
పత్రికా ప్రతులను దహనం చేస్తున్న నారా లోకేశ్
అధికారం లేదనే నైరాశ్యంలో.. తమ కుట్రలు బయటపడిపోతున్నాయన్న అక్కసుతో ఇంతకు దిగజారిపోతాడా?
జాతీయ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశానికి ప్రధాన కార్యదర్శి. మాజీ ముఖ్యమంత్రి కొడుకు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా మంత్రిగా పనిచేశాడు. మరి ఈయనకు ప్రజాస్వామ్యమన్నా... దానికి మూలస్తంభాల్లాంటి పత్రికలన్నా ఏ కొంచమైనా గౌరవం ఉందా? ఉంటే ఇలా చేస్తాడా? నిజాలు తనకు నచ్చనంత మాత్రాన ఏకంగా పత్రిక ప్రతులనే తగలబెట్టే సాహసం చేశాడంటే ఈయన రాజకీయాలకు పనికొస్తాడా? అధికారం లేదనే నైరాశ్యంలో.. తమ కుట్రలు బయటపడిపోతున్నాయన్న అక్కసుతో ఇంతకు దిగజారిపోతాడా? ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో మంగళవారం సాక్షి ప్రతుల్ని చింపి దహనం చేసిన నారా లోకేశ్‌ను చూసి ప్రజాస్వామ్య వాదులు సిగ్గు పడాలి. తెలుగుదేశం పార్టీ తలదించుకోవాలి. (అది చిడతల నాయుడికే చెల్లింది: పేర్ని నాని)