
ఎడ్లపాడులో లోడ్ లారీ దగ్ధం
గుంటూరు(ఎడ్లపాడు): పార్శిల్ లోడ్‌తో వెళుతున్న ఓ లారీ దగ్ధమైంది. ఈ ఘటన గురువారం ఎడ్లపాడు మండలం తిమ్మాపురం సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఆటో మొబైల్ వస్తువులతో పల్నాడు డైలీ పార్శిల్ సర్వీస్‌కు చెందిన లారీ వెళుతుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూర్తిగా కాలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం లేకున్నప్పటికీ ఆస్తి నష్టం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా రోడ్డుపై వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.