International Kabaddi Player Sandeep Nangal Died In Jalandhar, Unknown Persons Brutally Shot Sandeep - Sakshi
Sakshi News home page

Sandeep Nangal Death: కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య.. మ్యాచ్‌ జరుగుతుండగానే కాల్పులు

Mar 14 2022 10:18 PM | Updated on Mar 15 2022 8:45 AM

International Kabaddi Player Sandeep Nangal Shot Dead In Jalandhar - Sakshi

International Kabaddi Player Sandeep Nangal Shot Dead: దశాబ్ద కాలానికి పైగా కబడ్డీ ప్రపంచాన్ని శాసించిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్‌, భారత స్టార్‌ రైడర్‌ సందీప్ నంగల్‌ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. జలంధర్‌లోని మాలియన్ గ్రామంలో స్థానిక కబడ్డీ టోర్నీమెంట్‌ జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు సందీప్‌ను అతి దారుణంగా కాల్చి చంపారు. సందీప్‌ తల, ఛాతీపై దాదాపు 20 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల విషయాన్ని జలంధర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లఖ్వీందర్ సింగ్ ధృవీకరించారు. కబడ్డీ సమాఖ్యలో గొడవల కారణంగా సందీప్‌ను హత్య జరిగి ఉండవచ్చని డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ అనుమానాన్నివ్యక్తం చేశారు. కాగా, సందీప్‌కు భారత్‌లోనే కాకుండా కెనడా, అమెరికా, యూకేలలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సందీప్‌ను అభిమానులు డైమండ్‌ పార్టిసిపెంట్‌ అని పిలుస్తారు.


చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్‌.. అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement