రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు డొనాల్డ్ ట్రంప్ హితవు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో మతిలేని యుద్ధానికి ఇకనైనా తెరదించాలని రష్యా అధినేత పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హితవు పలికారు. యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్‌తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పుతిన్‌తో సాధ్యమైనంత త్వరగా సమావేశమవుతానని చెప్పారు. యుద్ధం ఆపకపోతే రష్యాపై కఠిన ఆంక్షలు విధించక తప్పదని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఆంక్షల భయంతో పుతిన్ వెనక్కి తగ్గుతారని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అది నాకు తెలియదు అని ట్రంప్ బదులిచ్చారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధక్షేత్రంలో అమాయకులు బలైపోతున్నారని, అందుకే తక్షణమే ఆ యుద్ధం ఆగిపోవాలని తాను కోరుకుంటున్నట్లు పునరుద్ఘాటించారు. రష్యాతో సంధికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సిద్ధంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు.
అబార్షన్ వ్యతిరేక ఉద్యమకారులకు ట్రంప్ క్షమాభిక్ష
షికాగో: అబార్షన్‌లకు వ్యతిరేకంగా క్లినిక్‌ల వద్ద నిరసన తెలిపిన ఉద్యమకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేయడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వీరికి శిక్షలు విధించడం సరికాదని తెలిపారు. 2020 అక్టోబర్‌లో వాషింగ్టన్‌లోని అబార్షన్ క్లినిక్‌ను దిగ్బంధించి, తలుపులు మూసి తాళాలు వేసి నిరసన తెలిపిన లారెన్ హార్డీతోపాటు మరో 9 మంది సహ నిందితులకు ట్రంప్ క్షమాభిక్ష ప్రకటన వర్తించనుంది.
Comments
Please login to add a commentAdd a comment