బంజారాహిల్స్ (హైదరాబాద్) : గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో మూడు బైకులను దగ్ధం చేశారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణనగర్ ఏ బ్లాకులో రెండు చోట్ల, కమలాపురి కాలనీ ఆంధ్రా బ్యాంకు సమీపంలో ఒకచోట బైకులను శనివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు.
ఈ పనికి ఎవరు పాల్పడ్డారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. తన బైకును ఎందుకు తగలబెట్టారో అర్ధం కావడం లేదని బాధితుడు సత్యనారాయణ పోలీసుల విచారణలో వెల్లడించారు. స్థానికంగా సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
మూడు బైక్‌లు దగ్ధం
Published Sun, Dec 20 2015 4:40 PM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM
Advertisement
Advertisement