- కబడ్డీలో రాణిస్తున్న గ్రామీణ విద్యార్థులు
- రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ
- నేపాల్ అంతర్జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక
- ప్రయాణ ఖర్చులు లేక ఇబ్బందులు
- దాతల సాయం కోసం ఎదురుచూపులు
నాచినపల్లి టూ నేపాల్
Published Mon, Jul 25 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
నాచినపల్లి (దుగ్గొండి) : ఒకప్పుడు గ్రామీణ ప్రాంతానికే పరిమితమై.. కొన్నేళ్ల నుంచి అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందిన కబడ్డీలో ఇద్దరు విద్యార్థులు రాణిస్తున్నారు. పేదరికంలో పుట్టినప్పటికీ వారు మెుక్కవోని దీక్షతో, అకుంఠిత పట్టుదలతో ముందుకుసాగుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచడంతోపాటు తాజాగా నేపా ల్ దేశంలో జరిగే సౌత్ ఏషియన్ అంతర్జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై సత్తాచాటారు.
అనిల్ క్రీడా ప్రస్థానం
మండలంలోని నాచినపల్లి గ్రామానికి చెందిన గుండెబోయిన నర్సయ్య, ప్రమీల దంపతుల కుమారుడు అనిల్ 1 నుం చి 10వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాడు. నర్సంపేట కాకతీయ జూనియర్ కళాశాలలో ఇం టర్ పూర్తి చేశాడు. 2010–11లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో, అదే ఏడాది కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఆల్ ఇండియా యూనివర్సిటీ పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ప్రస్తుతం ఆయన వరంగల్ సీకేఎం కâ శాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఇదిలా ఉండగా, అనిల్ ఈనెల 14 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి కబడ్డీ అండర్–19 విభాగంలో పాల్గొని సత్తాచాటారు. ఈ మేరకు నిర్వాహకులు ఆయనను ఆగస్టు 4 నుంచి నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరిగే సౌత్ ఏషియన్ పోటీలకు ఎంపికచేశారు.
సత్తాచాటుతున్న ‘నితీష్’
పేదరికం వెక్కిరిస్తున్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కన్నెబోయిన నితీష్ కృషి చేస్తున్నాడు. నాచినపల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన కుమారస్వామి–కవిత దంపతుల కుమారుడు నితీష్ 1 నుంచి 5 వరకు స్థానిక పాఠశాలలో, 6 నుంచి 10 వరకు నర్సంపేట మండలంలోని మహేశ్వరం శివానీ విద్యాలయంలో చదువున్నాడు. ఆరేళ్ల క్రితం భ ర్త అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినప్పటికీ భార్య కవిత కుమారుడిని కష్టపడి చదివిస్తోంది. నర్సంపేట ప్రభు త్వ జూనియర్ కళాశాలలో ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన నితీష్ కబడ్డీలో రాణిస్తున్నాడు. 2013–14లో స్కూల్ గేమ్స్ ఫెడ రేషన్ నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. 2014–15లో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాజీ పేటలో జరిగిన జిల్లాస్థాయి పైకా పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. తాజాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి అండర్–17 విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ఆగస్టు 16న నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరిగే సౌత్ ఏషియన్ పోటీలకు ఎంపికయ్యాడు.
ఇద్దరికి ఆర్థిక ఇబ్బందులు
నిరుపేద కుటుంబాలకు చెందిన అనిల్, నితీష్‌కు నేపాల్‌కు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కబడ్డీలో రాణిస్తున్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో వారు ఆవేదనకు గురవుతున్నారు. దాతలు, క్రీడాభిమానులు ఆర్థిక సాయం అందిస్తే నేపాల్‌లో జరిగే సౌత్ ఏషియన్ పోటీల్లో సత్తాచాటి ఓరుగల్లు కీర్తిని నిలబెడుతామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement