
వాషింగ్టన్: ముందుగా అనుకున్న ప్రకారం నవంబర్ 3వ తేదీనే ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరుగుతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు ఉంటాయా అన్న విలేకర్ల ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇచ్చారు. ‘ఏదేమైనా అధ్యక్ష ఎన్నికల తేదీల్లో మార్పులు ఉంటాయని నేననుకోవడం లేదు. అలా ఎందుకు చేయాలి? నవంబర్ 3 మంచి తేదీ’ అని వైట్‌హౌజ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. కాగా, కోవిడ్ క్లిష్ట సమయాల్లో అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికలు వాయిదా వేసే విషయమై ఆలోచించాలని ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న జో బిడెన్ గతవారం కోరిన సంగతి తెలిసిందే.
(చదవండి: టాప్–3లో భారత్)