
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జో బైడెన్‌ను టార్గెట్ చేశారు. ఇక, తాజాగా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌పై కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ట్రంప్ మాట్లాడుతూ..‘ఓ విషమంలో జో బైడెన్ మెచ్చుకుంటున్నాను. కమలా హారీస్‌ను తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం అతడు జీవితంలో తీసుకొన్న అద్భుతమైన నిర్ణయం. అదే అతడికి బెస్ట్ ఇన్స్యూరెన్స్ పాలసీ కావచ్చు. అలాగే, కమలా హారీస్‌ను బైడెన్‌కు బీమా పాలసీగా అభివర్ణించారు. ఇదే సమయంలో ఆమెపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.
బైడెన్ ప్రభుత్వంలో కమలా హ్యారిస్‌కు రెండు కీలక అంశాలు అప్పగించారు. ఒకటి బోర్డర్ సెక్యూరిటీ కాగా.. రెండోది ఉక్రెయిన్‌పై దాడి చేయకుండా రష్యాను భయపెట్టి ఆపడమని పేర్కొన్నారు. ఇక సరిహద్దు రక్షణ బాధ్యతలు చేపట్టాక ఆమె చేసిందేమీ లేదు. కనీసం బోర్డర్‌కు కూడా వెళ్లలేదని ట్రంప్ ఆరోపించారు. ఉక్రెయిన్‌పై దాడిని ఆపేందుకు ఆమెను ఐరోపాకు పంపించారని ట్రంప్ పేర్కొన్నారు. అది కూడా ఏమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వలేదని సెటైర్లు వేశారు.
ఇదిలా ఉండగా.. జూన్ 27వ తేదీన జరిగిన డిబెట్‌లో జోబైడెన్ ప్రదర్శనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా హారీస్‌ను పోటీ నిలపాలని పలువురు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అధ్యక్ష అభ్యర్థిత్వ మార్పిడిపై డెమోక్రటిక్ పార్టీలో చర్చ మొదలైన నేపథ్యంలో ట్రంప్.. కమలా హారీస్‌ను టార్గెట్ చేసి కామెంట్స్ చేయడం గమనార్హం.
మరోవైపు.. బైడెన్‌కు ట్రంప్ సరికొత్త సవాల్ విసిరారు. సౌత్ ఫ్లోరిడాలోని డోరల్ కోర్సులో గోల్ప్ మ్యాచ్‌కు బైడెన్ రావాలని సూచించారు. తనతో కలిసి గోల్ప్ ఆడాలని సవాల్ చేశారు. ఒక వేళ ఈ గేమ్‌లో ట్రంప్ ఓడిపోతే బైడెన్ ఎంపిక చేసుకున్న స్వచ్ఛంద సంస్థకు ఒక మిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తానని ప్రతిపాదించారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై బెడైన్ ప్రతినిథి జేమ్స్ సింగర్ స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ తాను చేసిన మంచి పనులు ఏమీ లేక ఇలా కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవాలని చూస్తున్నారు. కానీ, బైడెన్ మాత్రం అమెరికా ప్రజల కోసమే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment