International Kabaddi
-
కబడ్డీ.. కబడ్డీ... గెలిచింది
40 ఏళ్ల క్రితం సమాజం ఛీత్కారాల మధ్య కబడ్డీ ఆటను ఎంచుకుంది. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. వివక్షలను ఎదుర్కొంది. అవార్డులను గెలుచుకుంది. వందలాది అమ్మాయిలను చాంపియన్లుగా మలిచి అంతర్జాతీయ కబడ్డీ కోచ్‌గా పేరొందింది మహారాష్ట్రలోని నాసిక్ వాసి శైలజా జైన్. ఆటుపోట్ల మధ్య ౖధైర్యంగా ఎంచుకున్న మార్గం గురించి ఎన్నో విషయాలను పంచుకుంటుంది. ‘‘నా చిన్నతనం అంతా నాగపూర్‌లో గడిచింది. అమ్మ టీచర్, నాన్న బ్యాంకు ఆఫీసర్. అమ్మకు క్రీడలంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే చీర కట్టుకుని కబడ్డీ ఆడేది. నేను కూడా ఆమె నుండి ఈ గుణాన్ని వారసత్వంగా పొందాను. అమ్మనాన్నలకు నాతో కలిపి నలుగురం ఆడపిల్లలం సంతానం. కానీ, నేనే క్రీడాకారిణి అయ్యాను. స్కూల్లో జరిగే క్రికెట్, ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ.. ప్రతి పోటీలో పాల్గొనేదానిని. ఒక నెల రోజులు ఇంటికి దూరంగా క్రికెట్ క్యాంపులో చేరడానికి వెళ్లాను. ఈ రోజుల్లో ఎలాంటి అడ్డంకులు లేవు కానీ, యాభై ఏళ్ల క్రితం అంటే ఆడపిల్లలు ఆడుకోవడం అంత సులువు కాదు. హాఫ్ ప్యాంట్ ‘అమ్మాయి ఎదిగింది. హాఫ్ ప్యాంట్ వేసుకొని మగపిల్లల్లా ఆడుకోవడానికి బయటకు వెళుతోంది చూడు’ అని స్థానికులు చెప్పుకునేవారు. కానీ, మా అమ్మనాన్నలు ఎప్పుడూ అలాంటి మాటలు పట్టించుకోలేదు. నాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాదు, సపోర్ట్‌గా నిలిచారు. కబడ్డీ క్లబ్లో చేరడంతో నా జీవితమే మారిపోయింది. మొదటి మార్పు నాగపూర్‌లోనే మరాఠా లాన్సర్స్ పేరుతో కబడ్డీ క్లబ్ ఉండేది. అక్కడి కోచ్ నా స్నేహితుల్లో ఒకరిని ప్రాక్టీస్‌కు పిలిచారు. నన్ను పిలవలేదు. ఆ రోజు చాలా ఏడ్చాను. నాకు అవకాశం రాదనుకున్నాను. కానీ నేరుగా క్లబ్‌కి వెళ్లి, కోచ్‌తో నాకూ ఆడాలని ఉందని చెప్పాను. వారి అనుమతితో క్లబ్లో చేరిపోయాను. అటు నుంచి మిగతా క్రీడలను వదిలేసి కబడ్డీపైనే దృష్టి పెట్టాను. గ్రౌండ్‌కు చేరుకోవడంలో నేనే ముందుండేదానిని. వేరే వాళ్లు రాకముందే గ్రౌండ్ ఊడ్చటం, నీళ్లు చల్లడం, మార్కింగ్ చేయడం మొదలైన పనులన్నీ చేసేదాన్ని. చీకటి దారుల గుండా.. ఇంటికి గ్రౌండ్‌కి మధ్య 12 కి.మీ దూరం. అందుకే ఇంట్లో సైకిల్ కావాలని పట్టుబట్టాను. సైకిల్‌పై కాలేజీకి, ప్రాక్టీస్ కోసం క్లబ్‌కు వెళ్లేదాన్ని. దీని కోసం నాగ్‌పూర్‌లోని సివిల్ లైన్ ఏరియాను దాటాల్సి వచ్చేది. సాయంత్రం 5 గంటల నుంచే సివిల్ లైన్స్ మొత్తం నిర్మానుష్యంగా మారేవి. కానీ, నేను 8 గంటలకు చీకట్లో అదే మార్గంలో సైకిల్‌పై ఇంటికి వచ్చేదాన్ని. ఎప్పుడూ భయం అనిపించలేదు. ఎవరైనా వేధించినప్పుడు నడిరోడ్డుపై కొట్టి గుణపాఠం చెప్పేదాన్ని. చిన్న చిన్న అవార్డులైనా... యూనివర్శిటీ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాను. చిన్న చిన్న అవార్డులు వచ్చినా గర్వంగా ఫీలయ్యేదాన్ని. నాకు నేనే అత్యుత్తమ ప్లేయర్‌ననే విశ్వాసం పెరుగుతుండేది. పెళ్లయ్యే వరకు అదే మైదానంలో రోజూ ప్రాక్టీస్ చేసేదాన్ని. పెళ్లి తర్వాత నాసిక్‌కు వచ్చాను. అప్పటికే చదువు పూర్తయింది కాబట్టి ఉద్యోగం వేటలో ఉన్నాను. ఆ సమయంలో రాష్ట్ర కోచ్‌ని కలిశాను. కోచ్ అవడానికి ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్’ నుంచి కోర్సు చేయాలని సలహా ఇచ్చారు. బెంగళూరు వెళ్లి కోర్సు పూర్తి చేశాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక క్రీడా విభాగంలో కోచ్ ఉద్యోగం వచ్చింది. పాఠశాల స్థాయి నుంచి... కబడ్డీ, ఖోఖో ఆటలకు నేనే కోచ్‌ని. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను సిద్ధం చేయడం ప్రారంభించాను. నా శిక్షణలో అమ్మాయిలు అవార్డులు గెలుచుకోవడం చూసి నాలో ధైర్యం కూడా పెరుగుతూ వచ్చింది. శిక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అందుకు మా అత్తింటివారు ఎలాంటి అడ్డు చెప్పలేదు. స్పోర్ట్స్ ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చినప్పుడు ఆరు నెలల్లోనే దానిని తిరిగి ఇచ్చేశాను. ప్రమోషన్ తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతారని చెప్పారు. కానీ, ప్రమోషన్ పేరుతో ఆఫీసులో కూర్చొని ఉండటం నా వల్ల అయ్యే పని కాదు. గ్రౌండ్‌లోనే నా భవిష్యత్తు ఉందని బలంగా నమ్మేదాన్ని. అందుకే, తక్కువ డబ్బు వచ్చినా గ్రౌండ్‌ను వదలలేదు. డిప్రెషన్‌ను అధిగమించి.. నా దగ్గర శిక్షణ తీసుకున్న 400 మంది అమ్మాయిలకు జాతీయ స్థాయిలో ఆడే అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నాను. రికార్డ్ ఉన్నప్పుటికీ టీమ్ ఇండియా టీ షర్ట్ ధరించే అవకాశం రాలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపికైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అడుగడుగునా అవరోధాలు. దీంతో డిప్రెషన్‌కు గురయ్యాను. కొన్నాళ్లు ఏం చేయాలో అర్థం కాని స్థితి. 2008లో జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో కోచ్‌గా అవకాశం వచ్చింది. ఫలితాలు బాగుండటంతో ఆ తర్వాత అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా వెళ్తానని అందరికీ చెప్పాను. నా కల నెరవేరుతుందని అనుకున్నాను. కానీ, నా ఆశలు మళ్లీ నేలకు జారాయి. అదే ఏడాది మళ్లీ ప్రమోషన్ వచ్చింది. 2014 వరకు అదే జాబ్‌లో కొనసాగి రిటైరయ్యాను. అసంతృప్తి అలాగే ఉండిపోయింది. అంతర్జాతీయంగా అవకాశాలు... రిటైరయ్యాక ఇరాన్ నుండి బాలికల జట్టుకు కోచ్‌గా ఉండమని ఆహ్వానం అందింది. మా ఇంట్లోవాళ్లు ఆ దేశంలో ఉండటం సులభం కాదన్నారు. ఒకసారి పాస్‌పోర్ట్‌పై ఇరాన్ ముద్ర పడితే ఇక అంతే అన్నారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా వెళ్లాను. అలా మొదలైన నా ప్రయాణం రెండేళ్లకు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల వరకు వెళ్లింది. అక్కడి అలవాట్లు, తిండి, భాష, వేషధారణ అన్నీ మనకు భిన్నమైనవే. అయినా లభించిన అవకాశాన్ని బంగారంగా మార్చుకునే ధైర్యాన్ని పెంచుకున్నాను. నేను జైన్ కమ్యూనిటీకి చెందినదానిని, మాంసాహారం తినలేను. ఇరాన్లో శాకాహారం దొరకడం చాలా కష్టం. కోచ్‌గా ఉంటూ నాన్‌వెజ్ తినకుండా ఉండటం ఎలా సాధ్యం అని అక్కడివాళ్లు ఆశ్చర్యపోయేవారు. భారతదేశానికి వచ్చినప్పుడు నా ఆహారానికి కావల్సిన పదార్థాలను తీసుకెళ్లేదాన్ని. కానీ, ఆహారం గురించి పై అధికారులకు ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. రాని భాషలు నేర్చుకున్నాను. టీమ్‌తో అనుబంధాలను పెంచుకున్నాను. ఏడాదిన్నరలో 14 క్యాంపులు నిర్వహించాను. జకార్తా నుంచి భారత్‌కు జకార్తా ఆసియా క్రీడల్లో నా జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకొని భారత జట్టుతో ఫైనల్స్‌కు ఎంపికయ్యింది. ఆ మ్యాచ్‌లో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. నా దేశానికి ప్రత్యర్ధిగా నేనే ఉన్నాను... దీంతో తిండి, నిద్రకు దూరమయ్యాను. కానీ, నా బాధ్యత గుర్తుకొచ్చింది. నా జట్టు అమ్మాయిలను ప్రోత్సహించాను. నేను చెప్పిన ట్రిక్కులు పాటించి, గెలుపొందారు. స్వర్ణం గెలిచిన తర్వాత అమ్మాయిలు గ్రౌండ్లో ఉత్సాహంగా జెండాతో పరుగులు ప్రారంభించారు. నా చేయి పట్టుకుని ‘మేడమ్ రండీ.. మీ వల్లే మాకు బంగారు పతకం వచ్చింది..’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ, వారితో ‘నా కాంట్రాక్ట్ మిమ్మల్ని ఫైనల్ మ్యాచ్ వరకే, అది పూర్తయిపోయింది. నా భారత ఆటగాళ్లు బాధపడుతుంటే, నేను సంబరాలు చేసుకోలేను’ అని చెప్పాను. తొలిసారి భారత్ ఓడిపోయి ఇరాన్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ చరిత్రలో నా పేరు కూడా నమోదయ్యింది. స్వదేశానికి... ‘నా దేశాన్ని గెలిపించుకోవాలే కానీ, పరాయి దేశాన్ని కాదు’ అనే ఆలోచనతో తిరిగి నాసిక్ వచ్చేశాను. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న గిరిజన బాలికలకు కబడ్డీలో శిక్షణ ఇస్తున్నాను. వారిని నా అకాడమీకి తీసుకువచ్చి డైట్ కిట్స్ ఇస్తుంటాను. ఇందుకు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం నుంచి సహాయం అందుతుంది. గిరిజన బాలికలు క్రీడల్లో చాలా బాగా రాణిస్తున్నారు. దేశానికి మంచి క్రీడాకారిణులు లభించేలా వారిని తీర్చిదిద్దడంలో ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను’’ అని వివరించారు శైలజా జైన్. -
అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య
International Kabaddi Player Sandeep Nangal Shot Dead: దశాబ్ద కాలానికి పైగా కబడ్డీ ప్రపంచాన్ని శాసించిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్, భారత స్టార్ రైడర్ సందీప్ నంగల్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. జలంధర్‌లోని మాలియన్ గ్రామంలో స్థానిక కబడ్డీ టోర్నీమెంట్ జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు సందీప్‌ను అతి దారుణంగా కాల్చి చంపారు. సందీప్ తల, ఛాతీపై దాదాపు 20 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల విషయాన్ని జలంధర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లఖ్వీందర్ సింగ్ ధృవీకరించారు. కబడ్డీ సమాఖ్యలో గొడవల కారణంగా సందీప్‌ను హత్య జరిగి ఉండవచ్చని డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ అనుమానాన్నివ్యక్తం చేశారు. కాగా, సందీప్‌కు భారత్‌లోనే కాకుండా కెనడా, అమెరికా, యూకేలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. సందీప్‌ను అభిమానులు డైమండ్ పార్టిసిపెంట్ అని పిలుస్తారు. International Kabaddi player Sandeep Singh Nangal shot dead in #Jalandhar It has started… the deterioration.. Mark my words.. AAP has no interest nor experience in running law & order.. especially in a border state.. I shudder to think what Punjab will become pic.twitter.com/x2VXxfPB8q — Shehzad Jai Hind (@Shehzad_Ind) March 14, 2022 చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్.. అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు -
అండర్–17 కబడ్డీ విభాగం ఇండియన్ కెప్టెన్‌గా మంజి
మహబూబాబాద్ : కేసముద్రం మండలం బేరువాడ శివారుగుడి తండాకు చెందిన బోడ మంజి అండర్–17 విభాగంలో ఇండియన్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. త్వరలోనే నేపాల్‌లో జరగనున్న అంతర్జాతీయ కబడ్డీ క్రీడలో మంజి ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం(తెగ) ఆధ్వర్యంలో మానుకోటలో ఆ విద్యార్థిని ఆదివారం రాత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం డివిజన్ అధ్యక్షుడు బాలునాయక్, కార్యదర్శి హట్యానాయక్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వెంకట్రాములు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వీరన్న, సభ్యులు వీరన్ననాయక్ మాట్లాడుతూ మంజి నేపాల్ వెళ్లేందుకు అసోసియేషన్ ఆధ్వర్యాన ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాలాజీ, తదితరులు పాల్గొన్నారు. -
నాచినపల్లి టూ నేపాల్
కబడ్డీలో రాణిస్తున్న గ్రామీణ విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ నేపాల్ అంతర్జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక ప్రయాణ ఖర్చులు లేక ఇబ్బందులు దాతల సాయం కోసం ఎదురుచూపులు నాచినపల్లి (దుగ్గొండి) : ఒకప్పుడు గ్రామీణ ప్రాంతానికే పరిమితమై.. కొన్నేళ్ల నుంచి అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందిన కబడ్డీలో ఇద్దరు విద్యార్థులు రాణిస్తున్నారు. పేదరికంలో పుట్టినప్పటికీ వారు మెుక్కవోని దీక్షతో, అకుంఠిత పట్టుదలతో ముందుకుసాగుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచడంతోపాటు తాజాగా నేపా ల్ దేశంలో జరిగే సౌత్ ఏషియన్ అంతర్జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై సత్తాచాటారు. అనిల్ క్రీడా ప్రస్థానం మండలంలోని నాచినపల్లి గ్రామానికి చెందిన గుండెబోయిన నర్సయ్య, ప్రమీల దంపతుల కుమారుడు అనిల్ 1 నుం చి 10వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాడు. నర్సంపేట కాకతీయ జూనియర్ కళాశాలలో ఇం టర్ పూర్తి చేశాడు. 2010–11లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో, అదే ఏడాది కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఆల్ ఇండియా యూనివర్సిటీ పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ప్రస్తుతం ఆయన వరంగల్ సీకేఎం కâ శాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఇదిలా ఉండగా, అనిల్ ఈనెల 14 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి కబడ్డీ అండర్–19 విభాగంలో పాల్గొని సత్తాచాటారు. ఈ మేరకు నిర్వాహకులు ఆయనను ఆగస్టు 4 నుంచి నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరిగే సౌత్ ఏషియన్ పోటీలకు ఎంపికచేశారు. సత్తాచాటుతున్న ‘నితీష్’ పేదరికం వెక్కిరిస్తున్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కన్నెబోయిన నితీష్ కృషి చేస్తున్నాడు. నాచినపల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన కుమారస్వామి–కవిత దంపతుల కుమారుడు నితీష్ 1 నుంచి 5 వరకు స్థానిక పాఠశాలలో, 6 నుంచి 10 వరకు నర్సంపేట మండలంలోని మహేశ్వరం శివానీ విద్యాలయంలో చదువున్నాడు. ఆరేళ్ల క్రితం భ ర్త అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినప్పటికీ భార్య కవిత కుమారుడిని కష్టపడి చదివిస్తోంది. నర్సంపేట ప్రభు త్వ జూనియర్ కళాశాలలో ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన నితీష్ కబడ్డీలో రాణిస్తున్నాడు. 2013–14లో స్కూల్ గేమ్స్ ఫెడ రేషన్ నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. 2014–15లో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాజీ పేటలో జరిగిన జిల్లాస్థాయి పైకా పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. తాజాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి అండర్–17 విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ఆగస్టు 16న నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరిగే సౌత్ ఏషియన్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇద్దరికి ఆర్థిక ఇబ్బందులు నిరుపేద కుటుంబాలకు చెందిన అనిల్, నితీష్‌కు నేపాల్‌కు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కబడ్డీలో రాణిస్తున్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో వారు ఆవేదనకు గురవుతున్నారు. దాతలు, క్రీడాభిమానులు ఆర్థిక సాయం అందిస్తే నేపాల్‌లో జరిగే సౌత్ ఏషియన్ పోటీల్లో సత్తాచాటి ఓరుగల్లు కీర్తిని నిలబెడుతామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
కొరియా కబడ్డీ కోచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి
మెదక్ జిల్లా ఉత్తర్పల్లి గ్రామానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. అతని ప్రతిభను గుర్తించిన కొరియా తమ దేశ జాతీయ కబడ్డీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాలని కోరుతూ ఆహ్వా నం పంపింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెల్లవారుజామున కొరియా వెళ్లనున్నారు. శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం ఆంధ్రాబ్యాంకు కబడ్డీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఓ కబడ్డీ క్రీడాకారుడు విదేశీ జట్టు కోచ్‌గా ఎంపిక కావటం ఇదే ప్రథమం. ఏషియన్ గేమ్స్ టార్గెట్‌గా 2014 ఏషియన్ గేమ్స్‌కు కొరియా ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఇన్షాన్సిటీలో జరగనున్న ఈ క్రీడల్లో సత్తా చాటేందుకు కొరియా ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే కబడ్డీలో సైతం తప్పకుండా మెడల్స్ కొట్టేయాలని భావిస్తున్న కొరియా తమ దేశ జట్టుకు కోచ్‌గా ఓ భారతీయున్ని నియమించాలని భావిస్తోంది. అందులో భాగంగానే కొరియా కబడ్డీ అసోసియేషన్ గత నెలలో ఇండియాలోని కబడ్డీ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇండియా కబడ్డీ ఫెడరేషన్ తరఫున పలువురు సీనియర్ క్రీడాకారులు దరఖాస్తులు పంపగా, మెదక్ జిల్లా ఉత్తర్పల్లి గ్రామానికి చెందిన ఎల్.శ్రీనివాస్‌రెడ్డి కొరియా కబడ్డీ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు. దీంతో ఆ దేశ ప్రాదేశిక క్రీడా సంస్థ, కొరియన్ కబడ్డీ అసోసియేషన్ సంయుక్తంగా శ్రీనివాస్‌రెడ్డికి కోచ్ నియామకం ఉత్తర్వులు, వీసా మంజూరు చేశాయి. ఆరుమాసాల పాటు కొరియా కబడ్డీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్న శ్రీనివాసరెడ్డి, ఆ దేశ రాజధాని బుసాన్‌లో బస చేయనున్నారు. అంచలంచెలుగా అంతర్జాతీయస్థాయికి మెదక్ జిల్లా ఉత్తర్పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి అంచలంచెలుగా అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారునిగా ఎదిగారు. శ్రీనివాస్‌రెడ్డి 1995 నుంచి 1997 వరకు ఉస్మానియా యూనివర్సిటీ తర ఫున వివిధ టోర్నమెంట్లలో ఆడారు. ఆ తర్వాత హైదరాబాద్ జట్టు నుంచి జాతీయ క్రీడల్లో పాల్గొన్నారు. 2003లో ఆఫ్రో ఏషియన్‌గేమ్స్‌లో పాల్గొన్నారు. అదే సంవత్సరం మలేషియాలో నిర్వహించిన ఏషియన్‌గేమ్స్‌లో ఇండియా టీం తరఫున ఆడారు. 2005లో ఇరాన్లో నిర్వహించిన ఏషియన్గేమ్స్లోనూ ఉత్తమ ప్రతిభను కనబరచి బంగారు పతకం సాధించారు. 2009లో చైనాలో నిర్వహించిన ఏషియన్‌గేమ్స్‌లో భారత జట్టు తర ఫున ఆడారు. 2006 నుంచి శ్రీనివాస్‌రెడ్డి ఆంధ్రాబ్యాంకు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విదేశీ జట్టుకు శిక్షణ ఇవ్వటం సంతోషంగా ఉంది: శ్రీనివాస్‌రెడ్డి కొరియా జట్టు కోచ్‌గా ఎంపిక కావటం ఆనందంగా ఉంది. ఇండియా కబడ్డీ క్రీడాకారునిగా తాను ఓ విదేశీ జట్టుకు ఆరు నెలలపాటు శిక్షణ ఇవ్వనుండటం గర్వంగా ఉంది. ఆంధ్రాబ్యాంకు యాజమాన్యం, సహచర క్రీడాకారుల ప్రోత్సాహం వల్లే కొరియా జట్టు కోచ్‌గా ఎంపికయ్యా. కొరియా జట్టును ఉత్తమ జట్టుగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ఇందుకోసం అవసరమైన వ్యూహ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాను. ఇండియా కబడ్డీ జట్టుకు కోచ్ కావాలన్నదే నా లక్ష్యం.