‘‘మేముండగా నువ్వు పిల్లలు లేనిదానివెలా’’: జేడీ వ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన ‘ఎల్లా’ | Ella Emhoff Hits Back at J D Vance Childless Kamala Harris Attacks | Sakshi
Sakshi News home page

‘‘మేముండగా నువ్వు పిల్లలు లేనిదానివెలా’’: జేడీ వ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన ‘ఎల్లా’

Published Fri, Jul 26 2024 5:08 PM | Last Updated on Fri, Jul 26 2024 6:00 PM

Ella Emhoff Hits Back at J D Vance Childless Kamala Harris Attacks

కమలా హ్యారిస్‌కు మద్దతుగా సవతి కుమార్తె  ఎల్లా ఎమ్‌హాఫ్‌

ఆమె మా కుటుంబానికి అండగా ఉండటం  మా అదృష్టం, సంతోషం : ఎల్లా తల్లి

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో  కమలా హారిస్‌ దూసుకుపోతున్నారు. మరోవైపు  అమెరికా సెనేటర్‌, రిపబ్లిక్‌  ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న జేడీ వ్యాన్స్‌ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా దుమారం రేగుతోంది. దీనిపై  కమలా భర్త మొదటి భార్య కూతురు ఎల్లా ఎమ్‌హాఫ్  ఘాటుగా స్పందించారు. అంతేకాదు ఎల్లా తల్లికూడా కమలకు మద్దతుగా నిలిచారు.  

అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌పై చైల్డ్‌లెస్‌ క్యాట్‌ అంటూ గతంలో జేడీ వ్యాన్స్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కమల భర్త మొదటి భార్య కెర్‌స్టిన్ ఎమ్‌హాఫ్‌ కమలకు మద్దతుగా నిలిచారు. గత పదేళ్లుగా తన పిల్లలైన కోల్‌, ఎల్లా ఎమ్‌హాఫ్‌కు ఆమె తల్లిగా ప్రేమించారని, తమ కుటుంబానికి ఆమె ఎంతో అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తగవంటూ ఆమె మండిపడ్డారు. 

మరోవైపు ఈ వ్యాఖ్యలపై కమలా సవతి కుమార్తె (డగ్లస్ ఎమ్‌హాఫ్ ,కెర్‌స్టిన్ ఎమ్‌హాఫ్‌) ఇన్‌స్టాలో కౌంటర్‌ ఇచ్చారు. నేను, కోల్‌ (ఎల్లా సోదరుడు) ఉండగా నువ్వు పిల్లలు లేని దానివి ఎలా అవుతావంటూ కమలపై తన ప్రేమను చాటుకున్నారు. తద్వారా జేడీ వ్యాన్స్‌కు సమాధానం చెప్పారు.

2021లో జేడీ వ్యాన్స్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పిల్లలు లేనివారు పాలించేందుకు తగరంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పిల్లలు లేని స్త్రీల జీవితం దయనీయం. అలాంటి వారు దేశాన్ని కూడా దయనీయంగా మార్చాలనుకుంటారు. కమల లాంటి పిల్లలు లేని వ్యక్తుల  చేతిలో అధికారాన్ని పెట్టడంలో అర్థం లేదంటూ వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రముఖ  హాలీవుడ్‌ నటి జెన్నిఫర్ అనిస్టన్ కూడా తీవ్రంగా ఖండించారు.

కాగా  కమలా  హారిస్‌ భర్త డగ్లస్ ఎమ్‌హాఫ్ మొదటి భార్య కెర్‌స్టిన్ ఎమ్‌హాఫ్‌. ఈ దంపతులు పిల్లలే కోల్‌, ఎల్లా ఎమ్‌హాఫ్‌. వీరు కమలా హారిస్‌ను మోమలా అని ప్రేమగా పిలుచుకుంటారు.  ఎల్లా  మోడల్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌గా రాణిస్తోంది.  అల్లికలద్వారా మంచి కళాఖండాలను తయారు చేయడంలో ఆమె దిట్ట.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement