France Elections
-
French Election Results 2024: సంకీర్ణమా... సంక్షోభమా?
పారిస్: ఫ్రాన్స్ ముందస్తు ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ సారథ్యంలోని అతివాద కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంటు దిగువ సభ నేషనల్ అసెంబ్లీకి జూన్ 30న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో గెలిచిన ఆ కూటమి ఆదివారం కీలకమైన రెండో రౌండ్ పోలింగ్‌లో చేతులెత్తేసింది. 577 స్థానాలకు గాను 143 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. సోమవారం వెలువడ్డ ఫలితాల్లో ఏ కూటమికీ మెజారిటీ రాలేదు. తొలి రౌండ్ పరాజయం నేపథ్యంలో వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)తో అవగాహనకు రావడం అధికార సెంట్రిస్ట్ కూటమికి కలిసొచి్చంది. మెజారిటీ స్థానాల్లో అవి ఒకే అభ్యరి్థని నిలపడంతో నేషనల్ ర్యాలీ కూటమి జోరుకు కళ్లెం పడింది. ముఖ్యంగా మెరీన్ లీ పెన్ సారథ్యంలోని నేషనల్ ర్యాలీ కూటమి ఫాసిస్టు ఎజెండాకు ప్రత్యామ్నాయంగా సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ తదితరాలతో ముందుకొచ్చిన ఎన్పీఎఫ్ అతి పెద్ద కూటమిగా అవతరించింది. దానికి 193 సీట్లు రాగా సెంట్రిస్ట్ కూటమి 164 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఎవరికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 289 సీట్లు రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దాంతో ఎన్పీఎఫ్తో కలిసి మాక్రాన్ కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా, లేక పరిస్థితి రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ప్రధాని పదవి కోసం ఎన్పీఎఫ్ పట్టుబడుతుండటం, ఆ కూటమిలోని అతివాద పార్టీలతో అధికారం పంచుకునేందుకు మాక్రాన్ సుముఖంగా లేకపోవడం వంటివి కారణం. దీనికి తోడు ఎన్పీఎఫ్లోనూ కీచులాటలున్నాయి. ఫ్రాన్సు లో దశాబ్దాలుగా ఏక పార్టీ పాలనే సాగుతూ వస్తోంది. నేషనల్ ర్యాలీకి ఆశించిన ఫలితాలు రాకపోయినా 2022 ఎన్నికల్లో కేవలం 89 సీట్లు సాధించిన కూటమి బలం ఈసారి గణనీయంగా పెరిగింది. ఫలితాలు తమకు ఎదురుదెబ్బ కాదని, తమ విజయం వాయిదా మాత్రమే పడిందని లీ పెన్ అన్నారు. అప్పుడే కీచులాటలు ఫలితాల నేపథ్యంలో ప్రధాని గేబ్రియెల్ అటల్ సోమవారం రాజీనామా చేశారు. దాన్ని మాక్రాన్ తిరస్కరించారు. ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు మూడు వారాలే ఉండటంతో తాత్కాలికంగా పదవిలో కొనసాగాలని కోరారు. అందుకు అటల్ సిద్ధంగా ఉన్నా ఎన్పీఎఫ్ మాత్రం అధికారం చేతులు మారాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రజాభీష్టాన్ని గౌరవించి తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, ప్రధాని పదవి తమకే చెందాలని వామపక్ష నేత జీన్ లూక్ మెలెన్‌చోన్ డిమాండ్ చేశారు. అదే జరిగితే అధ్యక్షుడు, ప్రధాని వేర్వేరు పారీ్టల నుంచి ఉండటం ఫ్రాన్స్‌లో 22 ఏళ్లలో ఇదే తొలిసారి అవుతుంది. పలు అధికారాలను కూడా ప్రధానితో మాక్రాన్ పంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని కో హాబిటేషన్గా పిలుస్తారు. దేశ చరిత్రలో ఇలాంటి సందర్భాలు ఇప్పటికి మూడుసార్లు వచ్చాయి. పలు మాక్రాన్ సంస్కరణలకు చరమగీతం పాడతామని, అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన ప్రజా వ్యయ పథకాన్ని తెస్తామని, ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరి అవలంబిస్తామని ఎన్పీఎఫ్ ఇప్పటికే స్పష్టం చేయడంతో సంకీర్ణం ఏర్పాటు, మనుగడపై సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు ఎన్పీఎఫ్ భాగస్వాముల్లో అతివాద వామపక్షమైన ఫ్రాన్స్ అన్»ౌడ్తో కలిసి పని చేయబోమని మాక్రాన్ ఇప్పటికే ప్రకటించారు. సోషలిస్టులు, గ్రీన్స్‌తో భాగస్వామ్యానికి మొగ్గుతున్నారు. కానీ కొన్ని పక్షాలను పక్కన పెట్టేందుకు ఎన్పీఎఫ్ కూటమి అంగీకరించకపోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా నూతన జాతీయ అసెంబ్లీని జూలై 18న సమావేశపరుస్తానని మాక్రాన్ ప్రకటించారు. నాటో భేటీ కోసం బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. తిరిగొచ్చాక సంకీర్ణ ఏర్పాటుపై ఎన్పీఎఫ్తో చర్చలుంటాయని భావిస్తున్నారు. హంగ్ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ పడిపోయింది. యూరో విలువ కూడా 0.2 శాతం పడిపోయింది.ప్రధానీ పవర్‌ఫుల్లే... ఫ్రాన్స్‌లో 1958 నుంచి సెమీ ప్రెసిడెన్షియల్ పాలన వ్యవస్థ అమల్లో ఉంది. దీన్ని ఫిఫ్త్ రిపబ్లిక్‌గా పిలుస్తారు. ఇందులో అధ్యక్షునితో పాటు పార్లమెంటుకూ విశేషాధికారాలు ఉంటాయి. 1962 నుంచి అధ్యక్షుడిని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా నేరుగా ఎన్నుకుంటున్నారు. ఆయనే దేశాధిపతిగా, సాయుధ దళాల కమాండర్‌గా వ్యవహరిస్తారు. విదేశాంగ విధానం, రక్షణ విషయాలపై సర్వాధికారాలు ఆయనవే. ప్రధాని సిఫార్సు మేరకు కేబినెట్‌ను నియమిస్తారు. దేశీయ నిర్ణయాలన్నీ ప్రధాని నేతృత్వంలోని పార్లమెంటు తీసుకుంటుంది. ఆయనను అధ్యక్షుడు తొలగించలేరు. రాజీనామాను అభ్యరి్థంచవచ్చు. రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘిస్తే మూడింట రెండొంతుల మెజారిటీతో అధ్యక్షున్ని పార్లమెంటు అభిశంసించవచ్చు. ఫలించని ముందస్తు... నేషనల్ అసెంబ్లీ పదవీకాలం 2027 దాకా ఉంది. కానీ జూన్ 9న యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ చేతుల్లో మాక్రాన్ కూటమి ఘోర పరాజయం చవిచూసింది. దీనికితోడు ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న నేరాలు తదితరాలతో మాక్రాన్ నాయకత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మాక్రాన్ ముందస్తుకు వెళ్లారు. ఎన్నికల తేదీలు ప్రకటించగానే, సోషలిస్టులు, ఎకాలజిస్టులు, కమ్యూనిస్టులు, ఫ్రాన్స్అన్»ౌడ్ వంటివి కలిసి కలిసి ఎన్పీఎఫ్గా ఏర్పడ్డాయి. నేషనల్ ర్యాలీ కూటమిని ఓడించడమే లక్ష్యంగా చాలాచోట్ల ఎన్పీఎఫ్, సెంట్రిస్ట్ అభ్యర్థుల్లో ఎవరో ఒకరు తప్పుకుని ఓట్ల చీలికను నివారించారు. ఫలితంగా నేషనల్ ర్యాలీని నిలువరించినా మాక్రాన్ కూటమికి ఆయన ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు.దేశవ్యాప్త హింస... ఎన్నికల్లో ఆధిక్యం నేపథ్యంలో ఎన్పీఎఫ్ మద్దతుదారులు వీధుల్లోకొచ్చి సంబరాలు చేసుకున్నారు. పారిస్‌లోని ప్లేస్ డి లా రిపబ్లిక్ వద్ద వేలాదిగా గుమిగూడారు. ఈ క్రమంలో వారికి, నేషనల్ ర్యాలీ అభిమానులకు ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హింస చెలరేగింది. మాసు్కలు ధరించిన నిరసనకారులు పారిస్ వీధుల్లో పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఆస్తులను తగలబెట్టారు. రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.ఒలింపిక్స్‌పై ప్రభావమెంత? హంగ్ ఫలితాలతో ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరత నెలకొనడంతో జూలై 26 నుంచి జరగాల్సిన పారిస్ ఒలింపిక్స్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. అవి పూర్తయేదాకా పదవిలో కొనసాగేందుకు ప్రధాని అటల్ సుముఖంగా ఉన్నా ఆలోపే కొత్త ప్రధాని రావాల్సిందేనని అత్యధిక స్థానాలు సాధించిన లెఫ్ట్ కూటమి పట్టుబడుతోంది. ఒలింపిక్స్ భద్రత వ్యవహారాలు చూసుకునే కీలకమైన అంతర్గత భద్రత శాఖ మంత్రి గెలాల్డ్ డ్రమానియన్ కొనసాగడంపైనా సందిగ్ధతే కొనసాగుతోంది. ఒలింపిక్స్‌ను ఫ్రాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడేళ్లుగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలిక స్టేడియాలు, మౌలిక సదుపాయాలు తదితరాలపై ఇప్పటికే 260 కోట్ల డాలర్లకు పైగా వెచి్చంచింది. ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయినట్టేనని, ఒలింపిక్స్ నిర్వహణకు ఇబ్బందేమీ ఉండబోదని మాక్రాన్ ప్రభుత్వం చెబుతోంది. వాటి పర్యవేక్షణకు ఇబ్బంది ఉండకూడదనే అటల్ రాజీనామాను మాక్రాన్ ఆమోదించలేదని సమాచారం. ఏం జరగవచ్చు? సంకీర్ణ ఏర్పాటు సాధ్యపడని పక్షంలో రోజువారీ వ్యవహారాలను నడిపేందుకు ఏ పారీ్టలకు చెందని నిపుణులతో కూడిన ప్రభుత్వాన్ని మాక్రాన్ ఏర్పాటు చేసే వీలుంది. అయితే దేనికైనా పార్లమెంటు అనుమతి తప్పనిసరి. అధ్యక్షునిగా మాక్రాన్ పదవీకాలం 2027 దాకా ఉంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఆలోపు తప్పుకోబోనని ఆయన ఇప్పటికే ప్రకటించారు. -
French elections 2024: ఫ్రాన్స్‌లో నేడే రెండో దశ ఎన్నికలు
పారిస్: ఫ్రాన్స్‌లో ముందస్తు ఎన్నికల్లో కీలక దశకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటులో దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలోని 577 స్థానాలకు గాను 501 చోట్ల ఆదివారం రెండో రౌండ్లో భాగంగా పోలింగ్ జరగనుంది. తొలి రౌండ్లో 76 స్థానాలకు జరిగిన ఓటింగ్‌లో విపక్ష నేషనల్ ర్యాలీ, దాని మిత్ర పక్షాలు స్పష్టమైన ఆధిక్యం కనబరిచాయి. పోలైన 68 శాతం ఓట్లలో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి ఏకంగా 33.14 శాతం ఓట్లతో విజయం సాధించింది. మరో విపక్ష కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ 27.99 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ సారథ్యంలోని మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి కేవలం 20.04 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. జూన్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో మెరీన్ లీ పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ విజయం నేపథ్యంలో విపక్షాలు పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టమయ్యాయి. దాంతో మేక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే. రెండో రౌండ్లో కూడా నేషనల్ ర్యాలీ కూటమి హవాయే కొనసాగవచ్చంటున్నారు. అదే జరిగి 289 పై చిలుకు స్థానాలతో అది పూర్తి మెజారిటీ సాధిస్తే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఘనత సాధించిన తొలి రైటిస్టు కూటమి అవుతుంది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. అప్పుడు కూటమి అధ్యక్షుడు జోర్డాన్ బార్డెల్లా ప్రధాని అవుతారు. ఆయనతో మాక్రాన్ అధికారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. -
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు
ప్యారిస్: ఫ్రాన్సు అధ్యక్ష పదవికి ఆదివారం మొదటి రౌండ్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 13 మంది నేతలు బరిలో ఉండగా ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, మరీన్ లీపెన్ మధ్యే ప్రధాన పోటీ ఉంది. మొదటి విడత ఎన్నికల్లో ఏ ఒక్కరికీ 50% మించి ఓట్లు రాకుంటే ఈ నెల 24వ తేదీన నిర్ణయాత్మక రెండో విడత ఓటింగ్ చేపడతారు. ఫ్రాన్సు చరిత్రలో అధ్యక్ష పదవికి రెండో రౌండ్ ఎన్నిక ఎన్నడూ జరగలేదు. 2017 ఎన్నికల్లో లీ పెన్‌పై విజయం సాధించి మాక్రాన్ పిన్న వయస్కుడైన ఫ్రాన్సు అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. చదవండి: ఫ్రాన్స్‌కు పరీక్షా సమయం -
ఫలితాలు, గణాంకాలు కీలకం
► ఫ్రాన్స్ఎన్నికల ఫలితాలపై దృష్టి ► ఈ వారంలో పలు బ్లూచిప్ కంపెనీల ఫలితాలు ► రిటైల్, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై ఇన్వెస్టర్ల చూపు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, ఈ వారం వెలువడే కంపెనీల ఆర్థిక ఫలితాలు, రిటైల్, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ తదితర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని వారంటున్నారు. అదివారం జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడానికే మొగ్గు చూపుతున్న ఇమాన్యుయేల్ మక్రాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇది ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపవచ్చని విశ్లేషకులంటున్నారు. అయితే యూరోజోన్‌కు వ్యతిరేకి అయిన లీ పెన్ గెలిస్తే మాత్రం మార్కెట్లు షాక్తింటాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఫలితాల ప్రభావం... ఇక ఈ నెల 12న ఏప్రిల్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. అదే రోజు మార్చి నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(మార్కెట్ ముగిసిన తర్వాత) కూడా వస్తాయి. కాగా ఆర్థిక ఫలితాలు వెల్లడి కావడం మొదలై ఇది ఐదోవారం. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాలు నిలకడగా, సానుకూలంగా ఉన్నాయని, ఇది ఆర్థిక వ్యవస్థ రికవరీని సూచిస్తోందని నిపుణులంటున్నారు. నేడు (సోమవారం) కెనరా బ్యాంక్, భారతీ ఇన్ఫ్రా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాలు వస్తాయి. ఈ నెల 9న(మంగళవారం) భారతీ ఎయిర్టెల్, సిండికేట్ బ్యాంక్ ఫలితాలు, ఈ నెల 10న (బుధవారం) హీరో మోటొకార్ప్, జీ ఎంటర్టైన్మెంట్, ఈ నెల 11(గురువారం) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, గ్లెన్‌మార్క్ ఫార్మా, ఇక్రా, ఈ నెల 12న(శుక్రవారం) డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హావెల్స్ ఇండియా, నెస్లే ఇండియా, టైటాన్ కంపెనీల ఫలితాలు వస్తాయి. ఒడిదుడుకులు ఉంటాయ్ ! ప్రస్తుత ఫలితాల సీజన్లో ఆర్థిక ఫలితాలకనుగుణంగా ఆయా కంపెనీల షేర్ల కదలికలు ఉంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని వివరించారు. ఆర్థిక ఫలితాలను జాగ్రత్తగా గమనించాలని, ఆర్థిక వ్యవస్థలోకి వృద్ధి తిరిగి వచ్చిందన్న అంచనాలను నిర్ధారణ చేసుకోవాలని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా చెప్పారు. ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి సంబంధిత గణాంకాలు ఈ వారంలో వస్తాయని, ఈ గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. ఈ వారంలో చాలా ఈవెంట్స్ ఉన్నాయని, ఒడిదుడుకులు తప్పకపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం కీలకమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. హడ్కో ఐపీఓ ఈ వారంలోనే... హడ్కో ఐపీఓ సోమవారం మొదలై బుధవారం ముగిస్తుంది. రూ.56–60 ధరల శ్రేణితో ఈ ఐపీఓ ద్వారా హడ్కో కంపెనీ రూ.1,200 కోట్లు సమీకరించనున్నది. ఇటీవలే ఐపీఓకు వచ్చిన ఎస్. చాంద్ అండ్ కంపెనీ మంగళవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్కానున్నది. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, ఈ నెల 10న(బుధవారం) చైనా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈ నెల 11న(గురువారం) బ్యాంక్ ఆఫ్ జపాన్ తన పాలసీని ప్రకటిస్తుంది. ఈ నెల 12(శుక్రవారవ) యూరప్ మార్చి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అదే రోజు అమెరికా ఏప్రిల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. విదేశీ ‘అమ్మకాలు’ గత కొన్ని రోజులుగా జోరుగా పెట్టుబడులు కొనసాగించిన విదేశీ ఇన్వెస్టర్లు గత వారంలో అమ్మకాలు జరిపారు. నాలుగు ట్రేడింగ్ సెషన్లలో రూ.1,700 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ముడి చమురు ధరలు పతనం కావడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం దీనికి ప్రధాన కారణాలు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు గత వారంలో మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.1,680 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అయితే డెట్ మార్కెట్లో మాత్రం రూ.1,177 కోట్లు పెట్టుబడులు పెట్టారు. కాగా గత మూడు(ఫిబ్రవరి–ఏప్రిల్) నెలల్లో రికార్డ్ స్థాయిలో రూ.40,000కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. -
పసిడిపై ‘ఫ్రాన్స్’ ఫలితాల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధర న్యూయార్క్/ముంబై: బంగారం ధరలపై ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాల సరళి ప్రభావం పడింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ధర ఔన్స్ (31.1గ్రా) కడపటి సమాచారం అందేసరికి 13 డాలర్లు తగ్గి 1,275 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పష్టంకాని అమెరికా అధ్యక్షుడి ఆర్థిక విధానాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దీనితో డాలర్ బలహీనత వంటి అంశాల నేపథ్యంలో– తమ పెట్టుబడులకు సురక్షితమైనదిగా ‘పసిడి’వైపు పెట్టుబడులు మళ్లాయి. యూరో నుంచి ఫ్రాన్స్ వైదొలగాలని కోరుతున్న లీ పెన్ గెలుపు అంచనాల భయాలూ దీనికి తోడయ్యాయి. దీనితో పసిడి భారీగా పెరగడం ప్రారంభించింది. అయితే ఫ్రాన్స్ ఫలితాల సరళి ఇందుకు భిన్నంగా, మార్కెట్ అనుకూల మాక్రాన్‌కు సానుకూలంగా ఉండడంతో పసిడి నుంచి పెట్టుబడులు వెనక్కుమళ్లడం ప్రారంభిం చాయి. లాభాల స్వీకరణ దీనికో ప్రధాన కారణం. ఒకదశలో 1,266 డాలర్లకు తగ్గింది. తుది సమాచారం అందేసరికి క్రితంకన్నా 13 డాలర్ల తక్కువగా ట్రేడవుతోంది. మాక్రాన్ గెలుపుతో పసిడి ధర ప్రస్తుతానికి కొంత వెనక్కుతగ్గే వీలుందని విశ్లేషకుల అంచనా. అయితే డాలర్ బలహీనత నేపథ్యంలో స్వల్పకాలంలో పసిడిది బులిష్ ధోరణేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాగా దేశ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో కూడా కడపటి సమాచారం అందే సరికి పసిడి 10 గ్రాముల ధర రూ. 270 తగ్గి రూ29,148 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు దేశ ప్రధాన స్పాట్ మార్కెట్ ముంబైలో సోమవారం 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.235 తగ్గి రూ. 29,260కి చేరింది. వెండి కేజీ ధర కూడా రూ. 480 పడి, రూ.41,545కు చేరింది. -
ఫ్రాన్స్ ఎన్నికలపై మార్కెట్ ఫోకస్
♦ ఏప్రిల్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపుతో ఒడిదుడుకులు ♦ ప్రభావితం చేయనున్న ఆర్ఐఎల్, విప్రో యాక్సిస్ బ్యాంక్‌ల ఫలితాలు ♦ ఈసీబీ పాలసీపైనా ఇన్వెస్టర్ల దృష్టి ముంబై: ఫ్రాన్స్ ఎన్నికలు, కార్పొరేట్ ఫలితాల ఆధారంగా ఈ వారం మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఏప్రిల్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారంలో(ఈ నెల 27న–గురువారం) ముగియనున్నందున స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ అంశాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు, ఫ్రాన్స్ ఎన్నికల.. తదితరాలు కూడా ఈ వారం మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఇక ఈ శుక్రవారం (ఈ నెల28న) పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, విదేశీ కరెన్సీ నిల్వలు, బ్యాంక్ డిపాజిట్ వృద్ధి, బ్యాంక్ రుణ వృద్ధి.. ఈ అంశాలకు సంబంధించిన గణాంకాలు వెలువడుతాయి. నేడు ఫ్రాన్స్ ఎన్నికల తొలి రౌండు ప్రభావం ఇప్పుడు అందరి దృష్టి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. యూరోజోన్‌లో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఫ్రాన్స్‌లో రెండు రౌండ్లుగా జరిగే ఈ ఎన్నికల తుది ఫలితాలు మే 11న వస్తాయి. కానీ ఏప్రిల్ 23.. ఆదివారం జరిగిన తొలి రౌండు ఎన్నికలు మార్కెట్లకు కీలకమని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ తొలి రౌండు ఫలితంతో మార్కెట్ ముందుగా సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ హెడ్ వీకే శర్మ చెప్పారు. మే 7న రెండో రౌండు ఎన్నికలు జరుగుతాయి. అమెరికా, ఉత్తర కొరియా మధ్య తాజా పరిణామాలేవైనా సంభవిస్తే భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ ప్రభావితమవుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సంఘానియా అన్నారు. ఈ వారం జరిగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) పాలసీ సమావేశం సైతం మార్కెట్ ట్రెండ్‌ను శాసిస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. గురువారం (27న) ఈసీబీ ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. దిగ్గజ కార్పొరేట్ల ఫలితాలు... ఈ వారంలో పలు దిగ్గజ కంపెనీల జనవరి–మార్చి క్వార్టర్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటిదాకా వెలువడిన క్యూ4 ఫలితాలు మిశ్రమంగా ఉండడంతో ఈ వారంలో రానున్న కంపెనీల ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తున్నారు. సోమవారం(ఈనెల 24న) మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 ఫలితాలు వస్తాయి. అదే రోజు అల్ట్రాటెక్ సిమెంట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. మంగళవారం(ఈ నెల 25న) యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ ప్రులైఫ్, బుధవారం(ఈ నెల 26న) జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్, గురువారం(ఈ నెల27) మారుతీ సుజుకీ, బయోకాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, శుక్రవారం(ఈ నెల28) అంబుజా సిమెంట్, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ తదితర కంపెనీల ఆర్థిక ఫలితాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు రూ.18,890 కోట్లు దేశీయ కేపిటల్ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)పెట్టుబడులు భారీ స్థాయిలో తరలివస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.18,890 కోట్లను ఎఫ్‌పీఐలు నికరంగా పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్ 3–21 తేదీల మధ్య ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.1,132 కోట్లుగాను, డెట్ విభాగంలో రూ.17,758 కోట్లుగానూ ఉన్నాయి.