వాషింగ్టన్: అమెరికాలోని కొన్ని వార్తా పత్రికలు అసత్య కథనాలు రాస్తాయని మండిపడే అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌజ్‌కు వచ్చే వార్తా పత్రికల్లో కొన్నింటి చందాలను రద్దు చేశారు. ఆయన ఆగ్రహానికి గురైన దినపత్రికల్లో వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ఉన్నాయి. ఈ పత్రికల చందాలను మిగతా ప్రభుత్వ సంస్థలు కూడా రద్దు చేసుకోవాలని ట్రంప్ సూచించారు. ఈ మేరకు వైట్‌హౌజ్ ప్రతినిధులు ప్రకటించారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అన్ని ప్రభుత్వ సంస్థలు ఇలా చేస్తే చాలా ఆదా అవుతుందని వైట్‌హౌజ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment