Nancy Pelosi
-
బైడెన్ వల్లే ఓడిపోయాం
వాషింగ్టన్: ఎన్నికల ఫలితాలపై డెమొక్రాట్లలో ఆగ్రహం వెల్లువవుతోంది. పార్టీ హారిస్, బైడెన్ అనుకూల వర్గాలుగా చీలిపోయింది. ఓటమికి కారణం మీరంటే మీరంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వల్లే ఈ ఎన్నికల్లో ఓడిపోయామని అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆరోపించారు. ఆయన పోటీ నుంచి తొందరగా తప్పుకొని ఉంటే డెమొక్రాట్లు మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవారన్నారు. అయితే ఓటమికి హారిస్ సాకులు చెబుతున్నారని బైడెన్ మాజీ సహాయకుడు ఆక్సియోస్ చెప్పారు. గెలవకుండానే ఒక బిలియన్ డాలర్లు ఎలా ఖర్చుచేశారని ప్రశ్నించారు. జో బైడెన్‌ను బయటకు నెట్టడానికి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సలహాదారులు పార్టిలో అంతర్గత కుమ్ములాటలను బహిరంగంగా ప్రోత్సహించారని ఆరోపించారు. బైడెన్‌ను గద్దె దించడానికి కుట్ర పన్నిన వారే ఎన్నికల్లో ఓటమికి కారణమని డెమొక్రాట్ సెనేటర్ జాన్ ఫెటర్మన్ ఆరోపించారు. -
US Election 2024 నాన్సీ పెలోసీ వరుసగా 20వ సారి గెలుపు, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక విశేషం చోటు చేసుకుంది. 2024 అమెరికా ఎన్నికల ఫలితాలతో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ ప్రతినిధి నాన్సీ పెలోసి యుఎస్ హౌస్ స్థానానికి తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి వరుసగా 20 సార్లు గెలుపొందిన మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు. అంతేకాదు హౌస్ స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ కూడా నాన్సీ పెలోసి రికార్డు సృష్టించిన ఘనత కూడా ఆమె సొంతం. 1987లో తొలిసారిగా కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. 2003 నుండి హౌస్ డెమొక్రాట్లకు నాయకత్వం వహించారు. హౌస్ ఆఫ్ కాంగ్రెస్‌లో ప్రధాన పార్టీకి నాయకత్వం వహించిన తొలి మహిళ. 2007- 2011 వరకు, తిరిగి 2019- 2023 వరకు హౌస్ స్పీకర్‌గా వ్యవహరించారు. ఎక్కువ కాలం పనిచేసిన హౌస్ డెమోక్రాటిక్ నాయకురాలు పెలోసి. అలాగే చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన హౌస్ స్పీకర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎఫర్డబుల్ కేర్ రక్షణ చట్టంతో సహా కొన్ని కీలకమైన చట్టాలను ఆమోదించడంలో పెలోసి కీలక పాత్ర పోషించారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన లాంటి ఇతర ముఖ్యమైన సందర్భాలలో పార్టీలో ఆమె పాత్ర కీలకం.రాజకీయ వారసత్వం: రాజకీయంగా చురుకైన కుటుంబం నుండి వచ్చారు. నాన్సీ పెలోసి బాల్టిమోర్‌లో జన్మించారు. ఆమె తండ్రి రాజకీయ మేత్త మేయర్ , కాంగ్రెస్ సభ్యుడు థామస్ డి'అలెసాండ్రో జూనియర్. వాషింగ్టన్ ట్రినిటీ కళాశాల నుండి నాన్సీ 1962లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. వ్యాపారవేత్త పాల్ పెలోసిని వివాహం చేసున్నారు. -
నాన్సీ పెలోసీ భర్తపై దాడి.. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్తపై దాడికి పాల్పడిన పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న పాల్ (82)పై అతను సుత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది రాజకీయ ప్రేరేపిత, ఉద్దేశపూర్వక దాడి అని శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రూక్ జెంకిన్స్ వెల్లడించారు. ‘‘నాన్సీ ఎక్కడున్నారంటూ ఆరా తీశాడు. ఆమె కొన్ని రోజుల వరకు రాదని తెలుసుకుని పాల్ చేతులు కట్టేశాడు. కిందికి వెళ్లాలని ప్రయత్నించిన పాల్‌ను అడ్డుకున్నాడు. చివరికి రెస్ట్‌రూంకు వెళ్లేందుకు అంగీకరించాడు. రెస్ట్ రూం నుంచే పోలీసులకు పాల్ సమాచారమిచ్చారు. తర్వాత డేవిడ్ సుత్తితో పాల్ తలపై మోదాడు. పెనుగులాట జరుగుతుండగా పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు’’ అని చెప్పారు. ‘డెమోక్రాటిక్ పార్టీలోని అబద్ధాలాడే వారికి నాయకురాలు నాన్సీ. నిజం చెబితే వదిలేయాలని, లేదంటూ సుత్తితో మోకాళ్లు విరగ్గొట్టి, వీల్ చైర్లో కాంగ్రెస్‌కు తీసుకెళ్లాలనుకున్నా. అబద్ధాలు మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో మిగతా సభ్యులకు చూపాలనుకున్నా అని డేవిడ్ విచారణలో తెలిపాడు’అని జెంకిన్స్ వెల్లడించారు. నాన్సీ తర్వాత మరో కాంగ్రెస్ సభ్యుడిపైనా దాడి చేయాలనుకున్నట్లు చెప్పిన డేవిడ్ ఆ వివరాలు మాత్రం వెల్లడించలేదన్నారు. అంతేకాదు, పాల్, డేవిడ్‌లకు మధ్య ఇంతకు ముందు ఎటువంటి పరిచయం కూడా లేదని జెంకిన్స్ చెప్పారు. పెలోసీ ఇంట్లోకి దొంగతనంగా చొరబడిన డేవిడ్ డిపపే(42) వెంట సుత్తితోపాటు చేతులను కట్టేసేందుకు జిప్ టేప్, తాడు వెంట తీసుకెళ్లాడు. కెనడా పౌరుడైన డేవిడ్ 2000వ సంవత్సరం నుంచి అమెరికాలో ఉంటున్నాడు.అతడి వీసా గడువు కూడా ఎప్పుడో ముగిసిపోయిందని అధికారులు పేర్కొన్నారు. -
నాన్సీ పెలోసీ భర్తపై పైశాచికంగా దాడి
శాక్రమెంటో: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ అయిన నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీపై దాడి జరిగింది. ఈ దాడిలో పాల్ పెలోసీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం సమయంలో కాలిఫోర్నియాలోని ఆమె నివాసంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తైవాన్‌లో ఆమధ్య నాన్సీ పెలోసీ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆపై ఆమెపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది చైనా. ఇక ప్రస్తుత దాడి సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలుస్తోంది. డెమొక్రట్స్తో కలిసి ఆమె నవంబర్8న జరగబోయే మధ్యంతర ఎన్నికల కోసం ఫండ్‌రైజింగ్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. ఘటన సమయంలో ఆమె వాషింగ్టన్లో ఉన్నారు. పోలీసుల అదుపులోనే దుండగుడు ఉండగా.. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆగంతకుడి దాడిలో పాల్ పెలోసీ(82).. ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. సుత్తితో ఇంట్లోకి ప్రవేశించాడు ఆగంతకుడు. అయితే దాడికి ఆ సుత్తిని ఉపయోగించాడా? అనేది తెలియాల్సి ఉంది. పాల్ పెలోసీ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. శాన్ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా స్టేట్)కు చెందిన పాల్ పెలోసీ ప్రముఖ వ్యాపారవేత్త. నాన్సీ-పాల్‌కు 1963లో వివాహం జరిగింది. ఈ జంటకు ఐదుగురు సంతానం. ఈ కుటుంబం మొత్తం ఆస్తిపాస్తుల ద్వారా నాన్సీ పెలోసీ మొత్తం కాంగ్రెస్ సభ్యుల్లో అత్యంత ధనవంతురాలిగా నిలవడం విశేషం. బాల్టిమోర్‌కు చెందిన నాన్సీ పెలోసీ.. 1987 నుంచి శాన్ఫ్రాన్సిస్కో తరపున కాంగ్రెస్‌కు ఎన్నికవుతూ(మధ్య మధ్యలో కాలిఫోర్నియా, వాషింగ్టన్ నుంచి కూడా) వస్తున్నారు. అమెరికాలో పవర్ఫుల్ నేతల్లో పెలోసీ ఒకరు. ప్రతినిధుల సభకు స్పీకర్‌గా 2021లో ఆమె నాలుగో సారి ఎన్నికయ్యారు. పాతికేళ్లలలో తైవాన్ను సందర్శించిన అమెరికా అతిపెద్ద నేత ఈమెనే కావడం గమనార్హం. స్పీకర్ నాన్సీ పావెల్ భర్తపై దాడి ఘటనను యూఎస్ఐ, యూఎస్ కాపిటోల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
చైనా నుంచి తైవాన్ను కాపాడుతాం
బీజింగ్: తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం పునరుద్ఘాటించారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పష్టం చేశారు. చైనా ఆక్రమణ నుంచి అమెరికా బలగాలు, ప్రజలు తైవాన్ను రక్షిస్తారని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రానికి సంబంధించి తైవాన్ ప్రజలే సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. స్వతంత్రంగా ఉండాలంటూ వారిని మేం ప్రోత్సహించం’ అని అన్నారు. తైవాన్ అంశం శాంతియుతంగా పరిష్కారం కావాలన్నదే తమ విధానమని అనంతరం వైట్‌హౌస్ అనంతరం పేర్కొంది. ఈ విషయంలో తమ వైఖరి యథాతథమని తెలిపింది. అయితే, తైవాన్ విషయంలో సైనిక జోక్యంపై స్పందించలేదు. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవలి తైవాన్ సందర్శనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ ప్రాంతంపైకి క్షిపణులను ప్రయోగించడం, యుద్ధ విమానాలను మోహరించడం తదితర చర్యలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో బైడెన్ చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. దశాబ్దాలుగా ఒకే చైనా విధానాన్ని అనుసరిస్తున్న అమెరికా తైవాన్‌తో అధికారికంగా సంబంధాలు కొనసాగించడం లేదు. బైడెన్ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. -
‘ఇక చాలు ఆపండి’.. అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యాటనలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్ వార్నింగ్ ఇచ్చింది డ్రాగన్. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్బర్న్.. తైవాన్‌లో పర్యటించటాన్ని తీవ్రంగా ఖండించింది. తైవాన్‌తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది. రిపబ్లికన్ సెనేటర్ మార్షా బ్లాక్బర్న్ ఆగస్టు 25-27 వరకు తైపీ పర్యటన చేపట్టారు. ‘ఈ పర్యటన ఒకే చైనా పాలసీ నిబంధనలను, అమెరికా-చైనా మధ్య మూడు ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. అలాగే.. తైవాన్‌తో అనధికారిక సంబంధాలు మాత్రమే కొనసాగిస్తామన్న అమెరికా అంగీకారానికి వ్యతిరేకంగా ఉంది. ప్రపంచంలో చైనా ఒక్కటే ఉంది. చైనా భూభాగంలో తైవాన్ అంతర్భాగం. చైనా మొత్తానికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వానికే అధికారం ఉంటుంది.’ అని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి. తైవాన్ స్వాతంత్య్రం, వేర్పాటువాదం, విదేశీ శక్తుల జోక్యాన్ని వ్యతిరేకించటంలో వెనకడుగువేయబోమన్నారు. ఒకే చైనా పాలసీ, చైనా-అమెరికా ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని అమెరికా రాజకీయ నేతలకు విన్నవిస్తున్నామని తెలిపారు. మరోవైపు.. తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా వేచి చూస్తోందని ఆరోపించారు అమెరికా సెనేటర్ మార్షా బ్లాక్బర్న్. ఫిజీ పర్యటన ముగించుకుని గత గురువారం రాత్రి తైపీకి చేరుకున్నారు. పపువా న్యూ గనియా, ఫిజీ, తైవాన్లకు అమెరికా దౌత్యమద్దతును మరోస్థాయికి తీసుకెళ్లేందుకే ఈ పర్యటన సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో తైవాన్ జాతీయ భద్రతా మండలి అధినేతతో సమావేశం కానున్నారు. ఇదీ చదవండి: తైవాన్‌లో పెరుగుతున్న టెన్షన్... ఉక్రెయిన్‌లా పోరు సాగించలేం -
తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం
తైపీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శనతో రేగిన ఉద్రిక్తతలు చల్లారకమునుపే మరికొందరు అమెరికా ప్రజాప్రతినిధులు ఆదివారం అక్కడ పర్యటించారు. డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఈ బృందం ఆదివారం రాత్రి 7 గంటలకు తైపీ చేరింది. ఈ బృందం ఆది, సోమవారాల్లో అక్కడే ఉండి అమెరికా–తైవాన్‌ల సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై సీనియర్ నేతలతో చర్చలు జరుపనుంది. ఈ బృందం ఈనెల 2వ తేదీన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ సందర్శనపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత 12 రోజులుగా తైవాన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో యుద్ధ విమానాలు, క్షిపణులు, యుద్ధ నౌకలతో విన్యాసాలు జరుపుతోంది. -
ప్రశంసించడానికే వెళ్లాం! చైనాను బుజ్జగిస్తున్న అమెరికా!
వాషింగ్టన్: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చైనా తైవాన్ చుట్టూతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గస్తీ కాయడమే కాకుండా సైనిక కసరత్తులు ప్రారంభించింది కూడా. అంతేగాక తైవాన్‌ని భయభ్రాంతులకు గురిచేసేలా సైనిక విన్యాసాలను కొనసాగించింది. పెలోసీ పర్యటన పూర్తయినప్పటికీ తన విన్యాసాలను కొనసాగించడమే కాకుండా తైవాన్ చుట్టూత తమ ఆర్మీ కార్యకలాపాలు పూర్తి అయ్యాయని, యుద్ధం చేయడమే తరువాయి అన్నట్లు ప్రకటించింది. పైగా ఏ క్షణమైన యుద్ధం చేసేందుకు రెడీ అంటూ.. తైవాన్ సరిహద్దులో తన ఆర్మీ డ్రిల్ కొనసాగుతుందని కరాఖండిగా చెప్పేసింది. దీంతో నాన్సీ పెలోసి ఈ విషయమై స్పందించి...కేవలం తైవాన్‌ని ప్రశంసించడానికే వెళ్లాం. చైనా గురించి ప్రస్తావించడానికి వెళ్లలేదు. చైనా తైవాన్‌ని ఒంటరి చేయదు అంటూ తమ స్నేహ హస్తాన్ని అందించడానికి వెళ్లాం. అలాగే ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించేలా, చైనాకు ఆయా ప్రాంతాల్లో ఉన్న వివాదాలను పరిష్కరించేలా సాగిన పర్యటనే తప్ప మరోకటి కాదని చెప్పారు. పెలోసి ప్రతినిధి బృందం తైవాన్‌తో పాటు, సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్‌లను కూడా సందర్శించిందన్న విషయాన్ని చైనాకు గుర్తు చేశారు. చైనా అధ్యక్షుడు ఏం చెప్పినప్పటికీ అమెరికా తన నిబద్ధతకు కట్టుబడి తన మిత్ర దేశాలకు అండగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు తైవాన్‌ని ఒత్తిడికి గురిచేసేలా సైనిక శిక్షణ కొనసాగించడానికి అమెరికా అనుమతించదని ఫెలోసీ నొక్కి చెప్పారు. (చదవండి: 'తగ్గేదే లే' అని తెగేసి చెబుతున్న చైనా! ఎనీ టైం రెడీ!) -
అమెరికాని ఆపడం అసాధ్యం...చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్
న్యూయార్క్: అమెరికా అసెంబ్లీ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన పెద్ద ప్రకంపనమే సృష్టించిన సంగతి తెలిసిందే. చైనా అమెరికా పైన యుద్ధం చేస్తుందేమో అన్నంత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు బైడెన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెలోసీ మాట్లాడుతూ...చైనా ఆర్భాటం చూసి తమ కాంగ్రెస్ సభ్యుల బెదిరిపోయారని అన్నారు. అయినా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒక పక్కన భయపడి చస్తునే వార్నింగ్‌లు ఇస్తోందంటూ మండిపడ్డారు. అయినా చైనా యూఎస్ కాంగ్రెస్ సభ్యుల షెడ్యూల్‌ని చైనా నియంత్రించలేదు అని తేల్చి చెప్పారు. చైనా అచ్చం భయపడి చస్తున్న రౌడీలాగా ప్రవర్తిసుందన్నారు. ఈ పర్యటన కేవలం బైడెన్ తైవాన్ ప్రాంతాల్లో దృష్టిని కేంద్రీకరించేలా బలోపేతం చేయడానికి వెళ్లిందే తప్ప మరోకటి కాదని అన్నారు పెలోసీ. హౌస్ స్పీకర్‌గా మాత్రమే వెళ్లానని అమెరికా చెబుతున్నా చైనా వినకుండా కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్దమైపోయిందని విమర్శించారు. అంతేకాదు తైవాన్‌ని ఒంటరిని చేయడంలో భాగస్వామ్యం కాబోమంటూ చైనాకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. (చదవండి: ఆహా! కోటు వేసుకోవడం ఎంత కష్టమో... బైడెన్ చూస్తే తెలుస్తుంది) -
చల్లారని తైవాన్–చైనా ఉద్రిక్తత
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్ వైపు గుడ్లురిమి చూస్తున్న చైనా వారమైనా తన పంథాను మార్చుకోలేదు. తైవాన్ చుట్టూతా సముద్ర జలాల్లో సైనిక విన్యాసాలు కొనసాగిస్తూ ద్వీప ఆక్రమణ భయాలను పెంచేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారమే ముగియాల్సిన సైనిక యుద్ధ క్రీడలను ఇంకా కొనసాగిస్తోంది. తైవాన్ జలసంధి వెంట లైవ్ ఫైర్ డ్రిల్స్ పేరిట చైనా నావిక, వాయు సేన దళాలు సంయుక్త విన్యాసాలు కొనసాగిస్తున్నాయని చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ తెలిపింది. గత ఐదు రోజులుగా వేర్వేరు సామర్థ్యాలున్న క్షిపణులను చైనా ప్రయోగించింది. యుద్ధ విమానాలు, డ్రోన్లను తీరం వెంట, గగనతలంలో చక్కర్లు కొట్టించింది. తైవాన్ స్పందనను చైనా విశ్లేషిస్తోందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. -
దాడి చేస్తే బుద్ధి చెబుతాం
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన చైనా–తైవాన్ మధ్య అగ్గి రాజేస్తోంది. పెలోసీ తమ మాట లెక్కచేయకుండా తైవాన్‌లో పర్యటించడం పట్ల డ్రాగన్ మండిపడుతోంది. తైవాన్‌కు బుద్ధి చెప్పడం తథ్యమంటూ సైనిక విన్యాసాలు సైతం ప్రారంభించింది. తమపై నేరుగా దాడులకు దిగాలన్న కుట్రతోనే చైనా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందని తైవాన్ ఆరోపించింది. చైనా యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు ఇప్పటికే తైవాన్ అఖాతంలోని మీడియన్ లైన్‌ను దాటేసి ముందుకు దూసుకొచ్చాయి. ఈ పరిణామం పట్ల తైవాన్ ఆందోళన వ్యక్తం చేసింది. తైవాన్ జాతీయ రక్షణ శాఖ శనివారం కీలక ప్రకటన జారీ చేసింది. చైనా చర్యలకు ప్రతిస్పందనగా తమ ల్యాండ్–బేస్డ్ మిస్సైల్ వ్యవస్థలను యాక్టివేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. తమ వైమానిక, నావికా దళాలు పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తాయని ప్రకటించింది. ఒకవేళ చైనా దాడికి దిగితే ప్రతీకార దాడులు తప్పవని తైవాన్ రక్షణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారమే సముద్రంలో, గగనతలంలో సైనిక విన్యాసాలు కొనసాగిస్తున్నట్లు చైనా శనివారం పేర్కొంది. సైనిక సామర్థ్యాలను పరీక్షించుకొనేందుకు ఉత్తర, తూర్పు, నైరుతి తైవాన్‌లో మిలటరీ ఎక్సర్సైజ్ చేపట్టినట్లు పేర్కొంది. తైవాన్ విషయంలో సంక్షోభం మరింత ముదిరేలా చేయొద్దని అమెరికాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ హెచ్చరించారు. -
తైవాన్ ‘ఒకే చైనా’లో అంతర్భాగమే!
ఉద్రిక్తతల నడుమ తైవాన్‌కు యూఎస్ అసెంబ్లీ ప్రతినిధులసభ స్పీకర్ నాన్సీ పెలోసీని పంపించటంతో చైనా–తైవాన్‌ల మధ్య భవిష్యత్తులో యుద్ధం జరిగే అవకాశాలను తెరపైకి అమెరికా తీసుకొ చ్చింది. ఇక యుద్ధ బూచితో ఆసియా పసిఫిక్ దేశాలకు ‘నాటో’ సభ్యత్వాన్ని ప్రోత్స హిస్తూ, మ్యాడ్రిడ్ నిర్ణయాల ప్రకారం నాటోను ఈ ప్రాంతానికి విస్తరించే ప్రయత్నంలో అమెరికా ఉంది. ఇప్పటికే మన భారతదేశానికి ‘నాటో ప్లస్’ సభ్యత్వం ఇవ్వటానికి 6వ దేశంగా అర్హత కోసం యూఎస్ అసెంబ్లీలో నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్‌డిఏఏ)కు సవరణలు చేశారు. ఈ తరహా అర్హతలు ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఇజ్రాయిల్, దక్షిణ కొరియాలు కలిగి ఉన్నాయి. బిల్లు ఆమోదం పొందితే నాటో దేశాలతో సఖ్యతగా మెలిగే అవకాశాలను మనదేశానికి కల్పించి, భవిష్యత్తులో నాటో చేసే యుద్ధాలకు మనల్ని బలి పశువులను చేసే అవకాశం ఉంది. పెలోసీ పర్యటనను మానుకోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హితవు పలికినప్పటికీ... యూఎస్ మిలటరీ, ఇంటెలిజెన్స్ విభాగాల అధికారులు పెడచెవినపెట్టి, పర్యటనను ప్రణాళిక ప్రకారం సాగించారు. నాన్సీ పెలోసీని తైవాన్‌కు పంపాలను కోవటం నిప్పుతో చెలగాటం వంటిదనీ, ఆ నిప్పులో ఆహుతిగాక తప్పదనీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తీవ్ర స్వరంతో టెలిఫోన్లో బైడెన్‌ను హెచ్చరించాడు. ఈ హెచ్చరికతో తాత్కాలికంగా పెలోసీ పర్యటన దేశాల లిస్టులో కేవలం సింగపూర్, మలేసియా, జపాన్, దక్షిణ కొరియా దేశాల పేర్లు మాత్రమే ప్రకటించారు. తైవాన్ చైనాలో అంతర్భాగం గనుక మమ్మల్ని రెచ్చగొట్టటానికి ప్రయ త్నిస్తే తైవాన్‌లో అడుగుపెట్టే ముందే పెలోసీ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేస్తామనీ, లేకుంటే చైనా ఆర్మీ విమానాలు తైవాన్‌లో దిగుతాయనీ మిలిటరీ శాఖ తీవ్రంగా హెచ్చరించింది. పెలోసీకి రక్షణగా అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘రొనాల్ట్ రీగన్’, దాని అనుబంధ గ్రూపు యుద్ధ విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, గైడెడ్ మిస్సెల్ డిస్ట్రాయర్, క్రూయిజ్‌తో సహా రెండు రోజుల క్రితమే సింగపూర్ నుండి తైవాన్ వైపు దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి వచ్చాయి. చైనా నేవీ, ఎయిర్‌ఫోర్స్ కలిసి తైవాన్ జలసంధిలో మిలిటరీ విన్యాసాలు చేస్తున్న ఉత్కంఠ పరిణామాల మధ్య పెలోసీ ఆగస్టు 2 రాత్రి తైవాన్ విమానా శ్రయంలో దిగారు. ఇందుకు నిరసనగా ఆ తర్వాత తైవాన్ చుట్టుప్రక్కల ఉన్న సముద్రంలోని లక్ష్యాలపై క్షిపణుల వర్షం కురిపించి, తైవాన్ వాసులను చైనా భయకంపితులను చేసింది. ఈ దృశ్యాలను తైవాన్ మీడియా ప్రసారం చేసింది. అదేమంటే దీనికి పూర్తి బాధ్యత అమెరికాదేనని చైనా ఆరోపిస్తోంది. గతంలోకి వెళితే.. షియాంగ్ కై షేక్ పాలనలోని చైనాపై 1949లో మావో నాయకత్వాన విప్లవం విజయం సాధించగా, అమెరికా అండతో తైవాన్‌కు పారిపోయిన షియాంగ్ అక్కడ నుండి చైనాను పాలించడానికి ప్రయత్నించాడు. 1971 వరకు తైవాన్ కేంద్రమయిన ‘రిపబ్లిక్ ఆఫ్ చైనా’ను మాత్రమే ఐక్య రాజ్యసమితి గుర్తించింది. 1971 నుండి ‘ఒకే చైనా’ దేశంగా మెయిన్ ల్యాండ్ చైనాను తైవాన్‌తో సహా ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ (పీఆర్సీ)గా ఐరాస గుర్తించింది. ఈ ఒకే చైనాతో 1979 నుండి జిమ్మీ కార్టర్ ప్రభుత్వం దౌత్య సంబంధాలను ఏర్పర్చు కొంది. పీఆర్సీ అసలైన చైనా దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటంతో, ఎప్పటి వలెనే తైవాన్ చైనాలో అంతర్భాగంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా కనీసం డజను దేశాలు కూడా తైవాన్‌తో దౌత్య సంబంధాలను ఏర్పర్చుకోలేదు. మనదేశం కూడా దౌత్య సంబంధాలు ఏర్పర్చుకోలేదు. చైనా, తైవాన్‌ల మధ్య తరచూ అమెరికా కలహాలు సృష్టిస్తూ ఆయుధాల్ని అమ్ముతూ, మూడవ సంస్థలు, వ్యక్తులు, కంపెనీల ద్వారా వర్తక వాణిజ్యాలు చేస్తూ పరోక్ష సంబంధాలతో చైనాను కవ్విస్తూనే ఉంది. స్వదేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అమెరికాలో బైడెన్ ప్రభుత్వాన్ని గద్దె దింప టానికీ, రానున్న మధ్యంతర ఎన్నికల్లో రిబ్లికన్లను నెగ్గించటానికీ ఉక్రెయిన్, తైవాన్ యుద్ధాలను ప్రోత్సహించటానికై విపక్షాలు, మిలటరీ పరిశ్రమలు తీవ్రంగా కృషి సల్పుతున్నాయి. యుద్ధ వాతావరణాన్ని తక్షణమే ఆపి, చైనాలో అంతర్భాగంగా తైవాన్ను గుర్తించి, చైనా–తైవాన్‌ల అంతర్గత వ్యవహారంగా ఒకే చైనా సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఇప్పటికే అమెరికా ఏకధ్రువ ప్రపంచానికి కాలం చెల్లిందని అఫ్గానిస్తాన్, మధ్యప్రాచ్య యుద్ధాల చరిత్ర స్పష్టం చేసింది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ఆ సంగతిని గట్టిగా ధ్రువీకరించింది. రానున్న కాలం బహుళ ధ్రువ ప్రపంచానిదే. చైనా–తైవాన్, చైనా–హాంగ్‌కాంగ్, చైనా–మకావ్ వంటి సమస్యలు చైనా ఆంతరంగిక విషయాలుగా పరిగణించి, విదేశీ శక్తుల జోక్యం లేకపోవటం శ్రేయస్కరం. బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త హెచ్ఓడీ, ఫారెన్ లాంగ్వేజెస్, కేఎల్ యూనివర్సిటీ ‘ మొబైల్: 98494 91969 -
తైవాన్ టూర్ ఎఫెక్ట్: నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యాటనపై ముందు నుంచే మండిపడుతోంది చైనా. అయినప్పటికీ.. తైపీలో పర్యటించారు పెలోసీ. దీంతో అటు తైవాన్‌తో పాటు అమెరికాపైనా కన్నెర్ర చేస్తోంది డ్రాగన్ దేశం. తాజాగా స్పీకర్ నాన్సీ పెలోసీ, ఆమె కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధించినట్లు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. ‘చైనా తీవ్ర ఆందోళన, వ్యతిరేకతను లెక్క చేయకుండా పెలోసీ తైవాన్‌లో పర్యటించారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకోవటం తీవ్రమైన అంశం. చైనా సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత, ఒకే చైనా పాలసీని అణచివేయటమే. అలాగే.. తైవాన్‌లో శాంతి, సామరస్యాన్ని ఆందోళనలో పడేశారు. దాంతో పెలోసీ, ఆమె కుటుంబ సభ్యులపై బీజింగ్ ఆంక్షలు విధించాలని నిర్ణయించింది.’అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఓ ప్రకటన చేశారు. చైనాలోని షింజియాంగ్, హాంగ్‌కాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, డ్రాగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో ఇటీవల పలువురు అమెరికా అధికారులపై ఆంక్షలు విధించింది. అమెరికా అధికారుల వీసాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఈఏడాది మార్చిలో ప్రకటించింది చైనా. ఈ జాబితాలో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరోవ్‌లు ఉన్నారు. చైనాలోకి ప్రవేశించకుండా, చైనాతో ఎలాంటి వ్యాపారాలు చేయకుండా ఈ ఆంక్షలు ఉన్నాయి. ఇదీ చదవండి: తైవాన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ చైనా.. భయానక దృశ్యాలు వైరల్ -
China-Taiwan: తైవాన్ జలసంధిపై చైనా బాంబుల వర్షం.. వీడియో విడుదల
బీజింగ్: తైవాన్ జలసంధిపై క్షిపణులతో విరుచుకుపడింది చైనా. ఈ చర్య అంతర్జాతీయ సమాజంలో కలకలం సృష్టించింది. చైనా సైన్యంపై తైవాన్ సమీపంలో బాంబులు కురిపించిన వీడియోనూ ఆ దేశ అధికారిక మీడియా సీసీటీవీ విడుదల చేసింది. ఈ దృశ్యాలు ప్రపంచదేశాలను విస్మయానికి గురిచేశాయి. డాంగ్‌ఫెండ్ క్షిపణులను కురిపించి తమ సేనలు అనుకున్న ఫలితాలు సాధించాయని చైనా సైన్యం ప్రకటించింది. సైనిక క్రీడల్లో భాగంగా చైనా తన అధునాతన యుద్ధవిమాన వాహక నౌక, అణ్వస్త్ర సామర్థ్య జలాంతర్గామిలను తైవాన్ జలసంధిలోకి ప్రవేశపెట్టింది. తైవాన్‌లోని జపాన్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ సమీపంలోనూ క్షిపణులు పడ్డాయి. ‘మేం ఏం చెప్తామో అదే చేస్తాం’ అని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి టాన్ కెఫీ వ్యాఖ్యానించారు. క్షిపణి పరీక్షలంటూ చైనా రాకెట్లను ప్రయోగించడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. విమాన సర్వీసులు రద్దు చైనా సైన్యం క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో అప్రమత్తమై తైవాన్ తన పౌర విమానాల రాకపోకలను వెనువెంటనే ఆపేసింది. రాజధాని తైపేలోని ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 50 విమాన సర్వీస్‌లు రద్దయ్యాయి. ప్రపంచవిపణిలో అత్యంత కీలకమైన ప్రాసెస్ చిప్స్‌ల సముద్రమార్గ రవాణా కొనసాగుతోందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. చైనా సైనిక డ్రిల్స్ చేస్తున్న అదే ప్రాంతానికి సమీపంలోకి అమెరికా పీ–8ఏ పోసిడాన్ గస్తీ విమానం, ఎంహెచ్–60ఆర్ జలాంతర్గామి విధ్వంసక హెలికాప్టర్లు వచ్చి ఉద్రిక్తతలను మరింత పెంచాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది. తైవాన్ సైతం మిరాజ్, ఎఫ్–5 యుద్ధ విమానాలతో చైనా దళాలున్న చోటుపై పర్యవేక్షణకు వెళ్లి వచ్చాయని స్థానిక మీడియా వెల్లడించింది. చైనా చర్యను చట్టవిరుద్ధ, బాధ్యతారాహిత్య చర్యగా తైవాన్ అభివర్ణించింది. తైవాన్‌పై నోరు మెదపని పెలోసీ తైవాన్ పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసిన పెలోసీ.. దక్షిణ కొరియా పర్యటనలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ద.కొరియా పార్లమెంట్ స్పీకర్ కిమ్ జిన్ ప్యోను పెలోసీ కలిసినా తైవాన్ అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించలేదు. ఉ.కొరియా ‘అణు’ ప్రమాదంపై చర్చించామని జిన్ చెప్పారు. చదవండి: పంజా విసిరిన చైనా.. అదే జరిగితే ప్రపంచానికే ముప్పు! -
తైవాన్ ద్వీపాన్ని దిగ్బంధించిన చైనా సైన్యం
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యాటనతో మండిపడుతోంది చైనా. తైవాన్‌పై ఇప్పటికే ప్రతీకార చర్యలు చేపట్టింది. తైపీ దిగుమతులపై ఆంక్షలు విధించిన డ్రాగన్.. ఆ దేశానికి అతి సమీపంలో మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది. గత మంగళవారం నుంచి ఈ సైనిక ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా గురువారం మరింత దూకుడు పెంచింది. ఆరు వైపుల నుంచి తైవాన్ను చుట్టుముట్టాయి చైనా బలగాలు. తైపీ సమీపంలోని సముద్ర జలాల్లోకి బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి. మిసైల్స్‌కు సంబంధించిన దృశ్యాలు చైనా అధికారిక మీడియా సీసీటీవీలో ప్రసారమయ్యాయి. మిలిటరీ ప్రదర్శనలో భాగంగా తైవాన్ సమీపంలోని జలాల్లోకి మిసైల్స్ ప్రయోగించినట్లు పేర్కొంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. లాంగ్ రేంజ్ ఆయుధాలను ప్రయోగించినట్లు బీజీంగ్ మిలిటరీ సైతం ప్రకటించింది. చరిత్రలో ఇదే అతిపెద్ద మిలిటరీ డ్రిల్‌గా పేర్కొంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాంబుల మోతలు, ఆకాశంలో ఆయుధాల పొగ కనిపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదీ చదవండి: చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ కన్నెర్ర -
చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ కన్నెర్ర
తైపీ: చైనాను రెచ్చగొడుతూ, ఉద్రిక్తతలను మరింతగా పెంచుతూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (82) తైవాన్ పర్యటన బుధవారం ముగిసింది. ‘‘తైవాన్‌కు అమెరికా అన్నివిధాలా అండగా నిలుస్తుంది. అందుకు మేం కట్టుబడ్డామని ఈ పర్యటనతో మరోసారి చాటిచెప్పాం’’ అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. తైవాన్ తన భూభాగమేనని, దానితో ఏ దేశమూ సంబంధాలు పెట్టుకోరాదని చెబుతున్న చైనా ఈ పరిణామంపై మండిపడింది. ‘‘పెలోసీ నిప్పుతో చెలగాటమాడారు. అది అమెరికానే కాల్చేస్తుంది. తీవ్ర పరిణామాలుంటాయి. చేతులు ముడుచుకుని కూర్చోం’’ అంటూ చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి జీ ఫెంగ్ స్పందించారు. ఈ తప్పిదానికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘‘చైనా సార్వభౌమాధికారాల పరిధిని, ప్రాదేశిక సమగ్రతను అమెరికా ఉల్లంఘించింది. తైవాన్ జలసంధి వద్ద శాంతిభద్రతలను పూర్తిగా దెబ్బతీసింది’’ అని విమర్శించారు. ‘‘చైనాను నిలువరించేందుకు తైవాన్ అంశాన్ని వాడుకోవడాన్ని అమెరికా ఇకనైనా కట్టిపెట్టాలి. తైవాన్ స్వాతంత్య్ర డిమాండ్లకు మద్దతివ్వొద్దు’’ అని డిమాండ్ చేశారు. చైనాలోని అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్‌ను మంగళవారం రాత్రి పిలిపించి పెలోసీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం, అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనాతో కయ్యానికి కాలు దువ్వొద్దని హెచ్చరించారు. తైవాన్‌పై ఆంక్షలకూ చైనా తెర తీసింది. పళ్లు, చేపల దిగుమతులు, ఇసుక ఎగుమతులపై నిషేధం విధించింది. నిబద్ధత చాటుకున్నాం: పెలోసీ దక్షిణ కొరియా బయల్దేరే ముందు తైవాన్ అధ్యక్షురాలు సై ఇంగ్ వెన్‌తో పెలోసీ భేటీ అయ్యారు. తైవాన్లోనూ, ప్రపంచంలో ఇతర చోట్లా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న అమెరికా సంకల్పం మరింత బలపడిందంటూ సంఘీభావ ప్రకటన చేశారు. తమకు చిరకాలంగా మద్దతుగా నిలుస్తున్నందుకు పెలోసీకి వెన్ కృతజ్ఞతలు తెలిపారు. తైవాన్ అధ్యక్షురాలు సై ఇంగ్ వెన్‌తో పెలోసీ(ఎడమ) తైవాన్ చుట్టూరా సైనిక విన్యాసాలు పెలోసీ పర్యటనకు సమాధానంగా తైవాన్ను లక్ష్యంగా చేసుకుని మంగళవారం రాత్రి తెరతీసిన భారీ సైనిక విన్యాసాలను చైనా మరింత తీవ్రతరం చేసింది. తైవాన్ జలసంధిలోకి మరిన్ని యుద్ధ నౌకలను తరలించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలు, విన్యాసాల జోరు పెంచి అమెరికాకు హెచ్చరిక సంకేతాలు పంపింది. చైనా ఫైటర్ జెట్లు తైవాన్ గగనతలం సమీపంలో విన్యాసాలకు దిగాయి. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు తైవాన్ ద్వీపం చుట్టూ మరిన్ని సైనిక విన్యాసాలుంటాయని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా ప్రకటించింది. ఇవి యుద్ధానికి దిగడంతో సమానమని పరిశీలకులంటున్నారు. బలప్రయోగంతోనైనా తైవాన్ను తనలో కలిపేసుకునే చర్యలకు చైనా దిగనుందనేందుకు ఇవి సంకేతాలేనంటున్నారు. చైనా చర్యలను తైవాన్ తీవ్రంగా నిరసించింది. ‘‘మేం జడిసేది లేదు. సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుని తీరతాం’’ అని తైవాన్ అధ్యక్షురాలు ఇంగ్ వెన్ అన్నారు. -
తైవాన్‌లోకి 27 చైనా ఫైటర్ జెట్స్.. ఇక బాంబుల వర్షమేనా?
తైపీ: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యాటనపై మొదటి నుంచే హెచ్చరికలు చేస్తోంది చైనా. జరగబోయే ఏ పరిణామానికైనా అమెరికానే కారణమంటూ తన అక్కసును వెళ్లగక్కింది. అయినప్పటికీ.. తైవాన్‌లో పర్యటించి తిరిగి స్వదేశానికి వెళ్లారు పెలోసీ. తైవాన్ నుంచి పెలోసీ వెళ్లిపోయిన వెంటనే ఆ ద్వీప దేశంపై చర్యలకు ఉపక్రమించింది చైనా. ఇప్పటికే ఆ దేశ దిగుమతులపై నిషేధం విధించింది. తాజాగా తైవాన్ గగనతలంలోకి చైనాకు చెందిన 27 ఫైటర్ జెట్స్ ప్రవేశించినట్లు తైపీ ప్రకటించింది. ‘27 పీఎల్ఏ విమానాలు ఆగస్టు 3న తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. ఆరు జే11 ఫైటర్ జెట్స్, 5 జే16 జేట్స్ 16 ఎస్‌యూ-30 జేట్స్ ప్రవేశించాయి. వాటికి ప్రతిస్పందనగా తైవాన్ సైతం తమ ఫైటర్ జెట్స్‌ను రంగంలోకి దించింది. ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్‌ని మోహరించింది. ’ అంటూ ట్వీట్ చేసింది రక్షణ శాఖ. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పెలోసీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ తైవాన్ లెక్కచేయలేదు. దీంతో అతి సమీపంలో ప్రమాదకర మిలిటరీ ప్రదర్శన చేపట్టి భయపెట్టే ప్రయత్నం చేసింది డ్రాగన్. స్పీకర్ విజిట్‌పై అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. అలాగే.. హైఅలర్ట్ ప్రకటించింది చైనా మిలిటరీ. సైనిక డ్రిల్స్‌లో భాగంగా లాంగ్ రేంజ్ షూటింగ్ వంటివి ప్రదర్శించింది. దీంతో తైవాన్‌లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. తైవాన్‌కు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు పెలోసీ. 27 PLA aircraft (J-11*6, J-16*5 and SU-30*16) entered the surrounding area of R.O.C. on August 3, 2022. Please check our official website for more information: https://t.co/m1gW2N4ZL7 pic.twitter.com/Aw71EgmRjj — 國防部 Ministry of National Defense, R.O.C. 🇹🇼 (@MoNDefense) August 3, 2022 ఇదీ చదవండి: భగ్గుమంటున్న చైనా!...తైవాన్ పై కక్ష సాధింపు చర్యలు -
తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ పెలోసీ.. చైనాను రెచ్చగొట్టేలా ట్వీట్లు
తైపీ/బీజింగ్: తీవ్ర ఉద్రిక్తతల నడుమ తైవాన్‌లో అడుగుపెట్టారు అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ. తైపీ ఎయిర్‌పోర్ట్‌లో భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి దిగిన ఆమెకు సాదర స్వాగతలం లభించింది. అయితే దిగీదిగంగానే ఆమె చేసిన ట్వీట్లు.. చైనాను రెచ్చగొట్టేలా ఉన్నాయి. అమెరికా ముందు నుంచి చెప్తున్నట్లు తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతుగా, అలాగే ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛకు మేం కట్టుబడి ఉంటామని ఆమె ట్వీట్లు చేశారు. మరోవైపు నాన్సీ పెలోసీ ల్యాండ్ అయిన విషయం తెలుసుకున్న చైనా.. జరగబోయే పరిణామాలన్నింటికి అమెరికానే కారణమంటూ ప్రకటించింది. Our delegation’s visit to Taiwan honors America’s unwavering commitment to supporting Taiwan’s vibrant Democracy. Our discussions with Taiwan leadership reaffirm our support for our partner & promote our shared interests, including advancing a free & open Indo-Pacific region. — Nancy Pelosi (@SpeakerPelosi) August 2, 2022 ఇప్పటికే చైనా-తైవాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే ఉంటుంది. చైనా తీవ్ర అభ్యంతరాలు, హెచ్చరికల నడుమే తైవాన్‌లో అడుగుపెట్టారు యూఎస్ హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ. మొదటి నుంచి ఆమె పర్యటనను వ్యతిరేకిస్తున్న చైనా.. తాజాగా తైవాన్ భూ భాగంలోకి ఫైటర్ జెట్స్‌ను ప్రయోగించింది. అంతేకాదు తైవాన్ ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసింది. ట్రెండింగ్‌లో వరల్డ్‌వార్ త్రీ తైవాన్-చైనా ఉద్రిక్తతల నడుమ యుద్ధ వాతావరణం నెలకొనడంతో మూడో ప్రపంచ యుద్ధం అంటూ ట్విటర్ ట్రెండ్ నడుస్తోంది. స్వీయ పరిపాలన ఉన్న తైవాన్ను తమ సొంతంగా ప్రకటించుకుంది చైనా. అలాగే.. పెలోసీ పర్యటన తమ(చైనా) తైవాన్ పర్యటన.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, చైనా ఆర్మీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించింది. తైవాన్ పర్యటన తర్వాత.. సింగపూర్, మలేషియా, జపాన్, సౌత్ కొరియాలోనూ ఆమె పర్యటించనున్నారు. -
‘తైవాన్’పై చైనా వార్నింగ్.. తగ్గేదేలే అంటున్న అమెరికా!
తైపీ: అమెరికా, చైనాల మధ్య ‘తైవాన్’ రగడ తారస్థాయికి చేరుకుంది. అగ్రరాజ్యం సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ నాలుగు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా తైవాన్‌లో పర్యటిస్తారన్న వార్తలతో ఈ వివాదం మరింత ముదిరింది. తైవాన్‌లో అడుగుపెడితే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, తమ సైన్యం చూస్తూ కూర్చోదని ఇప్పటికే హెచ్చరించింది చైనా. డ్రాగన్ హెచ్చరికలతో అప్రమత్తమైంది అమెరికా. స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనకు ముందే నాలుగు యుద్ధ నౌకలను తైపీ సమీపంలోని సముద్ర జలాల్లో మోహరించింది. అందులో యుద్ధ విమానాలను మోసుకెళ్లే నౌక సైతం ఉంది. తైవాన్, ఫిలిప్పీన్స్‌కు తూర్పున, జపాన్‌కు దక్షిణాన ఫిలిప్పీన్స్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ రొనాల్డ్ రీగన్‌ను మోహరించినట్లు అగ్రరాజ్య నౌకాదళ అధికారులు తెలిపారు. జపాన్‌కు చెందిన ఈ రీగన్ నౌక.. గైడెడ్ మిసైల్స్, యూఎస్ఎస్ రాకెట్లు, నౌకా విధ్వంసక మిసైల్స్ వంటివి కలిగి ఉన్నట్లు చెప్పారు. ఈ మోహరింపు సాదారణ ప్రక్రియలో భాగమేనని, అయితే.. ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే దానికి తగినట్లుగానే తమ స్పందన ఉంటుందన్నారు. మరోవైపు.. యూఎస్ఎస్ త్రిపోలీ నౌక సైతం గత మే నెలలోనే సాన్‌డియాగో నుంచి బయలుదేరిందని, తైవాన్ సమీపంలోకి చేరుకున్నట్లు చెప్పారు. చైనాపై మొదటి నుంచే తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు స్పీకర్ నాన్సీ పెలోసీ. మంగళవారం రాత్రికి తైవాన్‌లోని తైపీకి చేరుకుంటారని సమాచారం. పెలాసీ పర్యటనపై చైనా చేస్తున్న హెచ్చరికలకు తాము భయపడబోమని స్పష్టం చేసింది అమెరికా. అయితే.. పెలోసీ పర్యటన నేపథ్యంలోనే తైవాన్‌కు ఇరువైపులా యుద్ధ నౌకలను మోహరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు.. తైవాన్‌కు అతి సమీపంలోకి చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు మోహరించటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాతో స్నేహం చేసి తైవాన్ యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చూడండి: Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం? -
‘అక్కడ అడుగు పెడితే ఊరుకోం’.. అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్!
బీజింగ్: కరోనా, మంకీపాక్స్ వంటి మహమ్మారులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అతలాకతలమవుతోన్న తరుణంలో చైనా, అమెరికాల మధ్య తైవాన్ వివాదం తారస్థాయికి చేరింది. తైవాన్ విషయంలో అగ్రరాజ్యం జోక్యం తగదంటూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తోంది చైనా. తాజాగా.. తైవాన్‌లో అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటించనున్నారనే వార్తల నేపథ్యంలో తీవ్రంగా స్పందించింది. తైవాన్‌లో నాన్సీ పెలోసీ పర్యటిస్తే.. తమ మిలిటరీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది. చైనా విదేశాంగ శాఖ సాదారణ సమావేశం సందర్భంగా ఈ హెచ్చరికలు జారీ చేసింది డ్రాగన్. తైవాన్‌లో అమెరికా ప్రభుత్వం తరఫున పర్యటిస్తున్న పెలోసీ మూడో వ్యక్తిగా పేర్కొన్నారు చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్. తైవాన్ తమ అంతర్గతమని స్పష్టం చేశారు. ఆసియాలోని నాలుగు దేశాల పర్యటనను సింగపూర్‌తో సోమవారం ప్రారంభించారు స్పీకర్ నాన్సీ పెలోసీ. చైనా నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోన్న తరుణంలో తైవాన్‌లో సైతం పర్యటిస్తారన్న వార్తలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతున్నాయి. ఇదీ చదవండి: Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం? -
అమెరికా మరింత నాగరికం కాబోతోందా?
యు.ఎస్. ప్రతినిధుల సభలోకి కొత్తగా తొమ్మిదిమంది మహిళా ఫెమినిస్టులు వచ్చారు! ఇప్పటికే సభలో స్పీకర్ మహిళ. ఆమె కూడా ఫెమినిస్టే. రెండు సభల్లోనూ (ఇంకోటి సెనెట్) మహిళలకు మద్దతుగా ఉండే ‘ప్రథమ మహిళ’ కూడా ఫెమినిస్టే. ఉపాధ్యక్షురాలు స్త్రీవాది. వీళ్లందరి శక్తి యుక్తులతో అమెరికా మరింత నాగరికం కాబోతోందా? ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని మనం కేరళను అంటున్నట్లుగా.. యూఎస్ ‘బ్లాక్స్ ఓన్ కంట్రీ’ అన్నంతగా సెన్సివిలైజ్ (సహజాతీయకరణ) చెందబోతోందా? యు.ఎస్. ప్రతినిధుల సభలో ప్రస్తుతం 119 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వారిలో కొత్తగా ఈ ఏడాది జనవరిలో సభలోకి అడుగుపెట్టిన వారిలో తొమ్మిది మంది స్త్రీవాదులే కావడం ఇప్పుడొక విశేషం అయింది. సాధారణంగా ప్రతి మహిళా స్త్రీవాదిగానే ఉంటారు. స్త్రీల సమస్యల్ని ఆలోచించి పరిష్కారాల కోసం మార్గాలను అన్వేషించేవారు, అవసరమైతే పోరాడే వారే స్త్రీవాదులు. అయితే ఈ తొమ్మిది మంది మరింత శక్తిమంతమైన వారు. ప్రత్యక్షంగా పోరులో పాల్గొన్నవారు. అవసరం అయితే ప్రథమ మహిళను, సభ స్పీకర్, ఉపాధ్యక్షురాలినీ ప్రభావితం చేయగలిగినవారు. ఏకాభిప్రాయాన్ని కూడగట్టుకోగలిగినవారు. చట్టాలను చేయించగలిగినవారు. నికేమా విలియం, కోరీ బుష్, మ్యారీ న్యూమేన్, మ్యారిలిన్ స్ట్రిక్‌ల్యాండ్, తెరిసా లేజర్, శారా జాకబ్స్, క్యాథీ మ్యానింగ్, డొబోరా రాస్, కొరొలీన్.. ఆ తొమ్మిది మంది శక్తి స్వరూపిణులు. మన భాషలో ‘నవ దుర్గ’లు. వీళ్లంతా కూడా డెమోక్రాటిక్ పార్టీకి చెందినవారే. స్పీకర్ నాన్సీ పెలోసీ డెమోక్రాటిక్ పార్టీనే. ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఎలాగూ అదే పార్టీ. పై తొమ్మిది మందిలో నలుగురు ‘ఉమెన్ ఆఫ్ కలర్’. అంటే నాన్–అమెరికన్లు. ∙∙∙ ఈ తొమ్మిది మందిలో ప్రతి ఒక్కరికీ ఒక పోరాట నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఇప్పుడు అమెరికా కొత్త ప్రభుత్వ పాలనలో.. స్త్రీ సంక్షేమం కోసం, నల్లజాతి ప్రజలతో సమభావన కోసం వీరు ప్రతిపాదించే విధానాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. నికేమా విలియమ్స్‌నే తీసుకోండి. సభలో ఎవరి పదవీకాలం అయినా రెండేళ్లు కనుక ఈ రెండేళ్లలోనూ నికేమా అనేక ఆశ్చర్యాలను చేయబోతున్నారనే అనిపిస్తోంది. సభలోకి రాకముందు జార్జియా స్టేట్ సెనెటర్‌గా ఉన్నప్పుడు ఎన్నికలలో అక్రమాలకు వ్యతిరేకంగా ప్రదర్శన జరిపి అరెస్ట్ అయ్యారు. కోరీ బుష్, మ్యారీ న్యూమేన్ తమ పురుష ప్రత్యర్థుల్ని ఓడించి సభలోకి అడుగుపెట్టినవారు. అదొక ఘన విజయం. నిజమైన జాతీయ భావన అంటే అన్ని జాతుల్ని కలుపుకుని వెళ్లడం అని ఈ ఇద్దరూ తమ ప్రసంగాలతో మెప్పించారు. కొత్తగా సభలోకి వచ్చిన ఈ తొమ్మిది మందిలో విలియమ్స్‌తో పాటు కోరీ బుష్, మ్యారిలీన్ స్టిక్‌ల్యాండ్, థెరెసా లేజర్ ‘నాన్–అమెరికన్’లు. ‘బ్లాక్ లైవ్జ్ మేటర్’ కార్యకర్తలు. శారా జాకబ్స్ స్త్రీ శిశు సంక్షేమ చట్టాల చట్టాలకు అవసరమైన సవరణలు సూచించగలరు. క్యాథీ మ్యానింగ్ స్కూళ్ల సంస్కరణ వాది. డెబోరా రాస్ మానవ హక్కుల న్యాయవాది. కరోలిన్ ఆర్థిక వ్యవహారాల నిపుణురాలు. ఈ నైపుణ్యాలు, పోరాట పటిమలు అన్నీ యూఎస్ ప్రతినిధుల సభ ప్రో–ఉమెన్ నిర్ణయాలు తీసుకునేలా చేయ గలిగినవే. ఈ స్త్రీవాదులకు ఎలాగూ మిగతా మహిళా సభ్యుల మద్దతు ఉంటుంది. అంటే.. మనమొక సమభావన కలిగిన సరికొత్త ఆమెరికా ను, ఆ కొత్త వెలుగులో సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామనే. -
తప్పుకోకపోతే తప్పిస్తాం: ట్రంప్‌కు వార్నింగ్
వాషింగ్టన్ : అమెరికన్ ప్రజాస్వామ్య కేంద్రబిందువైన కేపిటల్ భవన్‌పై దాడి నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆగ్రహం పెల్లుబికుతోంది. ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకులేకపోతున్న ట్రంప్.. దేశంలో హింసను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. వెంటనే పదవిన నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని అపహ్యస్యం చేసేలా, అమెరికా ఖ్యాతిని అవమానపరిచిన అధ్యక్షుడిని సాగనంపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అధ్యక్షుడిగా జనవరి 20న ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉన్నా.. ఆలోపే పదవి నుంచి దింపేయాలని న్యాయసలహాలను తీసుకుంటోంది. దీనిలో భాగంగానే రాజ్యాంగంలోని 25వ సవరణ అధికరణం ద్వారా ట్రంప్‌ని తొలగించడానికి గల అవకాశాలను కాంగ్రెస్ సభ్యులు పరిశీలిస్తున్నారు. (ట్రంప్ స్వీయ క్షమాభిక్ష..?) తప్పుకో.. లేకపోతే తప్పిస్తాం.. అమెరికా అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది అభిశంసన తీర్మానం కాగా, రెండోది 25వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన అధికరణం. దేశ ఉపాధ్యక్షుడు, మంత్రి మండలి సభ్యులు కలిసి ఈ అధికరణాన్ని ప్రయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అమెరికా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్ నాన్నీ పెలోసి కీలక వ్యాఖ్యలు చేశారు. కేపిటల్ భవన్‌పై దాడికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ తప్పుకోవాలని లేకపోతే తామే తప్పించాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరిక చరిత్రలో అత్యంత వైఫల్యమైన అధ్యక్షుడిగా వర్ణిస్తూ.. వెంటనే రాజనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ద్వారా ట్రంప్‌ను తొలగించేందుకు గల దారులను అన్వేషిస్తున్నట్లు పెలోసి వెల్లడించారు. అధ్యక్షుడిని తొలగించాలంటూ మూడింట రెండు వంతుల మెజార్టీతో ప్రతినిధుల సభ ఆమోదిస్తే, దానిని సెనేట్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. (తప్పిస్తారా ? తప్పించాలా?) అమెరికా స్పీకర్‌గా మళ్లీ పెలోసి అమెరికా ప్రజాప్రతినిధుల సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు 80 ఏళ్ళ నాన్సీ పెలోసి అతి స్వల్ప మెజారిటీతో రెండో సారి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. నాన్సీ పెలోసి అమెరికాకి ఎన్నికైన ఏకైక మహిళా స్పీకర్‌గా గతంలోనే రికార్డు సృష్టించారు. ఐదుగురు డెమొక్రాట్లు ఆమెకు ఓటు వెయ్యకూడదని నిర్ణయించుకొని ప్లేటు ఫిరాయించడంతో గందరగోళం ఏర్పడింది. అయితే స్వల్ప మెజారిటీతో నాన్సీ విజయం సాధించారు. రిపబ్లికన్ నాయకులు కెవిన్ మాక్ కార్తీకి 209 ఓట్లు వచ్చాయి. పెలోనీకి 216 ఓట్లు రావడంతో రెండోసారి గెలిచారు. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం పెట్టినప్పటి నుంచి, గత రెండు సంవత్సరాలుగా ట్రంప్, పెలోసీకి మధ్య వైరం కొనసాగుతోంది. హౌస్‌లో మొత్తం 435 సీట్లు ఉండగా, 427 మంది సభ్యులు ఓట్లు వేశారు. మిగిలిన వారు కరోనాసోకడంతో క్వారంటైన్లో ఉన్నారు. లూసియానా నుంచి ఎన్నికైన మరో సభ్యులు కోవిడ్ కారణంగా గత వారం మరణించారు. -
తప్పిస్తారా ? తప్పించాలా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడి ప్రకంపనలు అమెరికాని కుదిపేస్తున్నాయి. జనవరి 20కి ముందే ట్రంప్‌ని గద్దె దింపాలన్న డిమాండ్లు హోరెత్తిపోతున్నాయి. కాంగ్రెస్ సభ్యులందరూ ట్రంప్‌ని ఇంటికి పంపాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి మీరు ట్రంప్‌ని తొలగిస్తారా? లేదంటే ఆ పని మేమే చెయ్యాలా అని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ని ప్రశ్నించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంలోని 25వ సవరణ ద్వారా ఉపా«ధ్యక్షుడు, కేబినెట్ మంత్రులు ట్రంప్‌ని గద్దె దింపాలని డిమాండ్ చేశారు. ట్రంప్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆయన చేసింది దేశద్రోహమని విమర్శించారు. ఉపాధ్యక్షుడు ట్రంప్‌ని తొలగించకపోతే ప్రజల డిమాండ్ మేరకు తామే అభిశంసన తీర్మానం ద్వారా ఆయన్ను ఇంటికి పంపిస్తామన్నారు. ట్రంప్‌ని గద్దె దింపడం ఇప్పుడు దేశ తక్షణ అవసరమని నాన్సీ వ్యాఖ్యానించారు. వాళ్లంతా దేశీయ ఉగ్రవాదులు: బైడెన్ ట్రంప్ ప్రజాస్వామ్య ధిక్కార చర్యలతో క్యాపిటల్ భవనంలో హింసాకాండ చెలరేగిందని కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అన్నారు. దాడికి దిగిన వారంతా చొరబాటుదార్లు, ఉగ్రవాదులని బైడెన్ వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా ట్రంప్ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాల్ని తన చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని,అందుకే ఈ దుస్థితి దాపురించిందన్నారు. కేబినెట్ మంత్రుల రాజీనామా ట్రంప్ మద్దతుదారులు సాగించిన హింసాకాండకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరుగా పదవి నుంచి తప్పుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రి బెట్సీ దెవోస్, రవాణా శాఖ మంత్రి ఎలైన్ చావోలు రాజీనామా చేశారు. ‘‘ప్రభుత్వాన్ని వీడడానికి ముందు మనం సాధించిన ఘనతలు గురించి చాటి చెప్పాలనుకున్నాం. కానీ మీ మద్దతుదారులు చేసిన బీభత్సకాండతో మన మీద పడ్డ మచ్చని చెరిపేసుకోవడానికి ప్రయత్నించాల్సి వస్తోంది’’అని బెట్సీ తన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనని చాలా మనస్తాపానికి గురి చేసిందని అందుకే రాజీనామా చేస్తున్నానని రవాణా మంత్రి ఎలైన్ పేర్కొన్నారు. బైడెన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పటిదాకా పని చేసిన అధ్యక్షుడు హాజరు కావడం అమెరికాలో ఒక సంప్రదాయంగా వస్తోంది. -
‘ట్రంప్.. కుక్క విసర్జన పూసుకుని తిరిగే పిల్లవాడు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పీకర్ నాన్సీ పెలోసిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్రంప్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు పెలోసి. ట్రంప్ తన షూస్‌కు కుక్కల విసర్జన పూసుకుని తిరిగేవాడంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. కొద్ది రోజుల క్రితం ట్రంప్ ఎమ్‌ఎస్‌ఎన్‌బీసీ టెలివిజన్ హోస్ట్ జియో స్కార్బరో గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతడిని సైకో అంటూ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. దీని గురించి మీడియా ప్రతినిధిలు పెలోసిని ప్రశ్నించగా.. ‘అధ్యక్షుడు.. షూస్‌కు కుక్క విసర్జన పూసుకుని తిరిగే పిల్లాడిలాంటి వారు అంటూ మండిపడ్డారు. తనతో పాటు పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ దీన్ని పూస్తాడని అన్నారు. ఆ కుక్క విసర్జనను ఒకసారి పూసుకుంటే అది చాలా కాలం పాటు అలానే ఉంటుంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పెలోసి. (ట్రంప్ - పెలోసీల మధ్య వార్ షురూ..!) అధ్యక్షుని తర్వాత హోదాలో ఉపాధ్యక్షుని తర్వాతి స్థానంలో ఉన్న నాన్సీ పెలోసి డెమొక్రాటిక్ పార్టీకి చెందినవారు. ఆమెకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అస్సలు పడటంలేదు. గత ఏడు నెలలుగా ఇద్దరూ కనీసం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. కానీ మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. వైద్యశాస్త్రపరంగా రుజువుకాని హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించిన తర్వాత పెలోసి ఆయన ఊబకాయాన్ని ఎత్తిచూపారు. తానైతే అధ్యక్షునికి అలాంటి మందులు సూచించనని అన్నారు. దీనిపై ట్రంప్ తనదైన శైలిలో వ్యక్తిగత విమర్శలకు దిగారు. ‘పెలోసి ఒక రోగిష్టి మహిళ అని.. ఆమెకు చాలా సమస్యలు ఉన్నాయి.. పలు మానసిక సమస్యలతో ఆమె బాధపడుతున్నారు’ అంటూ విమర్శించారు. ఈ క్రమంలో ప్రస్తుతం పెలోసి వ్యాఖ్యలపై ట్రంప్ ఎలా స్పందిస్తారో.. ఈ మాటల యుద్ధం ఎక్కడి దాకా తీసుకెళ్తుందో చూడాలి.(రోజూ హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నా: ట్రంప్) -
ట్రంప్ షేక్‌హ్యాండ్ ఇవ్వలేదని..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగ ప్రతిని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి చించేసిన సంచలన ఘటన అమెరికా కాంగ్రెస్‌లో చోటు చేసుకుంది. ట్రంప్‌ను విమర్శించే విషయంలో డెమొక్రాటిక్ పార్టీ నేత నాన్సీ ముందుంటారనే విషయం తెలిసిందే. ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం ఇచ్చేందుకు వచ్చిన ట్రంప్‌ను సభకు పరిచయం చేస్తూ.. సాంప్రదాయక పరిచయ వాక్యాలను నాన్సీ వాడలేదు. తర్వాత ప్రసంగం ఇచ్చేందుకు ట్రంప్ నిల్చుని, తన ప్రసంగ ప్రతిని నాన్సీ పెలోసికి ఇచ్చారు. ఆ సమయంలో ఆమె ట్రంప్‌తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా, ట్రంప్ పట్టించుకోనట్లుగా వెనక్కు తిరిగారు. ట్రంప్ ప్రసంగం ముగించే సమయంలో.. నాన్సీ లేచి నిల్చున తన చేతిలోని ట్రంప్ ప్రసంగం కాపీని అడ్డంగా చింపేశారు. President Trump declines to shake Speaker Pelosi's outstretched hand at #SOTU2020 pic.twitter.com/oB7suIxNPT — Reuters (@Reuters) February 5, 2020 Speaker Pelosi rips up a copy of President Trump's #SOTU2020 speech after address pic.twitter.com/rM2cgibjcu — Reuters (@Reuters) February 5, 2020