సరిగ్గానే వేశా: యాదయ్య | Cale Yadayya on Presidential election | Sakshi
Sakshi News home page

సరిగ్గానే వేశా: యాదయ్య

Published Wed, Jul 19 2017 2:04 AM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

సరిగ్గానే వేశా: యాదయ్య

సరిగ్గానే వేశా: యాదయ్య

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు సరిగ్గానే వేశానని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మీడియా అంటే తనకు గౌరవం ఉం దని, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయ వద్దన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ.. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, పార్టీ ఆదేశాల మేరకు తన ఓటును రహస్యంగానే వేశానన్నారు. మీడియాలో ప్రచా రమైనట్లుగా తాను తప్పుగా ఓటు వేయలేదని, రెండో బ్యాలెట్‌ పేపర్‌ కూడా అడగలేదన్నారు.  ఈ విషయంలో అధిష్టానం తననేమీ అడగలే దని, తనకు తానుగా ప్రతిస్పందిస్తున్నానని ఎమ్మెల్యే యాదయ్య పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement