
రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
- ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజ సదారాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర శాసనసభా కార్యదర్శి, ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజ సదారాం తెలిపారు. సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ కమిటీ హాలులో పోలింగ్ బూత్, ఇతర ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ భన్వర్‌లాల్, కేంద్ర ఎన్ని కల పరిశీలకులు సునిల్ కుమార్‌తో కలసి పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేలందరికీ ఎన్నికల నిబంధనలను తెలియ జేశాం. ప్రాధాన్య ఓటు ఈసీ సమకూర్చిన పెన్నుతోనే ఎమ్మెల్యేలు తాము ఓటు వేయదల్చుకున్న అభ్యర్ధి పేరు ఎదురుగా ఉన్న గడిలో 1 అంకెను వేయాలి. తామేసిన ఓటును రహస్యంగానే ఉంచాలి’అని రాజసదారాం తెలిపారు.