
మాలె: మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష నేత మహ్మద్ ముయిజ్ 53 శాతం ఓట్లతో అనూహ్య విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలెహ్‌కు 46 శాతం ఓట్లు రాగా, మొత్తమ్మీద 18వేల మెజారిటీతో ముయిజ్ విజయం సాధించారని అక్కడి మీడియా తెలిపింది. అధ్యక్ష బరిలోకి ఆలస్యంగా దిగిన ముయిజ్ రెండో రౌండ్‌లో విజయం సాధించడం గమనార్హం.
సెప్టెంబర్‌లో జరిగిన మొదటి రౌండ్ పోలింగ్ ముయిజ్, సోలెహ్‌ల్లో ఎవ్వరికీ 50 శాతం పైగా ఓట్లు దక్కలేదు. దీంతో, శనివారం రెండో రౌండ్ పోలింగ్ జరిగింది. ముయిజ్‌కు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌ను చైనా అనుకూల పార్టీగా భావిస్తుంటారు. అధికారంలోకి వస్తే మాల్దీవుల్లో ఉన్న భారత్ బలగాలను వెనక్కి పంపించివేస్తానని, భారత్‌పై ఆధారపడటం తగ్గిస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment