
ఘోర ఓటమి భయంతో టీడీపీ నేతల దారుణకాండ
వైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచే వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్ర
పల్నాడు, తాడిపత్రి, జమ్మలమడుగు, చంద్రగిరి సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ రోజున అల్లర్లు
పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టి రిగ్గింగ్ చేసిన టీడీపీ రౌడీలు
వెబ్ కాస్టింగ్‌లో అరాచకపర్వం స్పష్టంగా కన్పిస్తున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులు
టీడీపీ మూక రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి
పోలింగ్ రోజున తమ కుట్ర విఫలమవడంతో టీడీపీ అండ్ గ్యాంగ్ యాగీ
సాక్షి, అమరావతి: ఏ విధంగా అయినా సరే పోలింగ్ రోజు పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి టీడీపీ తొక్కని అడ్డదారులంటూ లేవు. గూండాయిజం, దౌర్జన్యం, బెదిరింపులు, రిగ్గింగ్.. ఇలా అన్ని విధాలా అక్రమాలకు పాల్పడింది. ఎక్కడైనా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గట్టిగా ప్రతిఘటిస్తే ఈసీ అండతో పోలీసులను అడ్డుపెట్టుకుని ఎదురు దాడులు చేస్తూ.. ‘పచ్చ’ మూక ఎదురు కేసులు పెడుతోంది. నానా యాగీ చేస్తూ రాద్ధాంతం చేస్తోంది. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే ‘ఫ్యాన్’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి.. ఓటు వేసి ఆశీర్వదించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు భారీ ఎత్తున స్పందిస్తుండటంతో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఘోర పరాజయం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళనకు గురై ధ్వంస రచనకు తెరలేపారు.
పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించడం ద్వారా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు ఓట్లు వేసేందుకు బయటకు రాకుండా చేయాలని కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే పోలింగ్ రోజు (ఈనెల 13న) ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను గొడవలకు ఉసిగొల్పారు. దీంతో వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా ఓట్లు పడుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ గూండాలు రౌడీయిజానికి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, అగ్రవర్ణ పేదలను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు.
టీడీపీ గూండాల దారుణకాండ వెబ్ కాస్టింగ్‌లో లైవ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ టీడీపీ గూండాల పైశాచికత్వానికి వత్తాసు పలికారు. టీడీపీ రౌడీల అరాచకాలను అడ్డుకుని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్, ఎస్పీలకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయడానికి ఫోన్‌లు చేసినా, వారు స్పందించలేదు. మాచర్ల నుంచి తాడిపత్రి వరకు అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.
టీడీపీ రౌడీల దారుణకాండ
మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్ బూత్‌లలో ఓట్లు వేసేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలపై టీడీపీ గూండాలు దాడులకు దిగారు. ఓటు హక్కును వినియోగించుకోనివ్వకుండా వారిని అడ్డుకున్నారు. ఈ అరాచక పర్వం గురించి ఓటర్లు మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
పోలింగ్‌ను అడ్డుకుంటున్న టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని ఆ నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారితోపాటు పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పిన్నెల్లి ఫిర్యాదు చేసేందుకు పదే పదే ఫోన్‌లు చేసినా వారు స్పందించలేదు. దీంతో ఆయా వర్గాల వారికి అండగా నిలిచి.. వారు ఓటు హక్కు వినియోగించుకునేలా చేసేందుకు పిన్నెల్లి పాల్వాయిగేటుకు చేరుకున్నారు. టీడీపీ రౌడీల దారుణకాండను అడ్డుకునే యత్నం చేశారు. తమ కుట్ర విఫలమవడంతో పిన్నెల్లిపై పచ్చమూక దు్రష్ఫచారం చేస్తోంది.
బడుగులపై దాడులు.. ఈవీఎంల ధ్వంసం
మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్లలో పోలింగ్ బూత్ 251లో ఓటు వేసేందుకు వచ్చిన ఎస్టీ వర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావుపై టీడీపీ రౌడీలు దాడి చేసి, చితకబాదారు. భయోత్పాతం సృష్టించడం ద్వారా ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను బెదరగొట్టాలని కుట్ర చేశారు. మాచర్ల మండలం తుమ్మురుకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూత్‌లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, అగ్రవర్ణ పేదలు ఏకపక్షంగా ఓట్లు వేస్తుండటంతో టీడీపీ గూండాలు జీరి్ణంచుకోలేకపోయారు.
ఎలాగైనా సరే ఆ ఓట్లను చెల్లకుండా చేయాలనే లక్ష్యంతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఆ నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. తాడిపత్రిలో పోలింగ్ సజావుగా జరగకుండా విఘాతం కల్పించడానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ గూండాలు కవ్వింపు చర్యలకు దిగుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. జమ్మలమడుగు నవాజ్ కట్టలోని 116, 117 పోలింగ్ బూత్‌ల వద్ద పోలింగ్‌ను అడ్డుకోవడానికి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థి భూపే‹Ùరెడ్డి కవ్వింపు చర్యలకు దిగుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సు«దీర్‌రెడ్డిపై రాళ్ల దాడికి దిగారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని తేలప్రోలు జెడ్పీ హైస్కూల్‌లో ఉన్న 271, 273, 274, 275 పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రక్రియకు విఘాతం కల్పించడానికి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలోని పచ్చమంద బరితెగించింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కవ్విస్తూ దాడికి దిగి భయోత్పాతం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment