వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాకిస్తూ.. డెమొక్రాట్ జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో స్వీడిష్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ (17) ప్రతీకారం తీర్చుకున్నారు. గతంలో తనను అపహాస్యం చేసిన ట్రంప్‌కు సోషల్‌మీడియాలో గట్టి కౌంటర్ ఇచ్చారు. 'చిల్, డోనాల్డ్, చిల్' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ అవకాశం కోసం గ్రెటా 11 నెలలు వేచి చూడాల్సి వచ్చింది. (పాపం ట్రంప్.. కోర్టులో కూడా ఓటమే)
తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగులుతున్న సమయం చూసి ట్రంప్‌పై ఆమె సెటైర్లు వేశారు. ముఖ్యంగా ఓటమిని అంగీకరించలేక "స్టాప్ ది కౌంట్!" అంటూ కుపితుడైపోతున్న ట్రంప్‌ను ఆమె ట్రోల్ చేశారు. "చాలా హాస్యాస్పదం. డొనాల్డ్ యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్ సినిమాకు వెళ్లండి! చిల్, డొనాల్డ్, చిల్!" అంటూ థన్‌బర్గ్ గురువారం ట్వీట్ చేశారు. దీంతో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రంప్‌ను భారీగా ట్రోల్ చేస్తున్ననెటిజన్లు గ్రెటా ట్వీట్‌తో మరింత హంగామా చేస్తున్నారు. వ్యంగ్య కామెంట్లతో హల్ చల్ చేస్తున్నారు. లక్షల కొద్దీ 'లైక్'లు, వేలాది రీట్వీట్లతో సందడి చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే పర్యావరణ హితం కోసం విశేష కృషి చేస్తున్న గ్రేటా థన్‌బర్గ్‌ను 2019లో టైమ్ మ్యాగజైన్ ఇయర్ ఆఫ్ ది పర్సన్ పేరుతో సత్కరించింది. ఈ సందర్బంగా చిల్ గ్రెటా అంటూ గ్రెటాను ట్రంప్ ఎగతాళి చేశారు. "చాలా హాస్యాస్పదం గ్రెటా తన యాంగర్ మేనేజ్‌మెంట్‌పై పని చేయాలి, ఆపై స్నేహితుడితో మంచి పాత ఫ్యాషన్ చిత్రానికి వెళ్లండి!! " అంటూ ట్వీట్ చేశారు. దీంతో మనసునొచ్చుకున్న గ్రెటా మంచి సమయం కోసం వేచి చూసి గట్టి కౌంటర్ ఇచ్చిందన్నమాట. కాగా తాజా ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
So ridiculous. Donald must work on his Anger Management problem, then go to a good old fashioned movie with a friend! Chill Donald, Chill! https://t.co/4RNVBqRYBA
— Greta Thunberg (@GretaThunberg) November 5, 2020
Greta held onto this for 11 MONTHS and dropped an absolute precision missile strike. pic.twitter.com/0MxnWSNKZ3
— Jim Harper (@NewsroomJim) November 6, 2020
Comments
Please login to add a commentAdd a comment