China military drill
-
తైవాన్ ద్వీపాన్ని దిగ్బంధించిన చైనా సైన్యం
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యాటనతో మండిపడుతోంది చైనా. తైవాన్‌పై ఇప్పటికే ప్రతీకార చర్యలు చేపట్టింది. తైపీ దిగుమతులపై ఆంక్షలు విధించిన డ్రాగన్.. ఆ దేశానికి అతి సమీపంలో మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది. గత మంగళవారం నుంచి ఈ సైనిక ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా గురువారం మరింత దూకుడు పెంచింది. ఆరు వైపుల నుంచి తైవాన్ను చుట్టుముట్టాయి చైనా బలగాలు. తైపీ సమీపంలోని సముద్ర జలాల్లోకి బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి. మిసైల్స్‌కు సంబంధించిన దృశ్యాలు చైనా అధికారిక మీడియా సీసీటీవీలో ప్రసారమయ్యాయి. మిలిటరీ ప్రదర్శనలో భాగంగా తైవాన్ సమీపంలోని జలాల్లోకి మిసైల్స్ ప్రయోగించినట్లు పేర్కొంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. లాంగ్ రేంజ్ ఆయుధాలను ప్రయోగించినట్లు బీజీంగ్ మిలిటరీ సైతం ప్రకటించింది. చరిత్రలో ఇదే అతిపెద్ద మిలిటరీ డ్రిల్‌గా పేర్కొంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాంబుల మోతలు, ఆకాశంలో ఆయుధాల పొగ కనిపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదీ చదవండి: చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ కన్నెర్ర -
సిద్ధంగా ఉండండి: ఆర్మీకి జిన్‌పింగ్ పిలుపు
బీజింగ్ : యుద్ధనైపుణ్య శిక్షణను బలోపేతం చేయడంతో పాటు ఎల్లప్పుడూ దేనికైనా సిద్ధంగా ఉండాలని చైనా మిలటరీకి ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది నుంచి కొత్తగా తీసుకువచ్చిన డిఫెన్స్ చట్టం అమల్లోకి రావడంతో మిలటరీ అధికారాలు మరింతగా పెరగనున్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీకి, సెంట్రల్ మిలటరీ కమీషన్‌కు అధిపతైన జిన్‌పింగ్ 2021లో పీఎల్ఏ, పీఎల్ఏఎఫ్కు సంబంధించిన నూతన చట్టంపై సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం ఆర్మీ ఇకపై సోషలిజంపై జింగ్పింగ్ ఆలోచనకు తగ్గట్లుగా నడుచుకోవడం, జింగ్పింగ్ ఆలోచనల ప్రకారం బలోపేతం కావడం చేయాల్సి ఉంటుంది. (అమెరికా బలగాలపై దాడికి చైనా సాయం?) 2018లో ఇలాంటి ఆదేశాలనే జిన్‌పింగ్ ఒకమారు జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారం పీఎల్ఏ ఏ క్షణమైనా ఎలాంటి చర్యకైనా తయారుగా ఉండాలని సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు పత్రిక తెలిపింది. ఆర్మీకి అవసరమైన కొత్త ఆయుధాలు సమకూర్చుకోవడం, మరింత మందిని నియమించి శిక్షణ ఇవ్వడం, డ్రిల్స్ మోతాదు పెంచడం, సదా సిద్ధంగా ఉండడమనేవి చేయాల్సిఉంటుందని తెలిపింది. -
మరింత రెచ్చిపోతున్న చైనా
-
మరింత రెచ్చిపోతున్న చైనా
దక్షిణ చైనా సముద్రంలో కొంతభాగం మూసివేత.. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై గుండుగుత్తగా తన ఆధిపత్యం చాటాలని భావిస్తున్న చైనా మరో ముందడుగు వేసింది. సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఈ సముద్రంలో కొంత భాగాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కులు లేవని అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన కొద్దిరోజుల్లోనే చైనా ఈ చర్యకు దిగడం గమనార్హం. సముద్రంలోని ఆగ్నేయ దీవి ప్రావిన్స్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సోమవారం నుంచి గురువారం ఈ ప్రాంతాన్ని మూసివేస్తున్నట్టు చైనాకు చెందిన హైనాన్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అయితే, ఇవి ఏరకమైన సైనిక కార్యక్రమాలు అనేది వివరించలేదు. చైనా నేవీగానీ, రక్షణశాఖగానీ దీనిపై స్పందించలేదు. దక్షిణా చైనా సముద్రంపై వివాదాన్ని సామరస్య ధోరణిలో పరిష్కరించేందుకు, రెండు దేశాల ఆర్మీల మధ్య సంప్రదింపులను పెంచేందుకు అమెరికా నేవీ టాప్ అడ్మిరల్ చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలోనే డ్రాగన్ ఈ చర్యకు దిగడం గమనార్హం. అపార వనరులు, సహజ సంపదకు నెలవైన దక్షిణా చైనా సముద్రంలో చైనాకు ఎలాంటి చారిత్రక హక్కులు లేవని హేగ్ లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. ఈ ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ చైనా తన ధిక్కార ధోరణిని చాటుతున్న సంగతి తెలిసిందే.