అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సౌత్ కరోలినా రాష్ట్రంలోని చార్లెస్టన్ నగరంలో ఉన్న ప్రతిష్టాత్మక మెథడిస్ట్ చర్చిపై ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం) 110 కాల్ హౌన్ స్ట్రీట్ లో ఉన్న చర్చిలోకి తుపాకీతో చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు చార్లెస్టన్ పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో ఎవరూ మృతి చెందినట్టు అధికారిక సమాచారం లేదు. అయితే కాల్పులు జరిగిన తీరుబట్టి చూస్తే పలువురు మరణించివుంటారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Published Thu, Jun 18 2015 11:32 AM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement