BMJ study
-
వంద కోట్ల యువతకు శబ్దపోటు
వాషింగ్టన్: నిరంతరం హెడ్ఫోన్లు పెట్టుకునే సంగీతం వింటున్నారా ? ప్రతి ఫోన్‌కాల్, ఆడియో, వీ డియో శబ్దాలు నేరుగా కాకుండా కేవలం ఇయర్ బడ్స్ ద్వారానే వింటున్నారా ? చెవులు చిల్లులు పడే శబ్దమయ సంగీత విభావరిలకు హాజరవుతున్నారా ? అయితే వినికిడి సమస్య మిమ్మల్ని వెంటాడటం ఖాయమని ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గ్యాడ్జెట్లకు అతుక్కుపోతున్న దాదాపు 100 కోట్ల మంది టీనేజీ వయసువారికి చెముడు సమస్య పొంచి ఉందని బీఎంజే గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురి తమైన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ దేశాలు తమ టీనేజర్ల కోసం అత్యవసరంగా శబ్ద సంబంధ చట్టాలకు పదునుపెట్టాలని అమెరికా లోని సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయం పరిశో ధకులతో కూడిన అంతర్జాతీయ అధ్యయన బృందం సూచనలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది వినికిడి సమస్యతో బాధపడుతు న్నారని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయ ని పరిశోధకులు గుర్తుచేశారు . ‘‘సొంత శబ్ద సాధనాలు(పర్సనల్ లిజనింగ్ డివైజెస్–పీఎల్డీ) స్మార్ట్‌ఫోన్, హెడ్‌ఫోన్, ఇయర్బడ్స్ల అతివాడకమే సమస్యకు కారణం. వాస్తవానికి వయోజనులు 80 డెసిబెల్స్, చిన్నారులు 75 డెసిబెల్స్ స్థాయిలోనే శబ్దాలు వినాలి. కానీ, పీఎల్డీ వినియోగదారులు అత్యధికంగా 105 డెసిబెల్స్ వాల్యూమ్స్‌లో శబ్దాలు వింటున్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో ఇది 112 డెసిబెల్స్‌కు చేరుతోంది. 2022 ఏడాదిలో 12–34 ఏళ్ల వయసువారిలో ఏకంగా 280 కోట్ల మంది వినికిడి సమస్యను ఎదుర్కొనే ప్రమాదముంది’’ అని అంచనావేశారు. -
కరోనాకు 'కత్తెర'.. రెండు కొత్త చికిత్సా విధానాలు ఆమోదం
World Health Organization approved two new Covid-19 treatments: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహోచ్ఓ) శుక్రవారం కోవిడ్ -19 కోసం రెండు కొత్త చికిత్సా విధానాలను ఆమోదించింది. వ్యాక్సినేషన్లతో పాటు ఈ మెరుగైన చికిత్సలు కూడా తోడైతే ఈ కరోనా వైరస్ భారిన పడకుండా ఉండటమే కాక మరణాలను అరికట్టగలం అని డబ్ల్యూహోచ్‌వో నిపుణులు చెబుతున్నారు. అయితే డబ్ల్యూహోచ్‌వో మార్చి నాటికి యూరప్‌లో సగం మందికి కరోనా సోకుతుందని, ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోతాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ మెడికల్ జర్నల్ (బీఎంజే), డబ్ల్యూహెచ్ఓ నిపుణులు తీవ్రమైన లేదా క్లిష్టమైన కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి కార్టికోస్టెరాయిడ్స్ తోపాటు ఆర్థరైటిస్ డ్రగ్ బారిసిటినిబ్ని ఉపయోగించి మెరుగైన చికిత్స అందించవచ్చు అని అన్నారు. అంతేకాదు ఈ చికిత్స విధానం వల్ల వెంటిలేటర్ల అవసరం తగ్గుతుందని, మనుగడ రేటును పెంచగలం అని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన సోట్రోవిమాబ్ అనే సింథటిక్ యాంటీబాడీ చికిత్స అనేది కరోనా తీవ్రతరం కానీ రోగులకు కోసం. అయితే ఈ చికిత్స విధానం వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా మధుమేహం వంటి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఈ చికిత్సా విధానం వల్ల ఆస్పత్రులపాలై ప్రమాదం ఎక్కువ. ఆసుపత్రిలో చేరే ప్రమాదం లేని వ్యక్తుల కోసం సోట్రోవిమాబ్ మంచి ప్రయోజనం ఇస్తోందని, అలాగే కరొనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కి వ్యతిరేకంగా పనిచేస్తుందనేది కాస్త సందేహమే అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అయితే ఇప్పటి వరకు కరోనా కోసం మూడు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని డబ్ల్యూహెచ్ఓ విడి విడిగా ఆమోదించింది. సెప్టెంబర్ 2020లో ఆమోదించిన తీవ్రమైన అనారోగ్యం కోసం కార్టికోస్టెరాయిడ్స్‌ను ఉపయోగించే చికిత్స. ఇది చవకగా లభించే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. జూలైలో డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన ఆర్థరైటిస్ డ్రగ్స్ టోసిలిజుమాబ్, సరిలుమాబ్లతో అందిచే చికిత్స విధానం. అయితే ఈ చికిత్స విధానం ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక వ్యవస్థ యొక్క అధిక ప్రతిచర్యతో పోరాడటానికి ఎంతగానేఉపకరిస్తోంది. ఈ రోగులు బారిసిటినిబ్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ మేరకు రెండు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పుడూ ఖర్చులను, వైద్యుల సలహాలను, మీ సమస్యలను దృష్టి ఉంచుకుని సరైన చికిత్స విధానాన్ని ఎంచుకోండి అని డబ్ల్యూ హెచఓ పేర్కొంది. -
కరోనా : 2022 వరకు వారికి టీకా అందదు
లండన్: కరోనా వైరస్ కట్టడి కోసం ప్రపంచదేశాలన్ని వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే రెండు, మూడు వ్యాక్సిన్లు అత్యవసర అనుమతి కూడా పొందాయి. ఈ నేపథ్యంలో బీఎంజే మెడికల్ జర్నల్ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దాని ప్రకారం 2022 వరకు ప్రపంచంలో ఐదొందుతల జనాభాకు వ్యాక్సిన్ అందదని తెలిపింది. ధనిక దేశాలు ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయని.. ఫలితంగా పేద దేశాల ప్రజలకు వ్యాక్సిన్ ఇప్పట్లో అందుబాటులోకి రాదని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న డజన్ల కొద్దీ వ్యాక్సిన్లలో కనీసం ఒకదానిని అయినా పొందే అవకాశాలను పెంచుకోవాలనే ఆత్రుతతో, అనేక దేశాలు అనేక రకాల ఔషధాల కేటాయింపులను తగ్గించాయి. ఇక ప్రపంచ జనాభాలో కేవలం 14 శాతం మాత్రమే ఉన్న సంపన్న దేశాలు ఇప్పటికే వచ్చే ఏడాది వరకు అందుబాటులోకి రానున్న 13 ప్రముఖ కంపెనీలు అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ డోసుల్లో సగానికి పైగా ముందే ఆర్డర్ చేసినట్లు జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వెల్లడించారు. (చదవండి: వైద్యుడు కాదని వ్యాక్సిన్‌ను నమ్మలేదు.. కానీ) ఇక కరోనా కట్టడి కోసం 100 శాతం సామార్థ్యం గల వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. దాన్ని ప్రపంచ జనాభా అందరికి సరిపోయే మొత్తంలో ఉత్పత్తి చేసినప్పటికి 2022 వరకు ఐదొంతుల ప్రపంచ జనాభాకి వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని స్టడీ తెలిపింది. బీఎంజే మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఈ నివేదిక నవంబర్ మధ్య వరకు లభించిన డాటా ఆధారంగా రూపొందించారు. ఇప్పటికే ఈ దేశాలు 7.48బిలియన్ల డోసులను రిజర్వ్ చేసుకున్నాయని నివేదిక తెలిపింది. ఎందుకంటే ప్రస్తుతం అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్లను రెండు డోసులు తీసుకోవాల్సి ఉండటంతో భారీగా వ్యాక్సిన్లను రిజర్వ్ చేసుకున్నాయి. ఇక 2021 చివరి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5.96 బిలియన్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి కానున్నాయి. -
పెరిగిన పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సామర్థ్యం ప్రస్తుతం గణనీయంగా పెరిగింది. దేశంలో 10 లక్షల జనాభాకు గాను సగటున 47 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 78.6 మందికి టెస్టులు జరుగుతున్నాయి. తాజాగా రోజుకు 1,170 మందికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 7 వైరాలజీ ల్యాబొరేటరీలలో ప్రతి పది లక్షల జనాభాకు 78.6 మందికి పరీక్షలు నిర్వహించేలా సామర్థ్యం పెరిగింది. రానున్న పది రోజుల్లో ప్రతి పది లక్షల జనాభాకు 300 టెస్టులు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ఎక్కువ పరీక్షలు చేస్తున్నామని, కడప, విశాఖపట్నం, గుంటూరులో ల్యాబొరేటరీలు అందుబాటులోకి వచ్చాక నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నాటికి 3,930 మందికి నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది. ప్రైవేటు ల్యాబొరేటరీలు కూడా అందుబాటులోకి వస్తే టెస్టుల సంఖ్య మరింతగా పెరుగుతుందని తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువే – ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగానే జరుగుతున్నాయని బీఎంజే గ్లోబల్ హెల్త్ సంస్థ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సంస్థ కరోనా పరీక్షలు, మృతుల శాతంపై అధ్యయనం చేసింది. – భారతదేశంలో సగటున 10 లక్షల జనాభాకు గాను సగటున 47 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 52.74 మందికి టెస్టులు జరుగుతున్నాయి. భారతదేశంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ వెల్లడించింది. – కేంద్ర వైద్య ఆరోగ్య శాఖతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రకటించిన గణాంకాలు, కేసుల వివరాల ఆధారంగా ఈ వివరాలను ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. ఏపీలో మెరుగ్గా కరోనా నియంత్రణ – చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు మెరుగ్గా జరుగుతున్నాయి. తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా పైస్థాయిలో ఉంది. – కరోనా వైరస్ మృతుల నియంత్రణలో కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మొదటి వరుసలో ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల శాతం 0.53 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. హిమాచల్‌ప్రదేశ్‌లో 16.67 శాతం, పంజాబ్‌లో 8.77 శాతం ఉంది. – క్వారంటైన్, ఐసొలేషన్ వ్యవస్థ కట్టుదిట్టంగా అమలవుతోంది. రాష్ట్రంలో 2020 ఏప్రిల్ 7 నాటికి 3930 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 3.62 శాతం పాజిటివ్ కేసులుండగా, తెలంగాణలో అది 7.18 శాతంగా ఉంది. బీఎంజే వెల్లడించిన ముఖ్యాంశాలు.. – దేశంలోని కేరళలో 2020 జనవరి 30న తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత కేసుల సంఖ్యా పెరిగింది. అందువల్ల కేరళలో ఎక్కువ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. మృతుల శాతాన్ని 0.65 శాతానికి కట్టడి చేయగలిగారు. తమిళనాడులోనూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టెస్టుల సంఖ్యనూ పెంచారు. – కర్ణాటక, మహరాష్ట్రల్లో ఎక్కువ టెస్టులు చేస్తున్నా మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. – అరుణాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లో మిలియన్ జనాభాకు 13 టెస్టుల కంటే తక్కువగా జరుగుతున్నాయి. – బిహార్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్లో మిలియన్ జనాభాకు 20 కంటే తక్కువగా టెస్టులు చేస్తుండగా, మృతుల రేషియో 3.5 శాతంగా ఉంది. – రాబోయే రెండు మాసాల్లో ఆయా రాష్ట్రాల్లో చేపట్టే కరోనా నియంత్రణా చర్యలను బట్టి కేసుల వ్యాప్తి ఉంటుంది. సైన్స్ జర్నల్స్‌లో బీఎంజే దిట్ట బీఎంజే గ్లోబల్ హెల్త్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సంస్థ. రీసెర్చ్ పబ్లికేషన్స్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం ఈ సంస్థ పబ్లికేషన్స్‌కు ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన డా.సెయెఅబంబోలా సంపాదకులుగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య స్థితిగతులు, పరిణామాలను అంచనా వేయడంలో ఈ సంస్థకు మంచి పేరుంది. వైద్యులు ఈ సంస్థ పబ్లిష్ చేసే జర్నల్స్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. -
కరోలినా.. చాలా డేంజర్ గురూ..
కరోలినా రాపర్.. ఎంతటివారినైనా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించగల ఘనాపాటి.. ఎవరబ్బా ఈ కరోలినా అనుకుంటున్నారా.. మీరనకుంటున్నట్లు కరోలినా మనిషి కాదు.. ఒక మిరపకాయ. బ్యాడ్మింటన్‌లో ఆ కరోలినా మారిన్ రికార్డులు సృష్టిస్తే.. ఈ కరోలినా రాపర్ ప్రపంచంలోనే అతి ఘాటైన మిరపకాయగా గిన్నిస్ బుక్ రికార్డుకెక్కింది. స్పైసీ ఫుడ్ లవర్స్ పోటీ పెట్టుకుని మరీ వీటిని లాగించేస్తుంటారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా. న్యూయార్క్‌కు చెందిన యువకుడి విషయంలోనూ ఇదే జరిగింది. పోటీలో భాగంగా ఒకే ఒక కరోలినా రాపర్‌ని తిన్నాడు 34 ఏళ్ల యువకుడు. అంతే ఒక్క నిమిషంలోనే తీవ్రమైన తలనొప్పితో కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు పోటీ నిర్వాహకులు. తలనొప్పితో పాటు మెడ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. క్రమంగా ధమనులు కూడా అస్తిరపడటంతో వైద్యులు అతడి మెదడును స్కాన్ చేశారు. మిరపకాయ తినడం వల్లే రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. ఐదువారాల పాటు చికిత్స పొందిన అనంతరం అతడి ఆరోగ్యం కుదుటపడింది. పోటీలో గెలవలేకపోయిన ఆ యువకుడు.. కరోలినా రాపర్ తిని ఆస్పత్రిపాలైన మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కాడు. కారం ఎక్కువగా తింటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని బీఎంజే జర్నల్ తన నివేదికలో పేర్కొంది. ఒక్క కరోలినా రాపర్ 1.5 మిలియన్ల స్వావిల్లే హీట్ స్కేల్(ఘాటును కొలిచే ప్రమాణాలు) కలిగి ఉంటుందని పరిశోధనలో తేలింది. ఇంత ఘాటైన మిరపకాయల వలన రివర్సబుల్ సెరెబ్రల్ వాసొకన్సిట్రిక్షన్ సిండ్రోమ్ (తీవ్రమైన తలనొప్పి) అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
వైద్యం రాక చంపుతున్నారు.. జాగ్రత్త!
ముంబయి: రోగుల జబ్బుల ప్రకారం వైద్యం అందించడంలో పొరపాట్లు దొర్లుతుండటం వల్లే ఎక్కువ ప్రాణాలుపోతున్నాయని, ఇప్పుడిది అమెరికాలో అతిపెద్ద మూడో సమస్యగా పరిణమించిందని ఓ అధ్యయనం వెల్లడించింది. మితిమీరిన్ డోస్ ఇవ్వడం, సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం, నైపుణ్యం లేని నర్సులను ఉపయోగించడం.. రెండో దశలో చేయాల్సిన వైద్య భారం సీనియర్స్ పేరిట నర్సులపై వేయడం వంటి కారణాల వల్ల రోగుల ప్రాణాలు హరీమంటూ గాల్లో తేలిపోతున్నాయంటూ ఆ అధ్యయనం పేర్కొంది. దీనిపై ప్రజల్లో కనీస అవగాహన లేకుంటే పరిస్థితి ప్రమాద కరంగా ఉంటుందని ఆ అధ్యయనం వెల్లడించింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్(బీఎంజే)లో ఈ అధ్యయనం వివరాలను జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం వెల్లడించింది. అయితే, ఇండియాలో ఇలాంటి అధ్యయనం ఇప్పటి వరకు జరగలేదని కానీ 2013లో హార్వార్డ్ యూనివర్సిటీ వేసిన అంఛనా ప్రకారం ప్రతి ఏడాది 52లక్షల మంది వైద్యపరమైన తప్పులు చేయడం మూలంగానే గాయపడుతున్నారని, అవగాహన లేని చర్యల కారణంగా దెబ్బతింటున్నారని తెలిపింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మెడికల్ ఎర్రర్స్‌తో గాయపడుతున్న వారు 430లక్షల మంది ఉన్నారని అని కూడా అధ్యయనం తెలిపింది. అమెరికాలో ప్రతి ఏడాది 6.11లక్షలమంది గుండెపోటు, 5.85లక్షలమంది క్యాన్సర్ కారణంగా మృత్యువాత పడుతుండగా ఒక్క మెడికల్ ఎర్రర్స్ కారణంగా దాదాపు 2.51 లక్షలమంది చనిపోతున్నారని, ఇది అతిపెద్ద మూడో సమస్య అని ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ అధ్యయనం హెచ్చరించింది.