‘‘ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వార్తాపత్రికలు చదవాలి. ముఖ్యంగా ప్రతిరోజూ పిల్లలతో పత్రికలు చదివించాలి. నా పిల్లలతో నేను చదివిస్తాను’’ అన్నారు సోనూ సూద్. కరోనా సమయంలో వలస కార్మికులు వాళ్ల ఊళ్లు చేరుకోవడానికి విస్తృతంగా సహాయం చేశారు సోనూ సూద్. సినిమాల్లో విలన్ పాత్రలు చేసినా నిజజీవితంలో హీరో అనిపించుకున్నారు. ఇక న్యూస్‌పేపర్ల గురించి సోనూ సూద్ మాట్లాడుతూ – ‘‘నా చిన్నప్పుడు పేపర్లు చదివేవాడిని. ప్రతి వార్తనూ చదవకపోయినా నా తల్లిదండ్రుల కోసం చదివేవాడిని. అది అలవాటుగా మారిపోయింది. అలాగే మా స్కూల్లో ప్రతి రోజూ 20 వార్తల గురించి చెప్పాలి. అందుకని పేపర్ చదవడం అనేది నా హోమ్‌వర్క్‌లో భాగం అయ్యేది. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పాఠశాలల్లో ఇలాంటి కార్యకలాపాలు తప్పనిసరి చేయాలని నేను భావిస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment