‘ఎఫ్‌బీఐ మెమో బహిర్గతం చేయండి’ | Trump moves toward releasing memo he hopes will undermine Russia probe | Sakshi
Sakshi News home page

‘ఎఫ్‌బీఐ మెమో బహిర్గతం చేయండి’

Published Sat, Feb 3 2018 2:37 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Trump moves toward releasing memo he hopes will undermine Russia probe - Sakshi

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఎఫ్‌బీఐ జరిపిన దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగలేదంటూ రూపొందించిన ఒక రిపబ్లికన్‌ మెమోను సంపూర్ణంగా బహిర్గతం చేసేందుకు శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదం తెలిపారు. ఈ మెమో బహిర్గతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ చేసిన హెచ్చరికలను సైతం డొనాల్డ్‌ ట్రంప్‌ పక్కనబెట్టారు. ఈ సందర్భంగా ఎఫ్‌బీఐ సీనియర్‌ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘చాలామంది సిగ్గుపడాల్సి ఉంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు డెవిన్‌ న్యూన్స్‌ ఈ మెమోను రూపొందించారు. ఎలాంటి మార్పులూ చేయకుండానే ఈ మెమోను విడుదల చేయాలని ట్రంప్‌ ఆదేశించినట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement