బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యాటనతో మండిపడుతోంది చైనా. తైవాన్‌పై ఇప్పటికే ప్రతీకార చర్యలు చేపట్టింది. తైపీ దిగుమతులపై ఆంక్షలు విధించిన డ్రాగన్.. ఆ దేశానికి అతి సమీపంలో మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది. గత మంగళవారం నుంచి ఈ సైనిక ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా గురువారం మరింత దూకుడు పెంచింది. ఆరు వైపుల నుంచి తైవాన్‌ను చుట్టుముట్టాయి చైనా బలగాలు. తైపీ సమీపంలోని సముద్ర జలాల్లోకి బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి.
మిసైల్స్‌కు సంబంధించిన దృశ్యాలు చైనా అధికారిక మీడియా సీసీటీవీలో ప్రసారమయ్యాయి. మిలిటరీ ప్రదర్శనలో భాగంగా తైవాన్ సమీపంలోని జలాల్లోకి మిసైల్స్ ప్రయోగించినట్లు పేర్కొంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. లాంగ్ రేంజ్ ఆయుధాలను ప్రయోగించినట్లు బీజీంగ్ మిలిటరీ సైతం ప్రకటించింది. చరిత్రలో ఇదే అతిపెద్ద మిలిటరీ డ్రిల్‌గా పేర్కొంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాంబుల మోతలు, ఆకాశంలో ఆయుధాల పొగ కనిపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఇదీ చదవండి: చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ కన్నెర్ర
Comments
Please login to add a commentAdd a comment