వైఎస్సార్‌సీపీ ఏజెంట్ అప్పన్నను బెదిరించి మరీ రిగ్గింగ్
పలు గ్రామాల్లోని ఓటర్లు పోలింగ్ బూత్‌కు రాకుండా అడ్డుకున్న
కింజరాపు కుటుంబం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ
టెక్కలి: కింజరాపు కుటుంబం ఆనవాయితీగా చేస్తున్న రిగ్గింగ్‌ల పర్వానికి మరోసారి తెరతీసింది. పోలింగ్ ప్రక్రియలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలోని పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ కింజరాపు అప్పన్నను బెదిరించిమరీ.. కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు రిగ్గింగ్ చేశారు. తులసీపేట, భగీరథపురం తదితర గ్రామాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీల్లేకుండా టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు.
దీనిపై ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడలోని 287, 289, 290 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్‌లు జరిగినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నిమ్మాడతో పాటు 16 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌లు చేసినట్టు దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇచ్ఛాపురం మండలం తేలుకుంచిలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఎదుటే టీడీపీ, బీజేపీ కార్య కర్తలు, నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకు లతో బాహాబాహీకి దిగడం కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment