వాషింగ్టన్ : ట్విటర్ ద్వారా మంటలు పుట్టించడంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆరితేరారు. అంతర్జాతీయ దేశాలకు సైతం ట్రంప్ ట్విటర్ వేదికగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ కోవలోనే అమెరికన్ మీడియాను లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యాధినేత ట్వీట్లు సంధించారు. అధ్యక్ష ఎన్నికల సమయం నుంచి ప్రధాన మీడియా స్రవంతితో ట్రంప్‌కు ఏ మాత్రం పడడం లేదు. మొదట నుంచి మీడియాపై తీవ్ర వ్యతిరేక భావంతో ఉన్న ట్రంప్.. తాజాగా అమెరికాలోని ‘అత్యంత చెత్త మీడియా అవార్డులను ప్రకటిస్తానని ట్వీట్ చేశారు.
సీఎన్‌ఎస్, ఏబీసీ న్యూస్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి ఇతర ప్రదాన మీడియాతో ట్రంప్‌కు చాలాకాలం నుంచి వైరం ఉంది. శక్తివంతమైన మీడియా సంస్థలను కూడా ఆయన కుహానా పత్రికలుగా అభివర్ణించారు. అందులో వచ్చే వార్తలు, కథనాలతో అధ్యక్షుడు ఏనాడు ఏకీభవించలేదు. ఫాక్స్ న్యూస్‌కు మాత్రం ట్రంప్ మినహాయింపులు ఇవ్వడం విశేషం.
I will be announcing THE MOST DISHONEST & CORRUPT MEDIA AWARDS OF THE YEAR on Monday at 5:00 o’clock. Subjects will cover Dishonesty & Bad Reporting in various categories from the Fake News Media. Stay tuned!
— Donald J. Trump (@realDonaldTrump) January 3, 2018
Comments
Please login to add a commentAdd a comment