చెన్నైలో స్టాలిన్‌ను కలిసిన యశ్వంత్‌ సిన్హా | Yashwant Sinha Calls on DMK chief MK Stalin | Sakshi
Sakshi News home page

చెన్నైలో స్టాలిన్‌ను కలిసిన యశ్వంత్‌ సిన్హా

Published Fri, Jul 1 2022 3:08 PM | Last Updated on Fri, Jul 1 2022 3:08 PM

Yashwant Sinha Calls on DMK chief MK Stalin - Sakshi

యశ్వంత్‌ సిన్హాకు స్వాగతం పలుకుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్‌  

చెన్నై: రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా గురువారం చెన్నైకి వచ్చారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నాఅరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డీఎంకే మిత్రపక్ష పార్టీల అగ్ర నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా యశ్వంత్‌ సిన్హా వారిని కోరారు. ఇదిలా ఉండగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూలై 2న చెన్నై, పుదుచ్చేరిలో పర్యటించి మిత్రపక్షాలను కలుసుకుని మద్దతు కోరనున్నారు.

చదవండి: (మహారాష్ట్ర: షిండే  రాక.. కాషాయ నేతల్లో అప్పుడే కలకలం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement