వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగ ప్రతిని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి చించేసిన సంచలన ఘటన అమెరికా కాంగ్రెస్‌లో చోటు చేసుకుంది. ట్రంప్‌ను విమర్శించే విషయంలో డెమొక్రాటిక్ పార్టీ నేత నాన్సీ ముందుంటారనే విషయం తెలిసిందే. ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం ఇచ్చేందుకు వచ్చిన ట్రంప్‌ను సభకు పరిచయం చేస్తూ.. సాంప్రదాయక పరిచయ వాక్యాలను నాన్సీ వాడలేదు. తర్వాత ప్రసంగం ఇచ్చేందుకు ట్రంప్ నిల్చుని, తన ప్రసంగ ప్రతిని నాన్సీ పెలోసికి ఇచ్చారు. ఆ సమయంలో ఆమె ట్రంప్‌తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా, ట్రంప్ పట్టించుకోనట్లుగా వెనక్కు తిరిగారు. ట్రంప్ ప్రసంగం ముగించే సమయంలో.. నాన్సీ లేచి నిల్చున తన చేతిలోని ట్రంప్ ప్రసంగం కాపీని అడ్డంగా చింపేశారు.
President Trump declines to shake Speaker Pelosi's outstretched hand at #SOTU2020 pic.twitter.com/oB7suIxNPT
— Reuters (@Reuters) February 5, 2020
Speaker Pelosi rips up a copy of President Trump's #SOTU2020 speech after address pic.twitter.com/rM2cgibjcu
— Reuters (@Reuters) February 5, 2020
Comments
Please login to add a commentAdd a comment