సంజయ్‌ అరెస్ట్‌ తప్పింది | Warrant against actor Sanjay Dutt cancelled | Sakshi
Sakshi News home page

సంజయ్‌ అరెస్ట్‌ తప్పింది

Published Tue, Apr 18 2017 12:08 AM | Last Updated on Wed, Apr 3 2019 9:02 PM

సంజయ్‌ అరెస్ట్‌ తప్పింది - Sakshi

సంజయ్‌ అరెస్ట్‌ తప్పింది

అదేంటి... జైలు శిక్ష పూర్తయ్యింది.. బయటికొచ్చాడు.. హ్యాపీగా ఉన్నాడు.. మళ్లీ అరెస్టేంటి అనుకుంటున్నారా? ఇది ఇంకో పిడకల వేట. సంజయ్‌దత్‌ 2013లో ‘జాన్‌ కి బాజీ’ అనే సినిమాలో నటించడానికి 50 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు (ట). అయితే ఆ సినిమాకి కేవలం రెండు రోజులే పని చేశాడని ఆ తర్వాత చేయలేదని డబ్బులు వెనక్కు ఇవ్వలేదని ఆ సినిమా నిర్మాత షకీల్‌ నూరానీ ఆరోపణ. ఈ విషయమై అతడు ముంబై అంధేరీ కోర్టులో కేసు వేశాడు. కేసు విచారణలో ఉండగానే సంజయ్‌ ‘టాడా’ కేసులో జైలుకు వెళ్లడం బయటకు రావడం జరిగింది.

బయటికొచ్చాక కూడా ఈ కేసుకు సంబంధించిన వాయిదాలను సంజయ్‌ పట్టించుకోలేదు. దాంతో నిర్మాత తరఫున లాయర్‌ సంజయ్‌ అరెస్టుకు వారెంటు కోరగా మొన్న ఏప్రిల్‌ 15న కోర్టు అతనికి బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో అప్రమత్తుడైన సంజయ్‌ నిన్న (ఏప్రిల్‌ 17)న కోర్టులో హాజరయ్యి వ్యక్తిగత కారణాల రీత్యా వాయిదాలకు హాజరు కాలేకపోయానని విన్నయించి అరెస్టు వారెంట్‌ను రద్దు చేయించుకున్నాడు. అయితే వేరే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి కేసు ఉపసంహరించుకోమని సంజయ్‌ తరఫున అండర్‌ వరల్డ్‌ నుంచి తనకు బెదిరింపులొస్తున్నాయని నిర్మాత ఆరోపిస్తున్నాడు. ఆ మేరకు ఫిర్యాదు కూడా నమోదు చేశాడు. ఇది తీవ్రమైన నేరం కిందకే వస్తుంది.

 దాదాపు 7 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడవచ్చు. అందుకే సంజయ్‌ జాగ్రత్త పడి ఈ కేసు నుంచి కోర్టు ద్వారానే బయటపడే ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకు అడ్వాన్స్‌ ఏమీ అందలేదని ఇది తప్పుడు కేసు అని వాదిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా సంజయ్‌దత్‌ జీవితం ఆధారంగా సుప్రసిద్ధ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వం వహిస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నది. సంజయ్‌ దత్‌ పాత్రను నటుడు రణ్‌బీర్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇతని భార్య నమ్రతగా నటి దియా మిర్జా నటిస్తోంది. ఈ సినిమాలో సంజయ్‌ గెటప్‌లో ఉన్న రణ్‌బీర్‌ ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్‌గా ప్రచారంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement