
కొలంబియా : లాక్‌డౌన్ నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఏ వార్త, వీడియో కనిపించినా నిమిషాల్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని దక్షిణ కారోలినాకు చెందిన ఫెర్నాండో లోసాడా అనే కుటుంబం.. ఓ మొసలికి చెందిన వైరల్ వీడియోను సోమవారం ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. లోసాడా కుటుంబం ఇంటి వెనక భాగంలో ఓ పెరడు ఉంది. అలాగే వారికి కొంత దూరంలోనే లాగున్(మడుగు) ఉండటంతో తరచుగా ఆ మడుగు నుంచి అనేక మొసళ్లు తమ పెరటిలో తిరుగుతూ దర్శనమిస్తుంటాయి. ఇటీవల బిగ్ జార్జ్ అని స్థానికంగా పిలువబడే ఓ మొసలి వారి పెరటిలోకి ప్రవేశించిది. అయితే కోపంలో ఉన్న ఆ మొసలి పెరటిలోని కొన్ని వస్తువులను ద్వంసం చేసింది. (చిరంజీవి ఉప్మా పెసరట్టు... )
దీనిపై ఇంటి యాజమాని మాట్లాడుతూ.. ప్రతి రోజు మొసళ్లు తమ లాగున్‌లోకి వస్తుంటాయని తెలిపారు. కానీ ఈ మొసలిలాగా మిగతావి తమ పెరటిలోని వస్తువులను చెల్లాచెదురు చేయలేదన్నారు. ఇది చాలా కోపంగా కనిపించిందని, పెరటిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిందన్నారు. అయితే మనుషులెవరికి హానీ చేయలేదని, దాంతో తాము జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలిపారు. ఇక చివరికి శాంతించిన మొసలిని నాలుగురు సెక్యూరిటి గార్డులు తిరిగి లాగున్‌లో విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. కాగా మొసలి వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ‘మొసలి చాలా పెద్దగా ఉంది. ఇది భయానకంగా ఉంది.’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూన్నారు. (ఆ ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది: వర్మ )
Comments
Please login to add a commentAdd a comment