
చండీగఢ్: పంజాబ్‌లో హత్యల పరంపర కొనసాగుతుంది. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కొలువుదీరిన 20 రోజుల్లో 20 హత్యలు జరిగాయని ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్ ఆరోపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో నమోదైన హత్య కేసుల్లో అధిక భాగం క్రీడాకారులవే కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్, భారత స్టార్ రైడర్ సందీప్ నంగల్ హత్య ఉదంతం మరవకముందే తాజాగా మరో కబడ్డీ ప్లేయర్ హత్య చేయబడ్డాడు.
పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో ధర్మేంద్ర సింగ్ అనే కబడ్డీ ప్లేయర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా తుపాకులతో కాల్పులు జరిపి హతమార్చారు. ఓ విషయంలో (ఎన్నికలు) ధర్మేంద్రకు అదే ప్రాంతానికి చెందిన కొందరు యువకులతో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లే గత మంగళవారం ధర్మేంద్రను రాజీకని పిలిపించి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
చదవండి: అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment