
ఫ్రిజ్‌లోంచి ఎగసిన మంటలు
రాయదుర్గం అర్బన్: ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లోంచి ఉన్నపళంగా మంటలు చెలరేగడంతో ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఇతర సామగ్రి కాలిపోయాయి. బాధితులు తెలిపిన మేరకు.. పట్టణంలోని ఐఓసీ గోదాము పక్కన హమాలీ గొల్ల గోవిందు నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 7 గంటలకు గోవిందు బజార్‌లోకి వెళ్లాడు. భార్య మంజుల 7.30 గంటలకు సమీపంలోని తమ టీస్టాల్‌కు వెళ్లింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. సరిగ్గా 8.30 గంటల సమయంలో ఫ్రిజ్‌లో లోపాల వల్ల మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న టీవీ, నిత్యావసర సరుకులు, రూ.4వేల నగదు, ఒక సెల్‌ఫోన్ కాలిపోయాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పివేశారు. సిలిండర్ గనుక పేలి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో రూ.50వేల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. స్విచ్‌బోర్డులో షార్ట్‌సర్క్యూట్ జరిగి ఉండొచ్చని ఫైర్ ఆఫీసర్ ఖాద్రీ తెలిపారు. అయితే షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగలేదని విద్యుత్ సిబ్బంది స్పష్టం చేశారు.