ఫీనిక్స్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎఫ్.కెన్నెడీ కుటుంబీకుడొకరు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. స్వతంత్ర అభ్యరి్థగా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన శుక్రవారం వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకుని, భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను బలపరిచాక డెమొక్రటిక్ పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుండగా, ట్రంప్ ప్రచారంలో వెనుకబడ్డారు.
పలు కీలక రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయం కూడా హారిస్‌కు అనుకూలంగా మారింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌నకు రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ మద్దతు ప్రకటించడం రిపబ్లికన్ పారీ్టలో కొత్త ఉత్సాహం నింపినట్లయింది. ఇటీవలి వరకు ట్రంప్ విధానాలను ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. అనుచరగణాన్ని ఆయన పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ట్రంప్ కూడా..అధ్యక్ష రేసులో అత్యంత తీవ్ర వామపక్ష భావాలు కలిగిన వ్యక్తిగా రాబర్ట్ ఎఫ్.కెన్నడీని విమర్శించారు. తాజాగా తన నిర్ణయాన్ని సమరి్ధంచుకుంటూ రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ.. ‘ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం భవిష్యత్తు తరాలపై జరుగుతున్న యుద్ధం..దీనిని వెంటనే ఆపాలి. అందుకే ట్రంప్‌కు మద్దతిస్తున్నా’అని ప్రకటించారు.
రాబర్ట్ నిర్ణయాన్ని కెన్నడీ కుటుంబంలోని ఐదుగురు ప్రముఖులు తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్‌కు మద్దతివ్వడం ‘విషాద గాథకు విషాదాంతం’వంటిదని రాబ ర్ట్ సోదరి కెర్రీ కెన్నెడీ వ్యాఖ్యానించారు. ‘హారిస్, వాల్జ్‌లపై మాకు విశ్వాసం ఉంది. ట్రంప్‌ను సమర్థించాలనే మా సోదరుడు రాబర్ట్ నిర్ణయం మా నాన్నకు, మా కుటుంబం అత్యంత ప్రియమైనవిగా భావించే విలువలకు ద్రోహం చేసినట్లే’అని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు దివంగత జాన్ ఎఫ్.కెన్నడీ సోదరుడు, దివంగత అటార్నీ జనరల్, సెనేటర్ రాబర్ట్ కెన్నడీ కుమారుడే రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్.
Comments
Please login to add a commentAdd a comment