
ప్యారిస్: ఫ్రాన్సు అధ్యక్ష పదవికి ఆదివారం మొదటి రౌండ్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 13 మంది నేతలు బరిలో ఉండగా ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, మరీన్ లీపెన్ మధ్యే ప్రధాన పోటీ ఉంది. మొదటి విడత ఎన్నికల్లో ఏ ఒక్కరికీ 50% మించి ఓట్లు రాకుంటే ఈ నెల 24వ తేదీన నిర్ణయాత్మక రెండో విడత ఓటింగ్ చేపడతారు.
ఫ్రాన్సు చరిత్రలో అధ్యక్ష పదవికి రెండో రౌండ్ ఎన్నిక ఎన్నడూ జరగలేదు. 2017 ఎన్నికల్లో లీ పెన్‌పై విజయం సాధించి మాక్రాన్ పిన్న వయస్కుడైన ఫ్రాన్సు అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.
చదవండి: ఫ్రాన్స్‌కు పరీక్షా సమయం