రాష్ట్రంలో మొత్తం ఓట్ల విలువ దాదాపు 32 వేలు
సాక్షి, హైదరాబాద్: మరో ఇరవై రెండు రోజుల్లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల కోసం ఆయా రాజకీ య పక్షాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. జూలై 17వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా అధి కార టీఆర్‌ఎస్ ఎన్డీయే అభ్యర్ధి రాంనాధ్ కోవింద్‌కు మద్దతు తెలిపింది. కాగా, ఈ ఎన్నికల్లో విపక్ష టీడీపీ, బీజేపీ, అధికార టీఆర్‌ఎస్ ఒకే అభ్యర్థికి ఓటేయనున్నాయి. ఈ ఎన్నికల్లో విపక్ష కూటమి అభ్యర్థిగా మీరాకుమార్‌ను పోటీకి పెట్టాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిర్ణయించడంతో రాష్ట్రపతి ఎన్నికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం, సీపీఎంలు ఓటింగ్‌లో పాల్గొననున్నాయి. 1971 జనాభా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల ఓటు విలు వను నిర్ణయించారని అధికార వర్గాలు చెబుతు న్నాయి. తెలంగాణలో జరిగే ఓటింగ్ కోసం శాసన సభ కార్యదర్శిని సహాయ రిటర్నింగ్ అధికారి (ఏఆర్‌ఓ)గా నియమించారు. కాగా, దేశ వ్యాప్తంగా ఎంపీల ఓటు విలువ మారకున్నా, ఎమ్మెల్యేల ఓటు విలువలో మాత్రం రాష్ట్రాల మధ్య తేడా ఉంది.
ఇదీ .. లెక్క...
అధికారిక సమాచారం మేరకు ఒక ఎంపీ ఓటు విలువ 704. కాగా ఎమ్మెల్యే ఓటు విలువను 132గా నిర్ణయించారు. ఎంపీల విభాగంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల ఓటు విలువ ఒకే మాదిరిగా ఉం టుంది. ఈ లెక్కన తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజవర్గాలకు సంబంధించి ఉన్న ఓట్ల విలువ 15,708. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా కలిపి 24 మంది. ఇటీవలనే కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి దివంగతులు కావడంతో ఒక స్థానం ఖాళీ అయ్యిం ది.
దీంతో 23 మంది ఎంపీలకుగాను ఓట్ల విలువ 16,192. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల విలువను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం విలువ 31,900. ఎమ్మెల్యేలు విధిగా తమ రాష్ట్ర రాజధానిలోనే ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుందని, ఎంపీలకు మాత్రం ఎన్నికల కమిషన్‌కు ముందస్తు సమాచా రం ఇచ్చి అటు ఢిల్లీలో కానీ, లేదంటే తమ సొంత రాష్ట్ర రాజధానిలో కానీ ఓటింగ్‌లో పాల్గొనే వెసులు బాటు ఉందని అధికార వర్గాలు చెప్పాయి.
పార్టీలకు ఉన్న ఓట్లు ఇవీ..
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలని రాజకీయ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసే అధికారం ఉండదని, అదే మాదిరిగా, ఫిరాయింపుల చట్టమూ ఈ ఎన్ని కకు వర్తించదని అధికార వర్గాల సమాచారం. దీంతో రాష్ట్రంలో జరిగిన పార్టీ మార్పిళ్లు అధికార టీఆర్‌ఎస్ ఓట్లను పెంచినట్లు అయ్యింది. రాష్ట్రం లోని పార్టీల చేతుల్లో ఉన్న ఓట్ల విలువలో టీఆర్‌ఎస్‌దే సింహభాగం. ప్రస్తుతం టీఆర్‌ఎస్ చేతిలో 90 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు (14లోక్‌సభ, 3 రాజ్యసభ సభ్యులు) ఉన్నారు.
దీంతో ఒక్క టీఆర్‌ఎస్ చేతిలోనే 23,848 ఓట్లున్నాయి. కాంగ్రెస్ చేతిలో 13 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు (1 లోక్‌సభ, 3 రాజ్యసభ) ఉన్నారు. దీంతో కాంగ్రెస్ చేతిలో 4,532 ఓట్లున్నాయి. ఎంఐఎంకున్న ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో 1,628 ఓట్లు, బీజేపీ అయిదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో కలిపి 1,364 ఓట్లు, టీడీపీకి 3 ఎమ్మెల్యేలతో 396 ఓట్లు, సీపీఎంకు ఒక ఎమ్మెల్యేతో 132 ఓట్లు ఉన్నాయి.