World Health Organization approved two new Covid-19 treatments: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహోచ్‌ఓ) శుక్రవారం కోవిడ్ -19 కోసం రెండు కొత్త చికిత్సా విధానాలను ఆమోదించింది. వ్యాక్సినేషన్‌లతో పాటు ఈ మెరుగైన చికిత్సలు కూడా తోడైతే ఈ కరోనా వైరస్ భారిన పడకుండా ఉండటమే కాక మరణాలను అరికట్టగలం అని డబ్ల్యూహోచ్‌వో నిపుణులు చెబుతున్నారు. అయితే డబ్ల్యూహోచ్‌వో మార్చి నాటికి యూరప్‌లో సగం మందికి కరోనా సోకుతుందని, ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోతాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
బ్రిటీష్ మెడికల్ జర్నల్ (బీఎంజే), డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు తీవ్రమైన లేదా క్లిష్టమైన కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి కార్టికోస్టెరాయిడ్స్ తోపాటు ఆర్థరైటిస్ డ్రగ్ బారిసిటినిబ్‌ని ఉపయోగించి మెరుగైన చికిత్స అందించవచ్చు అని అన్నారు. అంతేకాదు ఈ చికిత్స విధానం వల్ల వెంటిలేటర్ల అవసరం తగ్గుతుందని, మనుగడ రేటును పెంచగలం అని చెప్పారు. డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన సోట్రోవిమాబ్ అనే సింథటిక్ యాంటీబాడీ చికిత్స అనేది కరోనా తీవ్రతరం కానీ రోగులకు కోసం. అయితే ఈ చికిత్స విధానం వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా మధుమేహం వంటి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఈ చికిత్సా విధానం వల్ల ఆస్పత్రులపాలై ప్రమాదం ఎక్కువ. ఆసుపత్రిలో చేరే ప్రమాదం లేని వ్యక్తుల కోసం సోట్రోవిమాబ్ మంచి ప్రయోజనం ఇస్తోందని, అలాగే కరొనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కి వ్యతిరేకంగా పనిచేస్తుందనేది కాస్త సందేహమే అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
అయితే ఇప్పటి వరకు కరోనా కోసం మూడు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని డబ్ల్యూహెచ్‌ఓ విడి విడిగా ఆమోదించింది. సెప్టెంబర్ 2020లో ఆమోదించిన తీవ్రమైన అనారోగ్యం కోసం కార్టికోస్టెరాయిడ్స్‌ను ఉపయోగించే చికిత్స. ఇది చవకగా లభించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్. జూలైలో డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన ఆర్థరైటిస్ డ్రగ్స్ టోసిలిజుమాబ్, సరిలుమాబ్‌లతో అందిచే చికిత్స విధానం. అయితే ఈ చికిత్స విధానం ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక వ్యవస్థ యొక్క అధిక ప్రతిచర్యతో పోరాడటానికి ఎంతగానేఉపకరిస్తోంది. ఈ రోగులు బారిసిటినిబ్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఈ మేరకు రెండు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పుడూ ఖర్చులను, వైద్యుల సలహాలను, మీ సమస్యలను దృష్టి ఉంచుకుని సరైన చికిత్స విధానాన్ని ఎంచుకోండి అని డబ్ల్యూ హెచఓ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment