తలుపు తెరవగానే అనుకోని అతిథి | family opens doors, find heavy alligator | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 20 2017 4:03 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

పొద్దున్నే నిద్ర లేవగానే తలుపు చప్పుడైతే ఇంత పొద్దున్నే వచ్చి డిస్ట్రబ్ చేసేది ఎవరని విసుక్కుంటాం. కానీ అమెరికాలోని సౌత్ కరొలినా ప్రాంతంలోని మౌంట్ ప్లెజెంట్‌లో ఉండే కుటుంబానికి మాత్రం అలా విసుక్కునే అవకాశం కూడా రాలేదు. పొద్దున్నే ఇంటి తలుపు బయట వాళ్లకు ఏదో శబ్దం వినిపించింది. ఎవరైనా దొంగలు తలుపు పగలగొట్టుకుని లోపలకు వద్దామని అనుకుంటున్నారా అన్న అనుమానం వచ్చింది. కానీ జాగ్రత్తగా తలుపు తీసి చూస్తే.. అక్కడో పెద్ద మొసలి నోరు తెరుచుకుని కనిపించింది. తన కూతురు మేడ మీద ఉంటుందని, ఆమె కిందకు దిగి ఉంటుందని తాము అనుకున్నామని.. తన కూతురేమో తన భార్య బయటకు వచ్చి ఉంటుందని అనుకుందని, కానీ చివరకు ఇద్దరూ కాకుండా తొమ్మిది అడుగుల పొడవున్న మొసలి కనిపించేసరికి గుండె ఝల్లుమందని ఇంటి యజమాని స్టీవ్ పాల్స్టన్ చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement