సీనియర్ హీరోకు పోలీసుల వార్నింగ్
సీనియర్ హీరోకు పోలీసుల వార్నింగ్
Published Sat, Feb 4 2017 7:56 PM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM
ఈమధ్యనే జైలు జీవితం ముగించుకుని సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన సీనియర్ హీరో సంజయ్ దత్కు పోలీసులు ఈమధ్య ఒక వార్నింగ్ ఇచ్చారట. పోలీసులకు.. సంజూబాబాకు మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఉంది. అయితే తాజా వార్నింగ్ మాత్రం పాత కేసులకు సంబంధించినది కాదు. ఆయన ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు వచ్చారు.
విషయం ఏమిటంటే.. జనవరి 14వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా సంజయ్ దత్ కుటుంబం వాళ్లు మేడమీదకు చేరుకుని పెద్ద సౌండుతో మ్యూజిక్ పెటప్టారు. దాంతో చుట్టుపక్కల వాళ్లు ఎవరికీ నిద్ర అన్నది లేకుండా పోయింది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్లొచ్చి సంజయ్ దత్కు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి మరీ మ్యూజిక్ ఆపించారు. అంతకుముందు సంజయ్ దత్ ఉండే ప్రాంతానికి చెందిన అసోసియేషన్ వాళ్లు కూడా ఈ విషయమై లేఖలు రాసినా ఆయన మాత్రం మారలేదట. ఈ విషయాన్ని జోనల్ డీసీపీ వరకు తీసుకెళ్లి సంజయ్ దత్ మీద గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామంటున్నారు.
Advertisement
Advertisement