వర్జీనియాలో కాంగ్రెస్ స్థానానికి జరిగిన డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ సుహాస్ సుబ్రమణ్యం గెలుపొందారు. సహచర భారతీయ-అమెరికన్ క్రిస్టల్ కౌల్‌తో సహా మరో 11 మంది అభ్యర్థులను ఓడించారు. నవంబర్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి ఎంపిక కోసం జరిగే అంతర్గత పార్టీ ఎన్నికల్లో సుహాన్ విజయం సాధించారు. అంతేగాదు వర్జీనియ కాంగ్రెస్ డెమోక్రటిక్ ప్రైమరీలో గెలిచిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు.
ఆయన 2019లో వర్జీనియా జనరల్ అసెంబ్లీ, 2023లో వర్జీనియా స్టేట్ సెనేట్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి అమెరికన్. ఆయన ఈ గెలుపుతో నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా యూఎస్ ప్రతినిధుల సభకు పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో సాధారణ రిపబ్లికన్ మైక్ క్లాన్సీతో తలపడతారు.
సుహాస్ నేపథ్యం..
37 ఏళ్ల సుహాస్ సుబ్రమణ్యం బెంగళూరు నుంచి యూఎస్‌కు వలస వచ్చిన భారత సంతతి తల్లిదండ్రులకు హ్యుస్టన్‌లో జన్మించాడు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌లో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా పనిచేశారు. ఒక యూఎస్ మీడియా ఇంటర్యూలో సుహాస్ మాట్లాడుతూ..అమెరికాకు మంచి భవిష్యత్తును అందించేందుకు తాను కాంగ్రెస్‌కి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సమస్యలను పరిష్కరించేలా భవిష్యత్తుకి బంగారు బాటవేసే కాంగ్రెస్ ఇక్కడ ఉందన్నారు. రాబోయే రెండేళ్లకు మాత్రమే కాదు, రాబోయే 20 ఏళ్లకో లేదా 30 ఏళ్లకో చట్టాలు చేయకూడదు. నాకు పిల్లలు కావాలి. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వారు ఇద్దరు లేదా ముగ్గురుగా అయ్యేటప్పటికీ మెరుగైన దేశంగా తీర్చిదిద్దిలన్నారు. పైగా వాళ్లు మంచి ప్రపంచంలో జీవించేలా చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
ఈ అమెరికాలో జీవించాలనే డ్రీమ్ అందరికీ దక్కాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన తల్లిదండ్రులు బెంగళూరు, చెన్నైకి చెందినవారు. కొంతకాలం సికింద్రాబాద్‌లో ఉన్నారు. వారు అమెరికాకు వచ్చి మంచి వైద్యులుగా స్థిరపడాలనుకున్నారు. అయితే వారు ఇక్కడ వచ్చినప్పుడూ.. తన తల్లిందడ్రులు అంతబాగా ఉన్నవాళ్లు కాదని కేవలం కష్టపడి చదివి తమ అమెరికా డ్రీమ్‌ని నెరవేర్చుకున్నారని అన్నారు. ఈ కలను అందరూ సాకారం చేసుకోవాని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే ప్రతిఒక్కరూ తాము కోరుకున్న దాంట్లో లేదా ఏదైన బిజినెస్‌లో విజయం సాధించి ఆర్థికంగా తమను తాము శక్తిమంతంగా చేసుకోగలిగినట్లయితే గొప్ప వ్యాపారాన్ని సృష్టించే అవకాశం ఉందన్నారు. అంతేగాదు ప్రతిఒక్కరూ బాగా చదివి, కష్టపడి పనిచేస్తే..ఎలాంటి స్థితి నుంచి అయినా ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే దాన్ని నిలబెట్టుకునే యత్నం కూడా చేయాలని కోరుకుంటున్నాని అన్నారు సుహాస్.
వ్యక్తిగత జీవితం..
నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలో ఆనర్స్‌తో లా డిగ్రీని సంపాదించిన తర్వాత, సుహాస్ ప్రెసిడెంట్ ఒబామాకు వైట్ హౌస్ టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేశారు. ఇక వైట్ హౌస్ నుంచి నిష్క్రమణ తర్వాత సుహాస్ లౌడౌన్ కౌంటీలో తన స్వంత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అలాగే తన కమ్యూనిటీకి వాలంటీర్ మెడిక్, అగ్నిమాపక సిబ్బందిగా కూడా సేవలందించారు. అతను మిరాండా పెనా సుబ్రమణ్యంను వివాహం చేసుకున్నారు. ఆమె కూడా పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రస్తుతం ఆ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో వర్జీనియాలోని యాష్‌బర్న్‌లో నివసిస్తున్నారు.
(చదవండి: కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు)
Comments
Please login to add a commentAdd a comment