వైద్యం రాక చంపుతున్నారు.. జాగ్రత్త!
ముంబయి: రోగుల జబ్బుల ప్రకారం వైద్యం అందించడంలో పొరపాట్లు దొర్లుతుండటం వల్లే ఎక్కువ ప్రాణాలుపోతున్నాయని, ఇప్పుడిది అమెరికాలో అతిపెద్ద మూడో సమస్యగా పరిణమించిందని ఓ అధ్యయనం వెల్లడించింది. మితిమీరిన్ డోస్ ఇవ్వడం, సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం, నైపుణ్యం లేని నర్సులను ఉపయోగించడం.. రెండో దశలో చేయాల్సిన వైద్య భారం సీనియర్స్ పేరిట నర్సులపై వేయడం వంటి కారణాల వల్ల రోగుల ప్రాణాలు హరీమంటూ గాల్లో తేలిపోతున్నాయంటూ ఆ అధ్యయనం పేర్కొంది.
దీనిపై ప్రజల్లో కనీస అవగాహన లేకుంటే పరిస్థితి ప్రమాద కరంగా ఉంటుందని ఆ అధ్యయనం వెల్లడించింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్(బీఎంజే)లో ఈ అధ్యయనం వివరాలను జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం వెల్లడించింది. అయితే, ఇండియాలో ఇలాంటి అధ్యయనం ఇప్పటి వరకు జరగలేదని కానీ 2013లో హార్వార్డ్ యూనివర్సిటీ వేసిన అంఛనా ప్రకారం ప్రతి ఏడాది 52లక్షల మంది వైద్యపరమైన తప్పులు చేయడం మూలంగానే గాయపడుతున్నారని, అవగాహన లేని చర్యల కారణంగా దెబ్బతింటున్నారని తెలిపింది.
మొత్తం ప్రపంచవ్యాప్తంగా మెడికల్ ఎర్రర్స్తో గాయపడుతున్న వారు 430లక్షల మంది ఉన్నారని అని కూడా అధ్యయనం తెలిపింది. అమెరికాలో ప్రతి ఏడాది 6.11లక్షలమంది గుండెపోటు, 5.85లక్షలమంది క్యాన్సర్ కారణంగా మృత్యువాత పడుతుండగా ఒక్క మెడికల్ ఎర్రర్స్ కారణంగా దాదాపు 2.51 లక్షలమంది చనిపోతున్నారని, ఇది అతిపెద్ద మూడో సమస్య అని ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ అధ్యయనం హెచ్చరించింది.