News papers
-
‘డాన్ తిరిగొచ్చాడు’.. ప్రపంచ వార్తా పత్రికల్లో..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అమోఘ విజయం సాధించారు. యావత్ ప్రపంచం దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే కేంద్రీకృతమైన నేపధ్యంలో.. ట్రంప్ విజయం తరువాత అన్ని దేశాలు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నాయి. అలాగే ప్రపంచంలోని పలు వార్తా పత్రికలు ట్రంప్ విజయాన్ని పతాక శీర్షికన ప్రచురించాయి. ‘డాన్ తిరిగొచ్చాడు’ అంటూ ఒక వార్తా పత్రిక పతాక శీర్షికన ట్రంప్ పునరాగమనాన్ని స్వాగతించింది. డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత ప్రపంచమంతా ఆయన పునరాగమనానికి శుభాకాంక్షలు చెబుతోంది.అన్ని దేశాల్లోని వార్తాపత్రికల మొదటి పేజీల్లోనూ డొనాల్డ్ ట్రంప్ విజయం పతాక శీర్షికన నిలిచింది.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధించారు.హనోయిలో వియత్నామీస్ వార్తాపత్రికలోనూ డొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందనలను ప్రచురించారు.మెల్బోర్న్ వార్తాపత్రికల మొదటి పేజీలోనూ నూతనంగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయంపై వార్త ప్రచురించారు.డొనాల్డ్ ట్రంప్ భారతీయ వార్తాపత్రికల మొదటి పేజీలలో చోటు దక్కించుకున్నారు.డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయానికి ప్రతిస్పందనలు వార్తాపత్రికలలో ప్రచురితమయ్యాయి.కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇవ్వాలనుకున్నా, అమెరికా ప్రజలు మరోసారి ట్రంప్‌కు పట్టంకట్టారు.అమెరికాలో మరోసారి డొనాల్డ్ ట్రంప్ మాయాజాలం ఫలించింది.ట్రంప్ చారిత్రాత్మక పునరాగమనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా వీక్షించారు. ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికలు.. రోదించిన కమలా హారిస్ మద్దతుదారులు -
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్న అమెరికా పత్రికలు!
'ఉదయం పూట టీ త్రాగగానే దినపత్రిక తిరగేసిన అలవాటు, అది కూడా తెలుగు పత్రిక అయితేనే తృప్తి. లాప్టాప్ ముందుపెట్టి మీకు కావలసిన పత్రిక చదువుకొండి! అంటున్నారు అమెరికాలో పిల్లలు. నిజమే నెట్లో వార్తలు తెలుసుకోవడం చాలా సులభం అయిపోయింది. అయినాసరే పేపర్‌ను చదవడమంటే వాలుకుర్చీలో ఒరిగి భౌతికంగా పేజీలను తిప్పుతూ శ్రీమతి విసుక్కున్నా ఆ వార్తలను గురించి ఆమెతో ప్రస్తావించడంలో లభించే ఆనందమే వేరు. అమెరికాలో న్యూస్‌పేపర్ తెప్పించుకొని చదివేవారు రోజురోజుకు తగ్గిపోతున్నారట. అంతదాకా ఎందుకు ఇప్పుడు మన దేశంలోనే ఆ పరిస్థితి వస్తుంది. వర్క్ చేసుకుంటూనే నెట్లో తాజావార్తలు చూసేస్తున్నారు. టీవీ న్యూస్ ఉండనే ఉన్నాయి, ఎటుపోయినా కారులో రేడియోలు మొగుతూనే ఉంటాయి. అంతదానికి ప్రత్యేకంగా న్యూస్ పేపర్ తెప్పించుకోవడం దేనికి అనుకుంటున్నది కొత్త తరం.' అమెరికాలో పత్రికలవాళ్ళు అమ్మకుండా మిగిలిన న్యూస్ పేపర్లను పాలితిన్ కవర్లలో చుట్టి మరీ ఇండ్ల ముందు పడేస్తుంటారు. అలా ప్రచారం కోసం వస్తున్న పత్రికలు ఎప్పటికప్పుడు తీయకపోతే చెత్తకుప్పలా తయారవుతాయి సుమా! ఇండియాలోనైతే వాటిని పాత వేస్ట్ కిందా అమ్ముకొని సొమ్ము చేసుకునే అవకాశమైనా ఉండేది ఇంట్లో మన ఆడవాళ్లకు. యూఎస్‌లో పేపర్ రద్దీకి ఒక ప్రత్యేక బాక్స్ ఉంచుతారు. అందులో వేస్తే అవి రీ సైక్లింగ్‌కు వెళ్లి పోతాయి. అమెరికాలో న్యూస్ పేపర్ ఖరీదు మనదేశంతో పోల్చుకుంటే తక్కువే అనవచ్చు. 50 సెంట్లకు అంతకు మించిన పేజీల పత్రిక, ప్రకటనల బ్రోచుర్లు కలుపుకొని వస్తుంది. ఆదివారం పేపర్ పేజీలు లెక్కించడం కాదు తూచి చూడాల్సిందే. అడ్వర్టైజ్మెంట్ కల్చర్ అంతగా పెరిగిపోయింది ఆ దేశంలో. వ్యాపార ప్రకటనలు చదువరులకు చేరవేయడానికి న్యూస్ పేపర్ల వాళ్లకు కవర్లలాగా ఉపయోగపడుతున్నాయనిపిస్తుంది. పేపర్ బాయ్స్ కారులో బయలుదేరి ఇంటింటికి పేపర్లు వేస్తూ వెళ్తుంటే మనకది చూడముచ్చట, కానీ అక్కడి వాళ్లకు మామూలే. ఒక దినపత్రికలో వార్తలు కాకుండా స్పోర్ట్స్, హెల్త్, ట్రావెల్, ఫ్లేవర్ అంటూ బోలెడు సప్లమెంట్లు, పిల్లల కోసం, పెద్దల కోసం పేజీలకు పేజీలు కార్టూన్లు, సినిమాలు, దుస్తులు, ఫర్నిచర్ ప్రకటనలు, స్పెషల్ ఆఫర్లు ఎన్నో.. ప్రత్యేక ఆసక్తి ఉంటే తప్ప పేపర్ మొత్తం చదవడం మాత్రం అయ్యే పనికాదు. ఇక రియల్ ఎస్టేట్ వారి కలర్ ఫుల్ ప్రకటనల గురించి చెప్పాల్సిన పనిలేదు (ఈ కల్చర్ ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేస్తుంది). అసలు వాళ్ళే అక్కడ దినపత్రికలను నడుపుతున్నారేమో అనిపిస్తుంది. అమెరికావారి పత్రికల్లో మనదేశం గురించిన వార్తలు ఎప్పుడో కాని కనబడవు. వాళ్ళ దృష్టంతా ఇస్లామిక్ దేశాల మీదనే, 9/11 దాడి తర్వాత వచ్చిన మార్పు ఇది. మన దినపత్రికల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, ప్రకటనలే ఎక్కువగా కనబడుతాయి, అమెరికా ఇందుకు భిన్నం అనిపిస్తుంది. అక్కడ దేశాధ్యక్షుడు కూడా ఎప్పుడో గానీ చిరునవ్వులు చిందిస్తూ పత్రికల్లో కనబడడు. వారి పత్రికల్లో స్థానిక సమస్యలకు, చదువులకు, కుటుంబ విషయాలకు, ఆరోగ్యానికి, రుచికరమైన ఆహార పానీయాలకు ప్రాధాన్యత ఎక్కువ. ఏమి తింటున్నామో అనే కాదు.., ఎలా తినాలో తెలిపే టేబుల్ మ్యానర్స్ కూడా వారికి ముఖ్యం. మరో విశేషం.. అమెరికా పత్రికల్లో ఎంగేజ్మెంట్లు, బర్త్‌డేలు, పట్టభద్రులకు అభినందనలు ఎక్కువ కనబడుతుంటాయి. ఆత్మీయులు చనిపోయినప్పుడు మొక్కుబడిగా ఫోటో వేసి నివాళులు అర్పించడం కాదు, సంక్షిప్తంగా గతించిన వారి జీవిత విశేషాలను పేర్కొనడం అక్కడి ఆనవాయితీ. క్లాసిఫైడ్స్ ప్రకటనల్లో ఎన్నెన్నో వింతలు పెంపుడు జంతువుల గురించి ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్కపిల్ల తప్పిపోయిందని, పిల్లి మాయమైందని బెంగపెట్టుకొని వాటి రూపురేఖా విలాసాలు వర్ణిస్తూ ప్రకటనలు ఇస్తారు. దొరికినట్లయితే మరో ప్రకటన ద్వారా కృతజ్ఞతలు కూడా చెబుతారు. ఇక సేవల ప్రకటనలకు లెక్కే లేదు. అవసరమైన వారికి అందమైన వారిని పంపడం కూడా వారి దృష్టిలో సేవే, ఎవరి పిచ్చి వారికి ఆనందం. పత్రికల సర్క్యూలేషన్ విషయానికి వస్తే అమెరికాలో జాతీయ స్థాయిలో వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, న్యూయార్క్ పోస్ట్, వాషింగ్టన్ పోస్ట్ వంటివి ముందు వరుసలో ఉంటాయి. అయితే స్థానిక పత్రికల డిమాండ్ కూడా తక్కువేం లేదు, ప్రతి సిటీ పేరు మీద ఏదో పత్రిక ఉండనే ఉంటుంది. ముఖ్యమైన సెంటర్లలో, మాల్స్‌లలో వెండింగ్ మెషిన్ల ద్వారా పత్రికలు పొందవచ్చు, కాకపోతే మన వద్ద సరిపడా కాయిన్స్ ఉండాలి. చాలామంది ప్రకటనల కోసం వీకెండ్ పేపర్ లు కొంటుంటారు. మత, కమ్యూనిటీ పరమైన, విదేశీయుల పత్రికలకు కూడా అమెరికాలో కొరత లేదు. జర్నలిజం అమెరికాలో ఎంతో గౌరవ ప్రదమైన వృత్తి. ఎన్నెన్నో కుంభకోణాలను బయట పెట్టినవి వాళ్ళ పత్రికలు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో పత్రికలది ప్రముఖ పాత్ర. 'విద్యార్థి దశలో నేను పాఠ్య పుస్తకాల కన్నా ఎక్కువగా చదివినవి పత్రికలే, గురువులకన్నా కూడా నన్ను ఎక్కువ ప్రభావితం చేసినవి పత్రికలు, సాహితీ పుస్తకాలే. ఇక్కడున్నా బయటి దేశాలకు వెళ్లినా సినిమాలు, షికార్ల కన్నా కూడా నా ప్రధాన కాలక్షేపం అవే. నేను ఎప్పుడైనా ఇంటినుండి బయటికి వెళ్తుంటే ‘జేబులో పర్సు పెట్టుకోవడం మరిచిపోయినా మా అయన పత్రికో పుస్తకమో పట్టుకోవడం మాత్రం మరిచి పోడని’ జోక్ చేసేది శ్రీమతి చంద్రభాగ!' — వేముల ప్రభాకర్ -
అద్దె బ్యాచ్ దిగింది !
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/తిరుపతి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తోంది. ఎన్నడూ లేని విధంగా నలుగురైదుగురు ఉన్న చోటకెళ్లి టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఆ పార్టీ గెలుస్తోందని అసత్య ప్రచారాలు కల్పిస్తూ ‘చీప్ పాలిట్రిక్స్‌కు’ దిగజారిపోయింది. రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు రచించడం సహజం. ప్రజలకు చేసిన మంచి పనులను ఎన్నికల సమయంలో చెప్పుకోవడం, మరోసారి అధికారంలోకి వస్తే మరింత మంచి చేస్తామని ప్రకటించడం పరిపాటి. అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏవగింపుగా మారింది. ప్రజాభిమానం కోల్పోయి రోజురోజుకూ పాతాళంలోకి దిగజారిపోయిన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మౌత్ పబ్లిíసిటీ పేరుతో అడ్డదారులు తొక్కుతోంది. ప్రతి నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఎల్లో కిరాయి మూకలను అద్దెకు ఏర్పాటు చేసుకుని టీ దుకాణాలు, సెలూన్ల వద్ద తిష్టవేసి అధికార పక్షంపై అసత్య ప్రచారం చేయించుకునే దుస్థితికి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్‌రెడ్డిని దూషించడమే పనిగా పెట్టుకుని అద్దెబ్యాచ్ పట్టణాల్లో తిరుగుతోంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం సహకారంతో విద్యార్థులను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి కళాశాల నుంచి కొంత మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించినట్లు తెలిసింది. అద్దె బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చి.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వైఎస్సార్సీపీ అభ్యర్థులను టార్గెట్ చేయటంతో పాటు ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్‌పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలని ఆదేశాలిచ్చారు. శిక్షణా తరగతులను మొదటి, రెండు, మూడు బ్యాచ్‌లుగా విభజించి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటి విడతగా నియోజక వర్గానికి ఇద్దరు విద్యార్థుల చొప్పున రంగంలోకి దింపారు. వీరిపైన జిల్లాకు ఒక కో ఆర్డినేటర్‌ని నియమించారు. ఈ ఇద్దరు రోజూ ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు? అక్కడ పరిస్థితులు ఏంటి అనేది జిల్లా కో ఆర్డినేటర్‌కి నివేదిక రూపంలో అందిస్తారు. దానిని అమరావతిలో ఉండే టీం లీడర్‌కి పంపుతారు. దాదాపు 5 వేల మందికి శిక్షణ ఇచ్చి నగర, పట్టణ ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. లోకల్‌గా కొంతమందిని రిక్రూట్ చేసుకుని వారితో సమన్వయం చేసుకుంటూ అద్దె బ్యా చ్ మౌత్ పబ్లిíసిటీ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల నెల్లూరు రూరల్ ప్రాంతంలో అద్దె బ్యాచ్ టీ దుకాణాల వద్ద చేస్తున్న అసత్య ప్రచారాన్ని కొందరు స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆ బ్యాచ్ ఆ ప్రాంతాన్ని వదిలి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు, మూడు విడతల్లో మండల, సచివాలయాలు.. మొదటి విడత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు పూర్తయ్యాక మరొక బ్యాచ్ రంగంలోకి దిగుతుంది. సంక్రాంతి తరువాత మండల, సచివాలయ కేంద్రాలను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిసింది. పట్టణాలు, నగరాలు అయితే అద్దె బ్యాచ్ ఎవరనేది ఎవ్వరూ ప్రశ్నించరు. కాబట్టి వారికి ఆ బాధ లేదు. మండల, సచివాలయ కేంద్రాలకు వెళ్లే సమయంలో స్థానిక నాయకుల సహకారంతో రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే స్థానిక నాయకులకు అధిష్టానం నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక నాయకులతో కలిసి పర్యటిస్తారు. ఒక అద్దె వ్యక్తి స్థానికుడు ఒకరు ఉంటారు. అలా ఇద్దరికి ఇద్దరు పర్యటిస్తారు. టీ కొట్లు, చిన్న బంకుల వద్ద కూర్చొని అబద్దపు ప్రచారాలకు పదును పెడుతారు. స్థానిక టీడీపీ కార్యకర్త ప్రభుత్వం గురించో, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గురించో ప్రస్తావన చేస్తారు. అద్దె వ్యక్తి ‘అవునంటన్నా. మా బంధువుకి అలా జరిగిందంట, వైఎస్సార్సీపీ వాళ్లు ఇలా చేశారంట’ అని శృతి కలుపుతాడు. నలుగురు కలిసి ఒక అబద్దాన్ని నిజం చేసేందుకు తీవ్రంగానే కృషి చేయటానికి పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం. మూడో బ్యాచ్‌లో బరి తెగింపుడే ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మూడవ బ్యాచ్ రంగంలోకి దిగే పనిలో ఉంది. ఈ బ్యాచ్ అన్నింటికీ తెగించిన వారికి ప్రస్తుతం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. షెడ్యూల్ వచ్చాక అబద్దాలు ప్రచారం చేయటం కంటే.. స్థానికంగా గొడవలు సృష్టించేందుకే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. మద్యం దుకాణాల వద్ద, లేదా మద్యం సేవించే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్థానికుల మధ్య గొడవలు పెట్టటం లేదా వీరే స్థానికులను రెచ్చగొట్టి విధ్వంసాలకు లాగటమే వీరి స్కెచ్‌గా తెలుస్తోంది. మద్యంపై విషప్రచారం చేయటం, స్థానికులను కొట్టడం, లేదా వారి వద్ద వీరు దెబ్బలు తినటమే ప్రధాన లక్ష్యంగా రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఘోర పరాభవాన్ని గుర్తెరిగే.. గత ఎన్నికల్లో మాదిరిగా ఘోర పరాభవాన్ని గుర్తెరిగే టీడీపీ ఇలాంటి నీతిమాలిన చర్యలకు పూనుకొంటోంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధితో ఆ ప్రభుత్వానికి ప్రజల్లో పరపతి పెరిగింది. మరోసారి కూడా వైఎస్సార్సీపీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఎన్నికల బరిలోకి దిగే ప్రయతాన్ని టీడీపీ చేస్తోంది.అయినా ప్రజల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మౌత్ పబ్లిíసిటీని నమ్ముకొని దానినే కార్యరూపంలోకి తీసుకొచ్చారు. టీ స్టాళ్లు, సెలూన్లే వేదికలు టీడీపీ కిరాయి మూకలు నగరాలు, పట్టణా ల్లోని టీ దుకాణాలు, సెలూన్లను వేదికగా చేసుకుంటున్నాయి. సాధారణ వ్యక్తుల్లా వెళ్లి అక్కడే తిష్ట వేస్తారు. వారి చేతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉంటుంది. ఆ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వార్త లను చదువుతున్నట్లు నటిస్తారు. వార్త ల సారాంశంపై పక్కనున్న వారితో చర్చ పెడతారు. ఆపై ఇదేం ప్రభుత్వం, ఎక్కడ చూసినా ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఎక్కడా రోడ్లు వేయలేదు, అభివృద్ధి జరగలేదు, రాష్ట్రం అప్పులు చూస్తే కొండలా పెరిగిపోతున్నాయి, సంక్షేమం అంటూ బటన్లు నొక్కి తిరిగి ధరలు పెంచి మన నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారంటూ పెదవి విరుస్తారు. ఇలా ఎల్లో కిరాయి మూ కలు తమ నటనను ప్రదర్శిస్తారు. అంతే కాకుండా లోకల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు టికెట్ రాదని, ఆయన అవినీతి చేశాడని.. టీడీపీలోకి వలసలు జోరుగా జరుగుతున్నాయంటూ భజన ప్రారంభిస్తారు. టీడీపీ, జనసేన జోడీ బాగుంది.. ఉత్తరాంధ్రలో అంతా టీడీపీ, జనసేన కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని, ఈ దఫా ఈ కూటమికే అధికారం వస్తుందని పదేపదే చెబుతారు. ఆ షాపుల వద్ద జనం ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే అక్కడ తిష్ట వేసి ఇలా తమ నటనను ప్రదర్శిస్తారు. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా నేర్పరితనంతో వ్యవహరిస్తారు. -
FSSAI: న్యూస్ పేపర్లో ఆహారం ప్యాక్ చేయొద్దు
న్యూఢిల్లీ: వార్తా పత్రికలను (న్యూస్ పేపర్) ఆహార పదార్థాలకు వినియోగించే విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. న్యూస్ పేపర్‌ను ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు వినియోగించొద్దని వ్యాపారులను కోరింది. అలాగే, న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన, నిల్వ చేసిన పదార్థాలను తినవద్దంటూ వినియోగదారులకు సూచనలు చేసింది. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన నిబంధనల కఠిన అమలుకు రాష్ట్రాల ఆహార నియంత్రణ సంస్థలతో కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు న్యూస్ పేపర్ వినియోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో జి.కమలవర్ధనరావు కోరారు. ‘‘వార్తా పత్రికల్లో వినియోగించే ఇంక్‌లో ఎన్నో బయోయాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఆహారాన్ని కలుíÙతం చేస్తాయి. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలు రావచ్చు’’అని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ప్రింటింగ్‌కు వాడే ఇంక్‌లో లెడ్, భార లోహాలు, రసాయనాలు ఉంటాయని, అవి ఆహారం ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయని వెల్లడించింది. ‘‘వార్తా పత్రికల పంపిణీ వివిధ పర్యావరణ పరిస్థితులకు లోబడి ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్లు లేదా ఇతర సూక్ష్మజీవులు వాటి ద్వారా ఆహారంలోకి చేరి.. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను కలిగించొచ్చు’’అని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. వార్తా పత్రికలను ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు వినియోగించకుండా నిషేధిస్తూ ఎఫ్ఎస్ఎస్ఏఐ 2018లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఆహార పదార్థాల్లో నూనె అధికంగా ఉన్నప్పుడు, దాన్ని వార్తా పత్రికల్లో సాయంతో తొలగించడాన్ని కొందరు చేస్తుంటారు. ఇలా చేయడాన్ని సైతం చట్టం నిషేధించింది. కస్టమర్ల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, చట్ట ప్రకారం అనుమతించిన ప్యాకింగ్ మెటీరియల్‌నే ఆహార పదార్థాలకు వినియోగించాలని కమలవర్ధనరావు కోరారు. -
న్యూస్ పేపర్లలో ఆహారం తింటున్నారా? కేంద్ర సంస్థ హెచ్చరిక!
రోడ్డు పక్కన విక్రయించే చిరుతిళ్లు, ఆహార పదార్థాలను సాధారణంగా పాత న్యూస్ పేపర్లలో పొట్లం కట్టి ఇస్తుంటారు. ఇలా న్యూస్ పేపర్లలో ఆహారం తింటే తీవ్రవైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది. ఆహార పదార్థాల ప్యాకింగ్, సర్వింగ్ కోసం న్యూస్ పేపర్లను ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని వ్యాపారులను, వినియోగదారులను కోరింది. ఈ విషయంలో నిబంధనలను పర్యవేక్షించడానికి, అమలు చేయడానికి రాష్ట్ర ఆహార అధికారులతో ఎఫ్ఎస్ఎస్ఏఐ కలిసి పని చేస్తోంది. ఆహార పదార్థాలను ప్యాకింగ్, సర్వింగ్ చేయడానికి న్యూస్ పేపర్లను ఉపయోగించడం తక్షణమే నిలిపివేయాలని దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు, ఆహార విక్రేతలను ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో కమల వర్ధనరావు గట్టిగా కోరారు. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఆహార పదార్థాల ర్యాపింగ్, ప్యాకేజింగ్ చేయడానికి న్యూస్ పేపర్లు ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన దీనివల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను తెలియజేశారు. న్యూస్ పేపర్లలో ఉపయోగించే ఇంక్ ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగించే బయోయాక్టివ్ పదార్థాలను కలిగి ఉంటుందని, ఇది ఆహారాన్ని కలుషితం చేసి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. ప్రింటింగ్ ఇంక్‌లలో సీసం, ఇతర భారీ లోహాలతో సహా రసాయనాలు ఉండవచ్చని, ఇవి ఆహారంలో కలసి దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని వివరించింది. అంతేకాకుండా బ్యాక్టీరియా, వైరస్ వంటి వ్యాధికారక క్రిములు న్యూస్ పేపర్ల ద్వారా ఆహారంలోకి ప్రవేశించి అనారోగ్యాలకు కారణమవుతాయని తెలిపింది. కఠిన నిబంధనలు ఆహార పదార్థాల ప్యాకింగ్‌కి న్యూస్ పేపర్ల వాడకాన్ని నిషేధించే ఆహార భద్రత, ప్రమాణాల (ప్యాకేజింగ్) నిబంధనలు-2018ని నోటిఫై చేస్తూ న్యూస్ పేపర్లను ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌గా ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని దేశవ్యాప్తంగా వినియోగదారులు, ఆహార విక్రేతలు, వాటాదారులను ఎఫ్ఎస్ఎస్ఏఐ కోరింది. సురక్షితమైన, ఆమోదించిన ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లతో పాటు ఫుడ్-గ్రేడ్ కంటైనర్లను మాత్రమే ఉపయోగించాలని సిఫార్సు చేసింది. -
బాబు స్కిల్డ్ క్రిమినల్..
బాబుది అంతా చీకటి చరిత్ర: అమర్నాథ్ అసలు చంద్రబాబు రాజకీయ జీవితమంతా.. కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో నిర్మితమైందని, ఆయనదంతా చీకటి చరిత్ర అని విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడిపై లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుపై ఉన్నాయని చెప్పారు. నేరుగా రాజకీయాల్లో ఎదగలేక, వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. తాను నిజాయితీపరుడిని అని రోజూ ప్రవచనాలు వల్లించే చంద్రబాబు రూ.118 కోట్లు ఎలా బొక్కేశాడని ప్రశ్నించారు. చంద్రబాబు తాజా ఆర్థిక నేరాలపై పత్రికలు, టీవీ చానళ్లు అనేక కథనాలు వెల్లడిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ బాబు ఆర్థిక నేరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించాడని ఆయన తెలిపారు. దుబాయ్ నుంచి కూడా అక్కడి కరెన్సీలో రూ.15 కోట్ల వరకు దండుకున్నారని మంత్రి ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు అధికారులను, మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించి సుమారు రూ.350 కోట్లు కొట్టేశాడని ఆయన వివరించారు. చంద్రబాబు ఆర్థిక నేరాల విషయంలో ఈడీ జోక్యం చేసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తండ్రీకొడుకులను జైలుకు పంపాలి: రోజా చంద్రబాబు, లోకేశ్‌పై సీబీఐ విచారణ జరిపించి, జైలుకు పంపాలని మంత్రి ఆర్కే రోజా తిరుమలలో మీడియాతో అన్నారు. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డుగానీ, ఓటరు కార్డు గానీ, ఇల్లుగానీ లేకపోయినా హైదరాబాదు నుంచి అప్పుడప్పుడు వచ్చి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేసి వెళ్లిపోతుంటారన్నారు. అలాగే, చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు. కాంట్రాక్టు పనుల్లో కోట్లాది రూపాయల కమీషన్లు దండుకున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులిస్తే ఆయన దత్తపుత్రుడు ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను సైతం సీబీఐ అధికారులు విచారణ చేయాలని రోజా డిమాండ్ చేశారు. బాబు అత్యంత అవినీతిపరుడు: కొడాలి నాని చంద్రబాబు అత్యంత అవినీతిపరుడు, స్వార్థపరుడు, నమ్మక ద్రోహి అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పుడు రికార్డులతో సహా దొరికిన దొంగని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లయినా ఖర్చుపెడదామని ఆయన చెబుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఇప్పటివరకు నిర్వహించిన ఎన్నికల్లో రూ.10 వేల కోట్లు వరకు ఖర్చుచేశారని, ఈ డబ్బంతా ఇలా కమీషన్లు తీసుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చిందని కొడాలి నాని ప్రశ్నించారు. ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు ఎలా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. చట్టాలు, రాజ్యాంగాలను అనుసరించి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలో ఆయనకు బాగా తెలుసునన్నారు. ఇప్పుడు ఐటీ శాఖాధికారులు ఇచ్చిన నోటీసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు అవినీతి బాగోతం బయటపడిందని ఇప్పుడు తప్పించుకోలేరని నాని అన్నారు. బాబు, లోకేశ్ పెద్ద అవినీతిపరులు: ధర్మాన ప్రపంచంలోనే చంద్రబాబు, లోకేశ్‌లు పెద్ద అవినీతిపరులని, దోచుకుని పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి ఓటు అడిగే అర్హత లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు ఒక్క పేదవాడికి సెంటు భూమి ఇవ్వలేదని, ఒక్క శాశ్వత పథకం కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి గజదొంగలకు అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు. ఇక అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చేసిందేమీ లేదని, చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడడం తప్ప జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా వీరు తీసుకురాలేకపోయారన్నారు. -
ఇదేం పిచ్చి రా బాబోయ్.. మొహాలకు న్యూస్ పేపర్లు చుట్టుకొని..
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: రీల్స్ పిచ్చిలో పడి కొందరు యువకులు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ పట్టణంలో ముగ్గురు యువకులు బైక్‌పై మొహాలు కనబడకుండా న్యూస్ పేపర్లు చుట్టుకొని వేములవాడ వీధుల గుండా పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ తిరగడంతో.. పట్టణ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు యువకులు వారిని వెంబడించి పట్టుకొని ప్రశ్నించగా తాము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించామని, ప్రమోషన్ కోసం వీడియో షూట్ చేశామని తెలిపారు. ఆ మాటలు విన్న పట్టణ వాసులు ఒక్కసారిగా అవాక్కై.. ఒకింత చిరాకు పడ్డారు. ఇదేం పిచ్చి రా బాబోయ్ అంటూ తలలు పట్టుకున్నారు. చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి: వలంటీర్ ఫిర్యాదు
విజయవాడ: ఒంటరి మహిళల సమాచారాన్ని వలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాయని విజయవాడ శాంతినగర్‌కు చెందిన వలంటీర్ రంగవల్లి న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో వలంటీర్లనుద్దేశించి ఏలూరులో పవన్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడలోని పలువురు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు పట్టించుకోకపోవడంతో వలంటీర్ రంగవల్లి నేరుగా విజయవాడ మెట్రోపాలిటన్ మేజ్రిస్టేట్ కోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి శుక్రవారం రికార్డు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఒగ్గు గవాస్కర్, మరో 25 మంది న్యాయవాదుల సమక్షంలో కోర్టు హాల్లో గంటన్నరపాటు ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సేకరించారు. ‘పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అన్ని దినపత్రికలు, వార్తా చానళ్లు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం, ట్విట్టర్లలో వచ్చాయి. పవన్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని నేను నివాసం ఉంటున్న, విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలో కొందరు సూటిపోటి మాటలతో మనసు గాయపరుస్తున్నారు. నా పిల్లలను స్కూలుకు తీసుకెళ్లేటప్పుడు∙కొందరు యువకులు వేధిస్తున్నారు’ అని ఆమె వాపోయింది. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించి సమాజంలో మర్యాద లేకుండా చేసిన పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని వేడుకుంది. ఆమె నుంచి పూర్తి సమాచారం సేకరించిన న్యాయమూర్తి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేశారు. ఆ రోజు మిగిలిన సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. -
కోర్టు బోనెక్కి సాక్ష్యం చెప్పనున్న ప్రిన్స్ హ్యారీ
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్ –3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సాక్ష్యం ఇవ్వడానికి వచ్చే వారంలో కోర్టుకు హాజరుకానున్నారు. రాజకుటుంబానికి చెందినవారు ఇలా కోర్టు బోనెక్కడం 130 ఏళ్లలో ఇది తొలిసారి. డైలీ మిర్రర్, సండే మిర్రర్ వంటి వార్తా పత్రికల ప్రచురణ సంస్థ మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్ (ఎంజీఎన్) సెలిబ్రిటీల వ్యక్తిగత అంశాలను సేకరించడం కోసం చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై 100 మంది సెలిబ్రిటీలతో పాటు ప్రిన్స్ హ్యారీ కూడా మిర్రర్ గ్రూప్‌పై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారిస్తున్న లండన్ హైకోర్టులో ప్రిన్స్ హ్యారీ హాజరై ఫోన్ ట్యాంపింగ్‌పై సాక్ష్యం ఇవ్వనున్నారు. గతంలో 1870లో ఎడ్వర్డ్–7 ఒక విడాకుల కేసులో సాక్ష్యమిచ్చారు. -
ఇండియన్ మీడియా ఎంటర్టైన్మెంట్కి ఇంతటి సత్తా ఉందా?
రాబోయే నాలుగేళ్లలో ఇండియన్ మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించబోతుందంటూ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ పీడబ్ల్యూసీ సంస్థ తెలిపింది. రాబోయే నాలుగేళ్లలో ఇండియన్ మీడియా, ఎంటర్టైన్ విభాగం 8.8 శాతం సమ్మిళిత అభివృద్ధి (సీఏజీఆర్) సాధిస్తుందని అంచనా వేసింది. దీంతో మీడియా, ఎంటర్టైన్ పరిశ్రమర విలువ ఏకంగా రూ. 4.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ తన నివేదికలో పేర్కొంది. పీడబ్ల్యూసీ నివేదికలో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. - దేశీయంగా టీవీ, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో రెవెన్యూ ప్రస్తుత విలువ రూ.3.14 లక్షల కోట్లుగా ఉంది. - 2026 నాటికి టీవీ అడ్వెర్టైజింగ్ విభాగం విలువ రూ.43,000 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. దీంతో టీవీ అడ్వెర్టైజ్మెంట్లో ప్రపంచంలో ఐదో స్థానానికి ఇండియా చేరుకుంటుంది. ఇండియా కంటే ముందు వరుసలో అమెరికా, జపాన్, చైనా, యూకేలు ఉండనున్నాయి. - రాబోయే నాలుగేళ్లలో ఓటీటీ వీడియో స్ట్రీమింగ్ మార్కెట్ విలువ రూ.21,031 కోట్లుగా ఉండబోతుంది. ఇందులో చందాల ద్వారా రూ.19,973 కోట్ల రెవెన్యూ రానుండగా వీడియో ఆన్ డిమాండ్ ద్వారా రూ.1058 కోట్లు రానుంది. - రాబోయే రోజుల్లో కూడా ఓటీటీలకు ప్రధాన ఆదాయం చందాల ద్వారానే తప్పితే వీడియో ఆన్ డిమాండ్ ద్వారా అంతగా పెరగకపోవచ్చని పీడబ్ల్యూసీ అంచనా వేస్తోంది. 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తే ఓటీటీ సేవలు మరింత వేగంగా విస్తరించవచ్చు. - ప్రస్తుతం రూ.35,270 కోట్లు ఉన్న టీవీ అడ్వెర్‌టైజ్ విభాగం మార్కెట్ విలువ 2026 నాటికి రూ.43,568 కోట్లు కానుంది. - ఇంటర్నెట్ యాడ్ మార్కెట్ 12 శాతం వృద్ధితో 2026 నాటికి రూ.28,234 కోట్లకు చేరుకునే అవకాశం. ఇంటర్నెట్ అడ్వెర్టైజింగ్ మార్కెట్లో 69 శాతం మొబైల్ ఫోన్ల ద్వారానే జరగనుంది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వాటా 60 శాతంగా ఉంది. - మ్యూజిక్, రేడియో, పోడ్కాస్ట్ విభాగం మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.7,216 కోట్లు ఉండగా నాలుగేళ్ల తర్వాత ఇది రూ.11,356 కోట్లకు చేరుకోవచ్చు. - వీడియో గేమ్ మార్కెట్ త్వరలో పైకి దూసుకుపోనుందని సీడబ్ల్యూసీ నివేదిక స్పష్టం చేస్తోంది. రాబోయే నాలుగేళ్లలో ఈ విభాగంలో రూ. 37,535 కోట్లుగా ఉండవచ్చని అంచనా. టర్కీ, పాకిస్తాన్ తర్వాత వీడియోగేమ్ మార్కెట్ ఇండియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. - ఇక ఇండియన్ సినిమా మార్కెట్ ప్రస్తుత రెవెన్యూ 2026 నాటికి రూ. 16,198 కోట్లు కానుంది. ఇందులో బాక్సాఫీసు ద్వారా రూ. 15,849 కోట్ల రాబడి ఉండగా మిగిలిన రూ.349 కోట్లు యాడ్స్ ద్వారా రానుంది. - న్యూస్‌పేపర్ రెవెన్యూ రాబోయే నాలుగేళ్లలో 2.7 శాతం వృద్ధితో రూ.26,278 కోట్ల నుంచి రూ.29,945 కోట్లను టచ్ చేయనుంది. న్యూస్‌పేపర్ రెవెన్యూలో ఇండియా వరల్డ్‌లో ఐదో ర్యాంకులో ఉంది. చదవండి: ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మజాక్ చేస్తే ఇట్లనే ఉంటది -
జైహింద్ స్పెషల్: తెల్లవారిని తుపాకులతో కాల్చుట
జాతీయతా భావాలనే మనసావాచా నమ్మిన మేధోవర్గాన్నీ, ఉద్యమ సారథ్యాన్నీ ఇచ్చిన పరిణామం వందేమాతరం ఉద్యమం. ఆ ఉద్యమం తెలుగువారికి అందించిన మేధో సంపన్నుడు, పత్రికా రచయిత ముట్నూరి కృష్ణారావు. ఆయన సంపాదకీయాల సంకలనం ‘లోవెలుగులు’ ఆధునిక జాతీయతా చైతన్యానికి గీత వంటిది. జాతిలో ఆ పెను నిద్రను వదిలించడానికి ఆయన ‘కృష్ణాపత్రిక’ను సాధనంగా చేసుకున్నారు. 1902 ఫిబ్రవరి 1న మచిలీపట్నంలో ప్రారంభమైన ‘కృష్ణాపత్రిక’కు 1907లో బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం నుంచి తిరిగి వచ్చిన తరువాత ముట్నూరివారు సంపాదకులయ్యారు. కృష్ణాపత్రికలో ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న వ్యాసం ప్రచురించినందుకు నాలుగేళ్ల పాటు సంపాదకత్వానికి దూరంగా ఉన్నా, మళ్లీ వచ్చి కొన ఊపిరి వరకు పత్రికను నడిపించారు. చదవండి: జైహింద్ స్పెషల్: పెన్నులతో గన్నుల పైకి కాశీనాథుని నాగేశ్వరరావు 1908లో ఆంధ్రపత్రిక వారపత్రిక, 1914లో ఆంధ్రపత్రిక దినపత్రిక స్థాపించిన స్వాతంత్య్ర సమరయోధుడు. భారతీయ పత్రికా రంగ చరిత్రను చేర్చకుండా ఎలాగైతే భారత స్వాతంత్య్ర సమర చరిత్ర సంపూర్ణం కాదో, తెలుగుప్రాంతాలలో జరిగిన ఉద్యమ చరిత్ర పరిపూర్ణం కావాలంటే ఆంధ్రపత్రిక చరిత్రను అలాగ అధ్యయనం చేయాల్సిందే. స్వాతంత్య్ర పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన పత్రిక ఇది. స్వాతంత్య్ర సమరయోధులను ఎన్నో విధాలుగా ఆదుకున్న సంస్థ కూడా. గాడిచర్ల హరిసర్వోత్తమరావు బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో లాల్, పాల్, బాల్ ఇచ్చిన సందేశాలతో ఉత్తేజితుడైన గాడిచర్ల విద్యార్థి దశలోనే నేరుగా ఉద్యమంలో చేరారు. 1907లోనే బెజవాడ నుంచి ‘స్వరాజ్య’ వారపత్రికను ఆరంభించారు. పింగళి లక్ష్మీనారాయణ, బోడి నారాయణరావు ఆయనకు సహకరించారు. 1908లో గాడిచర్ల ‘విపరీత బుద్ధి’ పేరుతో సంపాదకీయం రాశారు. దానితో మూడేళ్లు కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో అరెస్టు చేసినప్పుడు ఆయనకు సంకెళ్లు వేసి బెజవాడ వీధుల నుంచి తీసుకువెళ్లారని చెబుతారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో జాతీయ భావాల వ్యాప్తికి శ్రమించిన ‘ఆంధ్రపత్రిక’ తొలి సంపాదకుడు గాడిచర్ల వారే. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీలో జైలుకు వెళ్లిన తొలి స్వాత్రంత్య సమరయోధుడూ ఆయనేనని కూడా అంటారు. వెల్లూరు కారాగారంలో ఆయన కఠోర అనుభవాలు చవిచూశారు. దత్తమండలాలుగా పేరొందిన ప్రాంతానికి రాయలసీమ పేరు ఇచ్చినది, ఎడిటర్ అన్న ఇంగ్లిష్ పదానికి సంపాదకుడు అన్న అనువాదాన్ని ఇచ్చిందీ గాడిచర్ల వారే. చిలకమర్తి లక్ష్మీనరసింహం బిపిన్ చంద్ర పాల్ 1907లో రాజమండ్రి వచ్చినప్పుడు వారి ఉపన్యాసాన్ని అనువదించినవారు చిలకమర్తి లక్ష్మీనరసింహం. గొప్ప కవి, నాటకకర్త, జాతీయవాది. ఆనాటి సభలో ఆశువుగా వినిపించినదే, ‘భరతఖండంబు చక్కని పాడియావు..’ పద్యం. 1906లో ఆయన రాజమండ్రిలో ‘మనోరమ’ పేరుతో పత్రిక స్థాపించారు. 1909లో ‘దేశమాత’ పత్రికను నెలకొల్పారు. మనోరమ సాహిత్యానికి పరిమితమైనా, దేశమాతను పేరుకు తగ్గట్టే వెలువరించారు. చిలకమర్తి బెంగాల్ సంఘ సంస్కర్తల జీవితాలను తన పత్రికల ద్వారా తెలుగువారికి పరిచయం చేశారు. దేశమాత పత్రిక ప్రారంభించడానికి ఆయన ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ సంపాదక వర్గం గాంధీజీ పిలుపుతో స్వరాజ్య సమరంలోకి వచ్చినా, తన వార్తాపత్రిక ‘కాంగ్రేసు’ను మాత్రం తీవ్ర జాతీయవాదుల భావాలకు వేదికగా చేశారు మద్దూరి అన్నపూర్ణయ్య. 1921 మే మాసంలో, మద్దూరి సంపాదకునిగా మొదట సైక్లోస్టయిల్డ్ పత్రికగా అది ఆరంభమైంది. రాజమహేంద్రవరం నుంచి ప్రచురణ ప్రారంభించి, తరువాత సుబ్రహ్మణ్యం ప్రారంభించిన సీతానగరం గౌతమీ సత్యాగ్రహాశ్రమానికి తరలింది. రాజమండ్రికి 23 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆశ్రమానికి దక్షిణాది సబర్మతి అని పేరు. ఇంకా క్రొవ్విడి లింగరాజు, శ్రీరామచంద్రుని వెంకటప్ప, చండ్రుపట్ల హనుమంతరావు సంపాదక మండలిలో ఉన్నారు. కానీ పత్రిక వెలువడిన ఒక దశాబ్దకాలంలో (1921–1932) వీరిలో ఎవరో ఒకరు కారాగారంలో ఉంటూ వచ్చారు. 1929 మే నెల కాంగ్రేసు 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సంస్మరణ సంచికగా వెలువడింది. ఇందులోనే అచ్చయిన ‘చిచ్చుర పిడుగు’ అన్న నాటిక అప్పుడే ఆ ఆశ్రమాన్ని సందర్శించిన గాంధీజీని కలవరపరచడమే కాదు, మద్దూరిని రెండున్నరేళ్లు కారాగారంలో ఉంచింది. నిజానికి అది రామచంద్రుని వెంకటప్ప రచన. రచయిత పేరు వేయలేదు. కానీ పోలీసులు కేసు పెట్టడంతో సంపాదకుడు కాబట్టి మద్దూరి బాధ్యత వహించి జైలుకు వెళ్లారు. భగత్‌సింగ్ బలిదానాన్ని శ్లాఘిస్తూ ‘వీరబలి’ పేరుతో సంపాదకీయం రాసినందుకు, వాడపల్లి (తూర్పు గోదావరి జిల్లాలో ఊరు. వెంకటేశ్వరస్వామి ఉత్సవంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఏడుగురు చనిపోయారు) కాల్పుల వార్తలు ఇచ్చినందుకు ప్రభుత్వం ఈ పత్రిక మీద నిఘా ఉంచింది. చివరికి 1932 జనవరిలో మద్రాస్ గెజెట్ ‘కాంగ్రేసు’ చట్ట వ్యతిరేకమని ప్రకటించింది. జనవరి 12న పోలీసులు ఆశ్రమం మీద దాడి చేసి పత్రిక ఆస్తులన్నీ ధ్వంసం చేశారు. సురవరం ప్రతాపరెడ్డి మే 10, 1926న ప్రతాపరెడ్డి సారథ్యంలో ప్రారంభమైన ‘గోలకొండ పత్రిక’ సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని భయపెట్టేవి. రాజ్యంలో వాస్తవాలను తెలియచేసేందుకు సురవరం ప్రతాపరెడ్డి ఈ పత్రిక స్థాపించారు. సంపాదకునిగా మొదట్లో ఆయన పేరు లేకున్నా, అన్నీ ఆయనే. సురవరం బహుభాషావేత్త, సాహిత్యవేత్త. నిజాం సంస్థానంలో నవాబు నడిపిన ‘మీజాన్’ తెలుగు వెర్షన్‌కు అడవి బాపిరాజు సంపాదకులు. అందులో నవాబు వ్యతిరేకోద్యమ వార్తలకూ ఆయన చోటిచ్చారు. మందుముల నరసింగరావు ‘రయ్యత్’ పత్రిక పూర్తిగా నిజాం వ్యతిరేక పత్రిక. ఇక ‘ఇమ్రోజ్’ ఉర్దూ పత్రిక నిర్వాహకుడు, రచయిత షోయబుల్లా ఖాన్‌ను రజాకార్లు హైదరాబాద్‌లో హత్యచేశారు. ఇక్కడ ప్రస్తావించిన పత్రికలు, పత్రికా రచయితల పేర్లు చరిత్ర అనే సాగరం నుంచి తీసిన ఒక్క బొట్టులో భాగం మాత్రమే. స్వాతంత్య్ర సమరం, పత్రికలు సాగించిన ఉద్యమం వేరు చేసి చూడడం సాధ్యం కాదన్నది చారిత్రక వాస్తవం. వందలాది పత్రికలు, వందలాది మంది పత్రికా రచయితలు స్వాతంత్య్రోద్యమానికి అంకితం కావడం తిరుగులేని వాస్తవం. 1947 వరకు ఏ పత్రిక ఆశయమైనా దేశ స్వాతంత్య్ర సాధనే. దీనికి భూమికను అందించిన నిన్నటి సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో పత్రికలు నిశ్శబ్ద కర్తవ్యాన్ని నిర్వహించాయి. స్వాతంత్య్రోద్యమానికి గళం ఇచ్చాయి. పత్రికా రచన ఇంకొక మహత్కార్యం కూడా నెరవేరుస్తూ ఉంటుంది. చరిత్ర రచనకు ఆలంబన నిన్నటి వార్తాపత్రికలే. జాఫ్రీ సి వార్డ్ అన్నట్లు... ‘జర్నలిజం ఈజ్ మియర్లీ హిస్టరీస్ ఫస్ట్ డ్రాఫ్ట్’ . – డా. గోపరాజు నారాయణరావు, ఎడిటర్, ‘జాగృతి -
జైహింద్ స్పెషల్: పెన్నులతో గన్నుల పైకి
1870 ప్రాంతం నుంచి భారత పత్రికా రంగం వేళ్లూనుకోవడం మొదలయింది. పత్రికలు కేవలం రాజకీయ చైతన్యం రేకెత్తించడం వరకే పరిమితం కాలేదు. జాతీయ భావాలు నింపడంతోనే బాధ్యత పూర్తయిందని అనుకోలేదు. తొలి దశలో భారతీయ సమాజంలో ఉన్న వివక్ష, అసమానతలు, దురాచారాల నిర్మూలనకు కూడా కృషి చేశాయి. స్వతంత్ర దేశం దిశగా, స్వయం పాలన ఆశయంగా సాగుతున్న ఉద్యమంలో విద్య, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక వ్యవస్థ, కుటీర పరిశ్రమలు, సేద్యం వంటి వ్యవస్థల పునర్ నిర్మాణానికి ఆనాటి పత్రికారంగం బాటలు వేసింది. చదవండి: ఎడిటర్‌కి ఎనిమిదేళ్ల జైలు!.. రెండేళ్లకే పేపర్ మూత!! ప్రభుత్వం మీద ప్రజలను రెచ్చగొట్టే రచనలు ప్రచురిస్తే నేర శిక్షాస్మృతి 124ఏ నిబంధన కింద కఠిన శిక్షలు విధించే అవకాశం ఉన్నా చాలా పత్రికలు అందుకు సిద్ధమై పనిచేశాయి. ఇది చాలదన్నట్టు భారతీయ భాషా పత్రికల చట్టం 1878 ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక్క సమావేశంతోనే హడావుడిగా తెచ్చింది. దీని ప్రకారం పత్రికను అచ్చువేసే ప్రెస్ ఆస్తులను జప్తు చేయవచ్చు. 1881లో దీనిని రిపన్ రద్దు చేశాడు. పత్రికా రచయితగా ప్రభుత్వ ఆగ్రహానికి గురై భారతదేశంలో తొలిసారి జైలుకు వెళ్లిన ఘనత సురేంద్రనాథ్ బెనర్జీకి (ఐపీఐ అవార్డు 2007, ప్రదానోత్సవంలో ఔట్లుక్ పత్రిక సంపాదకుడు వినోద్ మెహతా ఇచ్చిన ఉపన్యాసం) దక్కుతుంది. బ్రిటిష్వాద పత్రికలు! 1900–1947 వరకు కనిపించే దశ ఒకటి. ఈ దశలోనే అతి జాతీయవాద, మితవాద ధోరణులతో సాగిన ఉద్యమం గురించి వార్తాపత్రికలు విశ్లేషించవలసి వచ్చింది. తీవ్ర జాతీయవాదం రంగం మీదకు వచ్చింది. జాతీయవాద పత్రికారంగానికీ, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికీ మధ్య యుద్ధం కూడా తీవ్రమైంది. బ్రిటిష్ ఇండియాను సమర్థించే పత్రికలు జాతీయవాద పత్రికలను లక్ష్యంగా చేసుకోవడం మరొక వాస్తవం. పత్రికల పాత్ర మరింత సునిశితమైంది. హిందుస్తాన్ టైమ్స్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జాతీయవాదం వైపు మళ్లాయి. భారత్ మిత్ర.. కలకత్తా సమాచార్ 1850–1857 మధ్య హిందీలో చాలా పత్రికలు వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఆ సంఖ్య ఇంకా పెరిగింది. ‘భారత్ మిత్ర’, ‘కలకత్తా సమాచార్’ వంటివి అప్పుడే వెలువడినాయి. 1920లో బెనారస్ నుంచి వెలువడిన ‘ఆజ్’ స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. ఆ సంవత్సరమే బాబూ రాజేంద్రప్రసాద్ పట్నా నుంచి ఆరంభించిన ‘దేశ్’ కాంగ్రెస్ వాణిగా పనిచేసింది. ఉర్దూలో ‘మిలాప్’, ‘ప్రతాప్’, ‘తేజ్’ తమ వంతు పాత్రను నిర్వహించాయి.1923లో కేరళలో ఆరంభమైన ‘మాతృభూమి’ కూడా కాంగ్రెస్ అధికార పత్రిక వంటిదే. అంతకు ముందే ఆరంభమైన కేరళ పత్రిక బ్రిటిష్ పాలన మీద విమర్శలు కురిపించేది. తమిళంలో 1917లో ప్రారంభమైన ‘దేశభక్తన్’ పత్రికకు ఎంతో ప్రత్యేకత ఉంది. స్వరాజ్య సమరంలో సిద్ధాంతవేత్తగా పేర్గాంచిన వీవీఎస్ అయ్యర్ దీని సంపాదకుడు. మైసూరు సంస్థానంలో ‘విశ్వ కర్ణాటక’ పత్రిక 1921 నుంచి జాతీయ భావాల వ్యాప్తి కోసం పనిచేసింది. తిలక్ ప్రభావం ఉన్న కొందరు వ్యక్తులు అక్కడ స్థాపించిన పత్రిక ‘జయ కర్ణాటక’. స్వాతంత్య్రోద్యమంలో ఉన్న నాయకులు, కార్యకర్తలనే కాదు, పత్రికా రచయితలను కూడా బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం అంతే ద్వేషంతో చూసింది. కఠిన కారాగార శిక్షలు, అండమాన్ ప్రవాసాలు, మాండలే నిర్బంధాలు, జరిమానాలు, జప్తులు పత్రికా రచయితలకు కూడా తప్పలేదు. బాలగంగాధర తిలక్ భారత స్వాతంత్య్ర సమరంలో, ఆనాటి పత్రికా రంగంలో రెండు దశాబ్దాల పాటు ముఖ్య భూమికను పోషించిన యోధుడు బాలగంగాధర తిలక్. స్వాతంత్య్రం నా జన్మహక్కు అని గొప్ప నినాదం ఇచ్చి, పత్రికలకూ, పోరాటానికీ నడుమ ఉన్న తాత్త్విక బంధం నిరూపించారాయన. ప్రభుత్వ వ్యతిరేకతతో తిలక్‌ను మూడు పర్యాయాలు దేశద్రోహం నేరం కింద ప్రభుత్వం విచారించింది. 1897లో ఆయనకు 18 మాసాల శిక్ష పడింది. ర్యాండ్ అనే బ్రిటిష్ అధికారిని చాపేకర్ సోదరులు చంపడాన్ని తిలక్ సమర్థించారు. ర్యాండ్ అప్పుడు ప్లేగ్ బారిన పడిన వారి పట్ల పరమ కర్కోటకంగా వ్యవహరించాడని పేరు. 1908లో ముజఫర్‌నగర్ దగ్గర మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్ లక్ష్యంగా వాహనం మీద బెంగాలీ యువకులు ప్రఫుల్ల చాకి, ఖుదీరాం బోస్ బాంబు విసరడాన్ని కూడా తిలక్ సమర్థించారు. అంతేకాదు, భారతీయులకు స్వరాజ్యం ఇవ్వాలని తన పత్రికలో రాశారు. వెంటనే ప్రభుత్వం విచారించి ఆరున్నరేళ్ల కారాగారం విధించి, మాండలే జైలుకు పంపింది. 1916లో మరొకసారి దేశద్రోహం కేసుతో తిలక్‌కు శిక్ష విధించింది. గాంధీజీతో మదన్ మోహన్ మలావియా ప్రసిద్ధ జాతీయవాద పత్రిక ‘హిందూస్థాన్ టైమ్’.. 1924లో ప్రారంభమైన కొన్ని నెలలకే బ్రిటిష్ పాలకుల ఒత్తిళ్లకు మనుగడ సాగించలేని స్థితిలో, మూసివేత తప్ప మరో మార్గం లేదనుకున్నప్పుడు మాలావియానే ముందుకొచ్చి 50 వేల రూపాయల విరాళాలు సేకరించి ఆ పత్రికను నిలబెట్టారు. అయ్యర్ మీద కేసు తన పత్రికలను దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఉపయోగిస్తున్నారని ‘ది హిందూ’ వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్ మీద కేసు పెట్టారు. 1908లో ఆయన కారాగారవాసం అనుభవించారు. అమృత్‌బజార్ పత్రిక వ్యవస్థాపకులు శిశిర్‌కుమార్ ఘోష్, మోతీలాల్ ఘోష్‌లను 1897లో దేశద్రోహం కేసు కింద జైలుకు పంపారు. ఆ ఇద్దరు సోదరులు. బాంబే క్రానికల్ ఎడిటర్ బీజీ హార్నిమన్‌ను కూడా బ్రిటిష్ వ్యతిరేకత కారణంగా నిర్బంధించి, బలవంతంగా ఇంగ్లండ్ పంపారు. – డా. గోపరాజు నారాయణరావు, ఎడిటర్, ‘జాగృతి’ -
‘నాన్న కష్టం చూడలేక’.. సూర్యుడి కంటే ముందే డ్యూటీ
ఈ ఇద్దరమ్మాయిలు... అక్కాచెల్లెళ్లు. అక్క ఇంటర్ ఫస్టియర్... చెల్లి టెన్త్ క్లాస్. ఇద్దరూ ధైర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. నాన్న కోసం కష్టమైన పనిని ఇష్టంగా అందుకున్నారు. ఆడపిల్లలు చేయని సాహసానికి సిద్ధమయ్యారు. చీకటి చీల్చడానికి సూర్యుడు డ్యూటీ చేస్తాడు. ఆ సూర్యుడికంటే ముందే వీళ్ల డ్యూటీ మొదలవుతుంది. సూర్యుడు వెలుతురును పంచేలోపు... ఈ అక్కాచెల్లెళ్లు అక్షరాల వెలుగును పంచుతున్నారు. నాన్నకు ఎదురైన కష్టాన్ని పంచుకున్నారు. ఇంటి చీకటిని తొలగిస్తున్న కాంతి వీచికలయ్యారు. తెలతెలవారుతోంది. హైదరాబాద్ నగర వీథుల్లో రోడ్డు మీద మాణింగ్ వాకింగ్ చేసే వాళ్లు, వీథులు చిమ్మేవాళ్లు తప్ప మనుష్య సంచారం పెద్దగా లేదు. ఓ అమ్మాయి రయ్యిమంటూ స్కూటీ మీద వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. న్యూస్ పేపర్ని రోల్ చుట్టి ఇంటి బాల్కనీలోకి విసిరేసింది. మరో కాలనీలో అంతకంటే చిన్నమ్మాయి ఇంటింటికీ వెళ్లి న్యూస్ పేపర్ వేస్తోంది. ఓ ఇంటి ముందు అప్పటికే నిద్రలేచి ఉన్న ఓ పెద్దావిడ నవ్వుతూ ఆ అమ్మాయిని పలకరించింది. ‘‘ఆడపిల్ల ఇంత ధైర్యంగా పొద్దున్నే ఇలా ఇంటింటికీ వచ్చి పేపర్ వేయడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందమ్మాయ్! అయినా ఇంత కష్టమైన పనికి ధైర్యంగా ముందుకు రావడం గొప్ప విషయమే. జాగ్రత్త తల్లీ’’ అని జాగ్రత్త చెప్పిందా పెద్దావిడ. ‘‘అలాగే మామ్మ గారూ!’’ అని ఆ అమ్మాయి కూడా నవ్వుతూ మామ్మగారికి టాటా చెప్పి మరో ఇంటిదారి పట్టింది. న్యూస్‌పేపర్ డెలివరీ చేస్తున్న ఈ అమ్మాయిలు కెలావత్ ప్రమీల, పవిత్ర. హైదరాబాద్, బోరబండ, శివమ్మ బాపురెడ్డి హిల్స్‌లో నివసిస్తున్నారు. రోజూ ఉదయం ఐదింటికే నిద్రలేచి ఆరు లోపు మోతీనగర్ చౌరస్తాలోని పేపర్ పాయింట్‌కు చేరుకుంటారు. ఏడు గంటల లోపు మోతీనగర్ చుట్టు పక్కల ఐదారు కాలనీల్లో పేపర్ వేసేసి, ఇంటికి వచ్చి రిఫ్రెష్ అయ్యి ఆన్లైన్ క్లాసులకు సిద్ధమవుతారు. పవిత్ర టెన్త్ క్లాస్, ప్రమీల ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ కుటుంబానికి కూడా పరీక్ష పెట్టింది. బాయ్స్ మానేశారు ‘‘మా నాన్నకు న్యూస్ పేపర్ లైన్ ఉంది. ఇరవై ఏళ్లుగా పేపర్లు వేస్తున్నాడు. నాన్న దగ్గర బాయ్స్ ఉండేవాళ్లు. మా లైన్లో మొత్తం ఏడు వందల పేపర్లు పడేవి. కరోనా కారణంగా చాలా మంది పేపర్ మానేశారు. బాయ్స్ కూడా పని మానేశారు. కరోనా భయం తగ్గిన తర్వాత కొందరు బాయ్స్ మళ్లీ వచ్చారు. కానీ అప్పటికే పేపర్ కాపీలు బాగా తగ్గిపోయాయి. బాయ్స్‌కు ఒక్కొక్కరికి వెయ్యి, పన్నెండు వందలు ఇవ్వాలంటే నాన్నకు కుదిరేది కాదు. బాయ్స్ లేకుండా అన్ని ఇళ్లకూ నాన్న ఒక్కడే వేయాలంటే టైమ్ సరిపోయేది కాదు. పేపర్ లేటుగా వేస్తే కోప్పడతారు కదా! పైగా నాన్న పేపర్ వేసిన తరవాత ఫిల్మ్ నగర్లో రేషన్ షాపులో ఉద్యోగానికి వెళ్లాలి. నాన్న అటూ ఇటూ పరుగులు తీయాల్సి వచ్చేది. నాన్న కష్టం చూస్తుంటే బాధనిపించేది. దాంతో ‘మేము పేపర్ వేస్తాం నాన్నా’ అని నాన్నని ఒప్పించాం’’ అని చెప్పింది ప్రమీల. రోజూ పేపర్ చదువుతాం నాన్న పనిలో ఉండడం వల్ల మాకు రోజూ ఇంగ్లిష్, తెలుగు పేపర్లు చదవడం అలవాటైంది. మేము చదివేది ఇంగ్లిష్ మీడియమే, కానీ చిన్నప్పటి నుంచి పేపర్లు చదవడం వల్ల తెలుగు కూడా బాగా వచ్చేసింది’’ అని చెప్పారు ప్రమీల, పవిత్ర. బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవుతామని చెప్తున్న ఈ అక్కాచెల్లెళ్ల సాహస ప్రస్థానం పలువురికి స్ఫూర్తిదాయకం. మెచ్చుకుంటున్నారు! లాక్డౌన్ పోయి అన్‌లాక్ మొదలైంది. కానీ పరిస్థితులు మాత్రం పూర్వపు స్థితికి చేరనేలేదు. పేపర్‌తో కరోనా రాదని తెలిసిన తర్వాత కూడా కాపీలు ముందులాగ పెరగలేదు. ఇప్పుడు మా లైన్లో మూడు వందల కాపీలు వేస్తున్నాం. మేము పేపర్ వేసే ఇళ్లలో పెద్ద వాళ్లు చాలామంది మమ్మల్ని పలకరించి మాట్లాడతారు. ‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, అన్ని పనుల్లోనూ ముందుకు రావాలమ్మా. మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తోంది’ అంటారు. – ప్రమీల పేపర్ల మధ్య పెరిగాం! మేము చిన్నప్పుడు సెలవుల్లో నాన్న పేపర్ వేయడానికి వెళ్తుంటే మారం చేసి మరీ నాన్న స్కూటీ మీద వెళ్లే వాళ్లం. ఈ కాలనీలన్నీ మాకు బాగా తెలుసు. పేపర్ల మధ్యనే పెరిగాం. ఏ కాలనీలో ఏ పేపర్ ఎన్ని కాపీలు వేయాలనే లెక్క కూడా త్వరగానే తెలిసింది. మాకిద్దరికీ స్కూటీ నేర్పించాడు నాన్న. మా అక్క రూట్లో ఇళ్లు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. తను స్కూటీ మీద వెళ్తుంది. దగ్గర దగ్గరగా ఉన్న ఎనభై పేపర్ల రూట్ నాది. పేపర్ వేసిన తరవాత నాన్న, అక్క, నేను ముగ్గురం కలిసి ఇంటికి వెళ్తాం – పవిత్ర – వాకా మంజులారెడ్డి -
చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ నిబంధనల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ల మంజూరు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. జీఎస్టీకి మినహాయింపునిస్తూ ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకుని చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ల మంజూరు నిబంధనలు సవరించడం హర్షణీయమని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ వెన్ను శనివారం పేర్కొన్నారు. చదవండి: పెదకాకానిలో అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ విచారణ -
ఎడిటర్–ఇన్–చీఫ్ రాయిటర్స్‌కు తొలి మహిళ
వార్తా పత్రికల్లో అనేకమంది ఎడిటర్లు ఉంటారు. పత్రికా కార్యాలయంలో ఎన్ని ప్రత్యేకమైన వార్తా విభాగాలు ఉంటే అంతమంది ఎడిటర్లు. వాళ్లందరి పైనా మళ్లీ ఒక ఎడిటర్ ఉంటారు. వారే ఎడిటర్–ఇన్–చీఫ్. లేదా చీఫ్ ఎడిటర్. ‘రాయిటర్స్’.. ప్రపంచానికి ఎప్పటికప్పుడు వార్తల్ని, వార్తా కథనాల్ని అందిస్తూ వస్తున్న విశ్వసనీయ వార్తా సంస్థ. ఆ సంస్థకు ఇంతవరకు ఒక మహిళా చీఫ్ ఎడిటర్ లేనే లేరు. ఇప్పుడు తొలిసారి అలెస్సాండ్రా గలోనీ అనే మహిళ ఆ బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు! 170 ఏళ్ల చరిత్ర గల రాయిటర్స్ని ఈ నెల 19 నుంచి 47 ఏళ్ల వయసు గల గలోనీ నడిపించబోతున్నారు! మహామహులకు మాత్రమే దక్కే ఇంత పెద్ద అవకాశం చిన్న వయసులోనే ఆమె సాధించగలిగారు! రాయిటర్స్ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. అక్కడ తన ‘ఎడిటర్–ఇన్–చీఫ్’ సీట్లో కూర్చొని దేశదేశాల్లోని 2,500 మంది సీనియర్ జర్నలిస్టులకు దిశానిర్దేశం చేయబోతున్నారు గలోని! రాయిటర్స్ న్యూస్ రూమ్ దాదాపుగా ఒక వార్ రూమ్. అక్కడ నిరంతరం తలపండిన పాత్రికేయుల సమాలోచనలు జరుగుతుంటాయి. వార్తని ‘ఛేదించడం’, ‘సాధించడం’ వారి ప్రధాన లక్ష్యాలు. వాళ్లందరికీ ఇక నుంచీ లీడర్.. గలోనీ. న్యూస్ రూమ్‌లో ప్రణాళికలను రూపొందిస్తూనే, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 ప్రాంతాలలో ఉన్న రిపోర్టర్లతో ఆమె ఎప్పుడూ అనుసంధానమై ఉండాలి. చిన్న పని కాదు. అలాగని పురుషులకే పరిమితమైన పని కాదని ఇప్పుడీ కొత్త నియామకంతో రాయిటర్స్ తేల్చి చెప్పింది. ఇప్పటికి వరకు ఎడిటర్–ఇన్–చీఫ్‌గా ఉన్న స్టీఫెన్ ఆల్డర్ వయసు 66. రాయిటర్స్ గ్లోబల్ మేనేజింగ్ ఎడిటర్ హోదాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అలెస్సాండ్రా గలోనీ. గత పదేళ్లుగా ఆయన న్యూస్ రూమ్‌కి సారథ్యం వహిస్తున్నారు. అనుభవజ్ఞుడు. ఆయన రిటైర్ అయితే తర్వాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. రాయిటర్స్లోనే ‘గ్లోబల్ మేనేజింగ్ ఎడిటర్’గా ఉన్న గలోనీనే సరైన ఎంపికగా నిలిచారు! ఐదేళ్లుగా ఆ పదవిలో ఉన్న గలోనీదే న్యూస్ ప్లానింగ్ అంతా. 2015లో రాయిటర్స్లోకి రాకముందు వరకు మరొక ప్రఖ్యాత వార్తా సంస్థ ‘వాల్ స్ట్రీట్ జర్నల్’లో 2013 నుంచీ దక్షిణ ఐరోపా బ్యూరో లో ఉన్నారు. ఎడిటర్–ఇన్–చీఫ్‌గా గత సోమవారం అనేక ఊహాగానాల మధ్య గలోనీ పేరును బహిర్గతం చేస్తూ.. ‘‘ఈ పదవికి తగిన వ్యక్తి కోసం లోపల, బయట విస్తృత పరిధిలో అనేకమంది అత్యంత యోగ్యులైన వారిని దృష్టిలో ఉంచుకున్న అనంతరం మా వెతుకులాట అలెస్సాడ్రా గలోని దగ్గర ఆగింది’’ అని రాయిటర్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రైడెన్‌బర్గ్ ప్రకటించారు. గలోనీ రోమన్ మహిళ. నాలుగు భాషలు వచ్చు. బిజినెస్, పొలిటికల్ వార్తల్లో నిపుణురాలు. ప్రపంచ వాణిజ్య, రాజకీయ రంగాలలో ఏం జరగబోతోందీ, అవి ఎలాంటి మలుపులు తిరగబోతున్నదీ ముందే ఊహించగల అధ్యయనశీలి, అనుభవజ్ఞురాలు. ఆమె కెరీర్ ప్రారంభం అయింది కూడా రాయిటర్స్లోనే. ఇటాలియన్ లాంగ్వేజ్ న్యూస్ రిపోర్టర్‌గా చేరి, కొద్ది కాలంలోనే ‘ఎడిటర్–ఇన్–చీఫ్’గా ఎదిగారు! జర్నలిజంలో అత్యంత విశేష పురస్కారం అయిన ‘గెరాల్డ్ లోయెబ్ పౌండేషన్’ వారి 2020 మినార్డ్ ఎడిటర్ అవార్డు విజేత గలోనీనే! ఇంకా ఆమె ‘ఓవర్సీస్ ప్రెస్ క్లబ్ అవార్డు’, యు.కె. ‘బిజినెస్ జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ల విజేత కూడా. గలోనీ హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’లో చదివారు. తన బాధ్యతల గురించి మాట్లాడుతూ ‘‘ప్రతిభ, అంకితభావం గల జర్నలిస్టులతో నిండి ఉండే ప్రపంచ స్థాయి న్యూస్ రూమ్‌ను నడిపించే వకాశం రావడం నాకు లభించిన గౌరవం’’ అని అన్నారు గలోనీ. -
పప్పూ... ఇది తప్పు!!
జాతీయ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశానికి ప్రధాన కార్యదర్శి. మాజీ ముఖ్యమంత్రి కొడుకు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా మంత్రిగా పనిచేశాడు. మరి ఈయనకు ప్రజాస్వామ్యమన్నా... దానికి మూలస్తంభాల్లాంటి పత్రికలన్నా ఏ కొంచమైనా గౌరవం ఉందా? ఉంటే ఇలా చేస్తాడా? నిజాలు తనకు నచ్చనంత మాత్రాన ఏకంగా పత్రిక ప్రతులనే తగలబెట్టే సాహసం చేశాడంటే ఈయన రాజకీయాలకు పనికొస్తాడా? అధికారం లేదనే నైరాశ్యంలో.. తమ కుట్రలు బయటపడిపోతున్నాయన్న అక్కసుతో ఇంతకు దిగజారిపోతాడా? ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో మంగళవారం సాక్షి ప్రతుల్ని చింపి దహనం చేసిన నారా లోకేశ్‌ను చూసి ప్రజాస్వామ్య వాదులు సిగ్గు పడాలి. తెలుగుదేశం పార్టీ తలదించుకోవాలి. (అది చిడతల నాయుడికే చెల్లింది: పేర్ని నాని) -
వార్తాపత్రికలు చదవాలి
‘‘ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వార్తాపత్రికలు చదవాలి. ముఖ్యంగా ప్రతిరోజూ పిల్లలతో పత్రికలు చదివించాలి. నా పిల్లలతో నేను చదివిస్తాను’’ అన్నారు సోనూ సూద్. కరోనా సమయంలో వలస కార్మికులు వాళ్ల ఊళ్లు చేరుకోవడానికి విస్తృతంగా సహాయం చేశారు సోనూ సూద్. సినిమాల్లో విలన్ పాత్రలు చేసినా నిజజీవితంలో హీరో అనిపించుకున్నారు. ఇక న్యూస్పేపర్ల గురించి సోనూ సూద్ మాట్లాడుతూ – ‘‘నా చిన్నప్పుడు పేపర్లు చదివేవాడిని. ప్రతి వార్తనూ చదవకపోయినా నా తల్లిదండ్రుల కోసం చదివేవాడిని. అది అలవాటుగా మారిపోయింది. అలాగే మా స్కూల్లో ప్రతి రోజూ 20 వార్తల గురించి చెప్పాలి. అందుకని పేపర్ చదవడం అనేది నా హోమ్‌వర్క్‌లో భాగం అయ్యేది. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పాఠశాలల్లో ఇలాంటి కార్యకలాపాలు తప్పనిసరి చేయాలని నేను భావిస్తున్నాను’’ అన్నారు. -
పత్రికారంగానికి ఉద్దీపన ప్యాకేజీనివ్వండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న న్యూస్‌పేపర్ పరిశ్రమను ఆదుకునేందుకు .. చాన్నాళ్లుగా కోరుతున్న ఉద్దీపన ప్యాకేజీని సత్వరం ప్రకటించాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో అనేక సంస్థలు మూతబడి, లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా దెబ్బతో అటు అడ్వర్టైజింగ్, ఇటు సర్క్యులేషన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావంతో ఆదాయాలు పడిపోయి న్యూస్‌పేపర్ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుందని ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ ఎల్ ఆదిమూలం పేర్కొన్నారు. దీనితో ఇప్పటికే పలు వార్తా సంస్థలు మూతబడటమో లేదా ఎడిషన్లను నిరవధికంగా మూసివేయడమో జరిగిందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే సమీప భవిష్యత్‌లో మరిన్ని సంస్థలు కూడా మూతబడే ప్రమాదముందన్నారు. గత 8 నెలలుగా పరిశ్రమ రూ. 12,500 కోట్ల మేర నష్టపోయిందని.. ఏడాది మొత్తం మీద నష్టం దాదాపు రూ. 16,000 కోట్ల దాకా ఉంటుందని పేర్కొన్నారు. లక్షల మంది ఉపాధికి ముప్పు..: ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభం వంటి పత్రికా రంగం దెబ్బతింటే జర్నలిస్టులు, ప్రింటర్లు మొదలుకుని డెలివరీ బాయ్స్ దాకా దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 30 లక్షల మంది ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆదిమూలం ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సామాజికంగా, రాజకీయంగా తీవ్ర దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న పరిశ్రమకు.. ప్రభుత్వం కూడా తోడ్పాటు కల్పించాలని ఆదిమూలం కోరారు. న్యూస్‌ప్రింట్, జీఎన్‌పీ, ఎల్‌డబ్ల్యూసీ పేపర్‌పై ఇంకా విధిస్తున్న 5% కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేయాలని, 2 ఏళ్ల ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని, ప్రభుత్వ ప్రకటనల రేట్లను 50% పెంచాలని, ప్రింట్ మీడియాపై ప్రభు త్వ వ్యయాలను 200% పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రకటనలకు సంబంధించిన బకాయిల సత్వర విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
చైనాలో మన న్యూస్ సెన్సార్
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ న్యూస్ వెబ్‌సైట్స్, పత్రికలను చైనా సెన్సార్ చేస్తోంది. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్)కు కూడా లొంగని అత్యంత శక్తిమంతమైన ఫైర్ వాల్‌ను రక్షణగా నిలిపి, న్యూస్ సెన్సార్‌కు పాల్పడుతోంది. (మీ ఫోన్లోని ‘టిక్‌టాక్’ ఏమవుతుంది?) ప్రస్తుతం చైనాలో ఇండియన్ టీవీ చానెళ్లను మాత్రమే ఐపీ టీవీ ద్వారా చూడటానికి కుదురుతోందని అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. గత రెండు రోజులుగా ఎక్స్‌ప్రెస్ వీపీఎన్ ఐఫోన్, డెస్క్‌టాప్‌లలో కూడా పని చేయడం లేదని వెల్లడించారు. (అమెజాన్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు) సెన్సార్‌షిప్‌కు గురైన వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని రహస్యంగా చూడటానికి వాడే అత్యంత శక్తిమంతమైన టూల్ వీపీఎన్. కానీ, రెండ్రోజులుగా చైనాలో ఇది కూడా పని చేయడం లేదు. హాంకాంగ్ ఉద్రిక్తతల నడుమ ‘హాంకాంగ్ ప్రొటెస్ట్’అనే పదాన్ని చైనా సెన్సార్ చేసింది. దీంతో ఆ పదంతో రాసిన వార్తలు చైనాలో కనిపించలేదు. తాజాగా గల్వాన్ లోయ ఉద్రిక్తతల నడుమ భారత వార్తలను సగటు చైనా పౌరుడిని చేరనీయకుండా డ్రాగన్ జాగ్రత్త పడుతోంది. -
మరో స్వాతంత్య్ర సమరం
ఊరట కోసం అబద్ధాలు రాయనక్కర్లేదు. వార్తల్లో ఉండ టంకోసం సంచలనాలు సృష్టించి, పతాక శీర్షికలకు ఎక్కించపన్లేదు. లక్ష తుపాకులకన్నా ఒక వార్తా పత్రిక మిక్కిలి శక్తివంతమైనదని అతి ప్రాచీన నానుడి. ఎందుకంటే పత్రికల్ని అంతో ఇంతో నమ్ముతాం. అసలు అచ్చులో అక్షరాన్ని చూడగానే విశ్వసిస్తాం. అవన్నీ మనం రాసి మనం కూర్చినవే కావచ్చు. అయినా కనుబొమ్మలెగరేస్తాం. కొంచెం నమ్మేస్తాం. ఈ కరోనా విపత్కాలంలో సోషల్ మీడియాలో లేనిపోని వదంతులు తిరుగు తున్నాయి గానీ, పత్రికలు పెద్దరికంగా బాధ్య తాయుతంగా ప్రవర్తిస్తున్నాయ్. అయితే, ప్రతి దానికీ ఒక మినహాయింపు ఉంటుంది. ఇప్పుడు దీనికీ ఉంది. ఇప్పటికే ప్రజలు పూర్తిగా డస్సిపోయి ఉన్నారు. ఇంకా భయభ్రాంతులకు గురి చేయ కండి. సొంత తెలివి ఉపయోగించి అసత్యాలు రాయక్కర్లేదు. నెల రోజులు దాటినా మాన వత్వం ఉదారంగా అన్నపురాశులుగా వాడవా డలా పరిమళిస్తూనే ఉంది. స్వచ్ఛంద సంస్థలు తమకు తామే జాగృతమై సేవలు అందిస్తు న్నాయి. గుంటూరు, చుట్టుపక్కల ప్రాంతా లకు ఏ వేళకు ఆ వేళ మూడు నాలుగు ఆదరు వులతో వేలాదిమందికి భోజనాలు అందిస్తు న్నారు. ఇప్పటికే మంచి పేరున్న ‘అమ్మ పౌండేషన్ నిస్వార్థ సంస్థ’ వేలాదిమందికి ఆకలి తీరుస్తోంది. డబ్బులివ్వడం వేరు. దాన్ని భోజ నంలోకి మార్చి వడ్డించిన విస్తరిగా అందించ డానికి మరింత ఔదార్యం కావాలి. వెనకాల ఎందరో వదా న్యులు ఉండి ఉండవచ్చు. కానీ, క్రమశిక్షణ కార్యదీక్షతో ఈ మహా క్రతువుని సాగించడం అసలైన పూజ. నిజమైన దేశభక్తి మన తారలు కొందరు ప్రజాహితం కోరుతూ, ‘ఇంట్లోనే ఉండండి! అదొక్కటే రక్ష!’ అంటూ సూచిస్తున్నారు. కొందరు కథానాయకులు ఇళ్లల్లో ఉండి వాళ్లు స్వయంగా చేస్తున్న ఇంటి పనులన్నింటిని మంచి పేరున్న శిల్పితో వీడి యోల కెక్కించి చానల్స్కిచ్చి తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. కొందరి జీవితాలు సౌందర్య సాధనాల్లాంటివి ఎప్పుడూ మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ ఉండకపోతే జనం మర్చి పోతారు. అందుకని స్మరింపజేస్తూ ఉండాలి. ఒకనాడు ఫోర్డ్ కారు ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందింది. ప్రతివారూ దాన్ని కలిగి ఉండాలని తహతహలాడేవారు. కానీ అంత తేలిగ్గా ఫోర్డ్ కారు లభించేది కాదు. అయినా ఫోర్డ్ సంస్థ ఆ కారు విశిష్టతల గురించి ఖరీదైన వ్యాపార ప్రకటనలు లక్ష లాది డాలర్లు వెచ్చించి విడుదల చేస్తుండేది. ఒక పెద్ద మనిషి ఫోర్డ్ని సూటిగా అడిగాడు. ‘మీ కారు కొనాలంటే దొరకదు. మళ్లీ అద నంగా కొనమని ఈ వ్యాపార ప్రకటనలొకటి’ అన్నాడు నిష్టూరంగా. అందుకు ఫోర్డ్ గారు నవ్వి, ‘దేనికదే.. విమానం గాలిలో జోరుగా ఎగురుతోంది కదా అని ఇంజన్ ఆపేస్తామా’ అని ఎదురుప్రశ్న వేసి నోటికి తాళం వేయిం చాడట! మనవాళ్లు ఆ అమెరికన్ కాపిటలిస్ట్ అడుగుజాడల్లో నడుస్తారు. మీడియా ఇలాంటి దిక్కుతోచని స్థితిలో సామాన్య ప్రజలకు ఏమి చెబితే ధైర్యస్థైర్యాలొస్తాయో అవి చెప్పాలి. జాగ్రత్తలు చెప్పండి. ఉపాయాలు చెప్పండి. ప్రపంచ దేశాల్లో సాగు తున్న పరిశోధనల గురించి చెప్పండి. తప్ప కుండా ఒక మంచి మందు శక్తివంతమైన టీకా వస్తుందని ధైర్యం ఇవ్వండి. మొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా మరీ కరోనా గురించి ఎక్కువ భయపెట్టకండని మీడియా మిత్రులకు చెప్పారు. మానవజాతి కరోనాతో కలిసి జీవించడానికి అలవాటుపడాలన్నారు. ఆ తర్వాత ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ కూడా ఈ మాటే ధ్రువపరి చారు. కుళ్లు కుతంత్రం, అసూయ ద్వేషం లాంటి ఎన్నో అవగుణాలతో జీవితాన్ని సాగి స్తున్నాం. వాటిముందు ఈ వైరస్ అంత నీచ మైందేమీ కాదు. దేశ స్వాతంత్య్ర సమరం తర్వాత మనలో సమైక్యతాభావం తిరిగి ఇన్నా ళ్లకు కనిపిస్తోంది. కాసేపు రాజకీయాలను పక్క నపెట్టి మానవసేవవైపు దృష్టి సారిస్తే పుణ్యం పురుషార్థం బయట ఏ స్వార్థమూ లేనివారు రకరకాల త్యాగాలు చేస్తున్నారు. సేవలు అంది స్తున్నారు. అంతా తమవంతు సాయం అందిం చండి. జీవితాన్ని ధన్యం చేసుకోండి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పత్రికలపైనే విశ్వసనీయత
సాక్షి, అమరావతి: విశ్వసనీయ సమాచారం అందించడంలో పత్రికలు మరోసారి పాఠకుల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు కంటే ప్రస్తుతం పాఠకులు పత్రికలను ఎక్కువగా చదువుతున్నారని ప్రముఖ మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ అవాన్స్ ఫీల్డ్ అండ్ బ్రాండ్ సొల్యూషన్స్ సర్వేలో వెల్లడైంది. కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో అసత్య, నిరాధార వార్తలు విపరీతంగా ప్రచారం చేస్తుండటం గందరగోళానికి దారితీస్తోంది. దాంతో ప్రజలు వాస్తవాల కోసం పత్రికలపైనే ఆధారపడుతున్నారని.. పత్రికలతో పాఠకుల బంధం బలోపేతమవుతోందని ఆ సర్వే స్పష్టం చేసింది. ఆ సర్వేలో తేలిన కీలక అంశాలివీ ► లాక్‌డౌన్‌కు ముందు సగటు పాఠకుడు పత్రికను రోజుకు 38 నిమిషాల పాటు చదివేవారు. ప్రస్తుతం సగటు పాఠకుడు రోజుకు గంటపాటు చదువుతున్నాడు. ► మొత్తం పాఠకుల్లో లాక్‌డౌన్‌కు ముందు 16 శాతం మంది గంట సమయం కంటే ఎక్కువసేపు పత్రిక చదివేవారు. ప్రస్తుతం 38 శాతం మంది గంట సమయం కంటే ఎక్కువసేపు పత్రిక చదువుతున్నారు. ► ప్రస్తుతం అరగంట కంటే ఎక్కువ సమయం పత్రిక చదువుతున్న పాఠకులు 72 శాతం మంది. లాక్‌డౌన్‌కు ముందు కేవలం ఇది 42 శాతమే. ► ప్రస్తుతం 15 నిమిషాల కంటే తక్కువ సేపు పత్రిక చదువుతున్న పాఠకులు కేవలం 3 శాతమే. లాక్‌డౌన్‌కు ముందు 14 శాతం మంది ఉండేవారు. ► మొత్తం పాఠకుల్లో లాక్డౌన్ రోజుల్లో పత్రికను ఒకటి కంటే ఎక్కువసార్లు చదువుతున్నవారు 42 శాతం మంది. -
దినపత్రికలే ‘దిక్సూచి’
సాక్షి, హైదరాబాద్: ఆధునిక యుగంలో సమాచార సేకరణకు ఎన్నో మార్గాలు.. చేతిలో ఫోన్.. ఆ ఫోన్‌కు ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో సమాచారం కళ్ల ముందుంటుంది. ఈజీగా సమాచారం తెలుసుకోవచ్చు. అంత వరకు ఓకే. అయితే మామూలు సమయాల్లో సమాచారం ఎలా వచ్చినా సరే.. కరోనా లాంటి కీలక సమయంలో వచ్చే సమాచారం చాలా ముఖ్యం. అది సమగ్రంగా ఉండాలి. దానికి విశ్వసనీయత ఉండాలి. ఈ రెండు ఉండాలంటే ఫోన్, ఇంటర్నెట్తో పాటు చేతిలో దినపత్రిక కూడా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే దేశంలో లాక్డౌన్ అమలు చేయడానికి ముందు కంటే ఆ తర్వాత దేశవ్యాప్తంగా పత్రికల పఠనా సమయం పెరిగిందని ఓ సర్వేలో వెల్లడైంది. ఎవాన్స్ ఫీల్డ్ అండ్ బ్రాండ్ సొల్యూషన్స్ అనే సంస్థ నిర్వహించిన ఈ టెలిఫోనిక్ సర్వేలో పత్రికలకు, పాఠకులకు మధ్య బంధం బలపడిందని తేలింది. దినపత్రిక దేశంలో నిత్యావసరమని ప్రజలు భావిస్తున్నారని, అవసరమైన, విశ్వసనీయ సమాచారాన్ని మన ముంగిటకు పొద్దున్నే మోసుకు వచ్చేది పత్రికలేనని మరోమారు నిర్ధారణ అయింది. ఈ సర్వేలో వెల్లడైన ముఖ్యాంశాలివే... –లాక్డౌన్ కంటే ముందు 100 మంది పాఠకుల్లో రోజుకు 30 నిమిషాల కంటే తక్కువ పత్రిక చదివే వారు 58 అయితే... ఇప్పుడు ఆ సంఖ్య 28కి తగ్గింది. అంటే సగటున మరో 30 మంది పాఠకులు 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పత్రికలు చదివే జాబితాలో చేరారన్నమాట. –అదే 30 నిమిషాల కన్నా ఎక్కువ సేపు పత్రిక చదివే అలవాటున్న వారు 100 మంది పాఠకుల్లో 42 మంది కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 72కి చేరింది. –ఇక గంట కన్నా పత్రికలతో ఎక్కువసేపు గడుపుతున్న వారి సంఖ్య కూడా పెరిగిందని సర్వేలో తేలింది. లాక్డౌన్ కంటే ముందు గంట కన్నా ఎక్కువ సేపు పత్రికలు చదివేవారి శాతం 16 కాగా.. ఇప్పుడు 38కి పెరిగింది. –గతంలో 15 నిమిషాల కంటే తక్కువ సమయం పత్రికలు చదివే అలవాటున్నవారు 14 శాతం కాగా ఇప్పుడు అది కేవలం 3 శాతానికి తగ్గింది. అంటే ప్రతి 100 మంది పాఠకుల్లో 97 మంది రోజూ పావు గంట కంటే ఎక్కువసేపు పత్రికలు చదువుతున్నారన్న మాట. –సగటున పత్రికా పఠనా సమయం 38 నిమిషాల నుంచి 60 నిమిషాలకు పెరిగిందని ఈ సర్వేలో తేలింది. –చివరిగా రోజుకు ఒక్కసారి మాత్రమే పత్రికలు చదువుతున్న వారు 58 శాతం మంది కాగా, 42 శాతం మంది ఒకటి కన్నా ఎక్కువ సార్లు చదువుతున్నారని ఈ సర్వే తేల్చింది. అందుకే పొద్దున్నే చేతిలో చాయ్‌తో పాటు ’సాక్షి’పత్రిక ఉంటే ఆ కిక్కే వేరప్పా..! -
వార్తా పత్రికలు శుభ్రమైనవి.. వైరస్ ఉండదు
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. వార్తా పత్రిక, మ్యాగజైన్, ప్రింట్ చేసిన లేఖ, ప్యాకేజీల ద్వారా వ్యాపిస్తున్నట్లు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారమూ లేదని ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ (ఐఎన్‌ఎంఏ) ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, సీఈవో ఎర్ల్‌జే విల్కిన్సన్ స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డాక్టర్లు, శాస్త్రవేత్తలందరి అభిప్రాయమూ ఇదేనని ఆయన తెలిపారు. కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న అపోహ చాలా చోట్ల కనిపిస్తోందని, సైన్స్ పరంగా ఇందులో వాస్తవాలేమిటో తెలియజేయాల్సిందిగా కొంతకాలంగా ఐఎన్‌ఎంఏను కోరుతున్నారని ఆయన చెప్పారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు జరిపిన పరిశోధనలు కూడా వార్తా పత్రికల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఇప్పటికే స్పష్టంచేశాయని ఆయన తెలిపారు. కరోనా కేసులున్న ఏ ప్రాంతంలోనైనా వార్తా పత్రికలు, మ్యాగజైన్లతో కూడిన ప్యాకేజీలను తీసుకోవడం, చదవడం వల్ల ఎలాంటి ముప్పూ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనా వైరస్ సోకిన వ్యక్తి వార్తా పత్రికలను ముట్టుకున్నా అతడి నుంచి కాగితంపైకి వైరస్ సోకదని, వార్తా పత్రికల రవాణా ద్వారా కూడా సమస్య ఏమీ ఉండదని స్పష్టంగా తెలిపింది. (డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్) బీబీసీ మాట కూడా ఇదే.. ఈ నెల 10వ తేదీ బీబీసీ రేడియో జాన్ ఇన్నెస్ సెంటర్లోని వైరాలజిస్ట్ జార్జ్ లొమోనోస్సాఫ్‌తో ఒక ఇంటర్వ్యూ ప్రసారం చేస్తూ.. వార్తా పత్రికలు చాలా శుభ్రమైనవి అని స్పష్టం చేశారు. ప్రింటింగ్ కోసం వాడే సిరా, ప్రింటింగ్ జరిగే పద్ధతి తదితర కారణాల వల్ల వార్తా పత్రికల ఉపరితలంపై వైరస్ ఉండే అవకాశాలు అత్యల్పమని ఆయన తెలిపారు. వివిధ ఉపరితలాలపై కరోనా వైరస్ (సార్స్–సీఓవీ2) ఎంత కాలం ఉంటుందన్నదానిపై ఇటీవలే ఒక పరిశోధన జరిగిందని, దాని ప్రకారం వార్తా పత్రికలపై వైరస్ ఉండే అవకాశమే లేదని స్పష్టమైందని ఐఎన్‌ఎంఏ సీఈవో ఎర్ల్ జే విల్కిన్సన్ తెలిపారు. మొత్తమ్మీద చూస్తే వార్తా పత్రికల ద్వారా కరోనా వ్యాపించిన సంఘటన ఇప్పటివరకూ ఒక్కటి కూడా నమోదు కాలేదు. వాడే సిరా, ప్రింటింగ్ పద్ధతుల కారణంగా మిగిలిన వాటికంటే వార్తా పత్రికలు ఎంతో శుభ్రంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వార్తా పత్రికల ప్రచురణ కర్తలు ప్రింటింగ్, పంపిణీ జరిగే చోట, న్యూస్స్టాండ్లలో, ఇళ్లకు చేరే సమయంలోనూ పలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారని ఎర్ల్ జే. విల్కిన్సన్ తెలిపారు. -
వార్తా పత్రికలతో కోవిడ్ సోకదు
కోవిడ్‌తో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఇదే సమయంలో సామాజిక మాధ్యమాలు నకిలీ వార్తలతో నిండిపోతున్నాయి. వార్తా పత్రికలను తాకితే కోవిడ్ వస్తుందంటూ ఓ నకిలీ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తదితర అంశాలను ప్రజల్లోకి వెళ్లాలంటే వార్తా పత్రికలు తప్పనిసరి. సమాజంలో ఉన్న అన్ని రకాల తారతమ్యాలను పరిగణనలోకి తీసుకున్నా వార్తా పత్రికలు కచ్చితంగా సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన తరుణమిది. ప్రధాని కూడా దీన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వార్తా పత్రికలను ముట్టుకుంటే కోవిడ్ సోకుతుందన్న నకిలీ వార్త వ్యాప్తిలోకి రావడం విచారించదగ్గ విషయం. వాస్తవానికి పత్రికలతో వైరస్ వ్యాప్తి చెందుతుందనేందుకు శాస్త్రీయ ఆధారమేదీ లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మాట.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌తో నిర్వహించిన అధ్యయనం ప్రకారం కోవిడ్ వేర్వేరు ఉపరితలాలపై వేర్వేరు కాలం మనుగడ సాగించింది. గత వారం న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం కార్డ్‌బోర్డు, రాగి వంటి వాటిపై వైరస్ తక్కువ కాలం బతుకుతుంది. కార్డ్‌బోర్డులో సూక్ష్మస్థాయి కన్నాలు ఉండటం ఇందుకు ఓ కారణం. ఈ వైరస్లు నున్నటి, కన్నాలులేని ఉపరితలాలపై ఎక్కువకాలం జీవిస్తాయని కూడా పరిశోధన స్పష్టం చేసింది. గాలి సోకినప్పుడు ఈ వైరస్ తీవ్రత తగ్గుతూ పోతుందని, ప్రతి 66 నిమిషాలకు వైరస్ సామర్థ్యం సగం తగ్గుతుందని ఈ పరిశోధన ద్వారా తెలిసింది. కార్డ్ బోర్డు, కాగితం నిర్మాణానికి సారూప్యత ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంది..? వార్తా పత్రికలను ముట్టుకుంటే కోవిడ్ వ్యాపిస్తుందనడంలో వాస్తవం ఏమాత్రమూ లేదు. కోవిడ్ కేసులు ఉన్న ఏ ప్రాంతంలోనైనా వార్తా పత్రికలను తీసుకోవడం, చదవడం వల్ల ఎలాంటి ముప్పు లేదు. కోవిడ్ బారిన పడ్డ వ్యక్తి కాగితాల ద్వారా వైరస్‌ను వ్యాప్తి చేయలేరని.. రకరకాల పరిస్థితులు, వాతావరణాల నుంచి వచ్చినా ఇబ్బందేమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రశ్నోత్తరాల కాలమ్‌లో స్పష్టంగా తెలిపింది. అగ్రరాజ్యం అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కూడా వార్తా పత్రికలు అందివ్వడం, అందుకోవడం వంటి చర్యల వల్ల కోవిడ్ వ్యాప్తి చెందదని తెలిపింది. సూర్య కిరణాలతో శక్తివిహీనం! వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం ఈ వైరస్ సూర్యుడి నుంచి వెలువడే పరారుణ కాంతి కిరణాలకూ శక్తిని కోల్పోతుంది. ఒకవేళ వైరస్ ఉన్న వ్యక్తి నుంచి కొంత వైరస్ కాగితంపైకి చేరినా వాటితో సమస్య ఉత్పన్నం కాదని సాంక్రమిక వ్యాధుల నిపుణుడు గారీ విటేకర్ తెలిపారు. శరీరపు సహజ రోగ నిరోధక వ్యవస్థను ఛేదించి లోనికి ప్రవేశించాలంటే భారీగా వైరస్లు కావాల్సి ఉంటుందని వివరించారు. -
ట్రంప్ ‘చందాలు’ బంద్
వాషింగ్టన్: అమెరికాలోని కొన్ని వార్తా పత్రికలు అసత్య కథనాలు రాస్తాయని మండిపడే అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌజ్‌కు వచ్చే వార్తా పత్రికల్లో కొన్నింటి చందాలను రద్దు చేశారు. ఆయన ఆగ్రహానికి గురైన దినపత్రికల్లో వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ఉన్నాయి. ఈ పత్రికల చందాలను మిగతా ప్రభుత్వ సంస్థలు కూడా రద్దు చేసుకోవాలని ట్రంప్ సూచించారు. ఈ మేరకు వైట్‌హౌజ్ ప్రతినిధులు ప్రకటించారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అన్ని ప్రభుత్వ సంస్థలు ఇలా చేస్తే చాలా ఆదా అవుతుందని వైట్‌హౌజ్ పేర్కొంది. -
ఇక పాఠకుల వ్యాఖ్యలకు ప్రాధాన్యత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న పత్రికలు ఓపక్క న్యూప్రింట్ ధరలు పెరిగిపోతుండడం, మరో పక్క రెవెన్యూ తగ్గిపోతుండడం వల్ల మనుగడ సాగించేందుకు కొత్త దారులు వెతుకుతున్నాయి. ఇప్పటికే డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టిన ఈ పత్రికలు డిజిటల్ మీడియా ద్వారా రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ‘హెరాల్డ్ సన్’ ట్యాబ్‌లైడ్‌ను ప్రచురిస్తున్న మెల్బోర్న్లోని ‘న్యూస్ కార్పోరేషన్ ఆస్ట్రేలియా’ తమ రిపోర్టర్లను ప్రోత్సహించడం ద్వారా ‘పేజ్ వ్యూస్’ను పెంచుకునే పథకానికి ఈ వారం శ్రీకారం చుట్టింది. పేజ్‌వ్యూస్‌ను బట్టి రిపోర్టర్ల కథనాలకు ఒక్కో కథనానికి పది డాలర్ల నుంచి 50 డాలర్ల వరకు రోజువారి బోనస్‌ను ప్రకటించింది. వారానికి కొన్ని వందల డాలర్లను సంపాదించుకునే అవకాశం దొరికిందని ‘హెరాల్డ్ సన్’ రిపోర్టర్లు మురిసి పోతున్నారు. క్రైమ్, సెక్స్, ఎంటర్టైన్మెంట్ వార్తలకే ‘పేజ్ వ్యూస్’ ఎక్కువ వస్తాయికనుక, అలాంటి వార్తల కోసమే రిపోర్టర్లు పోటీ పడాల్సి వస్తుందని, పర్యవసనంగా రాజకీయ వార్తలకు ఆదరణ తగ్గిపోతుందని సీనియర్ రిపోర్టర్లు వాపోతున్నారు. ఆస్ట్రేలియా మొత్తంలో 150 వేర్వేరు పత్రికలు కలిగిన ఈ సంస్థకు ఈ ఏడాది ఏడు శాతం రెవెన్యూ తగ్గింది. అదే సమయంలో డిజిటల్ సబ్క్రైబర్స్ 20.5 శాతం పెరిగారు. అంటే వారు 4,09,000 నుంచి 4,93,200లకు పెరిగారు. అయినప్పటికీ ముద్రణా మీడియాలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోలేకపోతోంది. అందుకని జర్నలిస్టులకు ఉద్వాసన పలుకుతోంది. ఈసారి మరో యాభై మంది జర్నలిస్టులకు ఉద్వాసన చెబుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. డిజిటల్ నైపుణ్యం లేనివారినే పంపిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మైఖేల్ మిల్లర్ ప్రకటించారు. ‘పేజ్ వ్యూస్’ పెరిగినంత మాత్రాన డిజిటల్ మీడియాకు యాడ్ రెవెన్యూ పెరగదని, డిజిటల్‌కు సంబంధించి యాడ్ వ్యవస్థ సంక్లిష్టమైనదని, నెంబర్లకన్నా ఉన్నత ప్రమాణాలుగల వార్తలు, ఉన్నత విలువలు కలిగిన రీడర్ల రద్దీ అవసరమని సర్చ్ ఇంజన్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ పాఠకులు తమ అభిప్రాయాలను వార్తా కథనం రాసిన రిపోర్టర్‌తో పంచుకునే అవకాశం ఉండాలని వారు అభిప్రాయ పడ్డారు. అన్నింటికన్నా ముఖ్యం స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం. ఇలాంటి అభిప్రాయాల నేపథ్యంలో పాఠకులు, వార్తా సంస్థలకు మధ్య మరింత అనుబంధాన్ని పెంచేందుకు అవసరమైన టూల్స్‌ను తయారు చేయాల్సిందిగా ‘ఫైర్ఫాక్స్ బ్రౌజర్’ను అభివృద్ధి చేసిన ‘మొజిల్లా’ డెవలపర్‌ను అమెరికాలోని ‘ది న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్’ పత్రికల యాజమాన్యాలు ఆశ్రయించాయి. దీన్ని ‘కోరల్ ప్రాజెక్ట్’గా అవి వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ దాత ‘నైట్ ఫౌండేషన్’ 40 లక్షల డాలర్లు చెల్లించారు. పాఠకులు వార్తలపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్ కింద ‘టాక్’ అనే ఫ్లాట్ఫారమ్ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి లోకల్ జర్నలిజం (స్థానిక ప్రజలకు సంబంధించిన వార్తా కథనాలు) అంతంత మాత్రంగానే ఉందని, దాన్ని విస్తరించడం ద్వారా స్థానికంగా యాడ్స్‌ను ఆకర్షించవచ్చని, తద్వారా రెవెన్యూను పెంచుకునే అవకాశం ఉందని కూడా సర్చ్ ఇంజన్ విశ్లేషకులు సూచిస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పాఠకులకు దగ్గరవడమే కాకుండా, స్థానిక వార్తా కథనాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. -
ఈ పేపరు.. ఆ పేపరు
తెల్లారే ఇంటి ముందు మళ్లీ చప్పుడైంది! రోజూ అయ్యే చప్పుడు కాదు అది! ఎలక్షన్ నోటి ఫికేషన్ వచ్చినప్పట్నుంచీ అవుతున్న చప్పుడు. తలుపు తెరిచి చూశాడు ఓటరు. ఎవరో ఇద్దరు.. కళ్లకు గంతలున్నాయి.. కాళ్లకు చెడ్డీలున్నాయి.. గళ్ల ‘టి’ షర్ట్లున్నాయి.. వెనక్కి తిరిగి చూస్తూ పరుగెడుతున్నారు! ఇద్దరి టీ షర్ట్స్ వెనుక ‘ఆర్’ అనే అక్షరాలున్నాయి. ఆర్ అంటే ఏంటో అనుకున్నాడు ఓటరు. ‘చూశాడా మనల్ని’ అంటున్నాడు ఒక ఆర్. ‘చూసినట్లే ఉన్నాడు’ అన్నాడు ఇంకో ఆర్. ఓటరుకు డౌట్ కొట్టింది. చెడ్డీ గ్యాంగ్ చీకట్లో కదా చోరీకి వస్తుంది.. అనుకున్నాడు. ‘మరైతే వీళ్లెవరూ తెల్లారే..’ అనుకున్నాడు. చప్పుడు ఎందుకైందా అని చూశాడు ఓటరు. వాకిట్లో ‘ఈ’పేపర్, ‘ఆ’పేపర్ పడి ఉన్నాయి. ఓటరుకు రోజూ వచ్చే పేపర్.. ముందే వచ్చేసింది. మరి ‘ఈ’ పేపర్, ‘ఆ’ పేపర్ ఎవరు వేసినట్లు? ఎందుకు వేసినట్లు? ఇది ఆ ఇద్దరు దొంగ డాగ్‌ల పనే అని ఓటరుకు అర్థమైంది. అడక్కుండానే పేపర్ వేసి వెళ్లారంటే అబద్ధాలేవో రాసి పంచుతున్నారనే! ‘ఈ’పేపరు, ‘ఆ’పేపరూ ముందేసుకున్నాడు ఓటరు. ఏది ఏ పేపరో అర్థం కాలేదు. పారిపోయిన ఆ ఇద్దరూ ఒకేలా ఉన్నారు. వాళ్లు పడేసిపోయిన రెండు పేపర్లూ ఒకేలా ఉన్నాయి! ‘దొంగలు అంతేకదా ఒకేలా ఉంటారు’ అనుకున్నాడు ఓటరు. రెండు పేపర్లలో టాప్‌లో జగన్మోహన్రెడ్డి ఫొటోలున్నాయి! ఆశ్చర్యపోయాడు ఓటరు. జగన్ పైకి రావడం ఓర్వలేని పేపర్లు, జగన్‌పై అబద్ధాలు మాత్రమే రాసే పేపర్లు, జగన్‌కి అంతా జై కొడుతుంటే బాబు కొంప మునుగుతుందేమోనని కంగారు పడిపోయి పాచి అబద్ధాలనే మళ్లీ పోగేసి ప్రింట్ చేసే పేపర్లు, చంద్రబాబు చెప్పకుండా, చంద్రబాబుకు చెప్పకుండా చిన్న కామా, ఫుల్స్టాప్ పెట్టని పేపర్లు.. జగన్ ఫొటో వెయ్యడం ఏంటా అని చూశాడు ఓటరు. ఫొటోలో జగన్ ఎంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. ఓటరుకు భరోసా ఇస్తున్నట్లున్నాడు. ‘నేనున్నాను’ అన్నట్లున్నాడు. ‘నేనొస్తున్నాను’ అన్నట్లు ఉన్నాడు. ఆయన ఫొటో పెట్టి, చుట్టూ ఏవో రాశాయి ‘ఈ’పేపరు, ‘ఆ’ పేపరు. బాబు నిన్ననే మళ్లీ ఒక కొండను తవ్వాడు అని ‘ఈ’పేపర్ రాసింది! ‘అవునవును ఆయన కొండను తవ్వుతున్నప్పుడు మేమూ పక్కనే ఉన్నాం’ అని ‘ఆ’ పేపర్ రాసింది! చంద్రబాబు కొండను తవ్వి పాత పేపర్లు పట్టాడని ఓటరు కనిపెట్టేశాడు. కొండను తవ్వి పాత పేపర్లు పట్టింది చంద్రబాబు అయితే చంద్రబాబు ఫొటో పెట్టాలి గానీ, జగన్ ఫొటో పెట్టారేమిటి అని ఆలోచించాడు ఓటరు. జగన్ ఫొటో పెడితే కానీ చంద్రబాబు గురించి ఎవరూ చదవరని ‘ఈ’పేపర్, ‘ఆ’పేపర్ అలా చేశాయని అర్థం చేసుకున్నాడు. ‘ఆ’ పేపరైతే పాపం, జగన్ పేరుకున్న ఇమేజ్‌నే కాదు, జగన్ ఫొటోకున్న ఇమేజ్‌ని కూడా డేమేజ్ చేయడానికి ట్రై చేసింది. జగన్ ఫొటోలో రంగులు మార్చితే జగన్‌కు ఓటేసేవాళ్లు, జగన్‌కు ఓటేయాలనుకున్న వాళ్లు మనసు మార్చుకుంటారని ఆశ పడినట్లుంది. ‘ఈ’ పేపర్నీ, ‘ఆ’ పేపర్ని విసిరికొట్టాడు ఓటరు. పెద్ద కర్రొకటి తీసుకుని వాకిట్లో సిద్ధంగా పెట్టుకున్నాడు. దొంగ డాగ్స్ రేపు ఉదయాన్నే మళ్లీ వస్తాయి కదా.. అప్పుడు చెబుతాను అనుకున్నాడు.–మాధవ్ -
పేపర్ చదవను.. టీవీ చూడను !
కర్ణాటక , యశవంతపుర : పత్రికలు, టీవీలపై తనకు నమ్మకం పోయిందని, దీంతో పదేళ్లుగా తాను టీవీ, పత్రికలను చూడటం లేదని కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే మీడియాపై విరుచుకు పడ్డారు. బుధవారం ఆయన కారవార జిల్లా అంకోల తాలూకా అలగెరెలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మీరు ఆరోగ్యంగా ఉండలాంటే టీవీలను చూడటం మానుకోవాలన్నారు. నెల రోజుల క్రితం ఉద్యోగ మేళాలో ఆపరేషన్ కమలం స్పందించాలని కోరిన విలేకర్లను కేంద్రమంత్రి తన రక్షణ సిబ్బందితో నెట్టివేయించారు. దీంతో మీడియా కేంద్రమంత్రి సమావేశాన్ని అప్పట్లో బహిష్కరించింది. దీంతో అప్పటి నుంచి ఆయన మీడియాపై అక్కసు పెంచుకున్నారు. వారం రోజుల క్రితం అంకోలలో పాస్‌పోర్ట్ ఆఫీసు ప్రారంభోత్సవానికి రాగా మీడియా ఆయనను పట్టించుకోలేదు. దీంతో ఆయన మీడియాపై కోపం పెంచుకుని ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది. -
ఆ పత్రికలపై ఫిర్యాదు: రేవంత్‌రెడ్డి
నమస్తే తెలంగాణ పత్రిక, టీ–న్యూస్, టీవీ– 9, 10 టీవీలు కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ను మాత్రమే చూపిస్తున్నాయని, ఇతర పార్టీల నుంచి జాతీయ నాయకులు వచ్చినా కనీసం చూపించడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఈఓ రజత్‌కుమార్‌ను కలి సిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడా రు. అధికార పార్టీకి మాత్రమే ప్రచారం కల్పి స్తున్న ప్రసార మాధ్యమాలపై నిషేధం విధించాలని, వాటిని వార్త చానళ్లుగా గుర్తించరాదని ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్ బృం దానికి సైతం ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రగతిభవన్‌ను టీఆర్ఎస్ అసమ్మతి నేతలను బుజ్జ గించడానికి కేటీఆర్ వాడుకుంటున్నారన్నారు. -
ఆన్లైన్ ద్వారానే పీసీఐకి ఫీజు చెల్లించాలి
సాక్షి, హైదరాబాద్ : ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కు వార్తాపత్రికలు, ఏజెన్సీలు చెల్లించే మొత్తాన్ని ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని పీసీఐ సూచించింది. ఆ మొత్తాన్ని Sabpaisa& Allbank Qwikcollect లింకు ద్వారా అలహాబాద్ బ్యాంకు అకౌంటు నంబర్‌కు చెల్లించాలని పేర్కొంది. ఆన్లైన్ లింకు, ఇతర చెల్లింపు వివరాలను http://presscouncil.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి వార్తా పత్రికకు శాశ్వత యూనిక్ ఐడీని కేటాయిస్తామని, దాని ద్వారా చెల్లింపులు జరపాలని పేర్కొంది. ఆఫ్‌లైన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలను వెంటనే నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. -
అది పత్రాలు ఇచ్చిన ప్రేరణ
♦ జాతిహితం తమ కార్యాలయానికి తాళాలు వేయించిన జడ్జికి వ్యతిరేకంగా వచ్చిన వార్తను ప్రచురించకుండా ఒక పత్రిక ఎలా ఉండగలదు? దేశంలో ఉన్న ప్రతి ప్రముఖ న్యాయవాదిని మేం సంప్రదించాం. అంతా చెప్పింది ఒక్కటే– మీరు ఆ వార్తను ప్రచురించలేరు. ఆ వార్త చూస్తే ప్రతీకారంతో ప్రచురించినట్టు కనిపిస్తుందని, కాబట్టి కోర్టు ధిక్కారమవుతుందని చెప్పారు. అప్పుడే బెంజిమన్ బ్రాడ్లీ రాసిన ‘ఏ గుడ్ లైఫ్’ పుస్తకం చదివాను. అందులో పెంటగాన్ పత్రాల ప్రస్తావన దగ్గర నా చూపు ఆగింది. ఈ వారం జరిగిన రాజకీయ పరిణామాలతో పాటు, గమనంలోకి తీసుకోవలసిన మరొక అంశం కూడా ఉంది. అది ‘ది పోస్ట్’ సినిమా. ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక, ఆ పత్రికకు పనిచేసిన మహోన్నత సంపాదయ ద్వయం బెంజి మన్ బ్రాడ్లీ, కేథరీన్ గ్రాహం చరిత్ర సృష్టించిన విధం ఎలాంటిదో ఆ చిత్రం చెప్పింది. అలాగే సాహసోపేతమైన పత్రికా రచనకు వారు ఎలాంటి ప్రమాణాలను నెలకొల్పారో కూడా అందులో చిత్రించారు. నిజానికి ఈ గాథంతా ఇంతకు ముందు పుస్తకాలలో ప్రస్తావనకు వచ్చిందే (గ్రాహం, బ్రాడ్లీ అత్యున్నత ప్రమాణాలతో వెలువరించిన వారి ఆత్మకథలలో, ‘ఆల్ ది ప్రెసిడెంట్స్ మెన్’ పుస్తకంలో కూడా ఉంది). వాటర్‌గేట్, పెంటగాన్ పత్రాలు సాహసోపేతమైన పత్రికా రచనలో అనితర సాధ్యమైన ప్రమాణాలను ప్రవేశపెట్టాయి. అది జరిగి చెప్పుకోదగినంత కాలం గడచిపోయింది కాబట్టి, ఇప్పుడు నేనొక విషయం చెప్పవచ్చు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో మేం పనిచేస్తున్నప్పుడే 2006 శీతాకాలంలో ఆ ఘటన జరిగింది. మేం పెంటగాన్ పత్రాలు ఇచ్చిన ప్రేరణతో ఆనాడు సంప్రదాయ విరుద్ధంగా చేసిన పని గురించి ఇప్పుడు వివరిస్తాను. ఇంకా చెప్పాలంటే ఎలాంటి శషభిషలు లేకుండా ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘ది హిందు’ పత్రికల మధ్య ఏం జరిగిందో చెబుతాను. ఈ రెండు పత్రికలకీ మధ్య ప్రధాన మార్కెట్లకు సంబంధించి ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ ఆలోచనలలో, తాత్వికతలలో మాత్రం ఆగ్రహం ప్రదర్శించుకునేవి. ఆర్థిక, వ్యూహాత్మక విధానాలకు సంబంధించి ఆ వైరం ఎక్కువగా ఉండేది. కానీ ఈ పోటీని ‘ది పోస్ట్’, ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికల మధ్య వాతావరణంతో పోల్చడం అతి అనిపిస్తుంది, కాబట్టి ఆ జోలికి వెళ్లవద్దు. అమెరికా తరహా ఉదారవాదంతో ఉండే ది పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వలె కాకుండా; ఎక్స్‌ప్రెస్, హిందు పత్రికల తాత్వికత, సిద్ధాంతాలు వేర్వేరు కాబట్టి, సంపాదకీయంలో కనిపించే ప్రాపంచిక దృక్పథం కూడా పరస్పరం భిన్నమైనదన్న సంగతి దగ్గర ఆగిపోదాం. ఎన్.రామ్ సంపాదకత్వంలో ఉండగా వ్యూహా త్మక, ఆర్థికాంశాలలో వామపక్ష భావజాలం వైపు మొగ్గేది. మేం మితవాద వర్గం. కానీ సామాజికంగా ఇరువురం ఉదారవాదులమే. ఇప్పుడు తెర లేపబోతున్న నాటకంలో అంతర్లీనంగా ఉన్న విషయం బోధ పడాలంటే పైన చెప్పిన సంగతులు అర్థం కావడం అవసరం. ఇందులో కనిపించే ఘనత అంతా రామ్, ది హిందులకే దక్కుతుంది. ఇంకొక విషయాన్ని ప్రస్తావించాలి. ఈ వారం సంచలన వార్తలకి కేంద్రంగా నిలిచిన ఓ పెద్ద వ్యవస్థ కూడా ఈ కథలో ఉంది. అదే సుప్రీంకోర్టు కోలీజియం. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పరిశోధనాత్మక జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న రీతు సెరీన్ 2006 నవంబర్ ప్రాంతంలో మొదటి పేజీలో రెండు చిన్న చిన్న వార్తా కథనాలను ప్రచురించింది. నిజానికి ఆమె మొత్తం భారతీయ మీడియాలోనే పరిశోధనాత్మక జర్నలిస్టుగా పేరు పొందింది. అప్పుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ విజేందర్ జైన్‌ను పంజాబ్–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంపడానికి నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నిరాకరించారు. కొందరు కొలీజియం సభ్యులకు ఉన్న అభ్యంతరాల కారణంగానే కలాం ఆ పదోన్నతికి నిరాకరించారన్నది ఒక వార్తా కథనం. ఈ అంశం మీద సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైకే సభర్వాల్‌ను సంప్రతించవలసిందిగా ప్రతిసారి నాటి ప్రధాని మన్మోహన్సింగ్ రాష్ట్రపతిని కోరేవారు. ఆయన ఈ నియామకం గురించి పరిశీలించాలని గట్టిగా భావించారు. కలాం మాత్రం తన వైఖరిని సడలించలేదు. ఈ నియామకానికి సంబంధించిన ఫైలును మూడోసారి కూడా ఆయన తిప్పి పంపించారు. ఈసారి మాత్రం చరిత్రలో ఇంతవరకు ఏ అధ్యక్షుడు చేపట్టని చర్యను తీసుకు న్నారు. ఆ తరువాత కూడా ఎవరూ అలాంటి చర్య చేపట్టినట్టు చెప్పలేను (http://www.thehindu.com/todays-paper/tp-national/President-Ka lams-file-noting-on-Vijender-Jain-appointment/article15741494. తన అభ్యంతరాలను ఉటంకిస్తూ క్లుప్తంగా రెండు పేరాలు రాశారు. తను సంప్రతించినప్పుడు ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు ఈ నియామకం మీద సందేహాలు వ్యక్తం చేశారని కలాం చెప్పారు. అప్పటికీ ఈ నియామకం జరగాలని పట్టుపడితే కొలీజియం సభ్యుల సంఖ్య, మరో న్యాయమూర్తి రాకతో పెరుగుతుంది. ఆయన ఈ విధానానికి వ్యతిరేకి. దీనికి సంబంధించి కలాం రాసిన నోట్‌ను పట్టుకుని రీతు ‘స్కూప్’ను కనుగొన్న ఉత్కంఠతో న్యూస్‌రూమ్‌లోకి వచ్చింది. దానిని వార్తగా రూపొందించే క్రమంలో జరిగే హడావిడి అంతా జరిగింది. సంబంధిత ఉన్నత కార్యాలయాల వారు ప్రశ్నలు సంధించారు. ఇక ప్రచురించడానికి అంతా సిద్ధమవుతుండగా అనుకోని అవాంతరం. ఢిల్లీవాసులకు గుర్తుండే ఉంటుంది. హైకోర్టు కమిటీ ఇచ్చిన ఆదేశంతో నగరంలో పెద్ద ఎత్తున అక్రమ కట్టడాల కూల్చివేత, చట్ట విరుద్ధంగా కడుతున్న వాటిని ఆపించడం వంటివి జరిగిన కాలమది. ఇలాంటి అధికారం ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు ధర్మాసనం జస్టిస్ జైన్ నాయకత్వంలో ఏర్పాటయినదే. నగరానికి దక్షిణ దిశగా ఉన్న రెండు భవనాలలో మా కార్యాలయాలు ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని కుతుబ్ ఇన్స్టిట్యూషనల్ ఏరియా అంటారు. అక్కడి భూములను ధార్మిక సంస్థలకు, సంస్థలకు చౌక ధరలకు కేటాయించారు. కానీ ఎక్కువ మంది వాటిని అమ్ముకున్నారు. లేకపోతే అనుమతులను అతిక్రమించి భవంతులు కట్టారు. లేదా అద్దెలకు ఇచ్చుకున్నారు. అదేశాలను అమలు చేయడానికి కోర్టు అధికారులు నవంబర్ 18 మధ్యాహ్నం వచ్చారు. ఏడు భవనాలకు సీలు వేశారు. ఈ భవనాల మీద ఆధిపత్యం చేతులు మారింది. మరో రెండు భవనాలకు కూడా తరువాత సీలు వేశారు. అందులో మా కార్యాలయాలు ఉన్నాయి. మేం నిర్వాసితులమయ్యాం. ఇంతకంటే దారుణం ఏమిటంటే, కలాం నోట్‌తో వార్తను ప్రచురించలేక పోతున్నామన్న వాస్తవం. తమ కార్యాలయానికి తాళాలు వేయించిన జడ్జికి వ్యతిరేకంగా వచ్చిన వార్తను ప్రచురించకుండా ఒక పత్రిక ఎలా ఉండగలదు? దేశంలో ఉన్న ప్రతి ప్రముఖ న్యాయవాదిని మేం సంప్రతించాం. అంతా చెప్పింది ఒక్కటే– మీరు ఆ వార్తను ప్రచురించ లేరు. ఆ వార్త చూస్తే ప్రతీకారంతో ప్రచురించినట్టు కనిపిస్తుందని, కాబట్టి కోర్టు ధిక్కారమవుతుందని చెప్పారు. అప్పుడే బెంజిమన్ బ్రాడ్లీ పుస్తకం ‘ఏ గుడ్ లైఫ్’పుస్తకం చదివాను. అందులో పెంటగాన్ పత్రాల ప్రస్తావన దగ్గర నా చూపు ఆగింది. ఆ తరువాత ఆ వార్తా కథనం ప్రచురించడానికి ఒక మార్గం ఉందని నాకూ, నా సహచరోద్యోగులకూ ఆలోచన వచ్చింది. మేం మా పాత కార్యాలయానికి వెళ్లడం కాదు, ఆ కథనాన్నే బయటకు తీసుకురావాలని ఆలోచించాం. చెన్నైలో ఉన్న ఎన్.రామ్‌కు నేను ఫోన్ చేశాను. కుశల ప్రశ్నల తరువాత నేను ఒక మాట అడిగాను. అదేమిటంటే– పెంటగాన్ పత్రాల రహస్యాల గురించి నీల్ షీహన్స్ రాసిన స్కూప్‌లు ప్రచురించరాదని న్యూయార్క్ టైమ్స్ మీద ఒక న్యాయమూర్తి ఆంక్షలు విధించినప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తుందా? అని. ఆ వార్తా కథనాలనే తరువాత ది వాషింగ్టన్ పోస్ట్‌లో ధారావాహికంగా ప్రచురించారు. ఎందుకంటే ది వాషింగ్టన్ పోస్ట్ మీద అలాంటి నిషేధాజ్ఞలు లేవు కదా! అన్నారు రామ్. సరిగ్గా మనం అలాంటి స్థితిలోనే ఉన్నామని నేను చెప్పాను. అలాంటి ఒక వార్తాకథనం ప్రచురణకి నోచుకోకుండా మిగిలిపోకుండా ఉండేందుకు మేం ఒక తప్పు పనిలో భాగస్వాములం కావడానికి సిద్ధపడ్డాం. మణిశంకర్ అయ్యర్ కుమార్తె యామిని పెళ్లి విందుకు తాను ఢిల్లీ వస్తానని, అప్పుడు ఈ వ్యవహారానికి తుది రూపం ఇవ్వవచ్చునని రామ్ నాతో అన్నారు. మేం అయ్యర్ బంగ్లా బయట పచ్చిక బయలులో కలిశాం. నేను ధరించిన జాకెట్ నుంచి గుండ్రంగా చుట్టిన ఒక కాగితాన్ని తీసి రామ్‌కు అప్పగించాను. నిష్కర్షగా వ్యవహరించే పత్రికారంగంలో ఇదొక ద్రోహం కింద లెక్క. కానీ అలాంటి వార్తా కథనం దొరికినప్పుడు దాని ప్రచురించకుండా అట్టే పెట్టడమంటే, దానిని వేరొకరికి ఇవ్వడం కంటే పెద్ద నేరం. ఆ కథనం మరునాడే ది హిందు మొదటిపేజీలో అచ్చయింది. (http://www.thehindu.com/todays-paper/A-controversial-judicial-ap pointment/article15728178.ece). పైగా కొలీజియంలో పేరు చెప్పడానికి ఇష్టపడని కీలక సభ్యుడొకరు చేసిన వ్యాఖ్యలను కూడా ఆ పేపరు విలేకరి జోడించి, కథనానికి మరింత విలువను తెచ్చాడు. జస్టిస్ జైన్‌ను పంజాబ్–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అంశం పరిశీలించాలని ఇప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గట్టిగా భావిస్తున్నారు. కానీ ఆ అంశం కలాంకు, ఆయనకు మధ్య ఉండిపోయింది. కానీ ఆ నియామకాన్ని ఆపించాలని మా ఉద్దేశం కాదు. ‘విధిగా ప్రచురించాలి’ అని రాసిన ఆ వార్త ప్రచురించడం గురించే మా తపన అంతా. ఈ వార్త ప్రచురణ ది హిందు, ఎన్, రామ్‌ల విశాల హృదయానికి నిదర్శనం. ఇక ఇందుకు ప్రేరణ లేదా చొరవ మాత్రం పెంటగాన్ పత్రాల నుంచి వచ్చినదే. విలేకరి అదృష్టం : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిన తొలి భారతీయ మీడియా గ్రూప్ దైనిక్ జాగరణ్. పెట్టుబడులు పెడుతున్న వారిలో మొదటివారు ‘ఐరిష్ ఇండిపెండెంట్’ అధిపతులు. వారిని పరిచయం చేయడం కోసం 2007లో దైనిక్ జాగరణ్ ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. అందులో రెండు ముఖాలు ఇదివరకు చూసినట్టు అనిపించింది నాకు. మొదటి ముఖం అచ్చంగా సీన్ కానరీ ముఖంలా ఉంది. ఆయన కూడా ఐరిష్ ఇండిపెండెంట్ అధిపతుల మండలిలో ఉన్నారు. ఇక రెండో వారి దగ్గరకు వెళ్లి మీరు బెంజిమిన్ బ్రాడ్లీలాగే ఉన్నారని అన్నాను. ‘‘నేను బ్రాడ్లీనే!’’ అన్నారాయన. ఆయన కూడా ఐరిష్ జాతీయుడే. ఆయన కూడా ఐరిష్ ఇండిపెండెంట్ అధిపతుల మండలిలో సభ్యుడే. అప్పుడే ఆయనకి ఎక్స్‌ప్రెస్– హిందులో జరిగిన ఉదంతం చెప్పి, ఇందుకు ఆయనే ప్రేరణ అని చెప్పాను. ఆ మరునాడు నా వాక్ ది టాక్ కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరింపచేశాను. ఆ సంభాష ణకు టీఆర్పీ ప్రాధాన్యం లేకున్నా (https://www.ndtv.com/video/shows/ walk-the-talk/walk-the-talk-with-benjamin-bradlee-aired-april-2007-342429) గుర్తుంచుకోదగిన ముఖాముఖి. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
అవినీతి అనకొండలు
జీవన కాలమ్ పత్రికలు ఇవాళ పెద్ద అక్షరాలతో వార్తలు చెప్తాయి. ఇçప్పుడు బయటపడింది బెల్లం ముక్క. ఆయన్ని పట్టుకున్నవారు కూడా ‘రుచి’ తెలిసినవారే. వారిని శంకించడం, అనుమానించడం ఉద్దేశం కాదు. ఈ మధ్య అతి తరచుగా అవినీతిపరులయిన అధికారులని పట్టుకునే సందర్భాలు కోకొల్లలుగా పత్రికల్లో కనిపిస్తున్నాయి. ఇదేమిటి? ఈ దేశం ఉన్నట్టుండి ఇంత నిజాయితీగా మారిపోయిందా అని ఆశ్చర్యమూ, అనుమానమూ కలుగుతోంది. పత్రికలు చదివేవారికి ఈపాటికే కొన్ని పేర్లు కంఠస్థమయిపోయాయి. జిల్లా రివెన్యూ అధికారి గణేశ్, విజయవాడ పబ్లిక్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీరు పాము పాండురంగారావు, నెల్లూరు జిల్లా రవాణాశాఖ ఏవో కృష్ణకిశోర్ ఇవాళ శీలం సూర్యచంద్రశేఖర అజాద్ అనే దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్. అసలు దేవాదాయ శాఖే వివాదాస్పదమైన ఏర్పాటు. చక్కగా తమ మతాన్నో, దేవుడినో నమ్ముకున్న భక్తుల డబ్బుని దోచుకోవడానికి ఈ ‘అజాద్’ల దరిద్రం ఎందుకు? పోనీ, ఈ పని అన్ని మతాలవారి విషయంలో–ముస్లింలు, క్రైస్తవులు, జైనుల విషయంలో చేస్తున్నారా? భారతదేశంలో హిందువులకే ఈ ‘అజాద్’ దరిద్రం ఎందుకు పట్టాలి? అద్భుతంగా నిర్వహించబడుతున్న ఎన్నో ఆలయాలు–దేవాదాయ శాఖ అధికారుల పాలిటబడి – ఆయన నాలుగైదు ఆలయాలకు ఒకే అధికారి అయిన పాపానికి కనీసం దీపానికి నోచుకోని సందర్భాలు నాకు తెలుసు. ఎందుకు ఈ ఆఫీసర్లు? ఒక్క ‘అజాద్’ చాలడా మన పాలక వ్యవస్థ నిస్సహాయతను, నిర్వీర్యతను చెప్పడానికి! 50 కోట్ల ఆదాయం, తన నౌకర్ల పేరిట ఒక సోలార్ ప్రాజెక్టు, లక్షల రొక్కం, కోట్ల విలువైన ఆస్తులు–ఎన్నాళ్ల బట్టి ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుంటే ఈ ‘అజాద్’ దోపిడీ సాధ్యమయింది? వీరు ఈ దేశానికి నిర్భయ దోషుల కన్నా చీడపురుగులు కదా! దేవుడి ఆదాయాన్ని నంచుకుతినే ఒక ‘నీచ’పు ఉద్యోగికి ఏమిటి శిక్ష? తమ హక్కు అయిన పట్టా పాసుబుక్కుల కోసం లంచం ఇవ్వలేని చిన్న చిన్న రైతు కుటుంబాల వారు రోజుల తరబడి – చిన్న రివెన్యూ ఉద్యోగుల ‘లంచం రాయితీ’ల కోసం ఎమ్.ఆర్.ఒ. ఆఫీసుల దగ్గర చెట్ల కింద వంటలు చేసుకుంటూ బతకడం నేను స్వయంగా చూశాను. ఈ ఉద్యోగుల ఫొటోలు పత్రికల్లో వేస్తే సరిపోతుందా? వీళ్లందరినీ బట్టలు విప్పి ఊరేగించాలి కదా! ఈ దుర్మార్గుల కోసం నిర్భయ కంటే భయంకరమైన చట్టం తేవాలి కదా! నలుగురి దుశ్చర్య కారణంగా ఒక నిర్భయకి అన్యాయం జరిగింది. దేవుడి సొమ్ముని, ప్రజల విశ్వాసాన్ని ఎన్ని సంవత్సరాలుగా దోచుకుతింటున్న ఈ కమిషనర్ గారికి ఏం శిక్ష వెయ్యాలి? గణేశ్ అనే మహానుభావుడిని ఎలా సత్కరించాలి? కింది స్థాయిలో మూగగా దోపిడీకి గురవుతున్న జనానికి ఈ అవినీతిపరుల నుంచి విముక్తి లభించనంత వరకు నోట్ల రద్దు జరిగినా, పట్టిసీమ, పోలవరాలు నీళ్లు తోడినా ప్రజలు సంతోషించరు. దేశంలో సంస్కరణలకు కంకణం కట్టుకున్న మోదీగారికి వారి అనుచరులు చెప్పాలి. తమరు చేస్తున్న సంస్కరణలు– రోజూ పట్టెడు కూడుకు యాతన పడేవారికి అర్థం కావు. వారిని అనుక్షణం దోచుకుంటున్న గణేశ్‌లు, అజాద్‌లు, పాండురంగారావుల బారి నుంచి కాపాడండి. అప్పుడు వ్యవస్థ మీద విశ్వాసం పెరుగుతుంది. మా దేవుడిని ఈ అనకొండల బారి నుంచి విడుదల చేయండి. ఈ దేశంలో మీ సౌహార్దతకు నోచుకున్న ముస్లిం, క్రైస్తవ, జైన సోదరుల పాటి సంయమనాన్ని హిందువులూ పాటించగలరు. మాలో చిన్న అవినీతిపరులున్నా – ఏనాడయినా పాలకవర్గం మా మీద రుద్దిన ‘అజాద్’ స్థాయికి రారు. పత్రికలు ఇవాళ పెద్ద అక్షరాలతో వార్తలు చెప్తాయి. సామాన్య పాఠకుడు బుగ్గలు నొక్కుకుం టాడు. ఈ దేశంలో అవినీతికి తగిన శిక్ష పడుతోందని తృప్తి పడతాడు. కానీ తన ఇంటి నౌకర్ల పేరుతో సోలార్ ప్లాంటుని స్థాపించగల ఘనుడు–రోడ్డు మీద పడి అడుక్కు తినడు. తినడని మనందరికీ తెలుసు. ఇప్పుడు బయటపడింది బెల్లం ముక్క. ఆయన్ని పట్టుకున్నవారు కూడా ‘రుచి’ తెలిసినవారే. వారిని శంకించడం, అనుమానించడం ఉద్దేశం కాదు. గణేశ్లూ, పాము పాండురంగారావు గార్లు, దొడ్డపనేని వెంకయ్యనాయుడు, కృష్ణకిశోర్, దేవుడిని అడ్డం పెట్టుకుని దోచుకున్న ప్రస్తుత ‘అజాద్’ కమిషనర్‌గారు బట్టల్లేకుండా వీధుల్లో ఊరేగిన దృశ్యం కళ్ల ముందు కనిపించనప్పుడు–వారు కూరల బజారులో పది మంది దృష్టిలో నిలవలేక తల మీద గుడ్డ కప్పుకు తిరిగినప్పుడు– భక్తితో దేవుని హుండీలో రూపాయి వేసి దండం పెట్టిన మామూలు మనిషికి కనీస తృప్తి అయినా మిగులుతుంది. చాలా సంవత్సరాల కిందట మా అబ్బాయి మెర్సిడిస్ కారు కొన్నాడు. మెర్సిడిస్, ఆడి కార్లున్న వారి మీద ఆదాయ శాఖ దాడి– ఆనవాయితీట. ఒక తమిళ ఇన్‌కం ట్యాక్స్ అధికారి వచ్చాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ– ‘‘బాబూ! ఈ ఉద్యోగంలో మేము చేరిన రోజే రెండింటిని ఇంటి దగ్గర మరచిపోయి వస్తాం– సిగ్గు, లజ్జ’’ అన్నాడు. ఇది దాడులు చేసేవారికి సంబంధించిన రెండో పార్శ్వం. గొల్లపూడి మారుతీరావు -
‘భాషా పత్రికల సమస్యలు పరిష్కరించాలి’
పూరి: వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధి నుంచి చిన్న భాషా పత్రికలకు మినహానింపునివ్వాలని ఇండియన్ లాంగ్వేజెస్ న్యూస్‌పేపర్స్ అసోసియేషన్(ఐఎల్ఎన్ఏ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు పూరీలో నిర్వహించిన ఐఎల్ఎన్ఏ 76వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో సభ్యులు తీర్మానం చేశారు. అసంబద్ధ కారణాలు చూపి చిన్నభాషా పత్రికలకు ప్రకటనలు ఇవ్వొద్దని డైరెర్టరేట్ ఆఫ్ అడ్వరై్టజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ)కి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ప్రతిపాదనలు పంపడం దారుణమన్నారు. ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం పీసీఐకి ఆ అధికారాలు లేవని స్పష్టంచేశారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖకు సైతం పీసీఐ రాసిన లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.మరోవైపు, ఐఎల్ఎన్ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కాబోయే అధ్యక్షులుగా పరేశ్నాథ్ను ఎన్నుకున్నారు. -
బ్యాడ్ న్యూస్: మీరు అలా తింటున్నారా?
చెన్నై: ఇంట్లో వేసిన మిరపకాయ బజ్జీలు, పుణుగులు, పూరీల లాంటివి బాగా నూనె పీల్చినప్పుడు.. వాటి నుంచి నూనె పోవడానికి న్యూస్పేపర్లలో పెడుతున్నారా? రోడ్డు పక్కన బండ్ల మీద ఏదైనా ఆహారం తిన్న తర్వాత చేతులు తుడుచుకోడానికి పాత న్యూస్‌పేపర్లు ఉపయోగిస్తున్నారా.. అలా అయితే మీరు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఎందుకంటే.. అలా చేశారంటే మీ శరీరంలోకి పేపర్ లో వినియోగించే ప్రింట్, పిగ్మెంట్స్, బైండర్స్, అడిటివ్స్ వెళ్తాయని ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) హెచ్చరించింది. ఇవి మనుషులను తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తాయని చెప్పింది. రీ సైకిల్ చేసిన న్యూస్ పేపర్లలో కూడా ఫ్తాలేట్ అనే రసాయనం మనుషులకు హాని చేస్తుందని తెలిపింది. దీని వల్ల అజీర్తి సమస్యలు, విష ప్రభావం పడుతుందని చెప్పింది. రీ సైకిల్ చేసిన పేపర్లలో ఆహారాన్ని ఉంచి తీసుకోవడం వల్ల వయసుతో సంబంధం లేకుండా అందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని పేర్కొంది. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కలిగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా.. ఎఫ్ఎస్ఎస్ఏఐను కోరారు. రోడ్డు పక్కన బండ్ల వద్ద ఆహారాన్ని తీసుకునేప్పుడు న్యూస్ పేపర్లలో ఆహారం ఇస్తే తీసుకోరాదని చెప్పారు. ఈ విషయంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
ఆ ఆటో డ్రైవర్ రూటే సపరేటు..!
-
న్యూస్‌పేపర్లు ఇలా వాడుతున్నారా.. జాగ్రత్త!
ఇంట్లో వేసిన మిరపకాయ బజ్జీలు, పుణుగులు, పూరీల లాంటివి బాగా నూనె పీల్చినప్పుడు.. వాటి నుంచి నూనె పోవడానికి న్యూస్పేపర్లలో పెడుతున్నారా? రోడ్డు పక్కన బండ్ల మీద ఏదైనా ఆహారం తిన్న తర్వాత చేతులు తుడుచుకోడానికి పాత న్యూస్‌పేపర్లు ఉపయోగిస్తున్నారా.. అలా అయితే మీరు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఎందుకంటే.. అలా చేశారంటే మీ శరీరంలోకి గ్రాఫైట్ వెళ్తుందట. పేపర్లమీద కథనాలు ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఇంకులో గ్రాఫైట్ ఉంటుంది. పత్రిక పొడిగా ఉన్నంతసేపు.. అంటే చదివేటప్పుడు దాంతో ఎలాంటి సమస్య ఉండదు. కానీ, అది ఏమాత్రం తడిగా అయినా.. చాలా ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇళ్లలో ఏవైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు వాటి నుంచి నూనె తీసేయడానికి చాలామంది ఇళ్లలో ఉండే పాత న్యూస్‌పేపర్లు ఉపయోగిస్తారని, అది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అలా ఏయడం వల్ల ఆహారనాళిక ద్వారా నేరుగా గ్రాఫైట్ మన శరీరంలోకి చేరిపోయి, మన మూత్రపిండాలు, కాలేయాలను దెబ్బతీయడంతో పాటు.. ఎముకలు, కణజాలాల ఎదుగుదలను కూడా నిరోధిస్తుంది. సాధారణంగా మన శరీరంలోకి వివిధ మార్గాల ద్వారా చేరే ప్రమాదకరమైన విష పదార్థాలు మలవిసర్జన ద్వారానే వెళ్లిపోతాయి. కానీ గ్రాఫైట్ పరిస్థితి మాత్రం అలా కాదు. అది ఎక్కడికీ పోకుండా అలాగే పేరుకుపోతుంది. దాంతో ప్రమాదం మరింత పెరుగుతుంది. అందువల్ల న్యూస్పేపర్లను కేవలం చదవడానికి మాత్రమే ఉపయోగించడం మంచిది. -
పత్రికలకు ఆదరణ భేష్!
ఏయూ జర్నలిజం బీవోఎస్ చైర్మన్ ఆచార్య మూర్తి ఏఎన్‌యూ: ప్రపంచ వ్యాప్తంగా పత్రికలకు ఆదరణ తగ్గుతున్నా భారతదేశంలో పత్రికలకు ఆదరణ నానాటికీ పెరుగుతోందని ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం బీవోఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్) చైర్మన్ ఆచార్య డి.వి.ఆర్.మూర్తి చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో గురువారం ‘ప్రస్తుత సమాజంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పాత్ర’ అంశంపై డాక్టర్ మూర్తి ప్రసంగించారు. సమాజంలోని సామాన్యుల అవసరాలు, సమస్యలను అధ్యయనం చేసి వాటిని పరిష్కరించే విధంగా పాత్రికేయులు కృషిచేయాలన్నారు. విలువలు, నిబద్ధతతో వృత్తిలో ముందుకు సాగితేనే పాత్రికేయ రంగం దీర్ఘకాలం మనగలుగుతుందని చెప్పారు. రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందడంతో మీడియా రంగంలో డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. దానికి అనుగుణంగా పాత్రికేయులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ జర్నలిజం విభాగాధిపతి« డాక్టర్ జి.అనిత, అధ్యాపకుడు డాక్టర్ జె.మధుబాబు పాల్గొన్నారు. -
ఇక అన్ని మిడియాల్లో ప్రమాణిక భాష
సుల్తాన్‌బజార్: అన్ని జిల్లాల మాండలిక పదాలతో ఒక ప్రామాణిక భాషను రూపొందించి పత్రికలు, ప్రసార మాధ్యమాలలో ప్రయోగించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు. బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో శనివారం ‘తెలుగు పత్రికలు–ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం’ అనే అంశంపై సదస్సు జరిగింది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పరిషత్ అధ్యక్షులు డాక్టర్ సి.నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలుగు పత్రికల్లో ప్రామాణిక భాష పేరుతో రెండున్నర జిల్లాల భాషను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి ఇతర ప్రాంతాల భాషలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పత్రికల భాషలనే అలవర్చుకున్నారని తెలిపారు. సినిమా భాష ప్రజల శిరస్సుపై తాండవం చేసిందన్నారు. పత్రికా భాషను సరళీకృతం చేసేందుకు నండూరి రామ్మోహన్, నాగుల వెంకటేశ్వరరావులు ముఖ్యపాత్ర పోషించారన్నారు. తెలంగాణ భాషలో పత్రిక రచన కష్టమని, ఇన్నాళ్లుగా ఉన్న భాషా స్వరూపం మార్పు చెందాలంటే మాండలికాలు ఏకరూపం చేయాలని అభిప్రాయపడ్డారు. వాల్‌పోస్టర్‌ను గోడపత్రిక అని రాస్తున్నారని, వాల్ అంటే గోడ అని, పోస్టర్ అంటే పత్రిక కాదన్నారు. ప్రస్తుత ‘సాక్షి’ దినపత్రిక ఈడీ రామచంద్రమూర్తి గతంలో ప్రసార భాషలో కొన్ని మార్పులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, సాహితీ ప్రియులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. -
పత్రికలకు మార్కులు
ప్రకటనల మంజూరుకు కేంద్రం కొత్త విధానం న్యూఢిల్లీ: ప్రింట్ మీడియాలో వార్తాపత్రికలకు ప్రభుత్వ ప్రకటనల జారీ కోసం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మార్కుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రకటనల జారీలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం రూపొందించిన ఈ విధాన వివరాల్ని డైరక్టరేట్ ఆఫ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ) శుక్రవారం విడుదల చేసింది. వృత్తిపరంగా ఉత్తమ ప్రమాణాలు పాటిస్తూ, సర్క్యులేషన్‌ను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్(ఏబీసీ) లేదా రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్‌ఎన్‌ఎ)తో తనిఖీ చేయించుకునే పత్రికల్ని ప్రోత్సహించేందుకు తొలిసారి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మార్కుల పద్ధతిలో 6 అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఏబీసీ/ఆర్ఎన్ఏతో సర్క్యులేషన్ తనిఖీకి(25 మార్కులు), ఉద్యోగులకు ఈపీఎఫ్ చెల్లిస్తే(20 మార్కులు), పేజీల సంఖ్యకు(20 మార్కులు), పీటీఐ/యూఎన్ఐ/హిందుస్తాన్ సమాచార్ వార్తా సంస్థల్లో సభ్యత్వముంటే(15 మార్కులు), సొంత ప్రింటింగ్ ప్రెస్‌కు(10 మార్కులు), పీసీఐ వార్షికసభ్యత్వ చెల్లింపునకు(10 మార్కులు) కేటాయిస్తారు. సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా డీఏవీపీ ప్రకటనలు కేటాయిస్తుంది. సర్క్యులేషన్.. రోజుకు 45 వేలు మించితే ఆర్ఎన్ఐ లేదా ఏబీసీ ధ్రువీకరణ పొందాల్సి ఉండగా... 45 వేల లోపు అయితే చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ ధ్రువీకరించాలి. జారీ తేదీ నుంచి రెండేళ్ల వరకూ ఆర్ఎన్ఐ ధ్రువీకరణ చెల్లుబాటు అవుతుంది. ఏబీసీ ప్రకారమైతే ప్రస్తుత ధ్రువీకరణనే సర్క్యులేషన్ సర్టిఫికెట్‌గా వాడొచ్చు. ఆర్ఎన్ఐ లేదా దాని ప్రతినిధుల ద్వారా సర్క్యులేషన్‌ను తనిఖీ చేయించుకునే హక్కు డీఏవీపీ డైరక్టర్ జనరల్‌కు ఉంటుంది. ఈ విధానం ప్రకారం వార్తాపత్రికలు, జర్నల్స్‌ను చిన్న స్థాయి(రోజుకు 25 వేల కంటే తక్కువ కాపీలు), మధ్య స్థాయి(25,001-75,000), భారీస్థాయి (రోజుకు 75వేలకు పైగా) గా విభజించారు. ప్రాంతీయ భాషా పత్రికలు, చిన్న, మధ్య స్థాయితో పాటు లక్ష కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలు, ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్ వంటి ప్రాంతాల పత్రికల్ని ప్రోత్సహించేందుకు పాలసీలో వెసులుబాట్లు కల్పించారు. -
దేన్ని చూసుకుని రాయాలి?
ఏప్రిల్ 24న జయకాంతన్ జయంతి ప్రారంభంలో జయకాంతన్ బతకటానికి ఎన్నో రకాలైన పనులను చేశారు. వాటిలో -అ) వెచ్చాల కొట్లో పొట్లాలు కట్టే పని, ఆ) డాక్టర్ దగ్గర మెడిసిన్ కిట్ మోసే పని, ఇ) పిండిమిల్లులో పని, ఈ) అచ్చు యంత్రాల దగ్గర అక్షరాలు పేర్చే పని, ఉ) ట్రెడిల్మేన్గా, ఊ) వార్తాపత్రికలు అమ్మే పని, ఋ) పిండిమిషన్ విడి భాగాలు తయారుచేసే ఫౌండ్రీలో ఇంజన్లకు బొగ్గు వేసే పని, ౠ) సోపుల ఫ్యాక్టరీలో పని, ఎ) జట్కావాలాకు సహాయకుడిగా, ఏ) ప్రూఫ్ రీడర్‌గా, ఐ) పేకాట క్లబ్బులో పనివాడుగా, ఒ) సంపాదకుడుగా, ఓ) అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్‌గా, ఔ) కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో పని... మొదలైనవి ఆయన ఎన్ని ఇబ్బందులెదుర్కొని జీవితంలో పైకొచ్చారో తెలియజేస్తాయి. ‘‘ఆ కాలంలో ‘హిట్లర్’ ప్రపంచంలోనే పేరు పొందిన వ్యక్తి . అయినప్పటికీ నేను హిట్లర్‌కు ఎనిమీని. అప్పుడు నాకు హిట్లర్ అంటే ఇష్టం లేకపోవటానికి కారణం - అతని మీసం. మా నాన్నా అదేలాగా మీసం పెట్టుకునేవారు. నాకు ఆయనంటే కూడా ఇష్టం లేదు. హిట్లర్ మీసాన్ని నాన్న పెట్టుకోవటం వల్ల నాన్నంటే ఇష్టంలేదా? లేక నాన్న మీసం హిట్లర్ పెట్టుకున్నందువల్ల హిట్లర్ అంటే ఇష్టంలేదా? అని స్పష్టంగా నాకు తెలియదు. ఆ కాలంలో నన్ను ఎంతగానో ఆకట్టుకున్న ఒకే ఒక వీర పురుషుడు స్టాలిన్. స్టాలిన్ మీసం ముందు ఈ హిట్లర్ మీసం ఓడిపోతుందని నేను పందెం కాసేవాణ్ణి’’ అనేవారు జయకాంతన్. (కాగా తమిళనాట సాహిత్య రంగంలో పెద్ద పెద్ద మీసాలు పెట్టుకున్న రచయిత జయకాంతన్ ఒక్కరే!) ‘‘నాకు రాసేందుకు కుతూహలమూ, దానికి తగ్గ కారణాలూ ఉన్నాయి. నా రాతలకు ఒక లక్ష్యమూ ఉంది. నేను రాసేది పూర్తిగా జీవితం నుండి నేను పొందే జ్ఞాన ప్రభావమూ, నా ప్రత్యేక శ్రద్ధానూ! రాయటం వల్ల నేను సాధువుగా మారుతున్నాను. అందుకోసమూ రాస్తున్నాను. రాయటం వల్ల భాష వృద్ధి చెందుతుంది. అందుకోసమూ రాస్తున్నాను. రాయటం వల్ల నావాళ్లు సుఖమూ, లాభమూ పొందుతున్నారు. వాటి కోసమూ రాస్తున్నాను. భవిష్యత్కాల సమాజాన్ని ఎంతో గొప్ప స్థితికి తీసుకెళ్లటానికి సాహిత్యం అంటూ ఒకటి అవసరం కనుక రాస్తున్నాను. కలం ఎంతో బలమైనది. నా జీవన పోరాటంలో నేను ఎంచుకున్న ఆయుధం కలం. అందుకే రాస్తున్నాను. కలం నా దైవం’’ అంటారు జయకాంతన్ ఎంతో ఆత్మవిశ్వాసంతో. 1990లో గోర్బచేవ్ పరాజయం చెంది, సోవియెట్ యూనియన్ ముక్కలైనపుడు, జయకాంతన్ ఎంతో కదిలిపోయారు. నిజమైన ఎందరో కమ్యూనిస్టుల్లాగే, సోవియెట్ స్నేహితుల్లా బాధపడ్డారు. 1993లో ఒక సభలో ఆయన మాట్లాడుతూ... ‘‘నేను రాయటం లేదు, ఎందుకు రాయటం లేదని అడుగుతున్నారు. నేనిక దేన్ని చూసుకుని రాయాలి? జీవితంలో దేన్ని కలగా కంటూ వచ్చామో, ఆశలు పెంపొందించుకుంటూ వచ్చామో, నమ్మామో ఆ విశాల సమాజమే, సోవియెట్ యూనియనే నాశనమై పోయిందే. ఇక నేను దేన్ని నమ్మాలి. దేన్ని ఉదహరించాలి. ఉండనీ... అదొక ఉన్నతమైన అబద్ధం. నాకది చాలు. ఇక తక్కినవాళ్లు రాయనీ...’’ అంటూ ముగించారు. జిల్లేళ్ళ బాలాజీ 9866628639 (సౌజన్యం: sirukadhai mannan J.K.100 ariya thagavalgal by Sabitha Joseph) -
పూసే విరబూసే పండగ
నాస్టాల్జియా సంక్రాంతి పండగ అంతకు పది రోజుల ముందు నుంచి న్యూస్ పేపర్ల ఫుల్‌పేజీ సినిమా యాడ్లతో మొదలయ్యేది. జనవరి 11 ఉ.9.30 గం. ఆటతో బ్రహ్మాండమైన విడుదల. దాంతో పాటే థియేటర్ల లిస్టూ ఇచ్చేవారు. మనూరులో మనం రోజూ చూసే థియేటర్ పేరు పేపర్లో రావడం ఒక గొప్ప. అందులో మన హీరో సినిమా రావడం ఇంకా గొప్ప. 11న ఒకటి, 12న ఒకటి, 13న ఒకటి, పద్నాలుగున ఒకటి. అన్నింటికీ డబ్బు కూడ బెట్టుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. పెద్దలు పెద్ద మనసు చేసుకొని పిల్లలకు పైసలు ఇచ్చే పండగ. పిల్లలు నిజమైన సంబరంలో మునిగే పండగ. కాని సగం ఆనందం టైలర్లు కాజేసేవారు. రైలు రాకపోకలకన్నా గ్యారంటీ ఉండేదేమోకాని వీళ్లు కుట్టిన గుడ్డలు ఇస్తారో ఇవ్వరో అనేదానికి మాత్రం ఎవరూ గ్యారంటీ ఇచ్చేవారు కాదు. అసలే కొత్తబట్టలంటే సంక్రాంతికి మాత్రమే కుట్టించేవారు. వాటి కోసం సంవత్సరం మొత్తం ఆగాలి. స్కూల్లో గొప్పలు చెప్పుకోవాలి. పండగ రోజు ధరించి ఫ్రెండ్స్ ఇంటికి క్యాజువల్‌గా వెళ్లినట్టు వెళ్లి చూపించుకోవాలి. చెప్పులు లేకపోతే ఏమీ టక్ చేసుకొని దర్జాగా తిరగాలి. కాని ఎన్నిసార్లు టైలర్ షాప్ ముందు తిరిగినా మన బట్టలు అలాగే మూట గట్టి పడి ఉండేవి. అదృష్టం బాగుంటే ష్రింక్ కోసమని తడిపి ఆరేశాక దండెం మీద కనిపించేవి. అన్నాళ్లు ఎవరూ పట్టించుకోని టైలర్ ఆ కొన్నిరోజులు ఊరి ఎమ్మెల్యే చేత కూడా సలాం కొట్టించుకునేవాడు. స్లీపింగ్ టేప్రికార్డర్లో పాటలు వింటూ అర్ధరాత్రి కూడా అతడు కుడుతూ ఉంటే అమ్మా నాన్నలకు చెప్పి అక్కడే కూర్చొని తెల్లారుతుండగా కాజాలు పూర్తి చేసి ఇంటికి పరిగెత్తుకురావడం జ్ఞాపకం. హరిదాసులకు బియ్యం పొయ్యడం బాగుండేది. గంగిరెద్దులవాళ్లకు పాత వస్త్రం ఇవ్వమని నాన్న అంటే అమ్మ ఒకటి కాదని మరొకటి ఇవ్వడమూ బాగుండేది. బుడబుడలవాడు నల్లగొడుగేసుకొని వచ్చి కుడిచేయి విసురుతూ చిట్టి డమరుకం డమడమలాడిస్తుంటే వీధి కుక్కలు వెంట పడాల్సింది పోయి తోక ముడిచేవి. పిల్లలు ఎందుకైనా మంచిదని అమ్మ కొంగుచాటు దాక్కుని చూసేవారు. కాని ఆ దేవర దీవెన ఎంత చల్లన! ఔట్‌లైన్ అక్క వేస్తుంది. లోపల కలర్ మనమే నింపాలి. ముగ్గుల సౌందర్యం ముగ్గుతో వస్తుందా? తల్లిదండ్రులు చూస్తూ ఉండగా వాటిలో మునిగే వంశాంకురాలతో వస్తుంది. అరిసెలు చేసే పెద్దమ్మ అంతకు నాలుగు వీధుల అవతల ఉంటుంది. మంచి మాటలు చెప్పి లాక్కురావాలి. ఆమె తీయని అరిసెలు చేసి పెడుతుంటే అంతకంటే తియ్యని కబుర్లను నంజుకోవాలి. జంతికలు సరిగ్గా కుదిరితే కరకరా. కాదంటే హరహరా. నిప్పట్లకు చప్పట్లు. లడ్డూ పిల్లసన్నాసుల హెడ్డుకొకటి. పూలకాలం కదా ఇది. దోసిట్లో నీళ్లు తీసుకొని నేల మీద అలా చిమ్మగానే ఇలా బంతిపూలు పూసుకొచ్చేవి. డిసెంబరాలు ఎరుపుకొచ్చేవి. మందారాలు మౌనంగా మొగ్గ విచ్చేవి. సీతమ్మ జడకుచ్చులు మంచుకు చెమ్మగిల్లి రామయ్యను తలుచుకునేవి. గుమ్మడిపూలు గొబ్బెమ్మల్లోకి... కనకాంబరాలు అమ్మ జడలోకి. తేలిక రంగులు గాలిపటాలకు పనికి రావు. వంకాయ రంగు బాగుంటుంది. రాణీ రంగు బాగుంటుంది. ఎరుపు ఎవర్‌గ్రీనే. ముదురు ఆకుపచ్చ ముస్తాబే వేరు. కాదూ కూడదూ అని లేత నీలిరంగు గాలిపటాన్ని కొని ఎగురవేస్తే అది మబ్బుల్లో ఎగిరి కలగలిసిపోతే మాయమైపోయిందని పిల్లాడు ఏడిస్తే చుట్టూ ఉన్న స్నేహితులందరికీ అది నవ్వుల సంక్రాంతి. చేయి తిరిగినవారు వెజ్ బిరియానీని కూడా మటన్ బిరియానీలా వండుతారు. ప్రావీణ్యం ఉన్నవారు పాయసాన్ని పాయసంలానే చేస్తారు. గారెల సైజు మనసును బట్టి. పులిహోర రుచి హృదయాన్ని బట్టి. అరిటాకులో రోటి పచ్చడి పడితే జిహ్వచాపల్యం ఉన్నవాడికి అది రుచుల సంక్రాంతి. ఈ పండగ ఇంటికి ధాన్యం తెస్తుంది. తీక్షణతను నింపుకున్న వెలుతురును తెస్తుంది. తియ్యని మమతలను పంచే బంధువులను తెస్తుంది. మరో సంక్రాంతి వరకూ కలిసి నడవగలిగిన సంతోషాన్ని తెస్తుంది. వాట్సప్ రావచ్చు. ఫేస్బుక్ రావచ్చు. ఫోన్ కాల్ రావచ్చు. ఈ మెయిల్ రావచ్చు. కాని వేల సంవత్సరాల పరంపర నిండిన ఆ పండగ మనల్ని తాకే తీరుతుంది. దేనికి చెందుతామో దానిని గుర్తు చేసే పండగ ఇది. దేనికి పులకరిస్తామో ఆ పులకరింపును ఇచ్చే పండగ ఇది. దేనిని మర్చిపోకూడదో ఆ జ్ఞాపకాన్ని ఇచ్చే పండగ ఇది. సంక్రాంతి మనది. మనందరిది. - సాక్షి ఫ్యామిలీ దోసిట్లో నీళ్లు తీసుకొని నీళ్ల మీద అలా చిమ్మగానే ఇలా బంతిపూలు పూసుకొచ్చేవి. డిసెంబరాలు ఎరుపుకొచ్చేవి. మందారాలు మౌనంగా మొగ్గ విచ్చేవి. సీతమ్మ జడకుచ్చులు మంచుకు చెమ్మగిల్లి రామయ్యను తలుచుకునేవి. గుమ్మడిపూలు గొబ్బెమ్మల్లోకి. కనకాంబరాలు అమ్మ జడలోకి. -
తప్పు చేస్తే ఉరేసుకుంటా
నర్సీపట్నం (విశాఖ) : తాను ఎప్పడూ తప్పు చేయలేదని, అలా చేస్తే ఉరేసుకుంటానంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆవేదన వెలిబుచ్చారు. మంత్రి అయ్యన్న పాత్రుడు పత్రికలపై మరోమారు దండెత్తారు. ఆయన మంగళవారం నర్శీపట్నంలో నవ నిర్మాణదీక్షను ప్రారంబించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పత్రికల్లో తనపై ఆవాస్తవాలు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేస్తూ తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. -
నవ్విస్తూనే చురకలేసే.. కార్టూనిస్ట్
అప్‌కమింగ్ కెరీర్ : మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పత్రికల్లో తనపై వచ్చిన కార్టూన్లను కత్తిరించి, దాచుకొనేవారట. ప్రముఖ పొలిటికల్ కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్ కుంచె నుంచి జాలువారిన ‘కామన్ మ్యాన్’ విగ్రహంగా మారి, కార్టూనిస్ట్‌ల గౌరవం పెంచాడు. మనదేశంలో అన్ని భాషల్లో ప్రసార మాధ్యమాలు విస్తరిం చడంతో కార్టూనిస్ట్‌లకు గిరాకీ పెరిగింది. వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, టీవీ ఛానళ్లు వంటి వాటిలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. వార్తాపత్రికల్లో పనిచేసే కార్టూనిస్ట్ లు జర్నలిస్టుల కంటే ఎక్కువ పాపులర్ కావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం యానిమేషన్, గ్రాఫిక్స్, అడ్వర్టైజ్ మెంట్ రంగాలు, ఇంటర్నెట్, కామిక్స్ బుక్స్ ప్రచురణ సంస్థల్లోనూ కార్టూనిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది. పాఠకులకు నాలుగు కాలాలపాటు గుర్తుండిపోయే కార్టూన్ వేయడం ఒక కళ. దీనికి ఎంతో ఊహా శక్తి, పరిశీలనా నైపుణ్యాలు ఉండాలి. నిత్య జీవితంలో జరిగే సంఘటనల నుంచి తనకు పనికొచ్చే అంశాన్ని గుర్తించగల నేర్పు ఉండాలి. కార్టూన్ల ప్రధాన ఉద్దేశం.. నవ్విస్తూనే సున్నితంగా చురకలేయడం. కాబట్టి హాస్యరసాన్ని కాచి వడబోసిన వారే మంచి కార్టూనిస్ట్‌గా త్వరగా గుర్తింపు పొందగలుగుతారు. మనదేశంలోని విద్యాసంస్థల్లో కార్టూన్ల కోసం ప్రత్యేకంగా కోర్సులు లేకపోయినా పెయింటింగ్‌లో భాగంగా వీటిపై శిక్షణ ఇస్తున్నారు. ఫైన్ ఆర్ట్స్ సంస్థల్లో పెయింటింగ్ కోర్సులు ఉన్నాయి. అర్హతలు కార్టూనిస్ట్‌గా కెరీర్లో స్థిరపడాలనుకొనేవారికి పదో తరగతి, ఇంటర్మీయెట్ పూర్తిచేసిన తర్వాత పూర్తిస్థాయి డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి. కొన్ని సంస్థలు స్వల్పకాలిక కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేతనాలు ఫ్రీలాన్స్ వర్క్ చేస్తే ఒక్కో కార్టూన్‌కు రూ.250 నుంచి రూ.2000 వేల వరకు అందుకోవచ్చు. వార్తాపత్రిక లేదా మేగజైన్లో చేరితే ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా వేతనం లభిస్తుంది. కార్టూనిస్ట్(పెయింటింగ్) కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.jnafau.ac.in సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వెబ్సైట్: http://teluguuniversity.ac.in సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్-ముంబై వెబ్సైట్: www.mu.ac.in కళ నిత్యనూతనం ‘‘కళాత్మకమైన కోర్సులన్నీ నిత్యనూతనమే. అయితే మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కావటంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఎంతబాగా సృజనాత్మకతను ప్రదర్శించగలిగితే కళాకారుడికి అంత గొప్ప పేరు, ప్రఖ్యాతులు వస్తాయి. చిత్రకళలో అవకాశాలకు కొదవలేదు. ఎప్పటికప్పుడు ప్రతిభను నిరూపించుకోవడం పైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. కార్టూనిస్ట్‌లు టీచర్స్‌గా, ఫ్రీలాన్సర్లుగా, మీడియా రంగంలో దేశ, విదేశాల్లో పనిచేయవచ్చు’’ - కప్పరి కిషన్, ఆర్ట్ ఇన్స్ట్రక్టర్, తెలుగు విశ్వవిద్యాలయం -
నేటి వార్తలు - విశేషాలు
-
నేటి వార్తలు - విశేషాలు
-
పుస్తక సమీక్షణం:
దళిత, బహుజన చైతన్యం పుస్తకం : దళిత బహుజన సాహితీవేత్తలు రచన : బి.ఎస్.రాములు పేజీలు: 184 వెల: 100 విషయం : వివిధ పత్రికలు, పుస్తకాల్లో భిన్న సందర్భాల్లో బి.ఎస్.రాములు రాసిన వ్యాసాలు, పీఠికలను ‘దళిత బహుజన సాహితీవేత్తలు’(1990-2012) పేరుతో సంకలనం చేశారు కర్రె సదాశివ్, మొయిలి శ్రీరాములు. ప్రతి వ్యాసం దళిత బహుజన భావజాలాన్ని అంతర్లీనంగా పరిచయం చేస్తుంది. దళిత బహుజన సాహిత్యం ఉధృతంగా వెల్లువెత్తిన కాలాన్ని గుర్తు తెస్తుంది. జన నాట్య మండలికి పూర్వం సాహిత్యం ఎలా ఉండేది? గద్దర్ పాటల్లోని ప్రయోగాల్లో ఉన్న వైవిధ్యం ఏమిటి? ‘అందుకో దండాలు బాబా అంబేద్కరా’ పాటతో బహుజన సాహిత్యానికి ఊపు తెచ్చిన మాస్టార్జీ కలంలోని పదును, నర్రెంగ చెట్టు కింద గళాన్ని సవరించిన శివసాగర్ పాటల లోతు, అలిశెట్టి ప్రభాకర్ అక్షరాయుధంలోని మెరుపు.... ఎన్నో విషయాలు. వ్యక్తుల గురించి చదువుతున్నట్లుగా ఉంటుంది. వారి వ్యక్తిగతం తెలుసుకున్నట్లుగా ఉంటుంది. కాని మనం చదివింది వ్యక్తిగతం కాదు ‘దళిత సామాజిక చరిత్ర’ అనే ఎరుక పుస్తకం ముగించేలోపు అర్థమవుతుంది. సాహు గురించిన సంస్మరణ వ్యాసం మళ్లీ మళ్లీ చదివిస్తుంది. జయధీర్ తిరుమలరావు అన్నట్లు రెండు దశాబ్దాల తాత్విక, సైద్ధాంతిక చర్చలు, పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. - పాషా ప్రతులకు: విశాల సాహిత్య అకాడమీ, 201, సులేఖ గోల్డెన్ టవర్స్, 2-2-186/53/5, రామకృష్ణ నగర్, బాగ్ అంబర్పేట్, హైదరాబాద్-13; ఫోన్: 8331966987 హృదయ స్పందనల సవ్వడి పుస్తకం : సవ్వడి (వ్యాసాలు) రచన : జి.వి.చక్రవర్తి పేజీలు: 222 వెల:100 ప్రతులకు: సంజీవ్ మీడియా హౌస్, 202, నంది ఎన్క్లేవ్, సిద్దార్థ నగర్, హైదరాబాద్-38; ఫోన్: 97043 33337 విషయం : నేటి సమాజ పోకడలను, విలువల పతనాన్ని, వస్తు సంస్కృతీ వ్యామోహాన్ని, అనుబంధాలు ఆత్మీయతలు పెళుసు బారిపోయిన విధాన్ని చూస్తూ కూర్చోలేని ఒక యదార్థవాది స్పందనలకు అక్షర రూపం ఈ వ్యాససంపుటి. నాడు సాక్షి వ్యాసకర్త పానుగంటి వారిలాగే నిత్యం మన చుట్టూ జరిగే అనేక సంఘటనల్ని, కుపిత నాయిక వాలుజడతో చరపు చరచినట్లు, లోకహితం కోసం చేసిన హృదయాక్రోశమే ఈ సవ్వడి. అయితే సాక్షిలోలా కాలాచార్యుడు, జంఘాల శాస్త్రి, వాణీదాసు, వైశ్యుడు లాంటి నాటకీయ పాత్రలు లేకున్నా, నవరసాల మేళవింపుగా రాసిన వ్యాస కదంబంలో అన్నీ తానై నిలిచాడు రచయిత. ఒళ్లంతా కళ్లు, బొడ్డు చూడు బొడ్డందం చూడు, ఆఫ్టర్నూన్ ఆంటీస్ లాంటి వ్యాసాలు మనలోని నలుపును గుర్తుచేస్తున్నాయి. సంసారం ఓ సాగరం, హింసధ్వని లాంటి వ్యాసాలు బాధ్యతలు మరవవద్దని హితవును చెప్తాయి. గుణమా... ఆ ఒక్కటీ అడక్కు, ఆరో తరగతి ప్రేమికులు, ఉత్తరోత్తరా చెప్పొచ్చేదేమిటంటే... వంటివి మమకారాల్ని, సహాయ సహకారాల్ని అమ్మకాలకు పెట్టవద్దని సందేశమిస్తాయి. - మీరాసాహెబ్ అక్షర గంగ పుస్తకం : స్వరగంగ - ఎం.ఎస్.సుబ్బులక్ష్మి సంపాదకులు : ‘లకుమ’ బుదేశ్వరరావు పేజీలు: 300 వెల: 299 విషయం : ‘ఆమె పాడకపోతే దేవుళ్లకు కూడా తెల్లవారదు/ ఆమె పాట వినబడకపోతే దేశమే తానైన/ ఏ పల్లే లేవదు’ అంటూ సుబ్బులక్ష్మి గురించి లకుమ చెప్పడం అక్షర సత్యం. కర్నాటక సంగీతానికి తన గళ మాధుర్యంతో ప్రపంచవ్యాప్త ఖ్యాతి తేవటమేకాక, భారతరత్న పొందిన తొలి సంగీత కళాకారిణిగా చరిత్రలో శిఖరాయమానంగా ఆమె నిలిచిపోయారు. సుబ్బులక్ష్మి జీవిత, సంగీత ప్రయాణంపై వెలువరించిన పుస్తకం ఇది. ఆధ్యాత్మిక లోకాల్లోకి ప్రయాణింపజేసే ఆమె స్వరాన్ని ఇది ఆసక్తిదాయకంగా వ్యక్తీకరించింది. ఓ రకంగా స్మృతి సంకలనమైన ఈ పుస్తకంలో ‘రాశులు - దుద్దులు - బేసరలు - పెర్ఫ్యూమ్లు - మల్లెపూలు - మట్టిగాజులు- రికార్డులు - జిలుగులు- సంస్కరణలు- ప్రతిష్టలు’ అంటూ చేసిన వ్యాస విభజన లకుమ పరిశోధన దృష్టిని చెబుతుంది. 64 మంది రాసిన వ్యాసాలతోపాటు, మంచి ఫొటోలను పొందుపర్చటం పుస్తకానికి నిండుదనాన్నిచ్చింది. - డా. నూకతోటి రవికుమార్ కొత్త పుస్తకాలు గురజాడ దర్బార్ (ఆధునిక సాహితీ రూపకం) రచన: డా. ద్వానా శాస్త్రి పేజీలు: 32; వెల: 30 ప్రతులకు: కిన్నెర పబ్లికేషన్స్, మద్దాళి గోల్డెన్ నెస్ట్, ఫ్లాట్ 101, 102, 2-2-647/153, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, హైదరాబాద్-13. ఫోన్: 040-27426666 1.మమకారం (కథలు) రచన: రేగులపాటి విజయలక్ష్మి పేజీలు: 92; వెల: 90 2.ఈతరం పెళ్లికూతురు (కథలు) రచన: రేగులపాటి కిషన్‌రావు పేజీలు: 130; వెల: 120 ప్రతులకు: కవితా నిలయం, 10-1-436, సంతోష్‌నగర్, రామ్‌నగర్, కరీంనగర్-505001; ఫోన్: 7396036922 నిప్పు కణికలు (కవిత్వం) రచన: మొగిలి స్వామిరాజ్ పేజీలు: 94; వెల: 65 ప్రతులకు: రచయిత, 1-1-1653, రాకాసిపేట్, బోధన్, నిజామాబాద్- 503185; ఫోన్: 9963642205 ప్రతులకు: లకుమ, ప్రెసిడెంట్, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ఫౌండేషన్, ఎ.239, హిల్ కాలనీ, నాగార్జున సాగర్, నల్లగొండ జిల్లా; ఫోన్: 08680 276454 -
అన్నాదురై ఆటో ఎక్కితే.. వైఫై ఫ్రీ!
ప్రయాణంలో చదవడానికి న్యూస్‌పేపర్లు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవడానికి వైఫై కనెక్షన్, సెల్ఫోన్చార్జింగ్ సదుపాయం, ఏ నెట్వర్క్ మొబైల్ కైనా రీచార్జ్ కార్డులు, వెబ్ సర్ఫింగ్ కోసం ఒక ట్యాట్లెట్... ఇన్ని సదుపాయాలున్నాయంటే అది ఏ విమానమో, ఏసీ టూ టైర్ రైలు బోగీనో అయ్యుంటుందనుకొంటున్నారా... అదేమీ కాదు అన్నాదురై ఆటోలో ఈ సదుపాయాలన్నీ ఉన్నాయి. విమానాలను, వోల్వో బస్సులను తలదన్నే ఏర్పాట్లతో ప్రయాణికులను ఆకట్టుకొంటున్నాడు ఈ ఆటోడ్రైవర్. అధునాతన సదుపాయాలను ఉచితంగా అందిస్తున్న ఇతడి వివరాలు ఇవి.. చెన్నైలోని ఒక ఐటీ సెజ్ చుట్టుపక్కల ఆటో నడుపుతుంటాడు అన్నాదురై. ఇతడి ఆటో ఎక్కేవారిలో ఎక్కువమంది ఐటీ ప్రొఫెషనల్స్. వారిని దృష్టిలో ఉంచుకొని తన ఆటోలో ఈ సదుపాయాలను అందుబాటులో ఉంచాడు అన్నాదురై. ఇతడి ఆటో ఎక్కగానే స్మార్ట్‌ఫోన్ లేదా లాప్టాప్ చేతిలో ఉంటే వైఫై కనెక్ట్ చేసుకొని ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ లేనివారి కోసం ప్రత్యేకంగా ఒక టాబ్లెట్‌ను ఏర్పాటు చేశాడు అన్నాదురై. బ్రౌజింగ్ మీద ఆసక్తి లేకపోతే రీడింగ్ చేయొచ్చు. ప్రముఖ ఆంగ్ల వార్తపత్రికలన్నీ అన్నాదురై ఆటోలో అందుబాటులో ఉంటాయి. మ్యాగ్జిన్లు, న్యూస్ పేపర్లు కలిసి 35 రకాల పత్రికలు ఉంటాయి అందులో! ఇంతేకాదు.. అర్జెంట్‌గా ఫోన్ రీచార్జ్ అవసరమైతే అన్నాదురైని సంప్రదిస్తే వివిధ ప్యాకేజ్‌ల రూపంలోని మొబైల్రీచార్జ్ సేవలు అందిస్తాడు. ఇంకా డీటీహెచ్ రీచార్జ్ సదుపాయం కూడా ఉంటుంది. ఈ సౌకర్యాల విషయంలో ఎటువంటి అదనపు చార్జీలు వేయడు అన్నాదురై. కేవలం తన, ప్రయాణికుల సంతృప్తి కోసమే ఈ సదుపాయాలన్నింటినీ సమకూరుస్తున్నట్లు అన్నాదురై చెబుతాడు. వీటి విషయంలో ఇతడు బాగానే ఖర్చు చేస్తున్నాడు. మ్యాగ్జైన్లకు, న్యూస్ పేపర్ల కోసమే మూడు వేల రూపాయలు ఖర్చవుతోందట. వైఫై కోసం వెయ్యి రూపాయలు! ఆటోలో ఇన్ని సదుపాయాలుండటమంటే ఇది పెద్ద విశేషమే కదా.. దీంతో మీడియా అన్నాదురై వెంటపడుతోంది. ఈ ఐడియా మీకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తోంది. దీని గురించి అన్నాదురై మాట్లాడుతూ.. చాలా రోజుల కిందట తాను చెన్నై రైల్వే స్టేషన్ బయట ఆటోను పెట్టుకొనుంటే.. ఒక పల్లెటూరి వ్యక్తి వచ్చి మాట్లాడుకోవడానికి మొబైల్ అడిగాడని.. అతడు తన ఆటోలో ఎక్కాలనే కండీషన్ మీద ఫోన్ ఇచ్చానని.. ఆ తర్వాత అలాంటి సదుపాయాలు పెడితే ఆటో ఎక్కడం పట్ల ఎవరైనా ఉత్సాహం చూపిస్తారనే ఆలోచన వచ్చిందని చెప్పాడు. ఐటీ కంపెనీల దగ్గర్లో ఉన్న ఆటోస్టాండ్‌కు మారి.. ఈ విధమైన ఏర్పాట్లతో టెక్కీలను ఆకట్టుకొంటున్నానని అన్నాదురై వివరించాడు. ఆటోను అన్ని సదుపాయాలున్న డీలక్స్ గా మార్చడానికే నెలకు నాలుగైదు వేలు ఖర్చు చేస్తున్నాడు కదా.. అతడికి ఇంకేం మిగులుతుంది? అంటే.. తన సంపాదన రోజుకు వెయ్యిరూపాయలని చెబుతూ.. మిగతా లెక్కలు మీరే వేసుకోండి అని అంటాడు ఈ ఆటోడ్రైవర్!