విజయనగరం: ఇద్దరు పిల్లలతో కలసి ఓ తల్లి ఆత్మాహుతికి పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తూర్ మండలం దిమిలి గ్రామానికి చెందిన చల్లా భాగ్యలక్ష్మి (28) ఆదివారం మధ్యాహ్నం ఇంటి తలుపులు వేసుకుని లోపల తనతోపాటు, ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో భాగ్యలక్ష్మితోపాటు ఆమె నాలుగేళ్ల కుమార్తె, నెల రోజుల బాబు సజీవ దహనమయ్యారు. ఇల్లు కూడా దహనమైంది. కాగా, ఆత్మాహుతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మాహుతి
Published Sun, Jul 26 2015 1:13 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement