
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ప్రహసనమంటూ బీజేపీ పేర్కొనడంపై కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. విమర్శలకు ముందుగా కాషాయ పార్టీ ఎన్నికలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ‘మా అంతర్గత సమస్యలను పరిష్కరించుకోగల సత్తా మాకుంది. మా పార్టీ ఎన్నికల్లో మీ జోక్యం అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఒక ప్రహసనమే అని తేలింది.
పోటీ సమఉజ్జీల మధ్య జరగడం లేదు. థరూర్‌కు సరైన వివరాలతో కూడిన డెలిగేట్ల జాబితాను కూడా ఇవ్వలేదు’ అంటూ అంతకుముందు బీజేపీ నేత మాలవీయ ట్వీట్ చేశారు. ‘పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు ఖర్గే వైపే మొగ్గుచూపుతున్నారు. గాంధీ కుటుంబానికి మరో ఎంఎంఎస్ 2.0 వెర్షన్ రానుంది’ అంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌నుద్దేశించి పరోక్షంగా అందులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment