stepdaughter
-
‘‘మేముండగా నువ్వు పిల్లలు లేనిదానివెలా’’: జేడీ వ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన ‘ఎల్లా’
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో కమలా హారిస్ దూసుకుపోతున్నారు. మరోవైపు అమెరికా సెనేటర్, రిపబ్లిక్ ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న జేడీ వ్యాన్స్ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా దుమారం రేగుతోంది. దీనిపై కమలా భర్త మొదటి భార్య కూతురు ఎల్లా ఎమ్హాఫ్ ఘాటుగా స్పందించారు. అంతేకాదు ఎల్లా తల్లికూడా కమలకు మద్దతుగా నిలిచారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై చైల్డ్‌లెస్ క్యాట్ అంటూ గతంలో జేడీ వ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కమల భర్త మొదటి భార్య కెర్స్టిన్ ఎమ్హాఫ్ కమలకు మద్దతుగా నిలిచారు. గత పదేళ్లుగా తన పిల్లలైన కోల్, ఎల్లా ఎమ్హాఫ్కు ఆమె తల్లిగా ప్రేమించారని, తమ కుటుంబానికి ఆమె ఎంతో అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తగవంటూ ఆమె మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కమలా సవతి కుమార్తె (డగ్లస్ ఎమ్హాఫ్ ,కెర్స్టిన్ ఎమ్హాఫ్) ఇన్‌స్టాలో కౌంటర్ ఇచ్చారు. నేను, కోల్ (ఎల్లా సోదరుడు) ఉండగా నువ్వు పిల్లలు లేని దానివి ఎలా అవుతావంటూ కమలపై తన ప్రేమను చాటుకున్నారు. తద్వారా జేడీ వ్యాన్స్‌కు సమాధానం చెప్పారు.2021లో జేడీ వ్యాన్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పిల్లలు లేనివారు పాలించేందుకు తగరంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పిల్లలు లేని స్త్రీల జీవితం దయనీయం. అలాంటి వారు దేశాన్ని కూడా దయనీయంగా మార్చాలనుకుంటారు. కమల లాంటి పిల్లలు లేని వ్యక్తుల చేతిలో అధికారాన్ని పెట్టడంలో అర్థం లేదంటూ వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ కూడా తీవ్రంగా ఖండించారు.కాగా కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్హాఫ్ మొదటి భార్య కెర్స్టిన్ ఎమ్హాఫ్. ఈ దంపతులు పిల్లలే కోల్, ఎల్లా ఎమ్హాఫ్. వీరు కమలా హారిస్‌ను మోమలా అని ప్రేమగా పిలుచుకుంటారు. ఎల్లా మోడల్, ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తోంది. అల్లికలద్వారా మంచి కళాఖండాలను తయారు చేయడంలో ఆమె దిట్ట. -
కామ పిశాచి.. సవతి కూతురిని దాచేసి
న్యూఢిల్లీ : మానవ మృగాల్లో కూడా అనిర్వచనీయ కరడుగట్టిన మృగాలు ఉంటాయని అమెరికాకు చెందిన హెన్రీ మిచెల్లీ పియెట్ నిరూపించాడు. 63 ఏళ్ల ఆ కామ పిశాచి తన సవతి కూతురిని 11 ఏళ్ల వయస్సులో కిడ్నాప్ చేసి అక్రమంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమెను మెక్సికోకు తీసుకెళ్లి అక్కడ ఆమెపై ప్రతిరోజు భౌతికంగానే కాకుండా లైంగిక దాడి చేసి ఏకంగా తొమ్మిది మంది పిల్లలను కన్నాడు. తాను మాత్రం బీరు సీసాలతో, హోటల్ భోజనంతో కులాసాగానే బతుకుతూ భార్యా, పిల్లలను అర్ధాకలికి వదిలేసి భూలోక నరకం చూపించాడు. (బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టి తాళం..) 1997 నుంచి 19 ఏళ్ల పాటు తన సవతి తండ్రి పియెట్ నిర్బంధంలో ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన రొసాలిన్ మ్యాక్గిన్నిస్, స్థానికుల సహాయంతో 2016 జూన్‌లో ఎనిమిది మంది పిల్లలతో తప్పించుకొని అమెరికాలోని ఓక్లహామ చేరుకున్నారు. పెద్ద కుమారుడు అంతకుముందే ఆ చెర నుంచి తప్పించుకొని ఎక్కడికో పారిపోయారు. రొసాలిన్ తన భర్తగానీ భర్త పియెట్‌పై కేసు పెట్టగా, ఆయన్ని ఓక్లహామ పోలీసులు 2017లో అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన ఓక్లహామ ఫెడరల్ కోర్టు పియెట్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గత బుధవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పు రొసాలిన్‌కు జరిగిన నష్టాన్ని పూడ్చ లేదని, ఆమె పట్ల సానుభూతి చూపడం తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదని అమెరికా అటార్నీ బ్రియాన్ జే. కుస్టర్ వ్యాఖ్యానించారు. రొసాలిన్‌కు ప్రస్తుతం 34 ఏళ్లు. ఆమె ‘పీపుల్ టీవీ’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ప్రకారం ఆమె తొమ్మిదవ ఏట, ఆమె తల్లి, పియెట్‌తో డేటింగ్ చేస్తూ కలిసి ఉన్నారు. అప్పుడే పియట్, రొసాలిన్‌ను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. పియట్ భౌతికంగా కొడుతుండడంతో రొసాలిన్ తల్లి కూడా ఆయనతో విడిపోయింది. అప్పటికే తనకు ముగ్గురు పిల్లలున్న పియెట్ ఓ రోజు వారితో కలిసి రొసాలిన్ చదువుతున్న స్కూల్‌కు వ్యాన్‌లో వెళ్లి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అప్పటికి 11 ఏళ్లున్న రొసాలిన్‌ను పియెట్ తన పిల్లలకు తల్లిగా పరిచయం చేసి, వారి సాయంతో ఆమెను అక్రమంగా పెళ్లి చేసుకున్నాడు. మెక్సికో వెళ్లిన తర్వాత పియెట్ ఓ షెడ్డులో రొసాలిన్తో వేరు కాపురం పెట్టాడు. బయటకు వెళ్లేటప్పుడు పియెట్ షెడ్డుకు తాళం పెట్టి వెళ్లేవాడు. రొసాలిన్‌కు 15వ ఏట మొదటి సంతానం కలిగింది. అప్పటి వరకు పారిపోయేందుకు పలు సార్లు ప్రయత్నించి విఫలమైన రొసాలిన్ ఆ తర్వాత తెలియని మానసిక స్థితిలో నిస్తేజంగా ఉండిపోయి తొమ్మిది మంది పిల్లలకు తల్లయింది. పిల్లలు కూడా సరిగ్గా తిండిలేక ఇబ్బంది పడుతుండడంతో వారిని తీసుకొని ఎక్కడికన్నా పారిపోవాలనుకుంది. చేతిలో చిల్లి గవ్వా లేకపోవడం, ఇరుగు, పొరుగు వారితో కనీసం ముఖ పరిచయం కూడా లేకపోవడంతో పారిపోయేందుకు అంతగా సాహసం చేయలేక పోయింది. 2016లో కొద్దిగా పరిచయమైన పొరుగింటి మహిళ సహకారంతో రొసాలిన్, మెక్సికోలోని అమెరికా అంబసీని సందర్శించి అమెరికాలోని ఓక్లహామ చేరుకున్నారు. ‘నేను ఎలా బతికానో, ఎందుకు బతికానో తెలియదు. నా 19 ఏళ్ల జీవితం జీవచ్ఛవంలా, అగమ్య గోచరంగా, ఒకరకమైన అపస్మారక స్థితిలో సాగింది’ అంటూ ఆమె ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది. పియెట్ పైసాచిక ఉదంతం ఆస్ట్రియా రేపిస్ట్ జోసఫ్ ఫ్రిజిల్ ఉదంతాన్ని గుర్తు చేస్తోంది. ఆ రాక్షసుడు సొంత కూతురిని నేల మాలిగలో 24 ఏళ్ల పాటు నిర్బంధించి ఏడుగురు సంతానాన్ని కన్నాడు. (చదవండి: చచ్చిపోతా.. చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు!) -
మా ఆయన కూతురు మంచినటి అవుతుంది
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీఖాన్ బాలీవుడ్లో తెరంగేట్రం చేయడానికి రెడీ అయ్యింది. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సారా ఇటీవల ముంబైకి తిరిగొచ్చింది. మోహిత్ సూరి సినిమాలో ఆమె నటించనుంది. సారా తెరంగేట్రంపై సవతి తల్లి, సైఫ్ అలీఖాన్ రెండో భార్య, నటి కరీనా కపూర్ స్పందిస్తూ.. ఆమె మంచి నటి అవుతుందని చెప్పింది. తెరపై సారాను చూడాలని ఉత్సుకతో ఉన్నట్టు కరీనా చెప్పింది. 'సారా చాలా అందమైనదే కాదు తెలివైనది కూడా. అంతేగాక ఆమె చాలా ధైర్యవంతురాలు. సారా గొప్ప నటి అవుతుందనే నమ్మకముంది. తెరపై ఆమె నటనను చూడాలని నేను, సైఫ్ ఎదురుచూస్తున్నాం' అని కరీనా చెప్పింది. సారా సినిమాలను కెరీర్‌గా ఎంచుకోవడాన్ని ఆమె తండ్రి సైఫ్ అలీఖాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన కూతురికి ఇష్టమైన దారిలో వెళ్లడాన్ని సమర్థిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సారా.. సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్‌ల కూతురు. సారా తొలి చిత్రంలో కరీనా కపూర్‌కు వరుసకు సోదరుడయ్యే ఇషాన్ ఖట్టర్ సరసన నటించనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా పనులు ప్రారంభంకానున్నట్టు సమాచారం. -
చిన్నారిపై సవతి తల్లి దొంగ వీడియో!
కనెక్టికట్: ఐదేళ్ల బాలికను క్రూరంగా హింసించి.. ఆ చిన్నారి తనకు తానే గాయపడ్డట్టు కల్పిత వీడియో సృష్టించిన ఓ సవతి తల్లి ఉదంతమిది. ఒక కన్ను పూర్తిగా ఉబ్బిపోయి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన బాలిక గత కొన్ని నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. కొంతకాలం ఎమర్జెన్సీ వార్డులో కూడా ఉంది. బాలిక తనకు తానే మంచానికి తలకొట్టుకొని గాయపడ్డదని, సవతి తల్లితోపాటు ఆ చిన్నారి కూడా చెబుతున్నది. ఇందుకు సాక్ష్యంగా ఓ వీడియోను సవతి తల్లి పోలీసులకు చూపించింది. అయితే వైద్య నివేదికలో మాత్రం అసలు విషయాలు వెలుగుచూశాయి. చిన్నారిని జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్లి.. తీవ్రంగా కొట్టడం వల్ల ఆ గాయాలైనట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆ మహిళ చూపించిన వీడియో దొంగ వీడియో అని తేలింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. సవతి కూతురిని అమానుషంగా హింసించిన కనెక్టికట్‌కు చెందిన మహిళ ఫెలిషియా మేరీ (24)పై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. గత ఆగస్టులో మైనర్ బాలికను క్రూరంగా హింసించినట్టు అభియోగాలు మోపారు. బాలల హక్కుల పరిరక్షణ సంస్థ కూడా రంగంలోకి దిగి.. చిన్నారి ఒంటిపై కాలిన గాయాలు ఉన్నాయని నివేదించింది. బాలిక తనకు తోచినట్టు చేస్తుందని, ఆమె తలను మంచానికి బాదుకున్నదని సవతి తల్లి సెల్ఫోన్లో చూపించిన వీడియో నకిలీ వీడియో అని వైద్యులు తేల్చడంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు జరుపుతున్నారు.