Washington Post
-
90 ఏళ్లుగా డైరీలు రాస్తూనే ఉంది!
కొందరు డైరీలు రాయరు. కొందరు డైరీ రాసే అలవాటును మధ్యలోనే వదిలేస్తారు. అమెరికాకు చెందిన ఎవీ రిస్కీ అలా కాదు. వంద సంవత్సరాల రిస్కీ తొంభై సంవత్సరాలుగా డైరీలు రాస్తూనే ఉంది... ఎవీ రిస్కీ తండ్రికీ డైరీలు రాయడం అంటే ఎంతో ఇష్టం. కూతురు చిన్న వయసులో ఉన్నప్పుడు కొత్త సంవత్సరం రోజున డైరీని కానుకగా ఇచ్చాడు. ఇక అప్పటినుంచి మొదలైన డైరీ రాసే అలవాటు ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ప్రతిరోజూ డైరీ రాస్తోంది. ఇది ఆమెకు జీవితకాలపు అలవాటు అయింది. చిన్ననాటి నుంచి మొదలైన ఈ అలవాటు వల్ల ఆమె వ్యక్తిగత ప్రయాణంతోపాటు చుట్టూ మారుతున్న ప్రపంచాన్ని కూడా డాక్యుమెంటూ చేస్తూ వస్తోంది.నయాగరా అనే చిన్న పట్టణంలో పెరిగిన రిస్కీ ప్రతి సీజన్ గురించి రాసింది. కుటుంబ ప్రయాణాల నుంచి చారిత్రాత్మక సంచలన ఘటనల వరకు ఎన్నో చేసింది. కష్టకాలంలోనూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ డైరీ రాయడం ఆపలేదు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా డైరీ రాయడం మానలేదు. ఎప్పుడైనా డైరీని చేరుకోలేనంత అనారోగ్యంగా ఉంటే చిత్తు కాగితాలపై నోట్సు రాసి ఆ తరువాత డైరీలో రాసేది. ప్రతిరాత్రి డైరీ రాయడం పూర్తి చేసిన తరువాత గత సంవత్సరం ఆరోజు విషయాలను తెలుసుకోవడం తనకు ఆసక్తిగా ఉంటుంది. ‘వాషింగ్టన్ పోస్ట్’ ఎవీ రీస్కీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆన్లైన్ సెన్సేషన్‌గా మారింది. -
మన్మోహన్‌కు అంతర్జాతీయ మీడియా నివాళులు
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణానికి అంతర్జాతీయ మీడియా సంతాపం తెలిపింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటన నడిపిన నాయకుడని ప్రపంచ మీడియా ప్రశంసించింది. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి: బీబీసీ 1991లో ఆర్థిక మంత్రిగా, 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా భారత ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడంలో మన్మోహన్సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన కీలక సరళీకృత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. భారత అత్యున్నత పదవిని నిర్వహించిన మొదటి సిక్కుగా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నేత. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. పదవులు నచ్చని రాజు: రాయిటర్స్ మన్మోహన్ సింగ్.. పదవులు నచ్చని రాజు. భారత్‌లో అత్యంత విజయవంతమైన నాయకులలో ఒకరు. ఆయన పాలనలో జరిగిన ఆర్థిక వృద్ధి లక్షలాదిమందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చింది. గొప్ప ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందినా.. సోనియాగాంధీ చేతిలోనే ప్రభుత్వం ఉందనే విమర్శలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. దూరదృష్టిగల నేత: న్యూయార్క్ టైమ్స్ మన్మోహన్సింగ్ భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వేదికపైకి నడిపించిన దూరదృష్టి గల నేత, మృదుభాíÙ. పాకిస్తాన్‌తో సయోధ్య కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. సమగ్రతకు చిహ్నం: వాషింగ్టన్ పోస్ట్ మన్మోహన్సింగ్ టెక్నోక్రాట్ నుంచి ప్రధాని స్థాయికి నాటకీయంగా ఎదిగారు. భారత్–అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ఆయన హయాంలో జరిగిన ఇండో–యూఎస్ పౌర అణు ఒప్పందం ఒక మైలురాయి. సమగ్ర నాయకుడైన ఆయన శక్తిహీనులని ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తి: బ్లూమ్‌బర్గ్ మన్మోహన్సింగ్ గొప్ప సంస్కర్త. 1990లలో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అవినీతి కుంభకోణాలతో రెండో పర్యాయంలో ఆయన సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇది పెట్టుబడిదారులను నిరాశపరిచింది. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది. ఎల్లలెరుగని స్నేహితుడు: ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో మన్మోహన్సింగ్ పాత్ర అమోఘం. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఆయన చేసిన కృషి, సంస్కరణలు ఆయన పదవీకాలంలో మైలురాళ్లు. సామాజిక విధానం, దౌత్యంలో ఆయన నాయకత్వం గొప్పది. 2జీ స్పెక్ట్రమ్ కేసు, బొగ్గు కుంభకోణం వంటి వివాదాలు ఆయన తర్వాతి కాలాన్ని దెబ్బతీశాయి. సౌమ్యుడైన నాయకుడు: అల్ జజీరా మన్మోహన్ సింగ్ సౌమ్య ప్రవర్తన కలిగిన టెక్నోక్రాట్. గొప్ప వ్యక్తిగత సమగ్రత కలిగిన నాయకుడు. దూర దృష్టితో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. -
US Presidential Election 2024: వాషింగ్టన్ పోస్ట్‌కు హారిస్ దెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు పలకాలని గత వారం ‘వాషింగ్టన్ పోస్ట్’వార్తాసంస్థ తీసుకున్న నిర్ణయం తాజాగా ఆ సంస్థ సర్కులేషన్‌కు ఎసరుపెట్టింది. హారిస్‌కు మద్దతు పలుకుతున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ‘తటస్థ’వైఖరిని అవలంభించాలని సంస్థను ఇటీవల కొనుగోలుచేసిన ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తాజాగా ఆదేశించడమే ఇందుకు అసలు కారణం. అసలేం జరిగింది? కమలా హారిస్‌కు మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పత్రిక ఎడిటోరియల్ సిబ్బంది గత వారం ప్రకటించారు. ఇది నచ్చని యజమాని, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వెంటనే రంగంలోకి దిగారు. ‘అధ్యక్ష అభ్యర్థికి మద్దతు పలకడం అనేది పక్షపాత భావనను సృష్టిస్తుంది. ఇది పాఠకుల ఆలోచనా స్వాతంత్య్రాన్ని పోగొట్టడమే అవుతుంది. అందుకే అధ్యక్ష అభ్యర్థులకు మద్దతు పలికే సంప్రదాయాన్ని అంతం చేయాలని కోరుకుంటున్నా. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, నాకు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ సీఈఓ డేవ్ లింప్ మధ్య అక్టోబర్ 25న భేటీ జరిగింది. అయితే ఈ భేటీకి వాషింగ్టన్పోస్ట్ హారిస్‌కు మద్దతు ఇవ్వకూడదన్న నిర్ణయానికి సంబంధం లేదు. ఇది ఉద్దేశపూర్వక వ్యూహం కాదు. ఇక్కడ ఏ విధమైన క్విడ్ ప్రోకో జరగలేదని స్పష్టం చేయదల్చుకున్నా’’అని వ్యాఖ్యానించారు. దీంతో బెజోస్ ఆదేశాలను శిరసావహిస్తూ వాషింగ్టన్ పోస్ట్ ప్రచురణకర్త విల్ లూయిస్ తాజాగా ఒక ప్రకటన విడుదలచేశారు. ‘ఏ అభ్యర్థికి ఓటేయాలనే విచక్షణా సామర్థ్యం అమెరికా ఓటర్లయిన మా పాఠకులకు ఉంది’ అని అందులో పేర్కొన్నారు. దీంతో సోమవారం 2 లక్షల మంది చందాదారులు వాషింగ్టన్పోస్ట్ సభ్యత్వాన్నిరద్దుచేసుకున్నారు. ఇది సంస్థ ప్రింట్, డిజిటల్ సర్కులేషన్ల 8 శాతానికి సమానం. ఈ సంఖ్య మరింతపెరిగే వీలుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కమలా హారిస్‌కు మద్దతుపలికే చందాదారులే తమ సబ్‌స్క్రిప్షన్‌ను వదులుకున్నట్లు వార్తలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం లాస్ ఏంజిల్స్ టైమ్స్ సైతం ఏ అభ్యర్థికీ మద్దతు ప్రకటించకూడదని నిర్ణయించింది. అభ్యర్థికి పత్రిక ఆమోదం ఎందుకు? అధ్యక్ష అభ్యర్థులను సమర్థించే వార్తాపత్రిక ఎడిటోరియల్ పేజీల సంప్రదాయం అమెరికాలో శతాబ్దానికి పైగా ఉంది. వార్తా పత్రికలు తాము విశ్వసించే అభ్యర్థిని సమర్థించడం ద్వారా సమాచారంతో కూడిన ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాయి. మద్దతు పలకడం అనగానే ఆ వార్తాసంస్థ ఆ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తోందని కాదు. పత్రిక పాత్రికేయ విలువలకు కట్టుబడి పనిచేస్తూనే నిష్పాక్షిక కవరేజీని అందిస్తాయి.ఆ అభ్యర్థి ఏరకంగా అధ్యక్ష పదవికి అర్హుడో వాస్తవకోణంలో తెలియజేయస్తాయి. ఓటేసేటపుడు ఏది ఉత్తమ నిర్ణయమో పాఠకులకు తెలియజేయడం ఈ మద్దతు అంతిమ లక్ష్యం. అనేక వార్తాపత్రికలకు అభిప్రాయాలు, మద్దతును ప్రకటించేందుకు ప్రత్యేకంగా ఎడిటోరియల్ బోర్డ్‌లు ఉన్నాయి. భారత్‌లో ఇలాంటి సంప్రదాయం లేదు. కానీ అనధికారికంగా కొన్ని వార్తాపత్రికలు, టీవీ చానళ్లు తాము మెచ్చిన అభ్యర్థి/రాజకీయ పార్టీకి అనుకూలంగా అత్యధిక కవరేజీ ఇచ్చే ధోరణి మాత్రం భారత్‌లో బాగా పెరిగింది. ఏ ప్రాతిపదికన సమరి్థస్తారు? అభ్యర్థి గెలిచి అధ్యక్షుడయ్యాక పరిపాలన ఎలా ఉండొచ్చు? హామీలను నెరవేర్చడానికి అమలుకు పక్కా ప్రణాళిక ఉందా?. మన వార్తాసంస్థ విలువలకు అనుగుణంగా ఏ అభ్యర్థి ఉన్నారు? అసలు అధ్యక్షుడయ్యే అర్హత ఆ అభ్యర్థికి ఉందా? అంతర్జాతీయ పరిణామాలను అవపోశన పట్టి అగ్రరాజ్య అధిపతిగా నెగ్గుకురాగలడా? వంటివి పరిగణనలోకి తీసుకుని వేర్వేరు వార్తాసంస్థలు తమకు నచ్చిన అభ్యర్థికేే మద్దతు ప్రకటిస్తాయి. అయితే అమెరికాలో వార్తాపత్రికలు బలపరిచిన అభ్యర్థులు ప్రతిసారీ గెలవలేదనే వాదన కూడా ఉంది. 1897లో దాదాపు అన్ని న్యూయార్క్ వార్తాపత్రికలు మద్దతు పలికిన అభ్యర్థులు ఓటమిని చవిచూడటం గమనార్హం. కానీ న్యూయార్క్ టైమ్స్ అధ్యయనం ప్రకారం 1940 నుంచి 2016 వరకు జరిగిన దాదాపు అన్ని అధ్యక్ష ఎన్నికల్లోనూ అత్యధిక వార్తాపత్రికల మద్దతు అందుకున్న అభ్యర్థే అధికారాన్ని కైవసం చేసుకుని శ్వేతసౌధంలో అడుగుపెట్టగలిగారు. ఈసారి ఎందుకు వివాదాస్పదమైంది?అనుకూల, ప్రతికూల అనే అంశాలను పక్కనబెడితే అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన అభ్యర్థుల్లో ట్రంప్ ఒకరు. అతని అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయాలు అమెరికన్లను తీవ్రంగా విభజించాయి. డెమొక్రటిక్ అభ్యర్థి గెలిస్తే అమెరికా నాశనమవుతుందని ట్రంప్ బలంగా ప్రచారంచేశారు. 2016లో తొలిసారి గెలిచినప్పటి నుంచి మీడియాలో వస్తున్న విమర్శలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి వార్తా పత్రికలను ఫేక్ న్యూస్ అని పదేపదే ఖండించారు. ఈ నేపథ్యంలో ఎండార్స్మెంట్ విషయమై వాషింగ్టన్ పోస్ట్, లాస్ఏంజిల్స్ టైమ్స్ వెనుకంజ వేయడానికి వ్యాపారపరమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది. జెఫ్ బెజోస్ కంపెనీ అమెజాన్‌కు అమెరికా ప్రభుత్వంతో బిలియన్ డాలర్ల క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాలు ఉన్నాయి. ఆయన రాకెట్ కంపెనీ బ్లూ ఆరిజిన్‌కు స్పేస్ ఫోర్స్, నాసాతో ఒప్పందాలున్నాయి. 2023లో డెమొక్రాట్ల బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ ట్రస్ట్ దావాను కూడా అమెజాన్ ఎదుర్కొంటోంది. బయోఫార్మా ఇన్నోవేటర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సూన్–షియోంగ్ ప్రస్తుతం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి అవసరమయ్యే కొత్త మందులపై పనిచేస్తున్నారు. విజయావకాశాలు 50–50 ఉన్నాయని సర్వేలు చెబుతుండటంతో ట్రంప్‌ను గెలిపిస్తే తమ వ్యాపార ఒప్పందాలకు ఢోకా ఉండబోదని వ్యాపార దిగ్గజాలు భావించి ఉంటారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. -
క్రౌడ్‌స్ట్రైక్ అతలాకుతలం
వాషింగ్టన్: ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం సాంకేతిక సమస్య ఆర్థికంగా కూడా అంతర్జాతీయంగా గట్టి ప్రభావమే చూపింది. పలు దిగ్గజ సంస్థల షేర్ల విలువ తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా తప్పుడు అప్డేట్తో సమస్యకు కారణమైన సైబర్ సెక్యూరిటీ దిగ్గజం క్రౌడ్‌స్ట్రైక్‌కు ఆర్థికంగా గట్టి దెబ్బే తగిలింది. శుక్రవారం ఆ సంస్థ షేర్ వాల్యూ ఒక్కసారిగా 11 శాతానికి పైగా పడిపోయింది. 42.22 డాలర్లున్న ఒక్కో వాటా విలువ 30 డాలర్లకు తగ్గింది. సంస్థ మొత్తం విలువ 83 బిలియన్ డాలర్ల పై చిలుకని అంచనా. ఆ లెక్కన 900 కోట్ల డాలర్లకు పైగా హరించుకుపోయినట్టే. అయితే ఆర్థిక నష్టం కంటే కూడా ప్రపంచంలోనే అగ్రశ్రేణి సైబర్ సెక్యూరిటీ సంస్థగా క్రౌడ్‌స్ట్రైక్‌కు ఉన్న ఇమేజీకి జరిగిన నష్టమే చాలా ఎక్కువ. ఎందుకంటే దాని కస్టమర్లుగా ఉన్న కంపెనీలు, పెద్ద సంస్థల్లో చాలావరకు తమ సైబర్ సెక్యూరిటీ బాధ్యతల కోసం ఇతర సైబర్ సెక్యూరిటీ సంస్థలవైపు చూస్తున్నట్టు సమాచారం. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ ఇప్పటికే ఈ జాబితాలో చేరారు. ‘‘మా వ్యవస్థల నుంచి క్రౌడ్స్ట్రౌక్ను తొలగించేశాం’’ అంటూ ఆయన సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశారు. సెంటినల్ వన్, పాలో ఆల్టో నెట్వర్క్ వంటి క్రౌడ్ర్స్టౌక్ ప్రత్యర్థి కంపెనీలు ఈ పరిస్థితిని రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్నాయి. భారీ పరిహారాలు! మరోవైపు క్రౌడ్‌స్ట్రైక్ కస్టమర్లంతా తమకు జరిగిన నష్టానికి ఆ సంస్థ నుంచి భారీగా నష్టపరిహారం డిమాండ్ చేసేలా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు ఆ సంస్థ క్లయింట్ల జాబితాలో ఉండటం తెలిసిందే. షట్‌డౌన్ దెబ్బకు వాటి షేర్ల విలువ సగటున ఒక శాతం దాకా పడిపోయినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
పన్నూ హత్యకు కుట్ర: వాషింగ్టన్ రిపోర్టుపై స్పందించిన యూఎస్
న్యూయార్క్: అమెరికాలో జరిగిన ఖలీస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య చేసేందుకు ఓ భారతీయ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన నివేదికపై అమెరికా స్పందించింది. పన్నూ హత్య కుట్రకు సంబంధించిన ఆరోపణల దర్యాప్తులో తాము నిరంతరం భారత్‌తో టచ్‌లో ఉండి, ఈ వ్యవహారంపై పని చేస్తున్నామని అగ్రరాజ్యం అధికార ప్రతినిధి వేదాంత పటేల్ తెలిపారు.‘పన్నూ హత్య కుట్రకు సంబంధించి భారత్ ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ విచారణపై పూర్తి జవాబుదారితనాన్ని ఆశిస్తున్నాం. అమెరికా.. భారత్‌తో ఈ విషయంలో నిత్యం టచ్‌లో ఉంటుంది. ఈ కేసులో పురోగతి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. మరింత సమాచారం తెలుసుకుంటున్నాం. పలు స్థాయిల్లో అమెరికా ఆందోళనను ప్రత్యేక్షంగా భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. నేను ఈ విషయంలో మరింత జోక్యం చేసుకోలేను’ అని వేదాంత పటేల్ తెలిపారు.ఇక.. వాషింగ్టన్ పోస్ట్ వెల్లండించిన నివేదికపై భారత్ తీవ్రంగా ఖండించింది. ‘వాషింగ్టన్ పోస్ట్ కథనం పూర్తిగా అసమంజసం, నిరాధారమం. క్రిమినల్, ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. అయినప్పటికీ ఊహాగానాలు, బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు’ భారత్ విదేశంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ అన్నారు.ఈ కేసులో కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాకు సీసీ-1 అనే పేరు తెలియని అధికారి ప్రమేయం ఉన్నట్లు అమెరికా పేర్కొంది. అయితే తాజాగా వాషింగ్టన్ పోస్ట్ ఆ అధికారిని విక్రమ్ యాదవ్‌గా గుర్తించింది. అమెరికా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్ 2023 నవంబర్‌లో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
పన్నూ హత్యకు కుట్ర.. యూఎస్ మీడియా రిపోర్డును ఖండించిన భారత్
ఢిల్లీ: అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్యచేసేందుకు భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రణాళికా రచించాడని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన నివేదికను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత రా(RAW)మాజీ అధికారి విక్రమ్ యాదవ్ అమెరికాలో గురుపత్వంత్ సింగ్‌ను హత్య చేయాలని ఓ బృందాన్ని ఏర్పాటు చేశారని వాషింగ్టన్ పోప్ట్ తన రిపోర్టులో తెలిపింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. ‘వాషింగ్టన్ పోస్ట్ కథనం పూర్తిగా అసమంజసం, నిరాధారమం. క్రిమినల్, ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. అయినప్పటికీ ఊహాగానాలు, బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు’ అని అన్నారు. ఈ కేసులో కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాకు సీసీ-1 అనే పేరు తెలియని అధికారి సాయం చేసినట్లు అమెరికా పేర్కొంది. అయితే తాజాగా వాషింగ్టన్పోస్ట్ ఆ అధికారిని విక్రమ్ యాదవ్‌గా గుర్తించింది. ఈ కేసులో అమెరికా తరచూ చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్ 2023 నవంబర్‌లో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
భారత్ టార్గెట్‌గా చైనా నిఘా బెలూన్లు!
వాషింగ్టన్: నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా.. మరిన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుందనే సమాచారం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్‌తో పాటు జపాన్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్.. ఇలా మరికొన్ని దేశాలపైనా సర్వేయిలెన్స్ బెలూన్లను ప్రయోగించిందని, ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని సేకరించే యత్నం చేసిందని కథనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ వార్తా ప్రచురణ సంస్థ ది వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్ నుంచి నిఘా బెలూన్ల ప్రయత్నం కొనసాగిందని.. జపాన్, భారతదేశం, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌తో సహా పలు దేశాల సైనిక సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరిగిందని ఆ కథనం పేర్కొంది. ఇందుకు సంబంధించి పలువురు నిఘా అధికారులు, భద్రతా విభాగానికి చెందిన ప్రముఖుల నుంచి అభిప్రాయాలను సేకరించి.. ప్రచురించింది ఆ కథనం. ఈ పరిణామంపై భారత్ నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. వాషింగ్టన్ పోస్ట్ కథనానికి కొనసాగింపుగా.. అమెరికా భద్రతా అధికారులు భారత్ సహా మిత్ర దేశాలను చైనా నిఘా బెలూన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు తాజాగా యుద్ధ విమానాల ద్వారా చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన విషయాన్ని.. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఆ బెలూన్ల శకలాలను సేకరించిన విషయాన్ని సైతం మిత్ర దేశాలకు నివేదించింది అమెరికా. గత మూడురోజులుగా 40 మిత్ర దేశాలకు చెందిన భద్రతా ప్రతినిధులు, దౌత్యవేత్తలతో పెంటగాన్ అధికారులు ‘చైనా నిఘా బెలూన్ల వ్యవహారం’పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సర్వేయలెన్స్ ఎయిర్‌షిప్స్‌గా భావిస్తున్న ఈ బెలూన్లు.. చైనా ఆర్మీ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) ద్వారానే ప్రయోగించబడుతున్నాయని, ఐదు ఖండాల్లో వీటి ఉనికి గుర్తించినట్లు అమెరికా భద్రతా అధికారులు చెబుతున్నారు. ఇది ఇతర దేశాల సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించడేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చైనా మాత్రం అవి శాటిలైట్ సంబంధిత ఎయిర్‌షిప్స్ తప్ప.. నిఘాకు సంబంధించినవి కాదని వాదిస్తోంది. ఈ మేరకు బెలూన్ కూల్చివేతపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. అమెరికా మాత్రం ఈ ఘటనతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీయదనే ఆశాభావం వ్యక్తం చేశారు బైడెన్. అలాగే.. పేలిన శకలాలను ఎట్టి పరిస్థితుల్లో చైనాకు అప్పగించబోమని స్పష్టం చేశారు. గత వారం రోజులుగా.. హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువాం ప్రాంతాల్లో చైనా బెలూన్లు దర్శనమిచ్చాయి. ఇందులో మూడు ట్రంప్ హయాంలోనే గగనతలంలో విహరించేందుకు అనుమతులు లభించాయని.. అయితే అవి చైనా నిఘా బెలూన్లు అనే విషయం తాజాగానే వెల్లడైందని భద్రతా అధికారుల నివేదిక వివరిస్తోంది. -
ఫేస్బుక్లో అన్‌ఫాలో కలకలం
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో బుధవారం ఉదయం నుంచి కొన్ని గంటల సేపు గందరగోళం నెలకొంది. ఫేస్బుక్ వినియోగదారుల ఫాలోవర్ల సంఖ్య రాత్రికి రాత్రి అమాంతంగా పడిపోవడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనూహ్యంగా భారీ సంఖ్యలో తమ ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతున్నట్టు చాలా మంది వినియోగదారులు ఆందోళన చెందారు. దీనికి కారణాలు తెలీక గగ్గోలు పెట్టారు. చివరికి మెటా కంపెనీ వ్యవస్థపాకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు తిప్పలు తప్పలేదు. జుకర్‌బర్గ్‌కు 11.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే ఏకంగా 10 వేలకు పడిపోవడంతో కలకలం నెలకొంది. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, యూఎస్ఏ టుడే వంటి అమెరికన్ మీడియా ఖాతాల ఫాలోవర్ల సంఖ్య పడిపోయింది. రచయిత్రి తస్లీమా నస్రీన్ ఫాలోవర్ల సంఖ్యపై ఆందోళన చెందుతూ ట్వీట్ చేశారు. ‘ఫేస్బుక్ సృష్టించిన సునామీతో తొమ్మిది లక్షల మంది ఉన్న నా ఫాలోవర్ల సంఖ్య కేవలం 9,000కు పడిపోయింది. జుకర్‌బర్గ్ ఫాలోవర్లు తగ్గిపోవడం మరీ విడ్డూరం’ అని ఆమె ట్వీట్ చేశారు. ఎందరో ప్రముఖుల ఫాలోవర్ల సంఖ్య పడిపోవడంతో ఫేస్బుక్ ప్రతినిధులు వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. సాయంత్రానికి అందరి ఖాతాల ఫాలోవర్లు సాధారణ స్థితికి చేరుకోవడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకిలా జరిగింది ? ఫేస్బుక్లో ఫాలోవర్ల సంఖ్య పడిపోవడానికి మెటా సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ రకరకాల విశ్లేషణలు చేస్తూ నెటిజన్లు పలు పోస్ట్‌లు పెట్టారు. ఫేస్బుక్లో బాట్ అకౌంట్ల ప్రక్షాళనకు దిగడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ బాట్ అకౌంట్ల సాయంతో ఆటోమేటిక్‌గా మెసేజ్‌లు పంపడం, ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడం వంటివి చేయొచ్చు. వీటిని తొలగించే క్రమంలో సాంకేతిక లోపాలు తలెత్తి భారీ గందరగోళానికి దారి తీసిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్లో కొత్త ఆల్గారథిమ్ ప్రయోగించడంతో ఇలా జరిగిందనే అనుమానాలు కొందరు వ్యక్తంచేశారు. -
ప్రధాని మోదీని ఆకాశానికెత్తిన అమెరికా మీడియా
భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా మీడియా ఆకాశానికెత్తింది. ఉజ్బెకిస్థాన్‌లో నిర్వహించిన ఎస్సీఓ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని సూచించడంపై ప్రశంసలతో ముంచెత్తింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను హైలైట్ చేస్తూ అమెరికా ప్రముఖ వార్తా సంస్థలు, వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్ తమ పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా ప్రచురించాయి. 'సమకాలీన ప్రపంచంలో యుద్ధానికి తావులేదు.. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించండి' అని మోదీ పుతిన్‌తో అన్నారు అంటూ వాషింగ్టన్ పోస్టు హెడ్లైన్లో చెప్పింది. దీంతో రష్యా అధ్యక్షుడు ప్రపంచ నలుమూలల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు అయిందని పేర్కొంది. మోదీకి బదులిస్తూ.. యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగిస్తామని పుతిన్ మాటిచ్చారని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. భారత్ ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని, చర్చల ప్రక్రియను ఉక్రెయిన్ బహిష్కరించడం వల్లే సైన్యం ఇంకా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పుతిన్ చెప్పినట్లు వెల్లడించింది. ఎస్సీఓ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా పుతిన్‌లో మాట్లాడారు. కానీ ఉక్రెయిన్ యుద్ధం గరించి ఒక్క మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. మోదీ మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తి యుద్ధాన్ని ఆపాలని కోరడాన్ని అమెరికా మీడియా కొనియాడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత పుతిన్‌తో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే పలుమార్లు ఫోన్లో ఈ విషయంపై మాట్లాడారు. చదవండి: బీజేపీ హర్ట్ అయ్యింది.. కారణం ఇదే: కేజ్రీవాల్ -
జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలే లక్ష్యం
బోస్టన్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పెగసస్ స్పైవేర్ ప్రధాన లక్ష్యం జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలేనని అంతర్జాతీయ మీడియా పరిశోధనలో తేలింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ పలువురు ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసిందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. స్పైవేర్‌తో సంపాదించిన 50వేలకు పైగా ఫోన్ నెంబర్ల జాబితా ఫొరిబిడెన్ స్టోరీస్ అనే ఎన్జీఓకు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు దొరికింది. ఈ జాబితాను ప్రముఖ మీడియా గ్రూపులు విశ్లేషించాయి. 50 దేశాల్లో వెయ్యికి పైగా కీలక వ్యక్తులు నెంబర్లను ఇందులో గుర్తించారు. వీరిలో 189 మంది జర్నలిస్టులు, 600మంది రాజకీయవేత్తలు, 65మంది వ్యాపారులు, 85మంది మానవహక్కుల కార్యకర్తల నెంబర్లు ఇందులో ఉన్నాయని వాషింగ్టన్ పోస్టు ప్రకటించింది. సీఎన్ఎన్, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్ తదితర దిగ్గజ సంస్థల జర్నలిస్టుల నెంబర్లు ఈ జాబితాలో ఉన్నాయని తెలిపింది. ప్రముఖ జర్నలిస్టు ఖషోగ్గి హత్యకు నాలుగు రోజుల ముందు ఆయనకు కాబోయే భార్య ఫోనులో ఈ స్పైవేర్ ఇన్‌స్టాలైందని అమ్నెస్టీ తెలిపింది. ఈ ఆరోపణలన్నింటినీ ఎన్ఎస్ఓ కొట్టిపారేసింది. తాము ఎప్పుడూ ఎలాంటి టార్గెట్ల జాబితాను ఉంచుకోవమని తెలిపింది. తమపై వచ్చిన కథనాలు నిరాధారాలని నిందించింది. అయితే ఈ వివరణలను విమర్శకులు తోసిపుచ్చుతున్నారు. కాగా, తమకు లభించిన జాబితాలో 15వేలకు పైగా నంబర్లు మెక్సికోకు చెందినవని మీడియా వర్గాలు తెలిపాయి. తర్వాత అధిక సంఖ్యలో మధ్యప్రాచ్యానికి చెందిన ఫోన్లున్నట్లు తెలిపాయి. నిఘా స్పైవేర్‌కు సంబంధించి ఎన్ఎస్ఓ గ్రూప్‌పై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గతేడాది ఇజ్రాయిల్ కోర్టులో దావా వేసింది. అయితే సరైన ఆధారాలు లేవని కోర్టు ఈ పిటిషన్ కొట్టేసింది. ఆటంకవాదుల నివేదిక: షా పెగసస్ స్పైవేర్ అంశంపై కాంగ్రెస్, అంతర్జాతీయ సంస్థలపై హోంమంత్రి అమిత్‌షా ఎదురుదాడి చేశారు. ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టారన్న నివేదికను భారత ప్రగతిని అడ్డుకునేందుకు కుట్రతో ఆటంకవాదులు రూపొందించిన అవాంతరాల నివేదికగా అభివర్ణించారు. పార్లమెంట్ సమావేశాల తరుణంలోనే ఎంపిక చేసినట్లు లీకేజీలు బయటకు రావడాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి ఇలాంటి దాడులు ఊహించినవేనని షా విమర్శించారు. వారి పార్టీని వారు సరిదిద్దుకోలేని వారు పార్లమెంట్లో అభివృద్ధికర అంశాలను అడ్డుకునే యత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో ప్రజాసంక్షేమాన్ని వదిలి ఇలాంటి అసత్య నివేదికలతో సభా సమయం వృధా చేయడం మంచిది కాదని హితవు చెప్పారు. జాబితాలో రాహుల్, ప్రశాంత్ నంబర్లు! కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పాటిల్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ఫోన్ నంబర్లు పెగసస్ హ్యాకింగ్ జాబితాలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. పెగసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికిపైగా భారతీయులున్నట్లు ‘ది వైర్’ వార్తా సంస్థ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు ఉద్యోగి, ఆమె చుట్టాల నంబర్లు ..ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీప్ కాంగ్, వసుంధరరాజే పర్సనల్ సెక్రటరీ తదితరులున్నారు. భారత్‌పై బురద జల్లేందుకే...! పెగాసస్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి పలువురు ప్రముఖులపై నిఘా పెట్టారన్న వార్తలను కేంద్రం ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కొట్టిపారేశారు. పార్లమెంట్ సమావేశాలు ఆరంభమవుతున్నవేళ దేశ ప్రజాస్వామ్యానికి అపత్రిçష్ట అంటించేందుకే ఈ కథనాలను వండివారుస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎంతో పటిçష్టమైన వ్యవస్థలున్నాయని, అందువల్ల భారత్‌లో అక్రమ, అనైతిక నిఘా అసాధ్యమని చెప్పారు. ఈఅంశాన్ని పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేవనెత్తడంతో మంత్రి లోక్‌సభలో ఈ వివరణ ఇచ్చారు. మీడియా జాబితాలో ఫోన్ నెంబరున్నంతమాత్రాన హ్యాకింగ్ జరిగినట్లు కాదని ఐటీ మంత్రి వ్యాఖ్యానించారు. పెగాసస్‌ను ప్రభుత్వం వాడుతున్నదీ లేనిదీ తెలపలేదు. అమిత్‌షా తొలగింపునకు కాంగ్రెస్ డిమాండ్ జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టిన పెగసస్ స్పైవేర్ అంశంలో హోంమంత్రి అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ప్రధాని మోదీ పాత్రపై లోతైన విచారణ జరపాలని కోరింది. పెగసస్ అంశానికి షానే బాధ్యత వహించాలని, ఆయన్ను తొలగించాలన్నదే తమ ప్రధాన డిమాండని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఇతర పార్టీల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ విషయంపై న్యాయ లేదా పార్లమెంటరీ విచారణ కోరే అంశమై అన్ని పార్టీలతో కాంగ్రెస్ చర్చిస్తుందన్నారు. హోంమంత్రి పదవికి షా అనర్హుడని రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. డిజిటల్ ఇండియా అని మోదీ చెబుతుంటారని, కానీ నిజానికి ఇది నిఘా ఇండియా అని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ దుయ్యబట్టారు. షాను వెంటనే ఎందుకు తొలగించరని ప్రశ్నించారు. ఈ నిఘా వ్యవహారం మొత్తం మోదీ ప్రభుత్వ కన్నుసన్నులోనే జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మోదీ, అమిత్‌షా స్పందించాలి పెగసస్‌తో ప్రముఖుల సమాచారం హ్యాక్ అయిందన్న వార్తలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా స్పందించాలని శివసేన డిమాండ్ చేసింది. దేశంలో ప్రభుత్వం, యంత్రాంగం బలహీనంగా ఉన్నాయని ఈ ఘటన చెబుతోందని సేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ప్రజలకు ప్రధాని, హోంమంత్రి ఈ అంశంపై స్పష్టతనివ్వాలని ఆయన కోరారు. -
కిమ్ చాలా తెలివైన వాడు
వాషింగ్టన్: వాషింగ్టన్ పోస్ట్ ఎడిటర్, సీనియర్ పాత్రికేయుడు 77 ఏళ్ళ బాబ్ వుడ్‌వర్డ్ రాసి ‘రేజ్’ ’పేరుతో ప్రచురించిన పుస్తకంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతరంగం స్పష్టమైంది. సీనియర్ జర్నలిస్టు వుడ్‌వర్డ్ గత డిసెంబర్ నుంచి జూలై వరకు పలు దఫాలుగా జరిపిన 18 ఇంటర్వ్యూల వివరాలను పుస్తకరూపంలో తీసుకొచ్చారు. 2018లో సింగపూర్‌లో ఉత్తర కొరియా అ«ధ్యక్షుడు కిమ్‌ని మొదటిసారి కలిసినప్పుడే తనని ఆకట్టుకున్నాడని, కిమ్ చాలా తెలివైన వ్యక్తి అనీ, ఆయన తనకి అన్ని విషయాలు చెప్పాడనీ, చివరకు తన సొంత అంకుల్ని చంపిన వైనాన్నీ గ్రాఫిక్స్‌లో వివరించాడని ట్రంప్ పేర్కొన్నట్టు పుస్తక రచయిత వెల్లడించారు. కిమ్‌తో అణ్వాయుధాలపై జరిగిన చర్చలను ప్రస్తావిస్తూ, ఉత్తర కొరియా అణ్వాయుధాల తయారీని ఎప్పటికీ వీడబోదని, అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల అంచనాలు తప్పని ట్రంప్ కొట్టిపారేశారు. ఉత్తర కొరియాని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో సీఐఏకీ తెలియదని ట్రంప్ చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అవసరం లేని రేటింగ్ ఇచ్చారని ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశంలో గతంలో ఎప్పుడూ లేని అణ్వాయుధ వ్యవస్థని ఏర్పాటు చేశానని, అమెరికాకి ఉన్న రహస్య ఆయుధాలు ప్రపంచంలో మరెవ్వరికీ లేవని, ట్రంప్ చెప్పినట్లు ఈ పుస్తక రచయిత పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని కావాలనే తక్కువ చేసి మాట్లాడిన విషయాన్ని అంగీకరించిన ట్రంప్, ప్రజలను భయభ్రాంతుకు గురిచేయడం ఇష్టంలేకనే తానలా మాట్లాడానన్నారు. సెప్టెంబర్ 15న మార్కెట్లోకి విడుదల కానుంది. -
ఖషోగి హత్య కేసులో 8 మందికి శిక్ష
దుబాయ్: వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వ్యాసకర్త, సౌదీ అరేబియా విమర్శకుడు జమాల్ ఖషోగి హత్య కేసులో రియాద్ క్రిమినల్ కోర్టు 8 మందికి శిక్షలు ఖరారు చేసింది. సౌదీ రాకుమారుడు, దేశ పాలనలో ముఖ్యభూమిక పోషిస్తున్న మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై తీవ్ర విమర్శలతో వాషింగ్టన్ పోస్ట్‌లో పలు వ్యాసాలు రాసిన ఖషోగి హత్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఖషోగి 2018లో టర్కీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో హత్యకు గురయ్యారు. సౌదీ ప్రభుత్వమే ఈ హత్య చేయించిందనే ఆరోపణలు వచ్చాయి. రాకుమారుడు సల్మాన్ కార్యాలయంలో పనిచేసిన ఫోరెన్సిక్ నిపుణులు, ఇంటలిజెన్స్, భద్రతా సిబ్బంది నిందితులుగా విచారణను ఎదుర్కొన్నారు. ఖషోగి కుటుంబం క్షమాభిక్ష ప్రసాదించడంతో నిందితుల్లో ఐదుగురు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు. వీరికి 20 ఏళ్ల చొప్పున శిక్ష పడింది. మిగిలిన నిందితుల్లో ఒకరికి పదేళ్లు, మరో ఇద్దరికి ఏడేళ్లు శిక్ష పడింది. -
అణు పరీక్ష ప్రయత్నాల్లో అమెరికా
వాషింగ్టన్: దాదాపు 28 ఏళ్ల తర్వాత అమెరికా మరోసారి అణు పరీక్ష జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రష్యా, చైనాలకు గట్టి హెచ్చరికలు పంపడమే దీని లక్ష్యమని ‘వాషింగ్టన్ పోస్ట్’తన కథనంలో పేర్కొంది. అణు పరీక్ష నిర్వహించడంపై 15న∙ప్రభుత్వ యంత్రాంగం చర్చించింది. చర్చల్లో అంతిమ నిర్ణయం తీసుకోలేదు. ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నదీ లేనిదీ వెల్లడి కాలేదని అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలోని ఓ అధికారి, ఇద్దరు మాజీ అధికారులు వెల్లడించారని ఆ కథనంలో పేర్కొంది. ర్యాపిడ్ టెస్ట్‌తో తన సామర్థ్యాన్ని ప్రదర్శించుకోవడం ద్వారా రష్యా, చైనాలను అమెరికా తన దారికి తీసుకువచ్చి అణ్వాయుధాలకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు అన్నారు. అయితే, ఈ చర్య ద్వారా తన రక్షణ విధానం నుంచి అమెరికా వైదొలిగినట్లే అవుతుందని, ప్రపంచ దేశాల మధ్య తీవ్ర అణ్వాయుధ పోటీకి దారి తీస్తుందని పరిశీలకులు అంటున్నారు. ‘అణ్వాయుధ పోటీని నివారించే ఉద్యమానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ప్రపంచ దేశాల మధ్య ఆయుధ పోటీకి తెరలేస్తుంది. ముఖ్యంగా ఉత్తర కొరియాతో అణు చర్చలకు ఆటంకం కలుగుతుంది. అణు పరీక్షలపై విధించిన మారటోరియంకు ఆ దేశ పాలకుడు కిమ్ కట్టుబడి ఉండకపోవచ్చు. అంతిమంగా, అమెరికా చర్య కొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీస్తుంది’అని ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డారిల్ కింబల్ అన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా రక్షణ విధానం పెనుమార్పులకు లోనయింది. రష్యా, చైనాలు తక్కువ తీవ్రత గల అణు పాటవ పరీక్షలు జరుపుతున్నాయంటూ అమెరికా గతంలో ఆరోపణలు చేసింది. వీటిని ఆయా దేశాలు ఖండించాయి కూడా. చివరిసారిగా అమెరికా 1992లో అణు పరీక్ష నిర్వహించింది. -
భారత్‌కు చైనా సరిహద్దు కాదన్న ట్రంప్
వాషింగ్టన్: పేరుకే అగ్రరాజ్యానికే అధ్యక్షుడే కానీ ఆయనకి భౌగోళిక సరిహద్దులపై కనీస అవగాహన కూడా లేదని తాజా పుస్తకం వెల్లడించింది. ఒకసారి చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీకే షాక్ ఇచ్చారట. ‘భారత్, చైనా సరిహద్దుల్ని పంచుకోవు కదా’అని ట్రంప్ వ్యాఖ్యానించడంతో మోదీ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వాష్టింగ్టన్ పోస్టుకు చెందిన ఫిలిప్ రకర్, కరోల్ లియోన్నింగ్ తమ తాజా పుస్తకం ‘ఏ వెరీ స్టేబుల్ జీనియస్‘లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. ఆ పుస్తకంలో ఏముందంటే ‘‘ఒకసారి మోదీ, ట్రంప్ సమావేశంలో భారత్‌కు, చైనా సరిహద్దు కాదని ట్రంప్ అనడంతో మోదీ ఆశ్చర్యపోయారు. ట్రంప్ ఏ మాత్రం సీరియస్‌గా ఉన్నట్టు కనిపించడం లేదు. అని మోదీ ట్రంప్ సహాయకుడితో వ్యాఖ్యానించారు’’అని ఆ పుస్తకం పేర్కొంది. -
ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష
రియాద్: వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష విధిస్తూ సౌదీ అరేబియా కోర్టు తీర్పుని చ్చింది. విచారణను ఎదుర్కొన్న ఇద్దరు ఉన్నతస్థాయి వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది. సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ షలాన్ అల్ షలాన్ సోమ వారం ఈ విషయాలు తెలిపారు. నేరాన్ని కప్పి ఉంచేందుకు యత్నించారన్న ఆరోపణ లపై ఈ కేసులో మరో ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ కేసులో 11 మంది విచారణను ఎదు ర్కోగా ఐదుగురికి మరణశిక్ష, ముగ్గురికి జైలు విధించగా మిగిలిన వారు నిర్దోషులుగా విడుదలయ్యారు. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ బద్ధ వ్యతిరేకి అయిన ఖషోగ్గీ గత ఏడాది అక్టోబర్ 2న ఇస్తాంబుల్ (టర్కీ)లోని సౌదీ ఎంబసీలో హత్యకు గురయ్యారు. దౌత్య కార్యాలయ అధికారులు ముందు హత్యను నిరాకరిం చినా.. ఘర్షణలో అతడు మరణించినట్లు తర్వాత ఒప్పుకున్నారు. -
వారి నమ్మకాన్ని కాపాడతాం: సుందర్ పిచాయ్
వాషింగ్టన్: వివాదాస్పద అంశాల చర్చ విషయంలో తమ కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొంటోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ప్రయాణ నిషేధ నిర్ణయాన్ని సమర్థించిన సెక్యూరిటీ అధికారి మైల్స్ టేలర్‌ను గూగుల్ నియమించడాన్ని సమర్థించారు. తాజాగా పిచాయ్ మాట్లాడుతున్న ఓ వీడియో లీకైంది. గురువారం పిచాయ్, నిపుణుల సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ముఖ్యంగా కొంతమంది ఉద్యోగుల నమ్మకాన్ని సంస్థ కోల్పోయిందని అంగీకరించారు. ఉద్యోగుల అసంతృప్తిని పరిష్కరించే మార్గాలను చర్చించారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కరన్ భాటియా మాట్లాడుతూ టైలర్‌ను ఇమ్మిగ్రేషన్ పాలసీలో కాకుండా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, జాతీయ భద్రతను పెంపొందించే అంశాలలో అతని సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో ఉద్యోగులు వివాదాస్పద రాజకీయ అంశాలను, కించపరిచే అంశాలను చర్చించొద్దని ఈ వేసవిలో కంపెనీ ఓ మెమోను జారీ చేసింది. అయితే ఎప్పటకప్పుడు ఉద్యోగుల ఫోరమ్‌లను పర్యవేక్షిస్తామని తెలిపింది. గూగుల్ అధికారి బరోసో మాట్లాడుతూ ఫోరమ్‌ల కంటే సాఫ్టవేర్‌ను ఉపయోగించుకొని సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. కంపెనీలో అసభ్య ప్రవర్తన, రహస్య సమాచారాన్ని లీక్ చేయడం స్పష్టమైన కంటెంట్ లేకపోవడం వంటి అంశాలను సాఫ్టవేర్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. -
ట్రంప్ ‘చందాలు’ బంద్
వాషింగ్టన్: అమెరికాలోని కొన్ని వార్తా పత్రికలు అసత్య కథనాలు రాస్తాయని మండిపడే అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌజ్‌కు వచ్చే వార్తా పత్రికల్లో కొన్నింటి చందాలను రద్దు చేశారు. ఆయన ఆగ్రహానికి గురైన దినపత్రికల్లో వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ఉన్నాయి. ఈ పత్రికల చందాలను మిగతా ప్రభుత్వ సంస్థలు కూడా రద్దు చేసుకోవాలని ట్రంప్ సూచించారు. ఈ మేరకు వైట్‌హౌజ్ ప్రతినిధులు ప్రకటించారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అన్ని ప్రభుత్వ సంస్థలు ఇలా చేస్తే చాలా ఆదా అవుతుందని వైట్‌హౌజ్ పేర్కొంది. -
ఖషోగ్గీ హత్య; పూర్తి బాధ్యత నాదే!
రియాద్ : ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో ఖషోగ్గీ హత్యకు గురైన కారణంగా పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఖషోగ్గీని చంపింది ఎవరైనా తానే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మహ్మద్ బిన్ పాలను విమర్శిస్తూ కథనాలు రాసే సౌదీ అరేబియా జాతీయుడు జమాల్ ఖషోగ్గీ... గతేడాది అక్టోబరు 2న టర్కీలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లిన ఖషోగ్గీ అదృశ్యమవడంతో సౌదీ యువరాజే పథకం ప్రకారం అతడిని అంతమొందించాడనే విమర్శలు వెల్లువెత్తాయి. యువరాజు ఆదేశాలతో ప్రత్యేక విమానంలో టర్కీకి వెళ్లిన 11 మంది బృందం అతడిని హత్య చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సైతం సౌదీ యువరాజును తప్పుబట్టింది. ఖషోగ్గీ విషయంలో సౌదీ అధికారులు క్లిష్ట సమస్యలు ఎదుర్కోబోతున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించడంతో మధ్య ప్రాచ్య రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ మొదటి వర్ధంతి సమీపిస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన వార్తా సంస్థ పీబీఎస్ మహ్మద్ బిన్ను ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ సందర్భంగా మహ్మద్ బిన్ మాట్లాడుతూ...‘ మా దేశంలో 20 మిలియన్ మంది ప్రజలు ఉన్నారు. అందులో 3 మిలియన్ల మంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు. నా దగ్గర ఎంతో మంది మంత్రులు, అధికారులు పనిచేస్తారు. నన్ను అడగకుండానే నా ప్రత్యేక విమానాలను వారు తీసుకువెళ్లే అధికారం కలిగి ఉంటారు. పైగా ఖషోగ్గీ హత్య నా హయాంలో జరిగిన కారణంగా బాధ్యత నాదే అని పేర్కొన్నారు. కాగా ఖషోగ్గీ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. గతేడాది అక్టోబరులో తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అయితే ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సౌదీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఖషోగ్గీ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. అయితే ప్రధాన కుట్రదారుడు సల్మానే అయినపుడు విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని నమ్మడం చాలా హాస్యాస్పదమైన విషయమని టర్కీ విమర్శలు గుప్పించింది. -
ప్రపంచ మీడియాకు హెడ్‌లైన్స్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని భారత మీడియా ఆకాశానికెత్తేస్తూ సోమవారం రోజంతా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఆర్టికల్ 370 రద్దుతో పరోక్షంగా ప్రభావం పడే పాకిస్తాన్ మీడియా మోదీ ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేక కథనాలు వండి వారుస్తోంది. ఈ అంశంపై ప్రపంచ మీడియా సంస్థలు ఎలా రిపోర్ట్ చేశాయో ఓసారి చూద్దాం. ది గార్డియన్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుందని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ది గార్డియన్ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌ను విభజించాలన్న నిర్ణయం కూడా నాటకీయ మైన ఎత్తుగడ అని తెలిపింది. ఈ నిర్ణయం తో పాకిస్తాన్ వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందంది. బీబీసీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం అత్యంత ముఖ్యమైన చర్యగా ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ అభివర్ణించింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఉద్రిక్తతలు రాజేసే అవకాశం ఉందంది. సీఎన్ఎన్: ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ చర్య కశ్మీరీలకు మానసికంగా పెద్ద షాక్ కలిగించిందని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సీఎన్ఎన్ సంస్థ పేర్కొంది. భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆ రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపింది. ది వాషింగ్టన్ పోస్ట్: ‘కలహాలకు కొత్త వేదిక’అంటూ భారత ప్రభుత్వ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. భారత్‌లో కశ్మీర్ విలీనమవ్వడానికి ఆర్టికల్ 370 మూలమైందని పేర్కొంది. -
ఖషోగ్గీ హత్య; ఆధారాలు దొరికాయి!
జెనీవా : జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉన్నట్లుగా తనకు ఆధారాలు దొరికాయని యూఎన్ హక్కుల కార్యకర్త ఆగ్నస్ కాలామర్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో సౌదీ రాజు, అధికారులకు వ్యతిరేకంగా ఆధారాలు లభించినందున వారిపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘ఈ కేసులో ఎవరినీ దోషులుగా నిర్ధారించలేం. అయితే కొన్ని ఆధారాలు మాత్రం లభించాయి. సరైన పద్ధతిలో విచారణ జరిపినట్లైతే నిజాలన్నీ బయటకు వస్తాయి. నేరం చేసిన వారితో పాటు వారిని ప్రోత్సహించిన వారి గురించి కూడా బయటపడతుంది. సౌదీ యువరాజుకు ఉన్న అధికారాల పట్ల ఖషోగ్గికి పూర్తి అవగాహన ఉంది. అందుకే ఆయన అంటే కాస్త భయం కూడా ఉండేది. ఖషోగ్గీ హత్య కేసును విచారించడంలో సౌదీ, టర్కీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయి. క్రైమ్‌సీన్‌లో ఆధారాలన్నీ మాయమయ్యాయి. దీన్ని బట్టి ఈ కేసు పట్ల ఇరు ప్రభుత్వాలకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది’ అని ఆమె తన నివేదిక(ఆర్బిటరీ ఎగ్జిక్యూషన్)లో పేర్కొన్నారు. కాగా సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. ఇక కొంతకాలం క్రితం ఖషోగ్గి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఖరీదైన బంగ్లాలు, పెద్ద మొత్తంలో సౌదీ ప్రభుత్వం డబ్బు అందజేసినట్లు వాషింగ్టన్ పోస్టు నివేదించింది. ఈ క్రమంలో ఖషోగ్గీ కేసును నీరుగార్చేందుకే ఆయన సంతానానికి రాజు కానుకలు ఇస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. -
వారికి ఖరీదైన ఇళ్లు, పెద్దమొత్తంలో డబ్బు!
వాషింగ్టన్ : ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి సంతానానికి సౌదీ ప్రభుత్వం భారీ సహాయం అందజేసిందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఈ మేరకు ఖషోగ్గి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఖరీదైన బంగ్లాలు, పెద్ద మొత్తంలో డబ్బు అందజేసినట్లు పేర్కొంది. పోర్టు సిటీ జెడ్డా సమీపంలో దాదాపు నాలుగు మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు ఇవ్వడంతో పాటు.. నెలకు పది వేల డాలర్ల చొప్పున వారికి చెల్లించేందుకు సిద్ధమైందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ పెద్ద కుమారుడు మాత్రమే సౌదీలో నివసించాలని అనుకుంటున్నాడని.. మిగతా వాళ్లంతా ఇక్కడ ఉన్న తమ ఆస్తులు అమ్మేసి అమెరికా వెళ్లి పోవాలనుకుంటున్నారని కథనం ప్రచురించింది. ఇక ఇస్తాంబుల్‌కు చెందిన పీహెచ్డీ స్కాలర్ హేటీస్ సెనీజ్ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఖషోగ్గీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఇది వరకే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరిలో ముగ్గురికి అమెరికా పౌరసత్వం ఉంది.(మా నాన్నే మాకు నిరంతర ప్రేరణ) కాగా సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. ఈ క్రమంలో ఆయన సంతానానికి సౌదీ యువరాజు భారీ ఎత్తున సహాయం అందించడం గమనార్హం. -
హ్యాకైన అమెజాన్ సీఈఓ ఫోన్
సాక్షి, వాషింగ్టన్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్‌కు గురైంది. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులు ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్టు సమాచారం. జెఫ్ బెజోస్ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడానికే హ్యాకింగ్ జరిగినట్టు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో కాలమిస్ట్ అయిన జమాల్ ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు సౌదీ ప్రభుత్వమే కారణమంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. దీనికి ప్రతిచర్యగా బెజోస్ ఫోన్‌ను సౌదీ హ్యాక్ చేసిందని, ఆయనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సౌదీ అధికారులు దొంగిలించారని బెజోస్ సెక్యూరిటీ అధికారి గవిన్ బెకర్ తెలిపారు. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని గెవిన్ బెకర్ అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఖషోగ్గి హత్యను ప్రిన్స్ సల్మాన్ చేయించారని అమెరికా ఇంటెలిజన్స్ సంస్థ సీఐఏ సెనేట్‌కు సమాచారమందించింది. -
తప్పుడు ప్రకటనల్లో ట్రంప్ రికార్డు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ 8,158 సార్లు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అధ్యక్షుడిగా ట్రంప్ ఆదివారం నాటికి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫ్యాక్ట్ చెకర్స్ డేటాబేస్’అనే కంపెనీ ట్రంప్ చేసిన ప్రతీ అనుమానిత తప్పుడు సమాచారాన్ని విశ్లేషించింది. తొలి ఏడాదిలో రోజుకు సరాసరి 5.9 తప్పుడు ప్రకటనలు చేశారని, రెండో ఏడాదికి వచ్చే సరికి ఆ సంఖ్య మూడు రెట్లు పెరిగి, రోజుకు 16.5 తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని పేర్కొంది. మొత్తం 8,158 తప్పుడు ప్రకటనల్లో దాదాపు 6 వేలకు పైగా ప్రకటనలు రెండో ఏడాదే చేశారని తెలిపింది. అధ్యక్షుడైన తర్వాత తొలి 100 రోజుల్లోనే 492 తప్పుడు ప్రకటనలు చేశారని తేల్చింది. ఇప్పటి వరకు చేసిన తప్పుడు ప్రకటనల్లో అధికంగా వలసల గురించే చేయడం గమనార్హం. విదేశీ విధానం గురించి 900, వాణిజ్యం గురించి 854, ఆర్థిక వ్యవస్థ గురించి 790, ఉద్యోగాల గురించి 755 తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ రెండేళ్లలో 82 రోజులు మాత్రమే ఎలాంటి ప్రకటనలు చేయలేదు. -
ట్రంప్ రాజీనామా అంటూ ఫేక్ న్యూస్
-
ట్రంప్ రాజీనామా!
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ ప్రజలు బుధవారం ఆశ్చర్యంలో మునిగిపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేశారని ’వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ’అన్‌ప్రెసిడెంటెడ్‘ అనే శీర్షికతో రాసిన కథనంలో ట్రంప్ రాజీనామాతో ప్రపంచదేశాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయని వెల్లడించింది. 2019, మే 1వ తేదీతో ఉన్న ఈ పత్రికను కొందరు వాషింగ్టన్‌తో పాటు వైట్‌హౌస్ సమీపంలో ఉచితంగా పంచిపెట్టారు. ఈ తేదీని గమనించిన వ్యక్తులు ఇది నకిలీ ఎడిషన్ అని భావించారు. చివరికి ఈ విషయం వైరల్‌గా మారడంతో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక స్పందిస్తూ.. అది నకిలీ ఎడిషన్ అనీ, దానితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. ట్రంప్ 2019, ఏప్రిల్ 30న వైట్‌హౌస్‌ను వదిలివెళ్లిపోయినట్లు ఈ నకిలీ ఎడిషన్‌లో లీసా చుంగ్ పేరుతో కథనం ప్రచురితమైంది. ‘ రాజీనామా విషయంలో ట్రంప్ అధికారిక ప్రకటనను వెలువరించలేదు. 2019, ఏప్రిల్ 30న ఓవల్ కార్యాలయంలోని అధ్యక్షుడి డెస్క్ పక్కన ఓ న్యాప్కిన్ దొరికినట్లు నలుగురు వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. అందులో ఎరుపురంగు ఇంక్‌తో ‘ఇందుకు(తన రాజీనామాకు) నిజాయితీ లేని హిల్లరీ క్లింటన్‌ను, హైఫియర్ను, నకిలీ వార్తల మీడియాను నిందించండి’ అని ట్రంప్ రాసినట్లు ఉంది. ప్రస్తుతం ఆయన శ్వేతసౌధం వదిలేసి రష్యాలోని క్రిమియాలో ఉన్న యాల్టా రిసార్ట్‌కు వెళ్లిపోయారు. దీంతో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అమెరికా అధ్యక్షుడిగా వెంటనే ప్రమాణస్వీకారం చేశారు’ అని కథనం ప్రచురితమైంది. ట్రంప్ రాజీనామాతో దేశవిదేశాల్లో సంబరాలు చేసుకున్నారని ఎడిషన్‌లో వార్త వచ్చింది. నకిలీ ఎడిషన్‌తో తమకు సంబంధంలేదని వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించింది. ‘యస్ మెన్’ అనే గ్రూపు నకిలీ పత్రిక, వెబ్‌సైట్‌ను నడుపుతోందని అమెరికా జర్నలిస్ట్ రామ్సే చెప్పారు. -
‘అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ రాజీనామా’..!!
వాషింగ్టన్: ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన తర్వాత తల దించుకొని వైట్‌హౌజ్ నుంచి ఇంటిదారి పట్టాడు. ప్రపంచం మొత్తం సంబరాలు చేసకుంటోంది’ అని వాషింగ్టన్ పోస్ట్ పేరిట వెలువడిన ఓ ఫేక్ న్యూస్ సంచలనం రేకెత్తించింది. వాషింగ్టన్ డీసీలో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యంలో ముంతెత్తింది. తాటి కాయంత అక్షరాలతో.. ‘ట్రంప్ రాజీనామా’ వార్త చూసి అక్కడి జనం షాక్‌కు గురయ్యారు. కొందరు నిజంగానే సంబరపడ్డారు. అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నుంచి బయటపడేందుకే ట్రంప్ రాజీనామా చేశాడంటూ ఆ ఫేక్ వార్తలో చెప్పుకొచ్చారు. లీసా చంగ్ ఈ ఫేక్ న్యూస్‌ను రచించగా.. క్రిస్టినైన్ ఫ్లెమింగ్ డిజైన్ చేశారు. ‘ది పబ్లిక్ సొసైటీ’ నుంచి ఈ పేపర్ పబ్లిష్ అయింది. జరిగేది అదే.. వైట్‌హౌజ్ నుంచి తలదించుకొని వెళ్తున్న ట్రంప్.. 4 కాలమ్స్ ఫొటో పాఠకులను ఆకట్టుకుంది. అయితే, పేపర్‌పై పబ్లిషింగ్ తేదీ 2019, మే 1 అని ఉండడంతో అప్పటివరకు గందరగోళంలో పడిన పాఠకులకు కొంత క్లారిటీ వచ్చింది. మొత్తం వార్త చదవగా అది ఫేక్ న్యూస్ పేపర్ అని తెలిసింది. ‘30 ఏప్రిల్, 2019 న ట్రంప్ అధికారం నుంచి దిగిపోతాడు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అధ్యక్షుడవుతాడు. జరిగేది ఇదే..! అందరిలా కాకుండా.. వినూత్నంగా.. వింతగా ఓ న్యాప్కిన్పై ఎర్ర సిరాతో తన ప్రత్యర్థులపై విమర్శలు రాసి పెట్టి పదవి నుంచి తప్పుకుంటాడు. అక్కడ నుంచి నేరుగా యాల్టా వెళ్తాడు’ అని సదరు ఫేక్ న్యూస్‌లో రాసుకొచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా మిత్ర దేశాల నాయకులు సమావేశమైన క్రిమియన్ హోటలే యాల్టా. కాగా, సమాచారం అందుకున్న వాషింగ్టన్ పోస్ట్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అధ్యక్షుడు ట్రంప్‌నకు వ్యతిరేకంగా వెలువడిన ఫేక్ న్యూస్ పేపర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ చర్యతో వారికి ఒరిగేమీలేదని ఫేక్ న్యూస్ పబ్లిషర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. తమ పత్రిక గౌరవానికి భంగం కలిగించినందుకు సదరు పబ్లిషర్ పై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేసింది. ఇలావుండగా, ‘ఇలాంటి పేపర్ మళ్లీ దొరకదు. వైట్ హౌజ్ దగ్గర ఉచితంగా ఈ పేపర్ ఇస్తున్నారు. వార్త బాగుంది’ అని ఓ నడివయసు మహిళ వ్యాఖ్యానించిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఫేక్ న్యూస్ పేపర్ పంచుతున్న ఓ మహిళ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. This might be the best visual ever. It’s a satire newspaper that shows what the front page of the paper will look like the day after Trump leaves office. With the headlines: UNPRESIDENTED. And: Celebrations breakout worldwide as Trump era ends. This is beautiful. This is art.🇺🇸 https://t.co/TU6jdQmgD0 — Scott Dworkin (@funder) January 16, 2019 -
సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య
వాషింగ్టన్: సౌదీఅరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. సల్మాన్‌కు తెలియకుండా లేదా అతని ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటన జరిగే ప్రసక్తే లేదని వెల్లడించింది. ఈ మేరకు సీఐఏను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. యువరాజు సల్మాన్ నిర్ణయాలపై విమర్శనాత్మక కథనాలు రాసిన ఖషోగ్గీ అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయానికి వెళ్లి అదృశ్యమయ్యారు. సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య జరిగిందని సీఐఏ చెప్పడం అమెరికా–సౌదీ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
యువరాజే చంపమన్నారు!
వాషింగ్టన్: ప్రముఖ జర్నలిస్ట్, వాషింగ్టన్ పోస్టు కాలమిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని అమెరికా గూఢచార సంస్థ(సీఐఏ) నిర్ధారణకు వచ్చినట్టు యూఎస్ మీడియా వెల్లడించింది. ఆయన ఆదేశాల మేరకే ఖషోగ్గీని పథకం ప్రకారం అంతమొందించినట్టు తెలిపింది. సౌదీకి చెందిన 15 మంది ఏజెంట్లు ప్రభుత్వ విమానంలో ఇస్తాంబుల్ వెళ్లి, సౌదీ రాయబారా కార్యాలయంలో ఖషోగ్గీని హత్య చేశారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. దీనిపై స్పందించేందుకు సీఐఏ నిరాకరించింది. యువరాజు మహ్మద్ బిన్ సోదరుడు, అమెరికాలోని సౌదీ రాయబారి ఖలీద్ బిన్ సల్మాన్ ద్వారా ఖషోగ్గీని ఇస్తాంబుల్‌కు రప్పించినట్టు సీఐఏ వర్గాలు గుర్తించినట్టు సమాచారం. ఇస్తాంబుల్‌లోని తమ కాన్సులేట్‌కు వెళ్లి ఖషోగ్గీకి అవసరమైన పత్రాలు తీసుకోవాలని, ఎటువంటి ముప్పు ఉండబోదని ఆయనతో ఫోన్లో ఖలీద్ బిన్ చెప్పినట్టు సమాచారం. దీన్ని సౌదీ కాన్సులేట్ తోసిపుచ్చింది. ఇదంతా అవాస్తవమని తెలిపింది. టర్కీకి వెళ్లే విషయం గురించి ఖషోగ్గీతో ఖలీద్ బిన్ మాట్లాడలేదని సౌదీ ఎంబసీ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో అక్టోబర్ 2న ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. టర్కీ మహిళను పెళ్లాడేందుకు అవసరమైన పత్రాల కోసం వెళ్లి ఆయనను సౌదీ ఏజెంట్లు హత్య చేశారు. ఖషోగ్గీ అదృశ్యం గురించి తమకేమీ తెలియదని బుకాయించిన సౌదీ తర్వాత నేరాన్ని ఒప్పుకుంది. ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ యువరాజు ప్రత్యక్ష ప్రమేయానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలను సీఐఏ సంపాదించలేదని ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ఖషోగ్గీ హత్య చేసిన బృందంలో సభ్యులు ఫోన్లో యువరాజు సన్నిహితులతో మాట్లాడిన దాన్ని బట్టి ఆయన ప్రమేయం ఉందన్న అంచనాకు వచ్చిందని వివరించింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో ఖషోగ్గీ హంతకులకు మరణశిక్ష అమలు చేస్తామని సౌదీ అరేబియా చెబుతోంది. ఖషోగ్గీ నన్ను పెళ్లాడారు జమాల్ ఖషోగ్గీ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు తనను పెళ్లాడారంటూ ఈజిప్టు మహిళ ఒకరు తెరపైకి వచ్చారు. వాషింగ్టన్లో జూన్ నెలలో తాము పెళ్లి చేసుకున్నామని ‘వాషింగ్టన్ పోస్ట్’తో చెప్పారు. అయితే తన వివరాలు వెల్లడించేందుకు ఆమె నిరాకరించారు. ‘ముస్లిం భార్యగా గుర్తింపు కోరుకునే పూర్తి హక్కు తనకుంద’ని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఖషోగ్గీ కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈజిప్టు మహిళను ఖషోగ్గీ పెళ్లి చేసుకున్న విషయం తనకు తెలియదని ఆయనను పెళ్లాడాలనుకున్న టర్కీ మహిళ హార్టిస్ సెంగిజ్ చెప్పారు. ఆమె వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. -
ఖషోగ్గీ హత్య.. మరో ట్విస్ట్
న్యూయార్క్: ‘మీ బాస్‌కు చెప్పండి’.. వాషింగ్టన్ పోస్టు కాలమిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యానంతరం తన పై అధికారికి సౌదీ అరేబియా నిఘా బృందంలోని సభ్యుడొకరు ఫోన్లో చెప్పిన మాట ఇది. ‘ఆ బాస్’ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ హత్యోదంతంలో సల్మాన్ పాత్ర ఉందనడానికి ఇదే బలమైన ఆధారమని భావిస్తున్నారు. ఖషోగ్గీ హత్య జరిగిన సమయంలో ముగ్గురు వ్యక్తులు రికార్డు చేసిన ఆడియో టేపులను టర్కీ నిఘా విభాగం సేకరించింది. వీటిని గత నెలలో అమెరికా గూఢాచార సంస్థ(సీఐఏ) డైరెక్టర్ గినా హాస్పెల్‌కు అప్పగించింది. ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో అక్టోబర్ 2న ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్య అనంతరం ఆయన మృతదేహాన్ని సౌదీ రాయబార కార్యాలయంలోనే ముక్కలుగా నరికి యాసిడ్‌లో కరిగించి మాయం చేశారని టర్కీ ఆరోపించింది. తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు సల్మాన్ చంపించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి బలం చేకూర్చే ఆధారాలు ఆడియో టేపుల్లో ఉన్నాయని అమెరికా నిఘా అధికారులు విశ్వసిస్తున్నారు. ఖషోగ్గి కోసం సౌదీ ప్రభుత్వం పంపించిన 15 మంది సభ్యులు బృందంలో ఒకరైన మహెర్ అబ్దులాజీజ్ ముత్రెబ్ ఒకరు. ఖషోగ్గీ హత్యానంతరం అతడు ఉన్నతాధికారికి ఫోన్ చేసి అరబిక్‌లో ‘మీ బాస్‌తో చెప్పండి’ అన్నాడని వెల్లడైంది. భద్రతా అధికారిగా పనిచేస్తున్న ముత్రెబ్ తరచుగా సల్మాన్‌తో కలిసి ప్రయాణిస్తుంటాడని అమెరికా అధికారులతో టర్కీ నిఘా అధికారులు చెప్పారు. ఖషోగ్గీని హత్య చేసిన తర్వాత సల్మాన్ సన్నిహితులకు అతడు ఫోన్ చేసివుంటాడని వెల్లడించారు. అయితే ముత్రెబ్ అరబిక్‌లో చెప్పిన మాటలను తర్జుమా చేస్తే మరో అర్థం వచ్చింది. ‘మాకు అప్పగించిన పని పూర్తయింద’నే అర్థం వచ్చేలా అతడు మాట్లాడినట్టు తేలింది. అమెరికా ఏం చేస్తుంది? సల్మాన్ పాత్రపై అమెరికా ఆచితూచి అడుగులు వేస్తోంది. సల్మాన్ పేరు ప్రస్తావన రాకపోవడంతో దీన్ని గట్టి ఆధారంగా పరిగణించలేకపోతున్నారు. ఖషోగ్గీ హత్యతో తమ యువరాజుకు ఎటువంటి సంబంధం లేదని సౌదీ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టర్కీ సేకరించిన ఆడియో టేపులను పరిశీలించేందుకు తమ నిఘా అధికారులను అనుమతించాలని కోరింది. ఆడియో టేపులు, టెలిఫోన్ కాల్స్ డేటాను టర్కీ తమకు నమ్మకమైన దేశాలతో మాత్రమే పంచుకుంది. సౌదీ యువరాజుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు వెలుగులోకి రావడంతో కచ్చితంగా వైట్‌హౌస్‌పై ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరబ్‌లో అమెరికాకు సౌదీ అరేబియా కీలక భాగస్వామి. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్తో సౌదీ యువరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్‌కు వ్యతిరేకంగా చర్యలకు అమెరికా ఉపక్రమిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టే ప్రమాదముంది. అయితే ఈ విషయంలో తాను నిక్కచ్చిగా వ్యవహరిస్తారని ట్రంప్ చెబుతున్నారు. సౌదీ యువరాజు సల్మాన్‌కు ట్రంప్ అండగా నిలబడతారనే అభిప్రాయాన్ని అమెరికా ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు వ్యక్తపరిచారు. -
అది అంగీకార సంబంధం కాదు
వాషింగ్టన్: విదేశాంగ శాఖ మాజీ సహాయమంత్రి, సీనియర్ జర్నలిస్ట్ ఎంజే అక్బర్(67) అధికార దుర్వినియోగం, బలప్రయోగంతో తనపై అత్యాచారం చేశారని నేషనల్ పబ్లిక్ రేడియో చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ స్పష్టం చేశారు. పరస్పర అంగీకారంతోనే తామిద్దరి మధ్య 1994లో కొన్ని నెలల పాటు వివాహేతర సంబంధం కొనసాగిందన్న అక్బర్ వాదనను ఆమె ఖండించారు. అక్బర్ చేతిలో తనకు ఎదురైన భయానక అనుభవాలపై పల్లవి వాషింగ్టన్ పోస్ట్‌కు ఓ కథానాన్ని రాశారు. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ.. అక్బర్ లైంగిక వేధింపుల పర్వంపై వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు శుక్రవారం రాసిన వ్యాసంలోని ప్రతి అక్షరానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. అక్బర్ చేతిలో లైంగికదాడులకు గురైన మహిళలు ముందుకొచ్చి నిజాలను బయటపెట్టాలన్న ఉద్దేశంతోనే తాను మాట్లాతున్నట్లు వెల్లడించారు. తమను అక్బర్ లైంగికంగా వేధించాడని 16 మందికి పైగా మహిళలు ముందుకురావడంతో ఆయన్ను కేంద్రం మంత్రి బాధ్యతల నుంచి ఇటీవల తప్పించిన సంగతి తెలిసిందే. -
జమాల్ ఖషోగ్గీ హత్య తర్వాత సౌదీ కాన్సులేట్‌లో దారుణం
-
అక్బర్‌పై మరో ‘మీ టూ’
వాషింగ్టన్: ప్రముఖ సంపాదకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్(67) లైంగిక వేధింపులపై మరో బాధితురాలు గళం విప్పారు. 23 ఏళ్ల క్రితం తనపై ఆయన అత్యాచారం చేశారంటూ అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థ ‘నేషనల్ పబ్లిక్ రేడియో’ చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ ఆరోపించారు. ఒక వార్తా పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్‌గా ఉన్న ఆ ‘తెలివైన పాత్రికేయుడు’ హోదాను వాడుకుని తనను వలలో వేసుకున్నారంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’లో ఆమె రాసిన వ్యాసం ఇటీవల ప్రచురితమైంది. ఏషియన్ ఏజ్ ఎడిటర్ ఇన్ చీఫ్‌గా అక్బర్ పనిచేస్తున్న సమయంలో తనపై లైంగికదాడికి, వేధింపులకు పాల్పడ్డారంటూ వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన వ్యాసంలో పల్లవి గొగోయ్ ఆరోపించారు. జీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలని అందులో పేర్కొన్నారు. ‘22 ఏళ్ల వయస్సులో ‘ఏషియన్ ఏజ్’లో చేరా. ఆ సమయంలో అక్బర్ ఎడిటర్ ఇన్ చీఫ్‌గా ఉండేవారు. ఏడాదిలోనే ఒపీనియన్ ఎడిటోరియల్ పేజీకి ఎడిటర్‌గా అక్బర్ నేతృత్వంలో పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన దగ్గర పనిచేయడం అద్భుతంగా అనిపించేది. ఆయన వాగ్ధాటి చూసి మైమరిచిపోయేదాన్ని. అయితే, నాకెంతో ఇష్టమైన ఆ ఉద్యోగ బాధ్యతను నెరవేర్చే క్రమంలో అందుకు తగ్గ మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది. ఉద్యోగం నుంచి తీసేస్తా.. 1994 వేసవిలో ఒక రోజు ఒపీనియన్ ఎడిటోరియల్ పేజీకి నేను రాసిన అద్భుతమైన శీర్షికను చూపిద్దామని అక్బర్ ఆఫీసుకు వెళ్లా. నా ప్రతిభను మెచ్చుకుంటూనే ఆయన అకస్మాత్తుగా ముద్దు పెట్టుకున్నారు. నేను వెంటనే వెనుదిరిగి బయటకు వచ్చేశా. ఆందోళనకు, అయోమయానికి గురయ్యా’. అక్బర్ మరోసారి ఆఫీసు పనిపై ముంబై తాజ్ హోటల్ రూంకు పిలిపించుకుని, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించారు. నేను విడిపించుకుని ఏడ్చుకుంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా నా ముఖంపై గోళ్లతో రక్కారు’ అని పల్లవి ఆ వ్యాసంలో వివరించారు. మరోసారి ఇలా అడ్డుకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరించారని తెలిపారు. ‘ఓ సారి అసైన్మెంట్ నిమిత్తం జైపూర్‌కు వెళ్లా. అప్పటికే అక్కడ ఓ హోటల్లో ఉన్న అక్బర్ ఆ కథనంపై చర్చించేందుకు రూంకు రమ్మన్నారు. అక్కడే నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. నేనెంత ప్రతిఘటించినా ఆయన బలం ముందు నిలవలేకపోయా. ఈ ఘటనతో తీవ్ర అవమానానికి గురై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేకపోయా. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చెప్పినా నమ్మరని తెలుసు’ అని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ఆయన నాపై మరింత అధికారం చెలాయించ సాగారు. ఆయన చూస్తుండగా నేను తోటి పురుష ఉద్యోగులతో మాట్లాడినా సహించేవారు కాదు’ అని పేర్కొన్నారు. నాపై అలా ఎందుకు పెత్తనం చెలాయించేందుకు అవకాశం ఇచ్చానన్నదే నాకు అర్థం కాలేదు. బహుశా ఉద్యోగం పోతుందని భయపడి ఉంటా. నన్ను నేనే అసహ్యించుకుంటూ కుమిలిపోసాగా’. బ్రిటన్, యూఎస్ పంపిస్తా.. 1994 డిసెంబర్లో ఎన్నికల కవరేజీపై అక్బర్ నన్ను మెచ్చుకున్నారు. అందుకు ప్రతిఫలంగా అమెరికా కానీ, బ్రిటన్ కానీ పంపిస్తానన్నారు. ఆ విధంగానైనా వేధింపులు లేకుండా దూరంగా ఉండొచ్చని ఆశించా. కానీ, ఢిల్లీకి దూరంగా ఉండే అలాంటి చోట్లకు ఎప్పుడనుకుంటే అప్పుడు రావచ్చు. నాతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చన్నది ఆయన వ్యూహమని నేను ఊహించలేదు. లండన్‌లోని పత్రిక ఆఫీసులో ఓ సహోద్యోగితో మాట్లాడుతుండగా గమనించిన అక్బర్..తిడుతూ నాపై చేయిచేసుకున్నారు. ఓ కత్తెరతోపాటు టేబుల్‌పై ఉన్న వస్తువులని నాపై విసిరేశారు. వాటి నుంచి కాపాడుకునేందుకు పార్కింగ్ప్లేస్కు పారిపోయా. ఈ ఘటనతో శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నా. ఈ ఘటన తర్వాత అక్బర్ నన్ను తిరిగి ముంబైకి పిలిపించారు. ఆ తర్వాత నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి న్యూయార్క్‌లోని ‘డౌజోన్స్’ పత్రికలో చేరాను’ ప్రతిభతో ఎదిగా.. ‘ఇప్పుడు నేను యూఎస్ పౌరురాలిని. ఒక భార్యగా, తల్లిగా ఉంటూ నా పాత్రికేయ వృత్తిని ఆనందంగా కొనసాగిస్తున్నా. ముక్కలైన నా జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నా. నా ప్రతిభ, కష్టంతో డౌజోన్స్, బిజినెస్ వీక్, యూఎస్ఏ టుడే, అసోసియేటెడ్ ప్రెస్, సీఎన్ఎన్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశా. ప్రస్తుతం నేషనల్ పబ్లిక్ రేడియోలో అత్యున్నత హోదాలో ఉన్నా. మీటూలో పలువురు మహిళలు చేసిన ఆరోపణలను నిరాధారాలంటూ అక్బర్ ఖండించడం, ఒక మహిళపై పరువు నష్టం కేసు వేయడం నాకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. అప్పట్లో ఆయన మా శరీరాలపై అధికారం చెలాయించినట్లుగానే, ప్రస్తుతం ’నిజం’ అనే దానికి తనదైన శైలిలో భాష్యం చెప్పాలని చూస్తున్నారు. తీవ్రంగా పరిగణిస్తున్నాం:ఎడిటర్స్ గిల్డ్ ఎడిటర్స్ గిల్డ్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత సభ్యుడు కూడా అయిన ఎంజే అక్బర్‌పై తాజాగా వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలో ఆయన సభ్యత్వాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపింది. పరస్పర అంగీకారంతోనే: అక్బర్ పల్లవి గొగోయ్ ఆరోపణలపై అక్బర్ స్పందించారు. ‘అప్పట్లో ఆమెతో లైంగిక సంబంధం పరస్పర అంగీకారంతోనే కొన్ని నెలలపాటు కొనసాగింది. ఆ సంబంధం నా కుటుంబ జీవితంలోనూ కలతలకు కారణమైంది. ఇద్దరి అంగీకారంతోనే ఈ సంబంధం ముగిసింది’ అని పేర్కొన్నారు. అక్బర్ భార్య మల్లిక కూడా పల్లవి ఆరోపణలను ఖండించారు. ఇరవయ్యేళ్ల క్రితం పల్లవి గొగోయ్ మా కుటుంబంలో అపనమ్మకానికి, అసంతృప్తులకు కారణమయ్యారు. అప్పట్లో ఆమె నా భర్తతో నెరిపిన సంబంధం గురించి నాకు తెలుసు. నా భర్తకు అర్ధరాత్రిళ్లు ఆమె ఫోన్ చేసేవారు. నా సమక్షంలోనే అక్బర్‌తో సన్నిహితంగా మెలిగేవారు. ఇప్పుడు ఆమె అబద్ధం ఎందుకు చెబుతోందో తెలియదు. అబద్ధం ఎప్పటికీ అబద్ధమే’ అని ఆప్రకటనలో పేర్కొన్నారు. -
ముక్కలు చేసి యాసిడ్‌లో కరిగించి..
అంకారా: పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గీ హత్య అనంతరం ఆయన మృతదేహాన్ని ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలోనే ముక్కలుగా నరికి యాసిడ్‌లో కరిగించి ‘మాయం’చేశారని టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ సలహాదారు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు అధికారులు విచారణ చేపడుతున్నారు. ‘ఆయన శరీర భాగాలను కేవలం ముక్కలుగా చేయలేదు. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యాసిడ్‌లో కరిగించేశారు’అని ఎర్డోగన్ సలహాదారు యాసిన్ అక్తయ్, టర్కీ అధికార పార్టీకి చెందిన ఓ నేత హరియత్ వార్తా పత్రికకు చెప్పారు. యాసిడ్‌లో కరిగించడం సులువనే ఉద్దేశంతో ముక్కలుగా కోశారని అక్తయ్ చెప్పారు. తమపై విమర్శలు చేసినందుకు ఖషోగ్గీని హత్య చేయించిందని సౌదీ అరేబియాపై అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సౌదీ కాన్సులేట్‌లోకి అక్టోబర్ 2న ప్రవేశించిన వెంటనే ఖషోగ్గీని గొంతు నులిమి చంపేశారని, తర్వాత ముక్కలుగా చేసి, యాసిడ్‌లో కరిగించారని టర్కీ ప్రధాన ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. ఆయన శరీరానికి సంబంధించి చిన్న ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకే ఈ పని చేసి ఉంటారని చెప్పారు. సౌదీ కాన్సులేట్ ఆవరణలోని బావిలో వెతికేందుకు టర్కీ అధికారులను సౌదీ అధికారులు అనుమతివ్వలేదు. నీటి శాంపిల్స్‌ను తీసుకెళ్లేందుకు అనుమతించారు. -
పథకం ప్రకారమే ఖషోగ్గీ హత్య: టర్కీ
ఇస్తాంబుల్: వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీని సౌదీ అరేబియా అధికారులు ముందస్తు ప్రణాళికతో పథకం ప్రకారమే హత్య చేశారని ఈ కేసు విచారణలో టర్కీ బృందానికి నేతృత్వం వహించిన అధికారి చెప్పారు. గత నెల 2న ఆయన ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయానికి రాగానే గొంతు నులిమి చంపేసి, శరీరాన్ని ముక్కలుగా నరికారని అధికారి చెప్పారు. మృతదేహం ఆనవాళ్లు లభించలేదన్నారు. సౌదీ యువరాజుకు వ్యతిరేకంగా వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో ఖషోగ్గీ వార్తలు రాసేవారు. -
నగ్నసత్యాలు వెల్లడిస్తా: ఎర్దోగన్
ఇస్తాంబుల్: వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ తమ రాయబార కార్యాల యంలో జరిగిన గొడవలోనే మరణించాడని సౌదీ అరేబియా ఎట్టకేలకు ఒప్పుకోవడం అంతర్జాతీయంగా దుమారం రేపుతోంది. ఖషోగ్గీ హత్య విషయంలో కొన్ని నగ్నసత్యాలను బయటపెడతామని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్ ప్రకటించడంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఖషోగ్గీ కేసు విషయానికి సంబంధించి తాను మంగళవారం ప్రసంగిస్తాననీ, అప్పుడు కొన్ని కొత్త విషయాలను చెబుతానని ఎర్దోగన్ గత వారాంతంలోనే ప్రకటించారు. టర్కీ అధికార పార్టీ ప్రతినిధి, ఎర్దోగన్‌కు సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ ‘ఇది పథకం ప్రకారం, క్రూర, దారుణ కుట్రతో జరిగిన హత్య’ అని ఆరోపించారు. అటు జర్మనీ కూడా ఒప్పందం ప్రకారం ఈ ఏడాది సౌదీకి ఎగుమతి చేయాల్సిన 480 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల విక్రయాన్ని నిలిపేస్తోందని ఆ దేశ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ ఖషోగ్గీ హత్య విషయంలో ఏం జరిగిందో విశ్వసనీయ ఆధారాలతో సౌదీ అత్యవసరంగా బయటపెట్టాల్సిన అవసరం ఉంద న్నాయి. ఖషోగ్గీ మృతి విషయంలో సౌదీ వివరణ నమ్మశక్యంగానే ఉందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మాట మార్చి సౌదీ అబద్ధాలు చెబుతోందన్నారు. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్కు సౌదీ యువరాజుతో సన్నిహిత సంబంధాలున్నాయి. ట్రంప్ సొంత పార్టీ నేతలు కూడా యువరాజుకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు నమ్ముతున్నామన్నారు. 15 ముక్కలుగా నరికేశారు సౌదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, యువరాజు సల్మాన్‌ను విమర్శిస్తూ ఖషోగ్గీ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. టర్కీ మహిళను పెళ్లి చేసుకునేందుకు అవసరమైన పత్రాలు పొందే విషయమై ఇస్తాంబుల్‌లోని సౌదీ ఎంబసీకి ఈ నెల 2న వెళ్లిన ఆయన అక్కడే హత్యకు గురయ్యారు. హురియత్ అనే పత్రికలో వ్యాసాలు రాసే అబ్దుల్ఖదీర్ మాట్లాడుతూ సౌదీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఖషోగ్గీ గొంతు నులిమి చంపిందన్నారు. అనంతరం లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న సలాహ్ మహ్మద్ అల్–తుబైగీ సంగీతం వింటూ ఖషోగ్గీ శరీరాన్ని 15 ముక్కలుగా నరికేశారన్నారు. -
ఖషోగ్గీ ఎమయ్యాడో తెలీదు: సౌదీ రాజు
దుబాయ్: వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ కనిపించకుండా పోవడంపై సౌదీ అరేబియాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో రాజు సల్మాన్ రంగంలోకి దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. ఖషోగ్గీ ఏమమయ్యాడో తమకు తెలియదని చెప్పారు. సౌదీ పౌరుడైన ఖషోగ్గీ అమెరికాలోఉంటూ సౌదీపై వాషింగ్టన్ పోస్ట్‌లో విమర్శనాత్మక కథానాలు రాసేవారు. ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోపలికెళ్లిన తర్వాత ఆయన కనిపించకుండా పోవడం, ఆయనను సౌదీనే హత్య చేసిందని ఆరోపణలు రావడం తెల్సిందే. సౌదీలో రాజకుటుంబానికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే వ్యతిరేక పోస్ట్‌లు కూడా వస్తున్నప్పటికీ వాటిని సౌదీ ప్రభుత్వం వెంటనే తొలగిస్తోందని తెలుస్తోంది. ఇస్తాంబుల్‌లోని సౌదీ ఎంబసీలో ఖషోగ్గీ అదృశ్యంపై టర్కీ పోలీసులు అక్కడ సోదాలు చేశారు. -
రాయబార కార్యాలయానికి వెళ్లి అదృశ్యమైన విలేకరి
వాషింగ్టన్: వాషింగ్టన్ పోస్ట్‌కు విలేకరి (కంట్రిబ్యూటర్)గా పనిచేస్తున్న, సౌదీ అరేబియాకు చెందిన జమాల్ ఖషొగ్గీ కనిపించకుండా పోవడం వెనుక సౌదీ అరేబియా హస్తం ఉండొచ్చనీ, ఖషొగ్గీ హత్యకు గురై ఉంటే అందుకు కారకులను కఠినంగా శిక్షిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరోక్షంగా సౌదీని హెచ్చరించారు. ఖషొగ్గీ సౌదీ ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలను అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లో రాసేవారు. తన వ్యక్తిగత పనిపై ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లిన తర్వాత ఖషొగ్గీ కనిపించకుండా పోయారు. కార్యాలయం లోపలే ఖషొగ్గీ్గని హత్య చేసి ఉంటారని టర్కీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంలో సత్వరమే చర్యలు చేపట్టాలని ట్రంప్‌పై కాంగ్రెస్ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఖషొగ్గీ ఆచూకీ విషయమై సౌదీ రాజు సల్మాన్‌తో మాట్లాడతానని ట్రంప్ చెప్పారు. ఏమయ్యాడో మేం కనిపెడతాం.. ‘టర్కీలో ఏం జరిగిందో, ఖషొగ్గీ ఏమయ్యాడో మేం కనిపెడతాం. ఈ విషయంలో ఎవ్వరికీ వివరాలు తెలియవు’ అని ట్రంప్ అన్నారు. అయితే సౌదీ రాజుతో తన చర్చలు ఏ విధంగా ఉంటాయో చెప్పేందుకు ఆయన నిరాకరించారు. సీబీఎస్ వార్తా చానల్ ‘60 మినిట్స్’ కార్యక్రమంలోనూ.. ఖషొగ్గీ్గని సౌదీనే హత్య చేసిందంటారా? అని ట్రంప్‌ను ప్రశ్నించగా ‘ వాళ్లే అయ్యుంటారా? అవునేమో!’ అని అన్నారు. ఒకవేళ ప్రచారం జరగుతున్నట్లుగా సౌదీనే ఖషొగ్గీని హత్య చేసిందని తేలితే ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా, గతంలో తాను ప్రకటించినట్లు సౌదీకి ఆయుధాల సరఫరాను మాత్రం ఆపననీ, ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘ఆయుధాల సరఫరాపై ఆంక్షల వల్ల ఇక్కడి ఉద్యోగాలు పోతాయి. ఆ దేశంతో మనకు ఉన్న ఒప్పందాలు రద్దవుతాయి. దేశంలో నిరుద్యోగాన్ని పెంచే ఈ చర్యను తీసుకోను. అయితే హత్యకు కారకులపై తీవ్ర చర్యలుంటాయి. ఆంక్షలుంటాయి’ అని చెప్పారు. అన్నీ నిరాధార ఆరోపణలే: సౌదీ ఇస్తాంబుల్‌లోని తమ రాయబార కార్యాలయంలోనే ఖషొగ్గీ హత్యకు గురయ్యాడన్న ఆరోపణలను సౌదీ అరేబియా శనివారం తోసిపుచ్చింది. అవన్నీ అబద్ధాలు, ఆధారాల్లేని ఆరోపణలేనని కొట్టిపారేసింది. ఖషొగ్గీ్గని సౌదీ అధికారులు రాయాబార కార్యాలయంలోనే చంపేశారనేందుకు భవనం లోపల తీసిన వీడియో రికార్డులు ఉన్నాయని టర్కీ అధికారులు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఈ విషయంపై టర్కీ ప్రభుత్వంతో మాట్లాడేందుకు సౌదీ నుంచి ఓ బృందం శుక్రవారమే టర్కీకి చేరుకుంది. అక్కడ సౌదీ హోం మంత్రి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఖషొగ్గీ్గని చంపేందుకు సౌదీ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాలన్నీ అబద్ధాలు, నిరాధార ఆరోపణలేనని చెప్పారు. రికార్డర్ ఆన్ చేసి వెళ్లాడా? సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లే ముందు ఖషొగ్గీ తన చేతికున్న యాపిల్ గడియారంలో రికార్డింగ్ ఆన్ చేశారనీ, ఆయనను సౌదీ అధికారులు విచారించి, హింసించి, హత్య చేస్తున్నప్పుడు వారు మాట్లాడిన మాటలన్నీ రికార్డయ్యి, ఆ ఫైల్స్ ఆయన ఫోన్‌కు, ఐ క్లౌడ్‌కు వెళ్లాయని టర్కీ పత్రిక సబా పేర్కొంది. ఖషొగ్గీ్గ నాడు తన ఫోన్‌ను భార్యకు ఇచ్చి రాయబార కార్యాలయానికి వచ్చారని తెలిపింది. గడియారంలో రికార్డర్ ఆన్‌లో ఉండటాన్ని ఆలస్యంగా గుర్తించిన సౌదీ అధికారులు అనేక పాస్‌వర్డ్‌లతో ప్రయత్నించినప్పటికీ వాచ్‌లో ఉన్న ఫైల్స్‌ను ఓపెన్ చేయలేకపోయారనీ, చివరకు ఖషొగ్గీ వేలిముద్రతో వాచ్‌ను అన్‌లాక్ చేసి కొన్ని ఫైళ్లను మాత్రం డిలీట్ చేయగలిగారని సబా పేర్కొంది. అయితే యాపిల్ గడియారాలను వేలిముద్రతో లాక్, అన్‌లాక్ చేసే సదుపాయం లేదని యాపిల్ ప్రతినిధి ఒకరు వెల్లడించడం గమనార్హం. -
జీరో టాలరెన్స్ బాధితుల్లో భారతీయురాలు
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి బిడ్డలకు దూరమైన వారిలో భారత్‌కు చెందిన ఓ మహిళ ఉందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గుజరాత్‌కు చెందిన భావన్ పటేల్ (33) అనే మహిళ పట్టుబడగా, వికలాంగుడైన ఆమె కొడుకు (5)ను అమెరికా ప్రభుత్వం తల్లి నుంచి వేరుచేసి నిర్బంధ కేంద్రంలో ఉంచిందని తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారి పట్ల ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తూ అక్రమ వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి అమెరికా వేరుచేయడం తెలిసిందే. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారిలో 200 మంది వరకు భారతీయులు ఉండొచ్చని వార్తలొచ్చినా ఇలా వివరాలు వెల్లడవటం ఇదే తొలిసారి. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని వాషింగ్టన్‌లోని సెనేట్ బిల్డింగ్ ముందు ఆందోళన నిర్వహించిన 600 మంది ప్రజల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
మోదీని అనుకరించిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని మోదీని భారతీయ యాసలో అనుకరించినట్లు వాషింగ్టన్ పోస్టు కథనం పేర్కొంది. అఫ్గానిస్తాన్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం మరింత మంతి సైన్యాన్ని, నిధులను పంపేందుకు ముందుకు రావటంపై.. గతేడాది అమెరికా పర్యటన సందర్భంగా మోదీ ప్రశంసించారు. ‘తక్కువ లాభం పొందుతున్నప్పటికీ ప్రతిఫలంగా ఎక్కువ మొత్తాన్ని తిరిగిస్తున్నారు’ అంటూ కొనియాడారు. ప్రపంచమంతా అఫ్గాన్‌ను అమెరికా సొంత అవసరాలకు వాడుకుంటోందని విమర్శిస్తున్న నేపథ్యంలో మోదీ ప్రశంసలకు ట్రంప్ మురిసిపోయారు. వేరో సందర్భంలో మోదీ వ్యాఖ్యలను భారతీయ యాసలోనే అనుకరించినట్లు వాషింగ్టన్ పోస్టు కథనం వెల్లడించింది. కాగా, ట్రంప్ తీరును భారత–అమెరికన్ డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. ఈ కథనంపై శ్వేతసౌధం ఇంతవరకు స్పందించలేదు. వాషింగ్టన్ పోస్టుతోపాటు ఇతర అమెరికా వార్తాపత్రికల్లో వస్తున్న వార్తలు అసత్యమంటూ ట్రంప్ ఇటీవలే ‘ఫేక్‌న్యూస్’ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ ఫేక్ న్యూస్ అవార్డులు.. విజేతలెవరో తెలుసా?
వాషింగ్టన్: ముందుగా వెల్లడించినట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఫేక్ న్యూస్ అవార్డులు’ ప్రకటించారు. ప్రముఖ దినపత్రిక ‘ద న్యూయార్క్ టైమ్స్’కు ఫేక్ న్యూస్ అవార్డు ప్రకటించారు. అలాగే, ఏబీసీ న్యూస్, సీఎన్ఎన్, టైమ్, ద వాషింగ్టన్ పోస్ట్ తదితర మీడియా సంస్థలను కూడా విజేతలుగా ప్రకటించారు. ఇలా ట్రంప్ తనదైన శైలిలో అవార్డులు ప్రకటిస్తూ.. ఆ వివరాలు జీవోపీ.కామ్‌లో పొందుపరిచారు. దీని గురించి ట్వీట్ చేసిన వెంటనే ఆ వెబ్సైట్ క్రాష్ అయింది. పాత్రికేయ రంగంలో తాను గౌరవించే ఎంతో గొప్పమంది జర్నలిస్టులు ఉన్నారు కానీ, మీడియా ఇప్పుడు అవినీతి, కపటబుద్ధితో కథనాలు రాస్తున్నదని ట్రంప్ మరో ట్వీట్లో మండిపడ్డారు. ‘2017లో పక్షపాతబుద్ధితో ఏమాత్రం పారదర్శకత లేకుండా అథమస్థాయిలో బూటకపు కథనాలు వెలువడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా 90శాతం ప్రతికూల కథనాలు వెలువడ్డాయి’అని జీవోపీ.కామ్ వెబ్సైట్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రాత్మక విజయం సందర్భంగా.. దేశ ఆర్థిక వ్యవస్థ ఇక కోలుకోలేదంటూ పాల్ క్రుగ్మన్ రాసిన కథనానికిగాను ’ద న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు ఫేక్ అవార్డుల్లో ప్రథమ బహుమతి ప్రకటించగా.. తప్పుడు కథనాలతో మార్కెట్‌ను దెబ్బతీసినందుకు ఏసీబీ న్యూస్‌కు (బ్రియాన్ రాస్ కథనానికి) దిత్వీయ బహుమతిని, వీకీలీక్స్ పత్రాల యాక్సెస్ ట్రంప్‌కు, ఆయన తనయుడికి ఉందంటూ కథనం ప్రసారంచేసినందుకు సీఎన్ఎన్కు తృతీయ బహుమతిని ట్రంప్ ప్రకటించారు. ఒవల్ కార్యాలయంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అర్ధవిగ్రహాన్ని తొలగించారని కథనం ప్రచురించినందుకు ‘టైమ్’ మ్యాగజీన్‌కు నాలుగో స్థానం కట్టబెట్టగా.. ఫ్లోరిడాలోని పెన్సాకోలాలో ట్రంప్ నిర్వహించిన భారీ ర్యాలీలో జనం లేరంటూ ప్రచురించిన ‘ద వాషింగ్టన్ పోస్ట్’కి చివరిస్థానం కేటాయించారు. తన హయాంలో మీడియా కపటబుద్ధితో వ్యవహరిస్తూ నిజాలను ప్రజలకు తెలియజేయడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
‘ఫైర్ అండ్ ఫ్యూరీ’ ట్రంప్!
సీనియర్ జర్నలిస్టు, రచయిత మైకేల్ వూల్ఫ్ తాజా పుస్తకం ‘ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్సైడ్ ద ట్రంప్ వైట్‌హౌస్’లో అనేక వివాదస్పద, సంచలన విషయాలు వెల్లడించింది. ఇంకా మార్కెట్లోకి విడుదల కాని ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ ఆన్లైన్ మ్యాగజైన్, ఇతర› ప్రధాన పత్రికలు ప్రచురించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్›ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తుడు, వైట్‌హౌస్ ప్రధాన వ్యూహకర్తగా మొన్నటివరకు పనిచేసిన స్టీవ్ బ్యానన్ ఈ పుస్తక రచయితకు వెల్లడించిన అంతర్గత విషయాలు ఆసక్తికరంగా మారాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారం, ట్రంప్‌ను గెలిపించేందుకు రష్యా జోక్యంపై ఆరోపణలు వంటి కీలకాంశాలపై ఈ పుస్తకంలో అత్యంత విశ్వసనీయమైన సమాచారం ఉండటం దుమారం రేపుతోంది. ఈ పుస్తకంపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. బ్యానన్ పేర్కొన్న ముఖ్యాంశాల్లో కొన్ని.. అది దేశద్రోహం కాదా?: ట్రంప్ టవర్లోని 25వ అంతస్తులో విదేశీ ప్రభుత్వ (రష్యా) అధికారులతో జూనియర్ ట్రంప్ (ట్రంప్ కుమారుడు), అల్లుడు జేరెడ్ కుష్నర్, ప్రచార మేనేజర్ పాల్ మనఫోర్ట్లు సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో జరిగిన ఈ సమావేశంలో న్యాయవాదులు లేకుండా విదేశీ ప్రతినిధులతో భేటీ కావడం వారికి దేశద్రోహం కాదా? సన్నిహితులపై అపనమ్మకం: రోజూ రాత్రి భోజనం తర్వాత తన సన్నిహితుల్లోని ఒక్కొక్కరి లోపాలు, బలహీనతల గురించి ట్రంప్ మాట్లాడతారు. ఒకరికి విధేయత లేదని, మరొకడు బలహీనుడని, కుష్నర్ వ్యవహారం సరిగా లేదని, వైట్‌హౌస్ అధికారప్రతినిధి సీన్ స్పైసర్ బుద్ధిహీనుడని ఇలా అందరిపైనా అపనమ్మకంతో ఉండేవారు. తనపై విషప్రయోగం జరుగుతుందని ట్రంప్ చాలా భయపడతారు. ఇవాంకా ‘ప్రెసిడెంట్’ కోరిక: అమెరికాకు అధ్యక్షురాలిని కావాలన్నది ఇవాంకా ట్రంప్ ఆశ. అందుకే భర్తతో కలిసి వైట్‌హౌస్‌లో కీలకబాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆమె ట్రంప్‌పైనే జోకులేస్తారు. బట్టతలకు సర్జరీ చేయించుకున్నారని.. అసహనం కారణంగానే ట్రంప్ జుట్టురంగు మారిందని చలోక్తులు వేసేవారు. ట్రంప్‌కు గెలుస్తారనే నమ్మకమే లేదని జూనియర్ ట్రంప్ తన సన్నిహితులతో పేర్కొన్నారు. ఆయన విజయంపై కుటుంబ సభ్యుల్లోనూ అపనమ్మకమే. ఫలితాలు వెల్లడవుతున్న సమయంలో మెలానియా ఏడ్చేశారు. ఎవరీ బ్యానన్? స్టీఫెన్ కెవిన్ బ్యానన్ (64).. అమెరికన్ మీడియా ఎగ్జిక్యూటివ్, రాజకీయవేత్త, గతంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా కొనసాగారు. ప్రస్తుతం బ్రీట్‌బార్ట్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఏడేళ్లపాటు యూఎస్ నేవీలో లెఫ్టినెంట్‌గా పనిచేశారు. ఎర్త్‌సైన్స్ రీసెర్చ్ ప్రాజెక్టు ‘బయోస్పియర్–2’కు యాక్టింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ప్రత్యేకంగా బ్యానన్ కోసమే ‘వైట్‌హౌస్ ప్రధానవ్యూహకర్త’ హోదాను సృష్టించారు. దాదాపు ఏడునెలల పాటు ఆ పదవిలో పనిచేశాక ఛార్లెట్స్‌విల్లేలో చోటుచేసుకున్న ఘర్షణలు హింసాత్మకంగా మారిన ఘటన ఆయన ఉద్వాసనకు దారితీసింది. ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధంలోనూ ఆయన పాత్ర ఉంది. ఎన్నికల సందర్భంగా ట్రంప్ ప్రచార కార్యక్రమాలకు సీఈఓ హోదాలో కీలకంగా వ్యవహరించారు. వైట్‌హౌజ్ నుంచి బయటకు వచ్చాక ఇవాంకాను ఉద్దేశించి ‘ఇటుక మాదిరిగా ఆమె కూడా మూగదే’ అని వ్యాఖ్యానించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘అత్యంత చెత్త మీడియా అవార్డులు ప్రకటిస్తా’
వాషింగ్టన్ : ట్విటర్ ద్వారా మంటలు పుట్టించడంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆరితేరారు. అంతర్జాతీయ దేశాలకు సైతం ట్రంప్ ట్విటర్ వేదికగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ కోవలోనే అమెరికన్ మీడియాను లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యాధినేత ట్వీట్లు సంధించారు. అధ్యక్ష ఎన్నికల సమయం నుంచి ప్రధాన మీడియా స్రవంతితో ట్రంప్‌కు ఏ మాత్రం పడడం లేదు. మొదట నుంచి మీడియాపై తీవ్ర వ్యతిరేక భావంతో ఉన్న ట్రంప్.. తాజాగా అమెరికాలోని ‘అత్యంత చెత్త మీడియా అవార్డులను ప్రకటిస్తానని ట్వీట్ చేశారు. సీఎన్ఎస్, ఏబీసీ న్యూస్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి ఇతర ప్రదాన మీడియాతో ట్రంప్‌కు చాలాకాలం నుంచి వైరం ఉంది. శక్తివంతమైన మీడియా సంస్థలను కూడా ఆయన కుహానా పత్రికలుగా అభివర్ణించారు. అందులో వచ్చే వార్తలు, కథనాలతో అధ్యక్షుడు ఏనాడు ఏకీభవించలేదు. ఫాక్స్ న్యూస్‌కు మాత్రం ట్రంప్ మినహాయింపులు ఇవ్వడం విశేషం. I will be announcing THE MOST DISHONEST & CORRUPT MEDIA AWARDS OF THE YEAR on Monday at 5:00 o’clock. Subjects will cover Dishonesty & Bad Reporting in various categories from the Fake News Media. Stay tuned! — Donald J. Trump (@realDonaldTrump) January 3, 2018 -
కమ్యూనిజం అక్కడ ఎలా బతికుందంటే...
వాషింగ్టన్ : సుందరమైన ప్రాంతాలున్న రాష్ట్రం, గాడ్స్ ఓన్ కంట్రీగా కేరళ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో కూడా ఆ చిన్న రాష్ట్రం గురించి పెద్ద కథనాలే వెలువడ్డాయి. అయితే అది పర్యాటక కోణంలో కాకపోవటమే ఇక్కడ విశేషం. కేరళలో ప్రస్తుతం కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఆదివారం తమ సంచికలో ఫ్రంట్‌పేజీలో ఓ వ్యాసాన్ని ప్రచురించింది. ఏ కమ్యూనిస్ట్ సక్సెస్ పేరుతో భారతదేశంలో ఓ చిన్న రాష్ట్రంలో కమ్యూనిజం ఇంకా బతికే ఉందని.. కలలు సాకారం చేసుకునేందుకు అక్కడ కృషి జరుగుతోందంటూ కథనం వెలువడింది. ప్రముఖ పాత్రికేయులు గ్రెగ్ జఫ్ఫె, విది దోషి.. ఈ ప్రత్యేక కథనాన్ని రచించారు. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐసాక్ ఇంటర్వ్యూతోపాటు పలు అంశాలను కూడా అందులో ప్రస్తావించారు. ఎన్నికలద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటిసారిగా ఇక్కడ జరగిందని.. వామపక్ష సిద్ధాంతాలను ప్రజలు విస్తృతంగా ఆదరించటం మూలంగానే కేరళలో ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ విరజిల్లుతోందంటూ థామస్ అందులో వివరించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వ హయాంలో సాధించిన ఘనతలను కూడా ఆ కథనం విపులంగా వివరించింది. అమెరికా ప్రధాన వార్తలను సైతం పక్కన పడేసిన ఈ స్టోరీపై పాఠకులు దృష్టిసారించటం విశేషం. ఇదిలా ఉంటే కేరళ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. గ్లోబల్ ఫేస్ అంటూ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. -
ట్రంప్‌పై సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై వాషింగ్టన్ పోస్ట్ సంచలన ఆరోపణలు చేసింది. అమెరికాకు సంబంధించిన అతి కీలకమైన సమాచారాన్ని ట్రంప్ రష్యా విదేశాంగ మంత్రి సెర్జెయ్ లావ్రోవ్తో పంచుకున్నారని ఆరోపించింది. గత ఏడాది శ్వేతసౌదంలో ట్రంప్ సెర్జెయితో భేటీ అయ్యారని, ఆ సమయంలో ఎవరికీ చెప్పకూడని విషయాన్ని లీక్ చేశారంటూ అందులో రాసింది. కాగా, వాషింగ్టన్ అలా పేర్కొన్న కొద్ది సేపట్లోనే అమెరికా అధికారులు ఖండించారు. దేశ ప్రధాన కార్యదర్శి రెక్స్ టిట్టర్సన్తోపాటు జాతీయ భద్రతా సలహాదారులు వాషింగ్టన్ పోస్ట్ అబద్ధాలు చెబుతోందన్నారు. దేశ భద్రతకు కలిగించే ఏ సమచారాన్ని కూడా రష్యాతో అసలు ట్రంప్ పంచుకోలేదని అన్నారు. నేరుగా కాకుండా అమెరికా నిఘా అధికారులు ఉపయోగించే ప్రత్యేక కోడ్ భాషలో ఈ సమాచారాన్ని ట్రంప్ రష్యాకు లీక్ చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని పంచుకోగా దానిని ట్రంప్ లీక్ చేశారని చెప్పింది. ‘ట్రంప్ రష్యా విదేశాంగ రాయబారితో చాలా సమాచారాన్ని పంచుకున్నారు. ఎంతంటే సొంతంగా మన దేశానికి భాగస్వామ్యం ఉన్న దేశాలతో ఎంత సమాచారాన్ని పంచుకుంటామో అంతకంటే ఎక్కువగా’ అని కూడా అది వెల్లడించింది. ఉగ్రవాదంతో వస్తున్న సమస్యలపై ట్రంప్, రష్యా విదేశాంగ రాయబారి సెర్జయితో భేటీ అయ్యారు. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా ట్రంప్ రష్యా సహాయం తీసుకున్నారని, అమెరికా ఎన్నికల్లో ట్రంప్ జోక్యం చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కోవడంతోపాటు ఎఫ్‌బీఐ దర్యాప్తు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. -
నిజం చెప్పిన ఆస్ట్రేలియా పీఎంకు థ్యాంక్స్: ట్రంప్
వాషింగ్టన్: పుండుమీద కారంజల్లి వెన్నముద్ద తినిపించినట్లుంది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌ను తొలుత చెడమడా తిట్టి ఇప్పుడు బుజ్జగింపు చర్యలకు దిగారు. అంతకంటే ముందు టర్న్‌బుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ గురించి ఆయన నిజాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని, కానీ, మీడియానే వాటిని వక్రీకరించిందంటూ గుర్రుమన్నారు. మరోపక్క, గతంలో శరణార్థుల విషయంలో అమెరికాతో చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకుందామని హామీ ఇస్తూ అమెరికా పరిపాలన వర్గానికి చెందిన ఇద్దరు ఉన్నత సలహాదారులు ట్రంప్ స్టాఫ్ చీఫ్ రెయిన్స్ ప్రీబస్, మరో సీనియర్ సలహాదారు స్టీవ్ బ్యానన్‌ను ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రతినిధి వద్దకు పంపించారు. ఈ వివరాలు వారిద్దరే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తాము ఆస్ట్రేలియా ప్రతినిధి జో హాకీతో కూడా భేటీ అయ్యి వివరాలు తెలియజేసినట్లు చెప్పారు. ఒబామా హయాంలో కుదుర్చుకున్న శరణార్థుల ఒప్పందంపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌తో వాగ్వాదానికి దిగి మధ్యలోనే ఫోన్ పెట్టేశారు. అధ్యక్షుడయ్యాక వరుసగా ప్రపంచదేశాల అధినేతలతో మాట్లాడుతున్న ట్రంప్... ఇంతవరకూ తాను మాట్లాడిన ఫోన్ కాల్స్‌లో ఇదే అత్యంత చెత్తదిగా పేర్కొన్నారంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఈ వ్యవహారంపై స్పందించారు. అలాగే ఇరాన్ విషయంలో కూడా స్పందిస్తూ తాను నిప్పుతో ఆడుకుంటుందన్న విషయం ఇరాన్ మర్చిపోతుందంటూ గట్టిగా మందలించారు. ఇరాన్ అణు క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండటంతోపాటు తాము కూడా అమెరికన్లపై ఆంక్షలు విధిస్తామని చెప్పిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. మరిన్ని సంబంధిత కథనాలకు చదవండి.. (ఇదెక్కడి ‘ట్రంపు’ నోరు!) (దేశ ప్రధానికి ఫోన్ చేసి షాక్ ఇచ్చిన ట్రంప్!) (‘మాది ఒబామా సర్కార్ కాదు.. సంగతి తేలుస్తాం’) (డోనాల్డ్ ట్రంప్ రికార్డు ఢమాల్) -
ఇదెక్కడి ‘ట్రంపు’ నోరు!
ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌తో వాగ్వాదం ► మధ్యలోనే ఫోన్ పెట్టేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ► అత్యంత చెత్త ఫోన్ కాల్ ఇదేనని ట్రంప్ వ్యాఖ్య! వాషింగ్టన్ /కాన్ బెర్రా: తాను చేసిందే చట్టంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తాను చెప్పినట్లు వినాల్సిందేనంటూ ప్రపంచానికి ప్రమాద సంకేతాలు పంపుతున్నారు. అందుకు నిదర్శనంగా అమెరికాకు మిత్రదేశమైన ఆస్ట్రేలియాతో తగువు పెట్టుకున్నారు. ఒబామా హయాంలో కుదుర్చుకున్న శరణార్థుల ఒప్పందంపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌తో వాగ్వాదానికి దిగి మధ్యలోనే ఫోన్ పెట్టేశారు. అధ్యక్షుడయ్యాక వరుసగా ప్రపంచదేశాల అధినేతలతో మాట్లాడుతున్న ట్రంప్... ఇంతవరకూ తాను మాట్లాడిన ఫోన్ కాల్స్‌లో ఇదే అత్యంత చెత్తదిగా పేర్కొన్నారని ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది. టర్న్‌బుల్‌తో దాదాపు గంట సేపు మాట్లాడాలనుకున్న ట్రంప్ 25 నిమిషాలకే ఫోన్ కాల్ ముగించారని ఆ పత్రిక వెల్లడించింది. గత శనివారం ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌కు ట్రంప్ ఫోన్ చేశారు. ఒబామాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆస్ట్రేలియా శరణార్థుల్ని అమెరికాలోకి అనుమతించాలని మాల్కం కోరగా... ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఒప్పందంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం సాగినట్లు అమెరికా మీడియా పేర్కొంది. 2 వేల మంది శరణార్థుల్ని అమెరికా అంగీకరించడం చాలా చెత్త ఒప్పందమని ట్రంప్ మండిపడ్డారు. 2వేల మంది కాదని 1,250 మంది శరణార్థులేనని టర్నబుల్ పదే పదే ట్రంప్‌కు గుర్తు చేశారు. శరణార్థుల్లో ఒకరు మరో బోస్టన్ బాంబర్ అవుతారంటూ ఆరోపణలు చేశారు. అమెరికాకు శరణార్థుల రాకను తాత్కాలికంగా రద్దు చేసిన నేపథ్యం లో ఒబామా సర్కారు చేసుకున్న ఒప్పందం ఎలా అమలవుతుందని ట్రంప్ ప్రశ్నించారు. ఇదొక చెత్త ఒప్పందం: ట్రంప్ అనంతరం ట్రంప్ ట్వీట్ చేస్తూ ‘ఒబామా సర్కారు వేలాది మంది శరణార్థుల్ని అక్రమంగా ఆస్ట్రేలియా నుంచి వచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చెత్త ఒప్పందాన్ని నేను పరిశీలిస్తాను’ అన్నారు. టర్న్‌బుల్ మాత్రం ట్రంప్‌తో సంభాషణ గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. అమెరికా – ఆస్ట్రేలియాల మధ్య ఒప్పందం మేరకు పసిఫిక్ దేశాలైన నౌరు, పపువా న్యూగినియా సముద్ర తీరాల్లోని నిర్బంధ శిబిరాల్లో ఉంటున్న 1,250 మంది శరణార్థుల్ని అమెరికా అనుమతించాలి. ఈ శరణార్థుల్లో చాలామంది ఇటీవల ట్రంప్ నిషేధం విధించిన 7 దేశాలకు చెందిన వారు ఉన్నారు. మత స్వేచ్ఛకు పాటుపడతాం అమెరికాలో మత స్వేచ్ఛను కాపాడేందుకు తన సర్కారు సాధ్యమైనదంతా చేస్తుందని ట్రంప్ అన్నారు. ‘అమెరికా ఎప్పటికీ సహనానికి ప్రతీకగా ఉండాలి. భద్రంగా ఉన్నామనే భావన అందరిలో ఉండాలి’ అని పేర్కొన్నారు. మతస్వేచ్ఛకు ఉగ్రవాదం ప్రధాన ముప్పని, దాన్ని అడ్డుకోవాల్సిందేనన్నారు. ఇదిలాఉండగా, అమెరికా విదేశాంగ మంత్రిగా రెక్స్ టిల్లర్సన్ (64) ప్రమాణ స్వీకారం చేశారు. టిల్లర్సన్ నియామకాన్ని 56–43 ఓట్లతో సెనేట్ ఆమోదించింది. ఒల్తైన జుట్టు వెనుక... మీరెప్పుడైనా ట్రంప్ హెయిర్ స్టైల్‌ను క్షుణ్నంగా పరిశీలించారా... ఏడు పదుల వయసులోను జాలువారుతున్న వెంట్రుకలతో ఆకట్టుకునే కేశ సంపద ట్రంప్ సొంతం. ఈ వయసులోనూ అంత ఒత్తైన జుట్టు ఎలా సాధ్యమనే రహస్యాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడు బయటపెట్టారు. పొడవైన జుట్టు కోసం ట్రంప్ ప్రొస్టేట్ సంబంధిత మందులు (ఫినాస్టెరైడ్) వాడేవారంటూ.. 1980 నుంచి వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించిన హరొల్డ్ ఎన్ బోర్నస్టెయిన్ న్యూయార్క్ టైమ్స్ పత్రికకు తెలిపారు. ఫినాస్టెరైడ్ను మగవాళ్లలో బట్టతల నివారణకు కూడా వినియోగిస్తారు. అలాగే బుగ్గలు, నుదుటి భాగంలో ఎర్రటి దద్దుర్లు (రొజెసియా) తగ్గేందుకు యాంటీ బయాటిక్స్, రక్తం లోని కొలస్ట్రాల్‌తో పాటు కొవ్వు తగ్గేందు కు స్టాటిన్ వాడేవారని ఆయన చెప్పారు. గుండెపోటు ప్రమాదం తగ్గేందుకు రోజూ ‘బేబీ ఆస్పిరిన్ ’ తీసుకునేవారని, ఆరోగ్యం విషయంలో ట్రంప్ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవారని హరొల్డ్ వెల్లడించారు. -
అమెజాన్ బాస్ కొత్త ఇల్లు ఖరీదెంతో తెలిస్తే...
వాషింగ్టన్: అమెజాన్ వ్యవస్థాపకుడు , టెక్ బిలియనీర్ జెఫ్ బెజోస్ అద్భుతమైన ఇంటిని సొంతం చేసుకున్నారు. అమెరికా రాజధాని వాషింగ్ టన్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. పోష్ ఏరియా కలోరమా జిల్లాలోని ఐదు బ్లాక్స్ ప్రాంతంలో ఈ కొత్త నివాసం ఉండనుంది. నగరంలోని అతి పెద్ద ప్రైవేట్ రెసిడెన్సీలో సుమారు రూ. 1.57కోట్లు ( 23 మిలియన్ డాలర్లు) విలువ చేసే ఇంటికి యజమాని అయ్యారు. 27,000 చదరపు అడుగుల (2,500 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉన్న ఇంటిని కొనుగోలుచేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అంతేకాదు 7,000 చదరపు అడుగుల అధికారిక తోట ఇందులో ఉందని బెజోస్ సొంతమైన వాషింగ్టన్ పోస్ట్ గురువారం నివేదించింది. అదీ మొత్తం నగదు రూపంలో చెల్లించినట్టు తెలిపింది. ఇందులో బరాక్ ఒబామా , మిచెల్ ఒబామా నివాసంతో పాటు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నెర్ నివాసం కూడా ఇక్కడే. అయితే సియాటెల్ లోని బెజోస్ ఇల్లు ప్రధాన నివాసంగా ఉన్నప్పటికీ, భార్య, నలుగురు పిల్లలు తో విజిటింగ్స్, ఎంటర్ టైన్ మెంట్ కోసం ఈ వాషింగ్టన్ కొత్త ఇంటిని ఉపయోగించనున్నారని నివేదించింది. మరోవైపు న్యూ యార్క్ టైమ్స్ ప్రకారం, బెజోస్ కొత్త ఇంటికి సమీపంలోని కుష్నెర్ ట్రంప్ ఇల్లు విస్తీర్ణం 6.870 చదరపు అడుగులు (630 చదరపు మీటర్లు) మాత్రమే. అయితే దీన్ని ఎంబసీగా కానీ, ప్రయివేటు స్కూలుకోసం విక్రయించాలని రియల్టర్లు అనుకున్నారట. ప్రస్తుతం బెజోస్ సొంతం చేసుకున్న ఈ నివాసం ఒకపుడు టెక్స్ టైల్ మ్యూజియంగా విలసిల్లింది. అనంతరం దీన్ని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ కి తరలించారు. 2013 వాషింగ్టన్ పోస్ట్ పత్రికను జెఫ్ బెజోస్ కొనుగోలుచేశారు. బెజోస్ సంపదను 70 మిలియన్ల డాలర్లుగా అంచనావేసిన ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల జాబితాల్లో చేర్చిన సంగతి తెలిసిందే. -
మేం నోరు తెరిస్తే భారత్‌లో కల్లోలమే!
• హ్యాకింగ్ సంస్థ లీజియన్ గ్రూపు ప్రకటన • అపోలోతోపాటు 40వేల భారత సర్వర్లకు యాక్సెస్ • భారత ప్రముఖుల వివరాలున్నాయని వాషింగ్టన్ పోస్టుకు వెల్లడి న్యూయార్క్/న్యూఢిల్లీ: భారత్‌లో రాజకీయ, జర్నలిజంతోపాటు పలురంగాల ప్రముఖుల ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేసిన ‘లీజియన్’గ్రూపు తాజాగా మరో బాంబులాంటి వార్తను ప్రకటించింది. వాషింగ్టన్ పోస్టుకు మొబైల్ చాటింగ్ ద్వారా ఇచ్చిన ఇంటర్వూ్యలో లీజియన్ గ్రూపు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. లీజియన్ క్రూ (ఎల్సీ) పేరుతో జరిపిన చాటింగ్‌లో.. అపోలో ఆసుపత్రి సర్వర్లకు సంబంధించిన వివరాలు కూడా తమ దగ్గర ఉన్నాయని.. అందులో భారత రాజకీయ ప్రముఖుల డేటా ఉందని వెల్లడించింది. ‘మా దగ్గరున్న సమాచారాన్ని బహిరంగపరిస్తే.. భారత్‌లో కల్లోలం తప్పదు’అని స్పష్టం చేసింది. చెన్నై అపోలోలో తమిళనాడు దివంగత సీఎం జయలలిత 75 రోజుల పాటు చికిత్స తీసుకోవటం, చివర్లో అపోలో కేంద్రంగానే తమిళ రాజకీయాలు నడిచిన నేపథ్యంలో లీజియన్ గ్రూపు ఇంటర్వ్యూ సంచలనం రేపుతోంది. అయితే సమాచారం విడుదలపై మాత్రం ఎల్సీ ఎటువంటి వివరాలివ్వలేదు. కానీ, పలు భారత సర్వర్ల నుంచి సేకరించి, క్రోడీకరించిన సమాచారంలో భారత ప్రముఖులకు సంబంధించిన డేటా ఉందని మాత్రం చెప్పింది. ఈ సంస్థ చాలాకాలంగా ప్రపంచవ్యాప్తంగా సర్వర్లను హ్యాక్ చేస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, వివాదాస్పద పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా, జర్నలిస్టులు బర్ఖాదత్, రవిష్ కుమార్ వంటి ప్రముఖుల ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేసింది. ‘కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నంతో భారత్‌లోని 40వేలకు పైగా సర్వర్ల సమాచారంపై పట్టుచిక్కింది. బర్ఖాదత్ ట్విటర్ అకౌంట్ హ్యక్ ద్వారా ఆమె మెయిల్స్‌కు సంబంధించి 1.2 జీబీ డేటాను డంప్ చేశాం’ అని లీజియన్ ప్రతినిధి వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్టు ప్రతినిధి తెలిపారు. తమ తదుపరి లక్ష్యం ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీయేనని చెప్పారన్నారు. ‘భారత్‌లో ట్విటర్ ఖాతాల హ్యాక్‌కు సంబంధించి ప్రజల సహకారం కావాలి. దీనికి మద్దతు తెలిపేవారు legion&group@sigaint.orgకు మెయిల్ చేయండి. అక్రమార్కుల వివరాలివ్వండి’ అని లీజియన్ క్రూ ట్విటర్ ద్వారా వెల్లడించింది. -
స్వచ్ఛంద మరణానికి సహకరించండి: టుటు
కేప్‌టౌన్: నోబెల్ శాంతి బహుమతి విజేత, దక్షిణాఫ్రికా విశ్రాంత క్రైస్తవ బోధకుడు డెస్మండ్ టుటు తన స్వచ్ఛంద మరణానికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయన శుక్రవారం తన 85వ జన్మదిన్నాని జరుపుకున్నారు. ‘నాకు రోజులు దగ్గరపడుతున్నాయి. చివరి రోజుల్లో జీవచ్ఛవంలా ఉండడం నాకిష్టం లేదు. వైద్యుల సాయంతో చనిపోవడానికి నాకు అనుమతి కావాలి’ అని వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వైద్యుల సాయంతో చనిపోవడం నిషిద్ధం. -
వాషింగ్టన్ పోస్ట్‌పై కాలుదువ్విన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరో వివాదం పెట్టుకున్నాడు. మాటలతోనే కాకుండా చేతలతో కూడా ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటూ తిరిగి అదే వివాదంలోకి వెళుతున్నారు. మీడియా ప్రతినిధులపై ముందునుంచే కస్సుబుస్సులాడుతున్న ఈ బిజినెస్ టైకూన్ ఈసారి ఏకంగా తన ప్రచార కార్యక్రమం నుంచి ప్రముఖ వార్తా పత్రిక, ఆన్ లైన్ న్యూస్ సంస్థ వాషింగ్టన్ పోస్ట్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాడు. తనపై తప్పుడు కథనాలు వెలువరించినందున తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పాడు. ఓర్లాండోలో కాల్పుల ఘటనపై ఒబామా స్పందిస్తూ దేశీయ ఉగ్రవాదం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద భావజాలానికి గురైన వ్యక్తులు ఇలా చేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, ఈ మాటలను ఉటంకిస్తూ ఒబామాను ట్రంప్ తప్పుబట్టారని, ఓర్లాండో షూటింగ్‌కు ఒబామాకు సంబంధం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. రోజంతా ఈ కథనాన్ని తన వెబ్ సైట్ లో పెట్టింది. అంతేకాకుండా, ఇస్లామిక్ ఉగ్రవాదం అనే పదాన్ని ఉపయోగించడానికి ఒబామా వెనుకాడుతున్నారని, దీనిని బట్టి ఆయనకు ఆ సంస్థకు మధ్య ఏదో జరుగుతుందని ట్రంప్ చెప్పారని ఆ కథనంలో వెలువరించారు. దీంతో మండిపడిన ట్రంప్ వాషింగ్టన్ పోస్ట్ వి తప్పుడు రాతలని అన్నారు. అబద్ధాలను ప్రచారం చేస్తుందని, తాను అనని మాటలను కూడా అన్నట్లుగా చెబుతూ అనైతికంగా వ్యవహరిస్తుందని, ఈ నేపథ్యంలో తన ప్రచార కార్యక్రమాల కవరేజీకి రాకుండా ఆ సంస్థ రిపోర్టర్లను నిషేధిస్తున్నట్లు చెప్పారు. కాగా, వాషింగ్టన్ పోస్ట్ అధినేత బారన్ స్పందిస్తూ తమ పేపర్ కచ్చితంగా ట్రంప్ ప్రచారాన్ని నిజాయితీగా, నిష్పక్షపాతంగా, ఉన్నది ఉన్నట్లుగా, ఉత్సాహంగా ప్రచురణ చేస్తుందని.. ఎందుకంటే తమ కవరేజ్ స్థాయి అలా ఉంటుందని చెప్పారు. -
మోదీ ఆలింగనంపై విపరీతార్థాలు
హైదరాబాద్: ప్రముఖులు కలిసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిని ఆలింగనం చేసుకోవడంపై ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనను మోదీ హత్తుకోవడంపై సోషల్ మీడియాలో కొందరు చేసిన విపరీతార్థాలు, వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వాషింగ్టన్ పోస్ట్ తన వెబ్ సైట్ లో చిలువలు పలువలుగా చూపించి హల్ చల్ చేసే ప్రయత్నం చేసింది. సాధారణంగా చిన్నవ్యక్తి కావొచ్చు.. పెద్ద వ్యక్తి కావచ్చు.. చిరుద్యోగి కావొచ్చి.. పెద్ద హోదాలో ఉన్న ఉద్యోగి కావొచ్చు.. గల్లీ నాయకుడు కావొచ్చు.. ప్రపంచ నేత అయ్యుండొచ్చు.. వీళ్లలో ఎవరూ ప్రత్యేకంగా ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు వెళ్లినా, మోదీ వారిని కలిసేందుకు వెళ్లినా అక్కడ జరిగే మొట్టమొదటి పని ప్రధాని నరేంద్రమోదీ వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం. ఇలా చేయడం ద్వారా వాత్సల్యంతో పాటు సందర్భానుసారం అర్థం ఉంటుంది. ఒకరికొకరం భరోసా అని చెప్పుకోవడం కూడా దాని ఉద్దేశం అయి ఉంటుంది. భారతీయ సంప్రదాయంలో ఇమిడి ఉన్న ఈ అంశాన్ని పెద్దగా బయటకు కనిపించకపోయినా చాలామంది పాటిస్తూనే ఉంటారు. అయితే, ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ కాస్త వక్రీకరించిన రీతిలో వాషింగ్టన్ పోస్ట్ తన వెబ్ సైట్ లో ఒక కథనాన్ని వెలువరించింది. మోదీ అభ్యంతరకరంగా అనిపించేలా ఏ నేతను వదిలిపెట్టకుండా అందరినీ హగ్ చేసుకుంటున్నారంటూ అందులో పేర్కొంది. అయితే ఇది తన సొంత ఉద్దేశం కాదని చెప్పేందుకు... మోదీ ఇతర దేశాల నేతలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలపై కొందరు వ్యక్తుల నెగెటివ్ స్పందనను జత చేసి ట్యాగ్స్ ఆ కథనానికి తగిలించింది. ముఖ్యంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయను ఆలింగనం చేసుకున్నప్పటి ఫొటోలను ఉద్దేశిస్తూ కొందరు ట్విట్టర్లో చేసిన కామెంట్లను ఫొటోలతో సహా పోస్ట్ చేసింది. అందులో మోదీ ఆలింగనం చేసుకున్న విధానం ఎబ్బెట్టుగా ఉందన్నారు.. దీంతో హోలాండే తప్పించుకునేందుకు వెనక్కి తిరిగారు కానీ... అంటూ రాశారు. మరో ఫొటోలో మోదీ, హోలాండే గుర్రం ఎక్కి ఉన్నట్లుగా ఒక ఫొటో చూపిస్తూ మిస్టర్ అండ్ మిసెస్ హోలాండ్ పానిపట్‌కు వెళ్లే మార్గంలో... అని సోషల్ మీడియాలో ఒకరిద్దరి కామెంట్స్ ఆధారంగా కథనం అల్లేశారు. హోలాండే వెనుక భాగంలో మోదీ ఉన్న ఫోటోను టైటానిక్ లో హీరో హీరోయిన్ ఫొటోతో పోల్చారు. షిప్ లేకుండా నేలపై టైటానిక్ చిత్రంలోని ఫేమస్ సీన్ చూపించిన ఏకైక వ్యక్తి మోదీ ఒక్కరే.. మరో ఫొటోను చూపిస్తూ.. ఇంత దగ్గరిగానా ఇక చాలు.... అంటూ కామెంట్స్ పోస్టు చేశారు. మరొకరు మాత్రం ఆలింగనం అనేది ఫ్రెంచ్ సంస్కృతి కాదని మోదీకి ఎందుకు తెలియజేయలేదు.. అది కూడా వెనుక నుంచి.. వెనుక నుంచి హోలాండ్ను హగ్ చేసుకోవడం ఏవగింపుగా అనిపించడం లేదా అంటూ మరో వ్యక్తి చేసిన ట్వీట్‌ను అందులో పేర్కొంది. దీంతోపాటు ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు ఆయా నాయకులను ఆలింగనం చేసుకున్న ఫొటోలను పెట్టారు.