
ఖ్వాజా సాద్ రఫీక్(ఫైల్)
పాకిస్థాన్ లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నవాజ్ షరీఫ్ కు అత్యంత విశ్వాసపాత్రుడు, రైల్వే మంత్రి ఖ్వాజా సాద్ రఫీక్ ను ఎన్నికల ట్రిబ్యునల్ అనర్హుడిగా ప్రకటించింది. 2013 సాధారణ ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడినందుకు ఆయనపై వేటు వేసింది.
లాహోర్ లోని ఎన్ఏ-125 నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 60 రోజుల్లోగా రీపోలింగ్ నిర్వహించాలని కూడా ఎన్నికల ట్రిబ్యునల్ ఆదేశించింది. ఖ్వాజా సాద్ రఫీక్ ఎన్నికను ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ సవాల్ చేయడంతో ఈ తీర్పు వెలువరించింది.