వైద్య పరీక్షలకు అమెరికా వెళ్లిన రజినీ | Superstar Rajinikanth In US For Medical Test, Doing Well, Says Brother | Sakshi
Sakshi News home page

వైద్య పరీక్షలకు అమెరికా వెళ్లిన రజినీ

Published Tue, Jun 28 2016 10:39 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

వైద్య పరీక్షలకు అమెరికా వెళ్లిన రజినీ - Sakshi

వైద్య పరీక్షలకు అమెరికా వెళ్లిన రజినీ

తంజావూరు: సూపర్ స్టార్ రజినీకాంత్ అమెరికా వెళ్లారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లారని ఆయన నటించిన చిత్రం కబాలీ త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో అతి త్వరలోనే వస్తారని కుటుంబ సభ్యులు చెప్పారు. 'ఆయన వైద్య పరీక్షలకోసం అమెరికా వెళ్లారు.

జూలై 15న ఆయన నటించిన చిత్రం కబాలీ విడుదలవుతున్నందున అంతకు ముందే వస్తారు' అని రజనీ సోదరుడు సత్యనారాయణ తంజావూరులో విలేకరులతో చెప్పారు. ఇటీవలె తంజావూరులోని యూనెస్కో గుర్తింపు ఉన్న శివాలయంలో రజినీ ప్రత్యేక పూజలు జరిపించారని చెప్పారు. అభిమానుల ప్రేమే తమ సోదరుడు రజనీకి నిజమైన బలం అని ఆయన చెప్పారు. కబాలీ సినిమా చాలా బాగుంటుందని, అందరికీ నచ్చుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement