లండన్: మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యూఎస్, యూకేలకు చెందిన రెండు కంపెనీలు జతకట్టాయి. ఇందుకోసం అవి భారతీయుల జెనోమిక్స్ (మాలిక్యులర్ బయాలజీలో ఓ భాగం) సమాచారాన్ని వాడుకోనున్నాయి. అరుదైన రోగాలను అధునాతన పద్ధతుల ద్వారా గుర్తించి మెరుగైన చికిత్స అందించే ఉద్దేశంతో కేంబ్రిడ్జిలోని గ్లోబల్ జెనె కార్ప్ (జీజీసీ), న్యూయార్క్‌లోని రీజనరాన్ జెనెటిక్స్ సెంటర్ (ఆర్‌జీసీ)లు సంయుక్తంగా భారత్‌లో ఓ ప్రాజెక్టును చేపట్టనున్నాయి.
ఈ ప్రాజెక్టులో భాగంగా భారతీయుల జెనోమిక్స్ సమాచారాన్ని విశ్లేషించి, వ్యాధులను గుర్తించేందుకు, చికిత్స అందించేందుకు మెరుగైన మార్గాలను కంపెనీలు సూచించనున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా భారీ సంఖ్యలో జెనోమిక్స్ సమాచారాన్ని ఈ కంపెనీలు పరిశీలించనున్నాయి. ఈ ప్రాజెక్టుతో భారత్‌లో ఆరోగ్య రంగంలో సమూల మార్పులు వస్తాయనీ, ఇటీవల ప్రధాని ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ పథకం వంటి లక్ష్యాలను సాధించడంలో జెనోమిక్స్ సమాచారం సాయపడుతుందని ఇన్వెస్ట్ ఇండియా అనే కంపెనీ సీఈవో చెప్పారు. ముంబై, అహ్మదాబాద్‌లలో జీజీసీకి మౌలిక వసతులను సమకూర్చే పనిని ఇన్వెస్ట్ ఇండియా చూసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment