వైఎస్సార్‌సీపీ ఓటింగ్ కీలకం
- మీరాకుమార్‌కు మద్దతివ్వండి
- వైఎస్ జగన్‌కు పీసీసీ చీఫ్ రఘువీరా లేఖ
విజయవాడ సెంట్రల్: రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు 17 పార్టీలు బలపర్చిన మీరాకుమార్‌కు మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన లేఖ రాశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు సొంతగా తన అభ్యర్థిని గెలిపించుకొనే బలం లేదని, దీంతో వైఎస్సార్‌సీపీ ఓటింగ్ కీలకమైందన్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్న తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. రామ్‌నాథ్ కోవింద్ రాజకీయ జీవితం మనువాద భావజాలం పునాదిగా ఏర్పడిందన్నారు.