వృద్ధ తల్లిపై దాడి...వైరల్ వీడియో
న్యూఢిల్లీ: 85 ఏళ్ల వృద్ధ తల్లిపై ఓ కూతురు చేయిచేసుకుంది. ఏమైందో ఏమో తెలియదుగానీ, ఆమెపై అనుచితంగా ప్రవర్తించింది. నిస్సహాయంగా పెద్దగా రోదిస్తున్నా..కనీసం జాలి చూపకుండా తల్లి పై పలుమార్లు చేయి చేసుకుంది. చుట్టుపక్కల వారు చూస్తూ ఉండగానే మొఖంమీద, మూతిమీది దాడిచేసింది. డిల్లీలోని కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అటు కూతురు కూడా (65) వయసు మళ్లిన మహిళ కావడం గమనించదగ్గ అంశం.
అయితే ఈ దాడిని పొరుగు వారు ప్రశ్నించారు. తల్లిని అలా దండించడం తప్పని నిలదీశారు. దీంతోపాటుగా ఆ ఉదంతాన్ని మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తల్లిని కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు. అయితే అందుకు నిరాకరించిన తల్లి ఇది కుటుంబ సమస్యఅనీ, ఫిర్యాదు చేయడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేయడం విశేషం.
కాగా చుట్టు పక్కల చిత్రీకరించిన ఈ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దాదాపు తొమ్మదిన్నర లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.